సర్వాయి పాపన్న

సర్వాయి పాపన్న (ఆంగ్లం: Sardar Sarvai Papanna) పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు.[1] తండ్రి పేరు ధర్మన్నగౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరు అతన్ని పాపడు అని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు. అతను శివున్ని కూడా ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.

సర్వాయి పాపన్న
Papadu
పాపడు
SPGoud.jpg
జననంఆగష్టు 18, 1650
మరణం1709 లేదా 1710
జాతీయతభారతీయుడు
వృత్తిగౌడ వృత్తి , తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు , తన రాజ్యాన్ని స్థాపించాడు.
తల్లిదండ్రులుసర్వమ్మ, దర్మన్న
పురస్కారాలుసర్ధార్

జననం, బాల్యం, స్నేహీతులుసవరించు

ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగష్టు 18, 1650 నాడు పాపన్న వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించాడు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ధూల్మిట్ట వీరగల్లు శాసనంలో ఇలా వుంది. ‘‘ బండిపోత గౌడ షాపూర్ ఖిలా పులి గౌడ యేబది రొడ్డి షబ్బారాయుడ, పౌదరు పాపడు

బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవమతస్థులై (శివభక్తులు) (గౌడు కులం వారు అందరు కూడ) నిత్యం పూజలు సంప్రదాయాలను తరాలుగా వస్తున్న సంప్రదాయా జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు. ఇతర కులాల వారితో తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రధాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లు గీయడం కులం పని చేయడం స్నేహితులు, పాపయ్య కల్లు తాగడం లోకం తీరు చుట్టుప్రక్కల జరుగుచున్న విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లాడుకునేవారు.

హైదారాబాదు తురుష్క ఆగడాలుసవరించు

పదహారవ శతాబ్దంలో బహమనీ సుల్తానేట్ ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. గోల్కొండ కుతుబ్ షాహి రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. వారు పాలించటానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు. తురుష్క సైనికులు భూమి పన్నుల (రకాలు, శిస్తూ) వసూలు విధానంతో ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురిచేస్తూ, పీడించి, రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు. కులాల, మతలా పేర్లతో కూడా శిస్తులు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులం వారికి తాటిచెట్లకు పన్ను వేసారు. తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళేదారిలో పాపన్న కల్లు అమ్ముకొనే మండువాలో తురుష్క సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా హేళనగా నవ్వుకుంటు వెళ్ళేవారు. రెండు, మూడు సార్లు అలాగే జరిగింది.

మొదటి తిరుగుబాటుసవరించు

తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని, కల్లు తాగి డబ్బులు ఇవ్వకున్నా, పాపన్న పెద్దగా పట్టించుకునే వాడు కాదు. తురుష్క సైనికులు నా వద్ద కల్లు తాగుచున్నారు‌. రాజు గారి సైనికులు అంటే చాల గౌరవనీయులు. అయినా సైనికులు రాజుగారికి శిస్తుల లెక్కలు అప్పగించాలి కదా, కల్లుకు డబ్బులు ఇచ్చిన లెక్క తగ్గును కద పొనీలే అనుకునేవాడు. ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కల్లు తాగి వెళ్లిపోవుటకు సిద్దం అవుచుండగా, కల్లు మండువాకు వస్తున పాపన్న స్నేహితుడు ఒకరు "ధనరాసులు ఉన్నా కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురుష్క సైనికులు వెళ్లిపోవుటకు సిద్దం అయ్యారా” అని సరసంగా అన్నాడు.

అందుకు తురుష్క సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితున్ని తన్నుటకు కాలు ఎత్తాడు. అది చూసి ఆ క్షణంలో కోపోద్రిక్తుడైన పాపన్న, తన వద్ద కల్లు గీయడానికి ఉపయోగించు గీత కత్తి, మారు కత్తిలో ఒకదానితో, ప్రాణ స్నేహితుణ్ణి తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు. దాంతో మిగాతా సైనికులు పాపన్న మీదికి యుద్దానికి రావడంతో, ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికుల గుర్రాలు, వసూలు చేసిన రాజుగారి ధనరాసులు మాత్రమే. పేదవారిని పీడించి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటు పాపన్న స్నేహితులతో గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. తురుష్క రాజ్యంలో విప్లవకారుడు అయ్యాడు.

అప్పటి నుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళేదారిలో, పాపన్న అతని స్నేహితులతో కలసి తిరుగుబాట్లు ప్రారంభించాడు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు. యుద్దవిద్యలు నేర్చుకున్నాడు. పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ప్రదేశంలో మారుమోగింది. గ్రామాల్లోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు. వారికి యుద్దవిద్యలు నేర్పించి, అతి తొందరలోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమక్చూకున్నాడు. వారి దాడుల వల్ల కలిగే నష్టం కారణంగా వారిని స్థానిక జమీందార్లు (వంశపారంపర్య అధిపతులు -భూస్వాములు), ఫౌజ్‌దార్లు తరిమికొట్టారు.[2]

భువనగిరి కోటపై తిరుగుబాటుసవరించు

తెలంగాణాలో మెుఘల్ రాజు అప్పటి పాలకుల, అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. అతని తరపున పోరాడటానికి గెరిల్ల సైన్యాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలను పెంచగల సామర్థ్యం అతని 10,000 –12,000 విస్తృతంగా పెంచడానికి అవసరమైన సంఖ్యకి సాక్ష్యం. [2] [lower-alpha 1][3]

పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలన అంతానికి పోరాడారు. 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.

ఒక సామాన్య వ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 - 1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ (మిలిటరీ గవర్నర్) సోదరి. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు. జానపద కళాకారులు తరతరాలుగా 3, 4 వందల ఏండ్లు గడిచినా, జానపద కథలలో పాపన్న చరిత్ర ఇప్పటికీ స్థానికంగా పాడతారు. జానపద, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన సందర్భంలోనే చాలా సాక్ష్యాలు సేకరించబడ్డాయి. పాపన్న ఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్టనష్టాలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురాబాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది రూపం మారినా నేటికీ అలానే ఉంది.

ఇతర వివరాలుసవరించు

మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కుతుబ్ షాహి సుల్తాన్ నుండి ఖచ్చితమైన ఆదేశాలు ప్రారంభించాడు. అతని కుమారుడు ఔరంగజేబును గోల్కొండలో ప్రాతినిధ్యం వహించడానికి పంపాడు. ఔరంగజేబు చివరికి 1687 లో ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాడు. పాపన్న గెరిల్ల సైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్ధానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపూర్ వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. 1707లో ఔరంగజేబు మరణించిన తరువాత గోల్కొండలో సింహాసనన్ని అధిష్టించాడు. కొత్తగా రాజు అయిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చూసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతోనే గుండెల్లో పొడుచుకొని చనిపోయాడు. 1710 లో పాపన్న తలని గోల్కొండ కోట ముఖద్వారానికి వేళ్ళాడ దీసారు.

మరో కథనం ప్రకారంసవరించు

1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత బహదూర్ షా 63 సంవత్సరాల వయసులో ఢీల్లీ సింహాసనన్ని అధిష్టించాడు. ఆయన 2వ సోదరుడు ముహమ్మద్ కాంబక్ష్ గోల్కొండలో సింహాసనాన్ని అధిష్టించాడు. ఔరంగజేబు తరువాత రాజ్యాధికారానికి వారసుల మధ్య యుద్ధం సంభవించింది. ఔరంగజేబు చిన్న కుమారుడు రాకుమారుడు ముహమ్మద్ అజాం షాహ్ తనకుతానే చక్రవర్తిగా ప్రకటించి బహదూర్ షాతో యుద్ధం చేసి యుద్ధంలో మరణించాడు. మరొక సోదరుడు ముహమ్మద్ కాంబక్ష్ 1709లో మరణించాడు. గోల్కొండలో సింహాసనం సందీ కాల వ్యవస్ధ ఆ సమయంలో గోల్కొండకోట సింహాసనాన్ని స్వాధీనపర్చుకొని ఏడు నెలల పాటు అధికారం చెలాయించాడు. ఈ తిరుగుబాటుతో ఆధునిక భావాలున్న బహదూర్ షా పాపన్నతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ప్రతి ఆరుమాసాలకు ఢిల్లీకి కప్పం చెల్లించాలి అనేది వారి ఒప్పందం. దానికి పాపన్న మొదట కప్పం చెల్లించి, ఆరు మాసాల కాలం తరువాత తనకు తానే చక్రవర్తిగా ప్రకటించి ఢిల్లీకి కప్పం చెల్లించలేదు. తన బావమరిది ఫౌజార్‌తో సహా- పాపన్న మరొక కోటను ముట్టడి చేస్తున్నప్పుడు వారి బందీలను తారుమారు చేసి కోటను స్వాధీనం చేసుకోగలిగారు. [lower-alpha 2] ఆ సమయంలో బహదూర్ షా గోల్కొండకోట ముట్టడి చేయడానికి అనేక వేల మంది బలగాలను పంపాడు. ఇది సుదీర్ఘమైన యుద్దంగా మారి, మార్చి 1710 వరకు కొనసాగింది. అప్పటికి పాపాన్న గెరిల్ల సైన్యం సంఖ్య సుమారు 12,000 కు రెట్టింపు చేశాడు. కనీసం 30,000 మంది సైనికులు,- అశ్వికదళం పదాతిదళం - స్థానిక భూస్వాములు సరఫరా చేస్తారు. [2] యుద్దం జరుగుతున్న రోజుల్లోనే ఓ రాత్రి పాపాన్న బావమరిది చేత పట్టుబడ్డాడు. కొద్ది రోజుల తరువాత అతన్ని ఉరితీశారు. [2] సాంప్రదాయిక వృత్తాంతాలు ఉరితీసే పద్ధతి శిరచ్ఛేదం అని, ఆ తరువాత అతని మృతదేహాన్ని ముక్కలుగా చేసి అతని తల ఢిల్లీకి పంపారని చెప్పారు. [2] [5] చరిత్రకారులు రిచర్డ్స్, రావు పాపన్న ప్రయత్నాన్ని "ద్వంద్వ తిరుగుబాటు" గా సూచిస్తారు [6]చరిత్రకారులు మెట్‌కాల్ఫ్‌లు ఇతరులతో పాటు ఉపయోగించారు. [7] . " [8]మొఘల్ సామ్రాజ్యంలో చెలామణి అవుతున్న అధికారిక నివేదికలపై తన రచనలను ఆధారంగా చేసుకున్న సమకాలీన చరిత్రకారుని రచన కూడా ఉంది.[9]

గుర్తింపులుసవరించు

ఆదిలాబాదు జిల్లా, నిర్మల్లో 2012 జూలై 30 నాడు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ఠించబడింది.ఆంధ్రభూమి దినపత్రిక, ఆదిలాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 31-07-2012 2012 ఆగష్టు 18 నాడు కరీంనగర్ జిల్లా సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం కరీంనగర్ లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చే ఆవిష్కరించబడింది.[10]

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ దినపత్రిక తేది 18-8-2012 లో కొన్నే దేవేందర్ రెడ్డి వ్యాసం
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Eaton (2005).
  3. Eaton (2005), p. 166
  4. Eaton (2005), p. 167
  5. Richards & Rao (1980).
  6. Richards & Rao (1998).
  7. Singh (2008).
  8. Metcalf & Metcalf (2002).
  9. Eaton (2005), pp. 155, 160
  10. ఈనాడు దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 19-08-2012

వెలుపలి లంకెలుసవరించు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు