వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 23
- 1950: ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
- 1749: ప్రముఖ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త పియరీ సైమన్ లాప్లాస్ జననం (మ.1827).
- 1893: భారత దేశ ప్రముఖ ఆవిష్కర్త, ఇంజనీరు జి.డి.నాయుడు జననం (మరణం:1974).
- 1910: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రాంమనోహర్ లోహియా జన్మించాడు (మ.1967).
- 1931: భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్ (జ. 1907), రాజ్ గురు (జ. 1908), సుఖ్ దేవ్ (జ. 1907) లను ఉరి తీసారు.
- 1942: రెండవ ప్రపంచ యుద్ధంలో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.
- 1956: ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది.(పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)
- 1992: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ హేయక్ మరణం (జ. 1899).
- 1994: కపిల్ దేవ్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు.
- 1968: తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ జననం.