వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/నిర్వాహకత్వం పొందటానికి మార్గదర్శకాలు
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
తెలుగు వికీపీడియాలో నిర్వాహకత్వం పొందగోరే వాడుకరులకు అవసరమైన మార్గదర్శకాలను ఈ పేజీలో చూడవచ్చు. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు పేజీలో విస్తృత చర్చ జరిగిన తరువాత వచ్చిన నిర్ణయంతో ఈ మార్గదర్శకాలు ఏర్పడ్డాయి.
ఈ మార్గదర్శకాలు అమల్లోకి రావడంతో, గతంలో వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి, వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు పేజీల్లో ఉన్న ప్రమాణాలు రద్దయ్యాయి.
కనీస అర్హతలు, ఆవశ్యకతలు
మార్చు- అనామక సభ్యులు నిర్వాహకులు కాలేరు, వారు ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటుహక్కు ఉండదు. వ్యాఖ్యానించవచ్చు
- స్వీయ ప్రతిపాదన చేసుకోవాలి
- స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికీలో వాడుకరిగా నమోదై రెండు సంవత్సరాలు దాటాలి. అన్ని పేరుబరులలో కలిపి కనీసం 2000 దిద్దుబాట్లు చేసి ఉండాలి
- స్వీయ ప్రతిపాదన చేసేనాటికి 20 "చర్చ:" పేరుబరిలో (ప్రధానబరి వ్యాసాల చర్చలలో) లేదా రచ్చబండ చర్చలలో పాల్గొని ఉండాలి
- అభ్యర్ధికి వాడుకరి పేజీ ఉండాలి. ఆ సభ్య పేజీలో తమ తెవికీ ఇష్టాలు, పరిజ్ఞానం, వికీలో స్వయం ప్రతిపాదన చేసేనాటికి చేసిన కృషి గురించి కొంత సమాచారం ఉండాలి. ఈ విధంగా తెలుపుటవలన ఓటింగు సందర్భంలో అభ్యర్ధి కృషి గురించి వాడుకరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది
ఇతర సూచనలు
మార్చుఇవి ఆవశ్యకమైన అంశాలు కావు, కేవలం అభ్యర్థులకు సహాయకారిగా ఉండే సూచనలు మాత్రమే
నిర్వాహక బడి
మార్చునిర్వాహకత్వాన్ని ఆశించే వాడుకరులకు ప్రత్యేకించి ఒక శిక్షణ ఉంటే బాగుంటుందని చర్చలో భావించారు. అభ్యర్థులు కోరిన మీదట అనుభవజ్ఞులైన నిర్వాహకులు అలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
నిర్వాహక-సంబంధ పనులపై కృషి
మార్చునిర్వాహకత్వం కోరే అభ్యర్థులు నిర్వహణకు సంబంధించిన పనులపై కొంత కృషి చేసి ఉంటే, అది వారి భవిష్యత్తు పనుల్లో సహాయకారిగా ఉంటుంది. కింది పట్టిక ఈ పనులకు సంబంధించి అభ్యర్థులకు మార్గదర్శకంగా ఉంటుంది.
ఇది నిర్వాహకత్వాన్ని నిర్ణయించే "కొలత" కాదు. దీనిపై ఆధారపడి నిర్ణయం చెయ్యరాదు. అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలో దీన్ని ఒక పనిముట్టుగా మాత్రమే చూడాలి.
సం | పని |
---|---|
1 | ఇటీవలి మార్పులపై నిఘా పెట్టి పేజీల్లో జరిగే దుశ్చర్యలు మొదలైనవాటిని పరిశీలిస్తూ ఆయా దిద్దుబాట్లను తిరగ్గొడుతూ ఉండడం. కొత్త వ్యాసాలను తనిఖీ చెయ్యడం. (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) చేసిన ప్రతి తనిఖీకీ.. |
2 | నిర్వహణకు సంబంధించి చేసే చర్యలు (అనాథ వ్యాసాలు, అగాధ వ్యాసాలు, కోరిన వ్యాసాలు/వర్గాలు/మూసలు వగైరా జాబితాలపై పనిచేయడం) (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
3 | వ్యాసాల్లో భాష నాణ్యతపై చర్యలు - భాషను సవరించడం, సముచితమైన మూసను చేర్చడం వగైరా (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
4 | నిర్వాహకుల నోటీసుబోర్డులో ఏదైనా విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకురావడం. ఉదా: దుశ్చర్య, తొలగింపు చర్య, సంరక్షణ, వగైరా (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
5 | అయోమయ నివృత్తి పేజీల సృష్టి/విస్తరణ/నిర్వహణ (వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
6 | అయోమయ నివృత్తి పేజీలకు వెళ్తున్న లింకులను గమనించి వాటిని సరైన పేజీకి మార్చడం (వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
7 | తక్షణమే తొలగించాల్సిన పేజీల్లో CSD మూసలు చేర్చడం (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
8 | తొలగింపు చర్చపై నిర్ణయాన్ని ప్రకటించడం (నిర్ణయం ఎలా ప్రకటించాలనే పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది) |
9 | తొలగింపుకు ప్రతిపాదించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది) |
10 | తొలగింపు చర్చలో పాల్గొని అభిప్రాయం ప్రకటించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది. చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది) |
11 | తొలగింపు ప్రతిపాదన వచ్చినపుడు ఆ వ్యాసంలో తగు మార్పులు చేసి తొలగింపు నుండి రక్షించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని, వ్యాసాలను తొలగించకుండా నిలిపి ఉంచే నిబద్ధతను సూచిస్తుంది) |
12 | రచ్చబండలో చర్చలో పాల్గొనడం (చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది) |
13 | కొత్తవారికి తోడ్పాటు (స్వాగతం కాకుండా, వాడుకరి చేసిన పనిని ప్రస్తావిస్తూ ప్రోత్సహించడం, దోషాలేమైనా ఉంటే మర్యాదగా తెలియజేయడం) |
14 | ఎడబ్ల్యుబి వాడుక |
15 | అనువాద పరికరం వాడుక |