వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 10
- ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
- 680: ముహమ్మద్ ప్రవక్త మనుమడు హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ మరణం (జ.626).
- 1731: బ్రిటిష్ తత్వవేత్త, శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ జననం (మ.1810).
- 1906: భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ జననం (మ.2001). (చిత్రంలో)
- 1908: అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు ముదిగొండ లింగమూర్తి జననం (మ.1980).
- 1960: తెలుగు సినిమా ప్రతినాయకుడు, హాస్యనటుడు రఘు బాబు జననం.
- 1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.
- 2011: భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ మరణం (జ.1941).