వికీపీడియా:తెవికీ వార్త/201 1-07-10/2011 తొలి 5 మాసాలలో తెవికీ ప్రగతి

తెవికీ వార్త
తెవికీ వార్త
2011 తొలి 5 మాసాలలో తెవికీ ప్రగతి

2011 తొలి 5 మాసాలలో తెవికీ ప్రగతి

గత 5 సం.లలో తొలి 5 మాసాలలో తెవికీ ప్రగతి రేఖాచిత్రం

2011 మే చివరి నాటికి తెవికీ 48వేలకు పైగా వ్యాసాలు, 434 చురుకైన సభ్యులను కలిగి ఉంది. జనవరి 2011 నుండి మే 2011 వరకు జరిగిన 5 మాసాలలో తెవికీలో 30 చురుకైన సభ్యులు (5కు పైగా దిద్దుబాట్లు చేసినవారు) కొత్తగా ప్రవేశించారు. ఈ 5 నెలల కాలములో సరాసరిగా రోజూ 7.2 కొత్త వ్యాసాలు తెవికీలో ప్రవేశించాయి. ఇదే సమయంలో సరాసరిన రోజూ 193 దిద్దుబాట్లు నమోదయ్యాయి. ఈ 5 మాసాల సమయంలో సరాసరిన ప్రతిమాసం 100కు పైగా దిద్దుబాట్లు చేసినవారి సంఖ్య 1 కాగా, నెలకు వెయ్యికి పైగా దిద్దుబాట్లు చేసిన వారి సంఖ్య 5 మాసాలు కలిపి ఒక్కటి మాత్రమే నమోదైనది. ఈ 5 మాసాల సమయంలో నిమిషానికి సగటున 55 సందర్శనలు (hits) నమోదయ్యాయి.

2011 తొలి 5 మాసాలలో తెవికీలో జరిగిన ప్రగతిని ఇదే సమయములో గత సంవత్సరాలలో జరిగిన ప్రగతితో తులనాత్మక అధ్యయనం చేయగా వచ్చిన విశ్లేషణలు:

వ్యాసాల సంఖ్య

2011లో తొలి 5 మాసాలలో సరాసరిన రోజూ 7.2 వ్యాసాల సృష్టి జరిగింది. ఈ సంఖ్య జనవరి, ఫిబ్రవరి మాసాలలో అత్యధికంగా 9 కాగా ఏప్రిల్‌లో కనిష్టంగా 5 వ్యాసాలు (సరాసరి) కొత్తగా తెవికీలో చేరాయి. ఇదే మాసాలకు సంబంధించి 2010లో సరాసరిన 5 వ్యాసాలు, 2009లో 8.2 వ్యాసాలు, 2009లో 13.2 వ్యాసాలు, 2007లో 9.2 వ్యాసాలు, 2006లో 7.4 కొత్త వ్యాసాల సృష్టింపు జరిగింది. పై 5 మాసాల రికార్డును గత కొన్ని సంవత్సరాలుగా పరిశీలిస్తే ఫిబ్రవరి 2008లో అత్యధికంగా రోజూ 21 కొత్తవ్యాసాల సృష్టింపు జరిగింది. కనిష్టంగా జనవరి 2010లో 3 కొత్త వ్యాసాలు మాత్రమే నమోదయ్యాయి. గత 2 సం.లుగా యాంత్రిక వ్యాసాలు అధిక సంఖ్యలో చేరుతున్ననూ కొత్త వ్యాసాలు 2008తో పోలిస్తే తక్కువగా ఉన్నట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి.

దిద్దుబాట్లు

2011 తొలి 5 మాసాలలో 5.8 వేల సరాసరితో మొత్తం 29.3 వేల దిద్దుబాట్లు నమోదయ్యాయి. అత్యధికంగా మే 2011లో 7.3 వేలు కాగా కనిష్టంగా ఏప్రిల్ 2011లో 4.4 వేలు దిద్దుబాట్లులు తెవికీలో జరిగాయి. గత సంవత్సరాలలో ఇదే సమయంతో పరిశీలిస్తే 2010లో 5.1 వేల సరాసరితో 25.4 వేలు, 2009లో 7.1 వేల సరాసరితో 35.7 వేలు, 2008లో 12.7 వేల సరాసరితో 63.8 వేలు, 2007లో 3.2 వేల సరాసరితో మొత్తం 16.2 వేల దిద్దుబాట్లు జరిగాయి.

సభ్యుల చేరిక

నెలలో కనీసం 5 దిద్దుబాట్లు చేసిన కొత్త సభ్యులు 2011 తొలి 5 మాసాలలో లో 30 మంది చేరగా, 2010లో ఈ సంఖ్య 21, 2009లో 25 ఉండగా 2008లో గరిష్టంగా 78 ఉంది. 2008 ఫిబ్రవరిలో అత్యధిక సంఖ్యలో చురుకైన సభ్యులు తెవికీలో ప్రవేశించారు.

చురుకైన సభ్యులు

నెలలో కనీసం 5 దిద్దుబాట్లు చేసిన సభ్యులు 2011 తొలి 5 మాసాలలో వరుసగా 39, 42, 38, 19, 37 (సరాసరి 35)గా ఉన్నది. అత్యధికంగా ఫిబ్రవరి 2011లో 42 కాగా ఏప్రిల్ 2011లో కనిష్టంగా 19 సభ్యులు రచనలు చేశారు. గత సంవత్సరాలలో ఇదే సమయంతో పరిశీలిస్తే ఈ సంఖ్య 2010లో 28.8, 2009లో 28.8, 2008లో 51.2, 2007లో 20.2గా నమోదైనది. ఫిబ్రవరి 2008లో గరిష్టంగా 105 చురుకైన సభ్యులు రచనలు చేశారు.

అతిచురుకైన సభ్యులు

నెలలో కనీసం 100 దిద్దుబాట్లు చేసిన సభ్యుల సంఖ్య 2011 తొలి 5 మాసాలలో వరుసగా 4, 5, 2, 1 మరియు 3 (సరాసరి 3)గా నమోదైనది. 2010లో ఇదే కాలములో సరాసరి 4.2, 2009లో 7.2, 2008లో 30.6, 2007లో 4.2గా నమోదైనది. ఫిబ్రవరి 2008లో అత్యధికంగా 17 సభ్యులు 100కి పైగా దిద్దుబాట్లు చేసినట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఆ ప్రభావం తదుపరి మాసాలలో కూడా కనబడగా ఇటీవలి కాలంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 1000కిపైగా దిద్దుబాట్లు చేసిన సభ్యులు ఈ 5 మాసాల కాలంలో ఒక్కటి మాత్రమే నమోదైనది. 2010 ఇదే కాలములో సున్నాకాగా, 2009లో 6, 2008లో 4, 2007లో 3గా గణాంకాల ద్వారా తెలుస్తున్నది. సంవత్సరంలోని ఏ మాసమునైనా పరిశీలిస్తే ఇప్పటివరకు నెలలో వెయ్యి దిద్దుబాట్లు చేసిన వారి సంఖ్య గరిష్టంగా 2 మాత్రమే. ఇది 6 సార్లు నమోదు కాగా, చివరిసారి నవంబరు 2009లో నమోదైనది.

వ్యాసాల సంఖ్య

వ్యాసాల సంఖ్య "వేలు"లో ఉన్నందున గణాంకాల ద్వారా ఖచ్చితమైన సమాచారం లభించడంలేదు. అందుబాటులో ఉన్న గణాంకాల ద్వారా పరిశీలిస్తే వ్యాసాల వృద్ధిలో 2011 తొలి 2 మాసాలలో ఒక్కశాతం చొప్పున వృద్ధి ఉండగా, ఆ తర్వాతి 3 మాసాలలో వృద్ధిరేటు సున్నాగా ఉన్నది. 2010లో ఇదే సమయములో అన్ని మాసాలలో సున్నా వృద్ధిరేలు నమోదుకాగా, 2009లో నాలుగు మాసాలలో 1% చొప్పున వ్యాసాల వృద్ధిరేటు నమోదైనది. 2008లో 4 మాసాలలో 1% చొప్పున మరియు ఫిబ్రవరిలో 2% వృద్ధిరేటు జరిగింది. 2007లో కూడా నాలుగు మాసాలలో 1% చొప్పున, ఒకమాసం 2% వృద్ధిరేటు జరిగింది. 2008 తర్వాత వ్యాసాల వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
  • ప్రముఖ అంకెలను సూచించిన వాటి దగ్గర, వాడుకరుల పేర్లు వారి సేవలను ఇతరులు తెలుసుకునే విధముగా ఖచ్చితముగా ప్రచురించి ప్రస్తావిస్తే మంచిది.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:36, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

జూన్ మాసపు గణాంకాలు కూడా పరిగణలోకి తీసుకొని 2011సం.లో తొలి 6 నెలల కాలంలో తెవికీలో సభ్యుల కృషిపై ప్రత్యేక వ్యాసం వ్రాయడానికి ప్రయత్నిస్తా. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:11, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
2008 లో ఎక్కువ కృషి జరగడానికి ప్రధాన కారణం అప్పుడు తెవికీ పై జరిగిన ప్రచారమ్ వివిద రకాలుగా తెవికీ గురించి పత్రికలలో వచ్చిన వ్యాసాలు బ్లాగులలో ప్రచారమ్ ద్వారా ఎక్కువ సభ్యులు వచ్చారు. ఇపుడు అలాటి ప్రచారం లేదు. వ్యాసాల సంఖ్య తక్కువ ఉండటం వలన సమచార సేకరణ కూడా మొదట్లో సులభంగా ఉండేది. ఇపుడు సేకరణ తగ్గింది. విశ్వనాధ్.బి.కె.
విశ్వనాధ్ గారు, వికీ పెరిగేకొద్దీ నిర్వహణ బాధ్యత పెరుగుతుంది. దానికి తగినట్లుగా సాంకేతిక మెళకువలు తెలిసిన సభ్యులు పెరగలేదు. అదేకాక బ్లాగులపై ఎక్కువ దృష్టిపెట్టారామో, సాధారణంగా పనిచేసే వారు కూడా క్రమేపీ తగ్గిపోయారు. ఇప్పుడు మరల పునరుత్తేజాన్ని కల్పించటానికి కృషి జరుగుతున్నది. మీలాంటి వారి చేయూత కావాలి. -- అర్జున 09:54, 30 డిసెంబర్ 2011 (UTC)