వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటీ/హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2019 తెవికీ స్టాల్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ (డిసెంబరు 23, 2019 నుండి జనవరి 1, 2020 వరకు) లో తెలుగు వికీపీడియా స్టాల్ ఏర్పాటు, నిర్వహణపై నివేదిక
నేపథ్యం
మార్చుఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ - హైదరాబాద్) భారతీయ భాషలలో వికీపీడియా వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ చేపట్టింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఇందులో భాగమైన ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’ కి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయి. సమాచార విప్లవం నేపథ్యంలో తెలుగు భాష, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి తదితర విషయాలపై సరైన సమాచారం అంతర్జాలంలో తెలుగు భాషలో అందరికి అందుబాటులో ఉండాలన్నదే ఈ ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’ లక్ష్యం.
2019, నవంబరు 16న ఐఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో “వికీపీడియా - సమాచార లభ్యత, సముదాయ అభివృద్ధి” అన్న అంశంపై జరిగిన సమావేశంలో మాతృభాషపై పట్టు, గౌరవం ఉన్న అందరిని ప్రాజెక్టులో భాగస్వాముల్ని చేసి సమగ్రమైన తెలుగు వికీపీడియాను అందుబాటులోకి తేవడానికి , వికీపిడియాలో తెలుగు వ్యాసాల సంఖ్యను పెంచడానికి ఏం చేయాలనే అంశంపై సమగ్రమైన చర్చ జరిగింది. ప్రాజెక్ట్ తెలుగు వికీ ని ‘సముదాయ అభివృద్ధి’, ‘సమాచార లభ్యత’, ‘శిక్షణ’, ‘అవగాహన’, ‘సాంకేతిక పరిశోధన’ అనే ఐదు విభాగాల కింద ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
2019, డిసెంబరు 7నాడు జరిగిన ప్రాజెక్ట్ తెలుగు వికీ సమావేశంలో విభాగాల వారీగా కార్యాచరణను చర్చించారు. (విభాగాలు: ‘సముదాయ అభివృద్ధి’, ‘సమాచార లభ్యత’, ‘శిక్షణ’, ‘అవగాహన’, ‘సాంకేతిక పరిశోధన’). తెలుగులో ఒక అంతర్జాల విజ్ఞాన సర్వస్వము ఉండాల్సిన ఆవశ్యకత గురించి, తెలుగు వికిపీడియా గురించి తెలుగు ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రప్రథమంగా చేయాల్సిన కార్యక్రమంగా అందరూ అభిప్రాయపడ్డారు. తెలుగు వికిపీడియా పై అవగాహన పెరిగితే అది సముదాయ అభివృద్ధిలో, వికీ వాలంటీర్ల సంఖ్య పెంచడంలో దోహదపడుతుంది కాబట్టి ‘అవగాహన’ విభాగం కింద కార్యక్రమాలు తక్షణమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో జరిగే పుస్తక ప్రదర్శన (బుక్ ఫెయిర్- 2019) మంచి వేదిక అవుతుందని, కాబట్టి బుక్ ఫెయిర్ లో వికీపీడియా స్టాల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్టాల్ ఏర్పాటు ప్రణాళిక- బాధ్యతల వివరాలు
మార్చుబుక్ ఫెయిర్ లో తెలుగు వికీ స్టాల్ ఏర్పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సమష్టి బాధ్యతగా భావించినప్పటికీ, నిర్వహణా సౌలభ్యం కోసం పనుల విభజన జరిగింది. స్టాల్ కి అనుమతి తీసుకోవడం, స్టాల్ ఏర్పాటు, ప్రచార సామగ్రిగా కరపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు సమకూర్చడం లాంటి బాధ్యతల్ని డిజిటల్ మీడియా విభాగం, తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ, తీసుకోగా, తెలుగు వికీపీడియా గురించి సందర్శకులకు వివరించే వాలంటీర్లను స్టాల్ లో అందుబాటులో ఉంచే బాధ్యతను ఐఐఐటీ హైదరాబాద్ వారు తీసుకున్నారు దీనికోసం ఒక గూగుల్ ఫారం ద్వారా వికీపీడియాకు చేయాలనుకొన్న వారి వివరాలు తీసుకొన్నారు[1]
బుక్ ఫెయిర్ ప్రారంభానికి (డిసెంబరు 23) కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున తదుపరి కార్యాచరణ గురించి కూలంకషంగా డిసెంబరు 7 నాటి సమావేశంలోనే చర్చించడం జరిగింది. దానిలో కొన్ని ముఖ్యాంశాలు:
- స్టాల్ ఏర్పాటు కోసం బుక్ ఫెయిర్ నిర్వాహకులకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
- స్టాల్ సైజులు బట్టి ఫ్లెక్సీ బోర్డుల సైజులు ఖరారు చేసుకోవాలి.
- స్టాల్ ఆకట్టుకొనే విధంగా ఫ్లెక్సీలు డిజైన్ చేసుకోవాలి.
- కరపత్రాలు, ఫ్లెక్సీలకు కావలిసిన సమాచారాన్ని, లోగోలను సమకూర్చుకోవాలి.
- స్టాల్ సందర్శుకుల్లో ఆసక్తి రేకెత్తించే విధంగా ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు/ఆటలు నిర్వహించాలనుకొంటే వాటిని చర్చించి ఖరారు చేసుకోవాలి, వాటికి కావలిసిన సరంజామాను సిద్ధం చేసుకోవాలి.
- ప్రాజెక్ట్ తెలుగు వికీ లో వాలంటీర్ గా పనిచేయడానికి సుముఖంగా ఉన్న వారి వివరాలు తీసుకోవడానికి ఒక ఫారం సిద్ధం చేసుకోవాలి. ( ఆన్లైన్ / ప్రింటవుట్ )
- సందర్శకులకు వికీపీడియా ప్రాజెక్ట్ ను వివరించడానికి స్టాల్ లో ఉండే వాలంటీర్లకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకాలను, పాటించవలసిన పద్ధతుల్ని రాసి సిద్ధంగా ఉంచుకోవడం.
- ముఖ్యమైన ఆహుతులను, మీడియాను ఆహ్వానించడం.
- సామాజిక మాధ్యమాల్లో వికీస్టాల్ గురించి పోస్టులద్వారా పోస్టర్ట్ల ద్వారా విశేష ప్రచారం చేయడం
తెలుగువికీ స్టాల్ ప్రారంభోత్సవం
మార్చుహైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో ఐఐఐటీ-హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం ఏర్పాటుచేసిన ‘ప్రాజెక్ట్ తెలుగు వికీపీడియా’ స్టాల్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్‌రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాలంలో స్థానిక భాషల ప్రాధాన్యత పెరగాల్సిన ఆవశ్యకతను రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని, ఇంటర్నెట్ ఆవిర్భావం, సమాచార విప్లవం నేపథ్యంలో, అంతర్జాలంలో తెలంగాణ చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక తదితర విషయాలపై సరైన సమాచారం తెలుగులో ఉండాలన్నది తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఆ దిశలో, డిజిటల్ మాధ్యమాలపై కృషి చేస్తున్న వ్యక్తులతో లేదా సంస్థలతో కలిసి సమాచార సాంకేతిక రంగాల్లో తెలుగు వాడుక మరియు అభివృద్ధికై డిజిటల్ మీడియా విభాగం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్ మీడియా సంచాలకులు దిలీప్ కొణతం, ఐఐఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ వాసుదేవ వర్మ, ప్రాజెక్ట్ తెలుగు వికీ సభ్యులు పాల్గొన్నారు.
గవర్నర్ సందర్శన: గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 33వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను డిసెంబర్ 23, 2019 నాడు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం తెలుగు వికీ స్టాల్ ను సందర్శించారు. ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుని అభినందనలు తెలియచేసారు.
ఉపరాష్ట్రపతి అభినందనలు: నేటి సాంకేతిక యుగంలో భావితరాలకు విజ్ఞానాన్ని మన తెలుగు భాషలో అందించాలన్న గొప్ప లక్ష్యం చేరుకోవడానికి తెలుగు వికీ స్టాల్ వంటి ప్రయత్నాలు తోడ్పడతాయని పేర్కొంటూ , స్టాల్ నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగానికి , ఐఐఐటి హైదరాబాద్ కు గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియచేసారు.[2]
పాల్గొన్న వాలంటీర్లు
మార్చు- కృపాల్ కశ్యప్
- నరేందర్ రెడ్డి
- చంద్రశేఖర్ పొన్నాల
- విభా
- ప్రణయ్‌రాజ్ వంగరి
- మనోహర్ గౌడ్
- మహేష్
- ఆదిత్య
- నిఖిల్
స్టాల్ నిర్వహణ - సందర్శకుల ప్రతిస్పందన
మార్చువిశేష ప్రజాదరణ కలిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ప్రతీ సంవత్సరం లాగానే, ఈసారి కూడా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్శకులు వికీ స్టాల్ కు విచ్చేసి తెలుగు వికీపిడియా గురించి, అడిగి తెలుసుకున్నారు, సూచనలు అందించారు. తమతమ ప్రాంతాలలో కూడా వికీపీడియా కార్యశాలలు నిర్వహించాలని కోరారు. సుమారు ఒక వెయ్యి మంది స్వచ్చందంగా వికీ వాలంటీర్లుగా ఉండడానికి ముందుకు వచ్చి, తమ వివరాలను అందించి, వికీ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహాన్ని కనబరిచారు. వికీ స్టాల్ ను సందర్శించిన వారిలో తెవికీ రచన పట్ల ఆసక్తివున్నవారికి ప్రత్యేకంగా తయారుచేయించిన పెన్నులను (పెన్నులపై తెలుగు వికీపీడియా, www.te.wikipedia.org ప్రింట్ చేయించి) కానుకగా ఇవ్వడం జరిగింది.
మీడియా కవరేజి
మార్చుచిత్రమాలిక
మార్చు-
స్టాల్ ఏర్పాటుకై వాడిన తెవికీ ఫ్లెక్సీ డిజైన్లు
-
తెలుగు వికీపీడియా పుస్తక ప్రదర్శన స్టాలు
-
తెలుగు వికీపీడియా కరపత్రం
-
సామాజిక మాధ్యమాల్లో వికీ స్టాల్ ప్రచారానికి ఉపయోగించిన పోస్టర్
మూలాలు
మార్చు- ↑ "తెలుగు వికీపీడియా పుస్తక ప్రదర్శన సందర్శకులు-గూగుల్ ఫారం". Google Docs. Retrieved 2020-03-01.
- ↑ "ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి ట్విట్టర్ వ్యాఖ్యల సరణి". 2019-12-31.