వికీపీడియా:పాఠం

మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    

వికీపీడియా దిద్దుబాటు పాఠం - స్వాగతం!

వికీపీడియా, ప్రపంచం మొత్తం నుండి వివిధ వ్యక్తుల సమిష్టి కృషితో రూపొందింపబడిన ఒక స్వేచ్ఛా . మీరో వికీపీడియనుగా మారడానికి ఈ పాఠం సాయపడుతుంది.

రాబోయే పేజీల్లో వికీపీడియా విశేషాలు, వికీపీడియా సముదాయం, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల గురించి తెలుసుకుంటారు.

ఇది ప్రాథమిక పాఠం మాత్రమే. సవివరమైన వ్యాసాల కోసం, ఈ పాఠం నుండే లింకులు ఇచ్చాము. ఆ లింకులను వేరే విండోలో తెరచి చదవండి.

ప్రతి పేజీ నుండి ప్రయోగశాలకు లింకులున్నాయి. మీరు నేర్చుకున్నదాన్ని అక్కడికక్కడే ఆ లింకును తెరచి ప్రయోగాలు చెయ్యవచ్చు. మీ తృప్తి దీరా ప్రయోగాలు చెయ్యండి. ప్రయోగశాలలో మీరేం చేసినా, ఎవరూ ఏమీ అనుకోరు.

గమనిక: మీరు డిఫాల్టు పేజీ లే ఔట్ ను వాడుతున్నట్లుగా భావించి ఈ పాఠాన్ని కొనసాగిస్తున్నాము. మీరు వేరే లే ఔట్ వాడుతున్నట్లయితే లింకుల స్థానాలు మారే అవకాశముంది.

పాఠంలోకి వెళ్ళే ముందు.. పరిచయము, 5 నిమిషాల్లో వికీ లను చూసారా?