వికీపీడియా:ఆటో వికీ బ్రౌజరుతో చేయదగ్గ మార్పులు
ప్రతిపాదించినది: చదువరి ఆటోవికీబ్రౌజరుతో చేయదగ్గ మార్పుచేర్పులను ఇక్కడ చేర్చాలన్నది లక్ష్యం. ఈ మార్పులు మొత్తం అన్నిటినీ కలిపి ఒక్కసారే చేసెయ్యొచ్చు. నేనో కొత్త AWB వాడుకరిపేరును సృష్టించుకుని ఈ పనులు ప్రధాన పేరుబరిలో మాత్రమే చెయ్యాలనుకుంటున్నాను. ఒకవేళ వేరే ఎవరైనా చెయ్యాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. వీటిలో ఇంకా కొన్నింటిని చేర్చవచ్చు -" :"," ;" లాంటివి. అలాగే " గారు " ను ఎత్తెయ్యవచ్చు, కొన్ని మినహాయింపులకు లోబడి. పోతే అన్నిటికంటే ముఖ్యమైన సంగతి.. అసలీ మార్పులు చెయ్యవచ్చా? ఏమైనా అభ్యంతరాలున్నాయా? మార్పుల హేతుబద్ధతపై సముదాయం అభిప్రాయాలు, వాటిని చెయ్యాలా వద్దా అనే నిర్ణయమూ అవసరం. మీ అభిప్రాయాలు రాయండి.
మొదటి సెట్టు
క్రమ సంఖ్య | దీని కోసం వెతుకు | దీనితో ప్రతిక్షేపించు | కారణం |
1 | " " (డబల్ స్పేసు) | " " | |
2 | " ." | "." | ఫుల్‌స్టాపుకు ముందు స్పేసుండరాదు |
3 | "." | ". " | ఫుల్‌స్టాపు తరవాత ఉండాలి |
4 | " ," | "," | కామా ముందూ స్పేసుండకూడదు |
5 | "," | ", " | కామా పక్కన స్పేసుండాలి |
6 | " " (డబల్ స్పేసు) | " " | 3, 5 ల కారణంగా రెండేసి స్పేసులు చేరే అవకాశం ఉంది. అంచేత రెండు స్పేసుల స్థానంలో ఒకే స్పేసును పెట్టు |
7 | " " (డబల్ స్పేసు) | " " | కొన్ని చోట్ల మూడు స్పేసులుండే అవకాశం ఉంది |
8 | " " (డబల్ స్పేసు) | " " | కొన్ని చోట్ల నాలుగు స్పేసులుండే అవకాశం ఉంది |
9 | "క్రీ.పూ." | "సా.శ.పూ" | "క్రీస్తు పూర్వం" పేరు స్థానంలో "సామాన్య శక పూర్వం" వాడడం మొదలైంది |
10 | "క్రీ.శ." | "సా.శ" | "క్రీస్తు శకం" పేరు స్థానంలో "సామాన్య శకం" వాడడం మొదలైంది |
11 | "క్రీపూ" | "సా.శ.పూ" | "క్రీస్తు పూర్వం" పేరు స్థానంలో "సామాన్య శక పూర్వం" వాడడం మొదలైంది. సముదాయం అభిప్రాయం తెలిసాకే చేస్తాను |
12 | "క్రీశ" | "సా.శ" | "క్రీస్తు శకం" పేరు స్థానంలో "సామాన్య శకం" వాడడం మొదలైంది. సముదాయం అభిప్రాయం తెలిసాకే చేస్తాను |
13 | " లో " | "లో " | లో దాని ముందు పదంతో కలిపి రాయాలి, విడిగా కాదు. లో తరవాత స్పేసుండాలి. భారత్ లో అని కాదు, భారత్‌లో అని రాయాలి అయితే ఇది అజంత పదం తరవాత వచ్చే లో కు మాత్రమే వర్తిస్తుంది. భారత్లో అని రాయకూడదు. కానీ అజంత పదాన్ని గుర్తించడం ఎలా? ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. అంచేత ఈ మార్పు ఇప్పుడు చెయ్యను |
14 | " తో " | "తో " | తో దాని ముందు పదంతో కలిపి రాయాలి, విడిగా కాదు. తో తరవాత స్పేసుండాలి. భారత్ తో అని కాక, భారత్‌తో అని రాయాలి. ఇదీ అంతే హలంత పదం తరవాత వచ్చే తో కు దీన్ని వాడరాదు. భారత్తో అని రాయకూడదు. ఈ మార్పు కూడా ఇప్పుడు చెయ్యను |
15 | "భాద్యత" | "బాధ్యత" | |
16 | "భందము" | "బంధం" | |
17 | "భంధము" | "బంధము" | |
18 | "భందం" | "బంధం" | |
19 | "భంధం" | "బంధం" | |
20 | "భంధము" | "బంధం" | |
21 | "భందములు" | "బంధాలు" | |
22 | "భంధములు" | "బంధాలు" | |
23 | "భందాలు" | "బంధాలు" | |
24 | "భంధాలు" | "బంధాలు" | |
25 | "మార్చ్" | "మార్చి" | |
26 | "ఆగస్ట్" | "ఆగస్టు" | |
27 | "ఆగష్ట్" | "ఆగస్టు" | |
28 | "ఆగష్టు" | "ఆగస్టు" | |
29 | "సెప్టెంబర్" | "సెప్టెంబరు" | |
30 | "అక్టోబర్" | "అక్టోబరు" | |
31 | "నవంబర్" | "నవంబరు" | |
32 | "డిసెంబర్" | "డిసెంబరు" | |
33 | "కి.మీ. " | "కిమీ " | |
34 | "కి.మీ " | "కిమీ " | సముదాయం అభిప్రాయం తెలిసాకే కి.మీ వగైరాలను మార్చాలి. |
35 | "కి. మీ. " | "కిమీ " | |
36 | "విగ్నాన" | "విజ్ఞాన" | |
37 | "విజ్నాన" | "విజ్ఞాన" |
అభిప్రాయాలు
మార్చు- క్రీ.పూ, క్రీ.శ, కి.మీ లకు సంబంధించినవి తప్ప మిగిలినవి అన్నీ మార్చవచ్చును అనేది నా అభిప్రాయం.--Rajasekhar1961 (చర్చ) 10:09, 17 ఆగష్టు 2016 (UTC)
- క్రీ.పూ, క్రీ.శ, కి.మీ, మార్చ్, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లను అలాగే ఉంచి మిగతావి మార్చాలని నా అభిప్రాయం. మార్చ్, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పదాలు ఆంగ్ల పదాల ఉచ్చరణలో ఉన్నాయి.--Pranayraj1985 (చర్చ) 12:10, 22 ఆగష్టు 2016 (UTC)