వికీపీడియా:సహాయ కేంద్రం
![]() | మీకు సభ్యత్వం వుంటే మీ వ్యక్తిగత సందేహమైతే మీ చర్చాపేజీలో, ఇతరాలకు ఆయా చర్చాపేజీలలో సందేహం చేర్చడం మంచిది. ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. |
| |||
గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)
సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.
|
అనువాదం ఎలా?సవరించు
సహాయం అందించబడింది
నేను ఇంగ్లీషులో ఉన్న విషయాలను తెలుగులోకి అనువదించడానికి ఏం చేయాలి
—Bvlk manohar (చర్చ) 07:43, 6 అక్టోబరు 2020 (UTC)
- Bvlk manohar గారు, ప్రత్యేక:ContentTranslation పేజీలో ఇతర వికీల వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయవచ్చు. మరింత సమాచారానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చూడండి. --అర్జున (చర్చ) 04:33, 12 అక్టోబరు 2020 (UTC)
- Bvlk manohar గారు, అన్నట్లు ఇటువంటి సందేహాలను మీ వాడుకరి చర్చాపేజీలో అడగవచ్చు. ఈ పేజీ ప్రధానంగా వాడుకరి ఖాతా లేని వారిసందేహాలకొరకు ఉద్దేశించబడింది.--అర్జున (చర్చ) 04:34, 12 అక్టోబరు 2020 (UTC)
వర్గం:Category:మమ్మీలు పేజీ ని తొలగించమని కోరుతున్నానుసవరించు
ఒక వ్యాసానికి అనువాదం చేస్తున్నప్పుడు వర్గాలు లో పై విధంగా పేజీ ఓపెన్ కావడానికి వీలుగా ఉండడంతో పై పేజీని ప్రారంభించాను. తర్వాత పై పేజీ పేరు సమంజసంగా లేదని భావించి పేజీని కొత్తగా ప్రారంభించి దానిలో కొన్ని మమ్మీల వ్యాసాలను కలిపాను. కావున వర్గం:Category:మమ్మీలు పేజీ ఇక ఖాళీగా ఉంటుంది. ఇక ఈ పేజీ వర్గం:Category:మమ్మీలు అవసరముండదు కాబట్టి తొలగించమనికోరుతున్నాను.--Vmakumar (చర్చ) 23:55, 15 అక్టోబరు 2020 (UTC)
నిరోదించండిసవరించు
- తె.వి నిర్వాహకులకు మనవి. 59.92.163.106 ఐపి అడ్రస్ గల వ్యక్తి చాలా పేజీలలో గ్రామం వ్యాసాలందు విధ్వంసం పనులు చేస్తున్నారు... కావున పరిశీలించి, నిరోధించగలరు.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 18:38, 4 నవంబర్ 2020 (UTC)
- @ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఇటీవలి మార్పులను ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఉంగుటూరు (కృష్ణా జిల్లా) పేజీలో ఆ ఐపీ అడ్రసు చేసిన మార్పులను పరిశీలించాను. అందులో చేర్చిన సమాచారంలో విధ్వంసం కనిపించలేదు గానీ, ఖాళీ విభాగాలు చేర్చడం కనిపించింది. మూలం లేకుండా "ప్రముఖుల" గురించి రాసారు. అవి విధ్వంసకర మార్పులు కాకపోవచ్చు. ఐపీ అడ్రసు కాబట్టి వారితో చర్చించే అవకాశం లేదు. మీరెలాగూ వారు చేసిన మార్పులను వెనక్కి తిప్పారు కాబట్టి, వారికి తమ లోపం తెలిసి వస్తుందనుకుందాం. మళ్ళీ అలాంటి మార్పులు చేస్తే తదుపరి చర్య సంగతి ఆలోచిద్దాం.
- పోతే, ఈమధ్య ఒక లాగినైన వాడుకరి ఎవరో గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు. (వారెవరో నాకు గుర్తు రావడంలేదు.) అప్పుడు మీరూ మరి కొందరూ వాటిని వెనక్కు తిప్పారు. ఆ వాడుకరికి అలా చెయ్యవద్దని సలహా ఇచ్చారా? లేదంటే , వారెవరో మీకు గుర్తుంటే, ఇప్పుడైనా సలహా ఇవ్వవచ్చు. ఆలస్యమైనా పర్లేదు, అసలివ్వనిదానికంటే నయమేగా. పరిశీలించండి. చదువరి (చర్చ • రచనలు) 07:22, 5 నవంబర్ 2020 (UTC)
- చదువరి గారు, ధన్యవాదాలు మీరు అన్న వారు. రమ్య ఈమధ్య లాగినైన వాడుకరి గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు. కొత్త వాడుకరి వీరికి చర్చాపేజీలో ను వివరించాను, ప్రణయ్ గారు ఒకరోజు నిరోధం విధించారు. ఈ వాడుకరి కూడా ఇలాగే ఖాళీ విభాగాలు చేర్చిన పద్ధతి ఒకే విధంగా ఉంది. ఇప్పటికే ఎర్ర రామారావు గారు ప్రణయ్ గారు కూడా అలా ఖాళీ విభాగాలు చర్చ వద్దని సలహా ఇచ్చారు. అయినా ఆ వాడుకరి కొనసాగింపు సాగిస్తున్నారు. ఈ విషయమై స్పందించిన అందుకు మీకు ధన్యవాదాలు సార్.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 07:49, 5 నవంబర్ 2020 (UTC)
- Ramya Kanumalli అనే వాడుకరి కొన్ని గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు, మరికొన్ని సవరణలు కూడా చేసారు. ఖాళీ విభాగాలు పెట్టినవాటిని వెనక్కు తిప్పడంతోపాటు ఉపయోగకరమైన ఎడిట్స్ చేసిన వాటికి ధన్యవాదాలు కూడా పంపించాము. అంతేకాకుండా సదరు వాడుకరి చర్చ పేజీలో వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, వాడుకరి:యర్రా రామారావు గారు సలహా కూడా ఇవ్వడం జరిగింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:53, 5 నవంబర్ 2020 (UTC)
- సరేనండి ప్రభాకర్ గౌడ్ గారు, ప్రణయ్ గారు. ఈ ఐపీఅడ్రసు చేసే మార్పులను గమనిస్తూ ఉందాం. __చదువరి (చర్చ • రచనలు) 09:51, 5 నవంబర్ 2020 (UTC)
వికీ సోర్స్ గురించిసవరించు
సహాయం అందించబడింది
వికీ సోర్స్ లో కొన్ని ఎలక్ట్రానిక్ పుస్తకాలు (గ్రంధాలు) గ్రంధ స్వామ్య పరిమితిలో లేనివి/అనుమతించబడినవి అప్లొడ్ చేయవచ్చా? ఆ ప్రక్రియ తెలుపగలరు . ఉదాహరణకి మహాకవి దాసు శ్రీరాములు గ్రంధాలు. ధన్యవాదాలు
--VJS (చర్చ) 14:33, 16 ఏప్రిల్ 2021 (UTC)
—VJS (చర్చ) 14:33, 16 ఏప్రిల్ 2021 (UTC)
- VJS గారు, చేయవచ్చు. ఇప్పటికే కొన్ని గ్రంథాలు వికీసోర్స్ లో వున్నాయి.( s:రచయిత:దాసు శ్రీరాములు ). కామన్స్ లో ఫైల్ ఎక్కించి, ఆ తరువాత వికీసోర్స్ లో పాఠ్యీకరణ చేయండి. అర్జున (చర్చ) 21:46, 16 ఏప్రిల్ 2021 (UTC)
కామన్స్ లో ఫైల్ అప్లోడ్ చేయటంసవరించు
అర్జున గారు. నేను కామన్స్ లో ఒక ఫైలును అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేసాను. (Ref: దస్త్రం:తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస.pdf) ఈ ఫైలును డా. దాసు అచ్యుతరావు గారు (మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి) నాకు ఉచితముగా పంపిణీ చేయుటకు, వికిపీడియా లో ఉంచుటకు, విద్యావసరాలకు ఇచ్చారు. వారు మా మామయ్య గారు. మహాకవి దాసు శ్రీరాములు గారు మా ముత్తాతగారు. ఇటువంటి గ్రంధాలు దాదాపు 15 PDF రూపములో నాకు ఇచ్చారు. అయనే ప్రచురణకర్త. నేను ఆయనకు కొంతవరకు సాంకేతిక సహకారం అందిస్తుంటాను. ఈ ఫైలు ఈక్రింది వెబ్ సైట్ లలో ఉచితముగా లభింపచేశాము. హైదరాబాదు విశ్వవిద్యాలయ గ్రంధాలయ సూచిక: http://igmlnet.uohyd.ac.in:8000/hi-res/hcu_images/297623.pdf ఆంధ్రభారతి కావ్యాలు: https://andhrabharati.com/kAvyamulu/telugunADu/index.html దీనికి తగిన అధికార/అనుమతి పత్రం నాకు ఈమెయిల్ ద్వారా ఇదివరలో హైదరాబాదు విశ్వవిద్యాలయ గ్రంధాలయం లో ఉంచడానికి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈయమని చెప్పాను. ఈ ప్రక్రియ సరిపొతుందా కామన్స్ లో చేయడానికి. నాకు ఈ విషయంలో మార్గదర్శనం చేయగలరు. ధన్యవాదాలు --VJS (చర్చ) 11:26, 18 ఏప్రిల్ 2021 (UTC)
- @Vjsuseela గారు, మీరు ఉదహరించిన పుస్తకం 1929 కూర్పు కామన్స్ లో వుంది కాని రెండు పేజీలు ఒకే బొమ్మరూపంలో వుంది కావున పాఠ్యీకరణలో OCR సాంకేతికాలు వాడడానికి సహకరించదు. దానిని ఒకపేజీ ఒకబొమ్మ రూపంలోకి మార్చాలి. ఇక మీరిచ్చిన లింకు 1974 కూర్పుది. దానిలో నకలుహక్కులు మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితికి చెందినవిని పేర్కొన్నందున, ఆ సమితి ప్రధాన కార్యనిర్వహధికారి, ఆ పుస్తకాలను CC-BY-SA 4.0 తో మరల విడుదల చేస్తే, కామన్స్ లోకి ఎక్కించవచ్చు. దానికి సంబంధించిన సూచనలు చూసి పాటించండి. ఏమైనా సందేహాలుంటే ఇక్కడకన్నా, మీ వాడుకరి చర్చాపేజీ అనువైనది కనుక అక్కడే చర్చించండి. అర్జున (చర్చ) 04:16, 19 ఏప్రిల్ 2021 (UTC)
కింగ్ డమ్ ను కలిపి రాయటం ఎలా?సవరించు
సహాయం అందించబడింది
కింగ్ డమ్ ను కలిపి రాయాలి అంటే ఎలా చేయాలి --Kocherlakota Padmakar (చర్చ) 01:34, 2 సెప్టెంబరు 2021 (UTC)
- @Kocherlakota Padmakar గారు, మీరు ZWNJ (Zero Width Non Joiner) అనే గుర్తుని వాడాలి. వికీపీడియాలో టైపింగ్ కువున్న లిప్యంతరీకరణ పద్ధతి వాడుతున్నట్లైతే వికీపీడియా:టైపింగు_సహాయం#zwnj లో ZWNJ ఉదాహరణ చూడండి. అర్జున (చర్చ) 10:55, 2 సెప్టెంబరు 2021 (UTC)
- Kocherlakota Padmakar గారూ మీరు డెస్క్ టాప్ లో లిప్యంతీకరణ వాడుతూ ఉంటే కింగ్ తరువాత ^ (shift 6) టైపు చేసి తరువాత డమ్ రాయవచ్చు ఉదాహరణ ఆన్‌లైన్ An^lain ,kiMg^Dam కింగ్‌డమ్ , మొబైల్ లో Gboard వాడుతున్నట్లు అయితే కీబోర్డులో మొదట కింగ్ అని టైపు చేసిన తరువాత స్పేస్ బార్ పక్కన నాలుగు నిలువు చుక్కతో ◀:▶ లాగ ఉన్న గుర్తును నొక్కి తరువాత డమ్ టైప్ చేయండి : Kasyap (చర్చ) 11:11, 2 సెప్టెంబరు 2021 (UTC)
9/11 దాడులు వ్యాసంతో సహాయంసవరించు
సహాయం అందించబడింది
అమెరికా దేశ చరిత్ర, కాదు, ప్రపంచ చరిత్ర లో 9/11 ఒక ముఖ్యమైన సంగతి. ఈ వారం లో ఇరవై సంవరసార్లు anniversary గా. దయచేసి, కొంచం షాహాయం ఇవ్వు ఈ వ్యాసం improve కోసం. ధన్యవాడులు. MSG17 (చర్చ) 16:57, 7 సెప్టెంబరు 2021 (UTC)
ఆర్టికల్ తోపాటుగా చిత్రాన్నిఎక్కించటంసవరించు
సహాయం అందించబడింది
నేను వికీపీడియాలో ఆర్టికల్ తోపాటుగా చిత్రాన్ని జతపరచాలనుకుంటున్నాను ఇది నా స్వంత చిత్రం అయినప్పటికీ దానిని ఈ సారాంశంలో జతపరచలేకపోతున్న అది ఎలా చెయ్యాలో కాస్త వివరంగా తెలియజేయగలరు. —Varjiliya (చర్చ) 12:28, 8 అక్టోబరు 2021 (UTC)
స్వాగతం మూస పనిచేయుటలేదుసవరించు
సహాయం అందించబడింది
welcome to members page is not working. Sr members to please help me.-- 2021-10-10T06:18:05 Nrgullapalli
- @User:Nrgullapalli಼಼, as per talk page comment, morebits module needs updation, or twinkle needs upgradation. Till it is completed, use manual welcome as described on {{Welcome}}--అర్జున (చర్చ) 12:33, 10 అక్టోబరు 2021 (UTC)
- నాగేశ్వరరావు, అర్జున గార్లు, నమస్తే, స్వాగతం మూస ఇప్పుడు పని చేస్తుంది. అండి. ధన్యవాదాలు.__ ప్రభాకర్ గౌడ్చర్చ 06:20, 11 అక్టోబరు 2021 (UTC)
- @ప్రభాకర్ గౌడ్ నోముల గారు, స్పందనకు ధన్యవాదాలు. @Chaduvari గారు అవసరమైన మార్పులు చేశారు. వారికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:04, 12 అక్టోబరు 2021 (UTC)
- నాగేశ్వరరావు, అర్జున గార్లు, నమస్తే, స్వాగతం మూస ఇప్పుడు పని చేస్తుంది. అండి. ధన్యవాదాలు.__ ప్రభాకర్ గౌడ్చర్చ 06:20, 11 అక్టోబరు 2021 (UTC)
ఐపీ అడ్రస్ బ్లాక్సవరించు
సహాయం అందించబడింది
నా ఐపీ అడ్రస్ బ్లాక్ అయ్యిందని వస్తోంది. ఎందుకు అలా వస్తుందో, నేను చేసిన తప్పేంటో నాకు తెలియడం లేదు. ఏదైనా తప్పిదాలు ఉంటే చెప్పగలరు? సవరించుకుంటాను. —183.82.111.252 06:31, 10 డిసెంబరు 2021 (UTC)
- @ ఐపి అడ్రస్ వాడుకరి గారు. మీరు పై వ్యాఖ్య రాశారు కాబట్టి, మీరు సమస్యగల కంప్యూటర్ కాక వేరే కంప్యూటర్ నుండి రాశారని భావిస్తున్నాను. గతంలో ఆ ఐపి అడ్రస్ వాడిన వాడుకరులు, వికీపీడియాలో దుశ్చర్యలకు పాల్పడినందున, నిర్వాహకులు ఆ ఐపి అడ్రస్ ను నిరోధించినట్లున్నారు. కావున మీరు పై వ్యాఖ్య చేర్చిన కంప్యూటర్ వాడి ఖాతా సృష్టించుకొంటే ఆ తరువాత మీ కంప్యూటరులో ఖాతా ద్వారా ప్రవేశించి వికీపీడియాలో కృషి చేయవచ్చు. మరింత సమాచారానికి వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_83#సహాయం చూడండి. అర్జున (చర్చ) 04:53, 11 డిసెంబరు 2021 (UTC)
- తెలుగు వికీపీడియా లో పనిచేయటానికి ఐపీ అడ్రస్ బ్లాక్ అయివుంటే, ఆంగ్ల వికీపీడియాలో ఖాతా సృష్టించుకొని ఆ తరువాత తెలుగు వికీపీడియాలో ప్రవేశించి పనిచేయవచ్చు. అర్జున (చర్చ) 03:00, 10 జనవరి 2022 (UTC)
సమాచార పెట్టే మూస దిగుమతిసవరించు
{{Infobox family}} ఈ సమాచార పెట్టేను దిగుమతి చేయండిCh Maheswara Raju☻ (చర్చ) 13:21, 4 మే 2022 (UTC)
- @Ch Maheswara Raju గారు, నేను దిగుమతి చేశాను. మీరు ఇటువంటి అభ్యర్ధనలకు ఇకముందు, మీ చర్చాపేజీలో, {{సహాయం కావాలి}} చేర్చి అడిగితే సరిపోతుంది. ఈ పేజీ, పేజీపై సూచనలో తెలిపినట్లు ఖాతాలేని వారి సహాయం అభ్యర్ధనలకు మాత్రమే ఉద్దేశించినది. అర్జున (చర్చ) 03:10, 5 మే 2022 (UTC)
సందేహం respected sir, till now I have written four books. How to send my books for award. can you explainసవరించు
—122.162.54.121 04:12, 17 మే 2022 (UTC)
- మీకు సాహిత్య అకాడమీ వ్యాసం, ఆ వ్యాసం ఆంగ్లవికీరూపం, సాహిత్య అకాడమీ వెబ్సైట్ ఉపయోగపడవచ్చు. ఈ పేజీలో వికీపీడియా కృషిలో సమస్యలు మాత్రమే ప్రస్తావించాలి. మీ ప్రశ్నకు మెరుగైన పేజీ వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం. -- అర్జున (చర్చ) 05:35, 18 మే 2022 (UTC)