వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 18
- 1650 : గోల్కొండ కోట పై బడుగువారి జెండాను ఎగురవేసిన సర్వాయి పాపన్న జననం (మ.1709/10).
- 1700 : మరాఠా సామ్రాజ్యానికి జనరల్ బాజీ రావు I జననం (మ.1740).
- 1900 : సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ జననం (మ.1990).
- 1936 : చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత గుల్జార్ జననం.(చిత్రంలో)
- 1939 : మొట్టమొదటి సారిగా, నలుపు-తెలుపు ఫిల్మ్, రంగుల ఫిల్మ్ లను, కలిపి తీసిన సినిమా ది విజార్డ్ ఆఫ్ ఓజ్ ప్రదర్శించారు.
- 1969 : అమెరికా చలనచిత్ర నటుడు, దర్శకుడు జననం.
- 1983 : ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు, ఆస్ట్రేలియా ట్వంటీ20 జట్టు కెప్టెన్ జననం.
- 1988 : పాకిస్తాన్ అధ్యక్షుడు మొహమ్మద్ జియా ఉల్ హక్, అమెరికా రాయబారి ఆర్నాల్డ్ రాఫెల్ అంతుచిక్కని విమాన ప్రమాదంలో మరణించారు.
- 1998 : భారతీయ మోడల్, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి ప్రొతిమా బేడి మరణం (జ.1948).
- 2009 : వికీపీడీయా (ఇంగ్లీషు) లోని వ్యాసాలు 30 లక్షలకి చేరిన రోజు.
- పార్సి నూతన సంవత్సర ప్రారంభం.