వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 11
- 1922 : మధుమేహ రోగులకు ఇన్సులిన్ వాడకం ప్రారంభించిన రోజు.
- 1928 : ప్రకృతి ధర్మవాద సమయంలో ఒక ఆంగ్ల నవలారచయిత, కవి థామస్ హార్డీ మరణం (జ.1840).
- 1944 : జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ జననం.
- 1966 : భారత దేశ రెండవ ప్రధాని, ప్రధానిగా శ్వేతవిప్లవం, హరితవిప్లవం, పాకిస్తాన్ యుద్ధం వంటి విజయాలు సాధించిన లాల్ బహదూర్ శాస్త్రి మరణం (జ.1904).
- 1973 : భారత క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్ జననం. (చిత్రంలో)
- 1991 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ డేవిడ్ అండర్సన్ మరణం (జ.1905).
- 2008 : న్యూజీలాండుకు చెందిన పర్వతారోహకుడు, అన్వేషకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం (జ.1919).