వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

తెలుగు వికీపీడియాలో నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి ఈ పేజీ సృష్టించబడింది. ఇక సవరణలు, కొత్త ప్రతిపాదనలు అవసరమా అనే దానిపై అలోచిస్తే తప్పనిసరిగా అవసరమనే భావించాలి. ఎందుకంటే తెవికీలో ఇప్పటికే నిర్వాహకత్వ బాధ్యతలు పొందుటకు నిర్వర్తించవలసిన బాధ్యతలు, మార్గదర్శకాలు, ప్రతిపాదనల విధానం, వోటింగు విధానం మొదలగు విషయాలు గురించి సుమారు 15 సంవత్సరాలపై క్రిందట 2005 నుండి 2008 మధ్య తయారుచేయబడినవి. అవి ఇప్పటి పరిస్థితులకు చాలావరకు అనువుగా లేవు. కొన్ని సందిగ్ధంగా ఉన్నవి. వాటిలో కొన్నిటిని ఇప్పటి పరిస్థితులకు అనువుగా మార్చుటకు, కొన్ని కొత్త మార్గదర్శకాలు, బాధ్యతలు మొదలగు విషయాలు చేర్పు అవసరమైఉంది. తెవికీలో నిర్వాహకుల చురుకుదనం కొరతపై, విశాఖలో జరిగిన తెవికీ పండగ-2024లో చర్చకు వచ్చిన విషయం అందరికీ తెలుసు. నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించాటానికి అవసరమైన నిర్దుష్ట కనీస మార్గదర్శకాలు అంతగా లేవు. వాటిని పొందుపర్చి సముదాయంలో కూలంకషంగా చర్చించి, నిర్వాహకత్వ హక్కులు పొందటానికి విధానాల పేజీ అనేది ఒకటి ఉండాలనే అభిప్రాయంతో ఈ పేజీ తయారుచేయబడింది. వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలు ప్రతిపాదించటమైనది. వీటివలన నిర్వహాకత్వం మంచి వాతావరణతో ఉండి, తెవికీ అభివృద్ధికి మరింత దోహదపడగలదని భావించటమైనది.

అవలోకనం

మార్చు

విర్వాహకులు సాధారణముగా వికిపీడియా సమాజములో విశ్వసనీయులై ఉంటారు. ఈ పేజీ సృష్టించేనాటికి ప్రస్తుతం తెవికీలో 11 మంది నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటివరకు గతంలో పనిచేసిన మాజీ నిర్వాహకులు 14 మందిలో వివిధ కారాణాలవలన స్వచ్ఛంద విరమణ చేసినవారు నలుగురు ఉండగా, చాలాకాలం నుంచి చురుకుగా లేనందున స్టీవార్డులచే తొలగించినవారు 9 మంది, సముదాయం నిర్ణయం ప్రకారం తొలగించినవారు ఒకరు ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితి

మార్చు

ప్రస్తుతం ఉన్న 11 మందిలో కారణం ఏదైనా కావచ్చు, బహు కొద్దిమంది (ముగ్గురు లేదా నలుగురు) మాత్రమే చురుకుగా నిర్వాహక విధులను నిర్వర్తించుట సాగుతుంది. ఈ పరిస్థితులలో వికీపీడియా నిర్వహణ చాలా క్లిష్టతరంగా ఉంది. దాని వలన ఆశించినంతగా తెవికీ అభివృద్ధిని చేయలేకపోతున్నాం.

భవిష్యత్తు ప్రణాళిక

మార్చు

వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు లో భాగంగా నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణపై పేజీనొకదానిని తయారుచేసి, దానిపై సముదాయంలో చర్చించి విధానాలు రూపొందించుకున్నాం. అయితే ఆ చర్చనాటికి నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు అనే ఈ పేజీని రూపొందించనందున ఇది చర్చకు రాలేదు. అప్పటినుండి ఇది పెండింగులో ఉంది. తెవికీ అభివృద్ధి చెందాలంటే నిర్వాహకునికి మరింత సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం మెరుగుపడాలంటే చేసేపనిలో విస్తృత చర్యల వలన మాత్రమే సాధ్యపడింది. ఆ చర్యలలో భాగంగా అదనంగా ఈ కొత్త ప్రతిపాదనలు చేయటమైనది.

అమలులో ఉన్న మార్గదర్శకాలు

మార్చు

ప్రస్తుతం అమలులో ఉన్న అభ్యర్ధిత్వ మార్గదర్శకాలు ఈ రెండు లింకులలో ఉన్నవి.

1) మొదటి లింకు:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి

2) రెండవ లింకు:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు

సవరణలతో ప్రతిపాదించిన పాత, అదనంగా ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలు

మార్చు
  1. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికీలో వాడుకరిగా నమోదై రెండు సంవత్సరాలు దాటాలి. ఆ కాలంలోపు 2000 ఎడిట్లు చేసి ఉండాలి.(ఈ దిద్దుబాట్లు అన్ని నేంస్పేసులతో కలిపి).
  2. స్యీయ ప్రతిపాదన చేసుకోవాలి
  3. అనామక సభ్యులు నిర్వాహాకులు కాలేరు, వారు ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటుహక్కు ఉండదు.వ్యాఖ్యానించవచ్చు.
  4. అభ్యర్ధికి సభ్య పేజీ ఉండాలి. ఆ సభ్య పేజీలో వ్యక్తిగత విషయాలు బయల్పరచవలసిన అవసరం లేదు, కానీ తనకు తెవికీ ఇష్టాఇష్టాలు, పరిజ్ఞానం, వికీలో స్యయం ప్రతిపాదనచేసేనాటికి చేసిన కృషి గురించి కొంతైనా సమాచారం ఉండాలి. ఈ విధంగా తెలుపుటవలన ఓటింగు సందర్బంలో అభ్యర్ధి ఇష్టాఇష్టాలు, కృషిని సభ్యులందరూ తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది.
  5. అభ్యర్ధి 2000 దిద్దుబాట్లతో పాటు, స్యీయప్రతిపాదన చేసుకునేనాటికి 50 వ్యాసాలలో ఎడిట్లు చేసిఉండాలి.
  6. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికి ప్రధానపేరుబరిలో అనువాదయంత్రం ద్వారా 20 వ్యాసాలు సృష్టించి ఉండాలి.
  7. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి 20 ప్రధానపేరుబరి వ్యాసాల చర్చలలో లేదా రచ్చబండ చర్చలలో పాల్గొని ఉండాలి.
  8. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి కనీసం రెండు ప్రాజెక్టు పనులలో భాగస్వామ్యం అయి ఉండాలి.
  9. స్వీయ ప్రతిపాదన చేసుకునేముందు ముగ్గురు నిర్వాహకులు అభిప్రాయాలు తెలుసుకోవాలి. వారిలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు పరిగణించి, స్వీయప్రతిపాదన చేసుకోవాలి. (దీని వలన అభ్యర్థికి ఆత్మస్థైర్యం కలగటానిక అవకాశం ఉంది.)
  10. ఆరు మాసాలకు మించి శలవులో ఉన్నప్పుడు నిర్వాహకత్వం స్వయంచాలకంగా రద్దైయింది.
  11. మొదట ఒక సంవత్సరకాలం వరకు నిర్వాహకత్వం పనితీరు పరిశీలన కింద (ట్రయల్ రన్) గా పరిగణించబడుతుంది. దాని తరువాత నిర్వాహకత్వం స్వయంచాలకంగా రద్దైయింది.
  12. అభ్యర్థి కోరికమేరకు తిరిగి రెగ్యులర్‌గా కొనసాగటానికి, ఆ కాలంలో పనితీరు సంతృప్తిగా ఉందని సముదాయం భావిస్తే మాత్రమే కంటిన్యూ కావటానికి అవకాశం ఉంది.

చర్చ, అభిప్రాయల కొరకు సమయం

మార్చు

దీనిమీద 2024 మార్చి 19 నుండి మార్చి 31 లోపు

సమయం పొడిగింపు

మార్చు

ఇలాంటి మార్గదర్శకాలకు కొరకు కనీస సమయం 15 రోజులైనా ఉండాలనే ఉద్దేశ్యంతో మరో రొండు రోజులు అనగా 2024 ఏప్రిల్ 2 (రాత్రి 12 గం) వరకు పొడిగించటమైనది.

గడువు ముగిసింది

మార్చు

2024 ఏప్రిల్ 2 (రాత్రి 12 గం) తో గడువు ముగిసింది

అభిప్రాయాలు, చర్చ, మద్దతు కొరకు

మార్చు

అభిప్రాయాలు

మార్చు
  1. వికీపీడియా అభివృద్ధి పయనంలో ఉండాలంటే విస్తృత మార్గదర్శకాలు ఉండాలిసిన అవసరముంది. పై మార్గదర్శకాలు అలాంటి ఉద్ధేశ్యంతో ఉన్నాయని నేను నమ్ముతున్నాను.పై వాటిని అమలులో తీసుకురావటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:21, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన లోని వివిధ పాయింట్లపై అభిప్రాయాలను విడివిడిగా కింద ఇచ్చిన ఆయా పాయింట్ల కింద రాయవలసినది.

  1. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికీలో వాడుకరిగా నమోదై రెండు సంవత్సరాలు దాటాలి.ఆ కాలంలోపు 2000 ఎడిట్లు చేసి ఉండాలి.(ఈ దిద్దుబాట్లు అన్ని నేంస్పేసులతో కలిపి)
    1. ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తోంది. దీని బదులు 1) గత 6 నెలల్లో చురుగ్గా ఉండి ఉండాలి (కనీసం 300 దిద్దుబాట్లు చేసి ఉండాలి), 2) వాడుకరి చేసిన మొత్తం దిద్దుబాట్లలో ప్రధాన బరిలోని దిద్దుబాట్లను, వాడుకరి చర్చ పేజీలో స్వాగతం దిద్దుబాట్లనూ మినహాయించి మిగతావి కనీసం 10 శాతం లేదా 150 దిద్దుబాట్లు (ఏది తక్కువైతే అది) ఉండాలని నిబంధన పెట్టవచ్చు అని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. రెండు వేల ఎడిట్లూ, రెండేళ్ళు చాలా పెద్ద సంఖ్య. ఎడిట్ల సంఖ్య సగానికి (వెయ్యి), ఏళ్ళ సంఖ్య సగానికన్నా తక్కువ (6-8 నెలల వరకూ) తగ్గించాలని నా ప్రతిపాదన. ఏయే పేరుబరుల్లో ఎంత కృషిచేశారన్నదానిపై కూడా నిబంధన ఉండాలి. --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. వేరే వికీ ప్రాజెక్టులో లో ఇప్పటికే అధికారి/నిర్వాహకునిగా ఉన్న వ్యక్తికి ఈ నిబంధన వర్తిస్తుందా? --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. ఎడిట్లను పరిగణలోకి తీసుకోకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కో వాడుకరి ఒక్క వ్యాసానికి 100 ఎడిట్లు చేస్తున్నారు. దీనికి బదులుగా గత 6 నెలల్లో చురుగ్గా ఉండి ఉండాలి అనే నిబంధన పాటిస్తే బాగుంటుంది. --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. సమ్మతిస్తున్నాను స్వీయ ప్రతిపాదన చేసేవారికి తెలుగు వికీపీడియాలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని గత ఆరు నెలలలో చురుకుగా వుండాలి అందులో ప్రధాన పేరుబరిలో కాక వికీపీడియా నిర్వహణలో సహేతుకమైన సమయం మాత్రమే కాక కనీసం 30 ఎడిట్లు శాతం అన్నా చర్చా పేజీలు, వంటి ఇతర పేజీలలో వుండాలి. Kasyap (చర్చ) 04:40, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. తెవికీలో 6 నెలల పాటు క్రియాశీలకంగా ఉంటూ తన వ్యాసాలలో దిద్దుబాట్లు మాత్రమే కాకుండా వికీ నిర్వహణా కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండాలి. అంటే ఇతర వ్యాసాలలో శుద్ధి, విస్తరణా కార్యక్రమాలు, వికీకరణ, మూలాలు చేర్చడం, లింకులను చేర్చడం వంటి విషయాలపై అవగాహన ఉండాలి. వికీ విధానాలు తెలిసి ఉండాలి. 6నెలల కాలపరిమితి, 1000 దిద్దుబాట్లు చేసి ఉండాలి.➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. రెండూ తగ్గించాలి. సంవత్సర కాలం, 1000 దిద్దుబాట్లు సరిపొతాయి. B.K.Viswanadh (చర్చ)
    8. ఇక్కడి లింకులలో సమాచారం చూస్తే నాకు అర్ధమయినది ఏమంటే నిర్వాహకులు కొన్ని అదనపు బాధ్యతలు చేపట్టే వాడుకరులు అని. దానికి నిర్వాహక సామర్ధ్యంతో పాటు వికీ గురించిన అదనపు అవగాహన, పని సామర్ధ్యం కూడా ఉండాలి. దానికి కనీసం ఒక సంవత్సరం కొన్ని ప్రాజెక్ట్ లలో చురుకుగా పనిచేసిన వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. దిద్దుబాట్లు, వ్యాసాలు ఇతరత్రా పని సామర్ధ్యానికి కొలమానమయితే 1000 దిద్దుబాట్లు వంటివి కనీసం ఉండాలి. ఇది నా అభిప్రాయం.--VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. సంవత్సర కాలం, 1000 దిద్దుబాట్లుగా నియమం పెట్టుకొని, ఏయే పేరుబరుల్లో ఎంత కృషిచేశారన్నదాన్ని పరిగణలోకి తీసుకోవాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. సమ్మతిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:41, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. సమ్మతిస్తున్నాను --అభిలాష్ మ్యాడం (చర్చ) 16:20, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. సమ్మతిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. సమ్మతిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. సమ్మతిస్తున్నాను -- Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. సమ్మతిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. స్వీయ ప్రతిపాదన చేసుకోవాలి
    1. సమ్మతిస్తున్నాను __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. సమ్మతిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. సమ్మతిస్తున్నాను -- రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. సమ్మతిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. సమ్మతిస్తున్నాను -- Kasyap (చర్చ) 04:40, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. సమ్మతిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. సమ్మతిస్తున్నాను ---B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. సమ్మతిస్తున్నాను -- రవిచంద్ర (చర్చ) 10:15, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. సమ్మతిస్తున్నాను ----VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. సమ్మతిస్తున్నాను --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. సమ్మతిస్తున్నాను -- Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. సమ్మతిస్తున్నాను --అభిలాష్ మ్యాడం (చర్చ) 16:20, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. సమ్మతిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. సమ్మతిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. సమ్మతిస్తున్నాను -- Thirumalgoud (చర్చ) 16:01, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. సమ్మతిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. అనామక సభ్యులు నిర్వాహకులు కాలేరు, వారు ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటుహక్కు ఉండదు కానీ వ్యాఖ్యానించవచ్చు.
    1. సమ్మతిస్తున్నాను __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. సమ్మతిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. వోటుహక్కు ఉన్నా లేకపోయినా, అనామకంగా వ్యాఖ్య చేసే హక్కు ఉండాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. సమ్మతిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. సమ్మతిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:26, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. సమ్మతిస్తున్నాను ---B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. సమ్మతిస్తున్నాను -- రవిచంద్ర (చర్చ) 10:15, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. సమ్మతిస్తున్నాను ----VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. సమ్మతిస్తున్నాను --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. సమ్మతిస్తున్నాను Palagiri (చర్చ) 06:34, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. సమ్మతిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. సమ్మతిస్తున్నాను --అభిలాష్ మ్యాడం (చర్చ) 16:20, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. సమ్మతిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. సమ్మతిస్తున్నాను --Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. సమ్మతిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. సమ్మతిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:01, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    17. సమ్మతిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    18. సమ్మతిస్తున్నాను -- నేతి సాయి కిరణ్ (చర్చ) 06:20, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. అభ్యర్ధికి సభ్య పేజీ ఉండాలి. ఆ సభ్య పేజీలో వ్యక్తిగత విషయాలు బయల్పరచవలసిన అవసరం లేదు, కానీ తనకు తెవికీ ఇష్టాఇష్టాలు, పరిజ్ఞానం, వికీలో స్వయం ప్రతిపాదనచేసేనాటికి చేసిన కృషి గురించి కొంతైనా సమాచారం ఉండాలి. ఈ విధంగా తెలుపుటవలన ఓటింగు సందర్భంలో అభ్యర్ధి ఇష్టాఇష్టాలు, కృషిని సభ్యులందరూ తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది.
    1. సమ్మతిస్తున్నాను __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. no వ్యతిరేకిస్తున్నాను అభ్యర్థికి వాడుకరి పేజీ ఉండాలన్నంతవరకూ ఒప్పుకుంటున్నాను. అయితే, అందులో ఏం ఉండాలన్నదానిపై ఏ నిబంధన ఉండకూడదని నా అభిప్రాయం. ప్రతిపాదనలోనే వారి కృషి గురించి, నిర్వాహకులయ్యాకా ఏం చేయదలుచుకున్నారన్నదాని గురించి ఉండాలి తప్ప వాడుకరి పేజీలో ఆ సమాచారం ఉండాలని నిబంధనగా అయితే విధించకూడదు. వాడుకరి పేజీలో కేవలం Babel టెంప్లెట్ ఉన్నా వారి ప్రతిపాదన విషయంలో, ప్రతిపాదనను పరిశీలించడంలో ఏ తేడా ఉండకూడదు. --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. no వ్యతిరేకిస్తున్నాను -- రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. సమ్మతిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను - అనామక సభ్యులు నిర్వాహాకులు కావచ్చు, వేరొకరిని ప్రతిపాదించ వచ్చు Kasyap (చర్చ)
    6. సమ్మతిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. no వ్యతిరేకిస్తున్నాను ---B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. no వ్యతిరేకిస్తున్నాను - వారికి తోచిన సమాచారంతో సభ్య పేజీ ఉంటే సరిపోతుంది. ఓటు చేసే వాళ్ళు ఆ సభ్యుని కృషి తెలుసుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. -- రవిచంద్ర (చర్చ) 10:15, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. సమ్మతిస్తున్నాను -- సభ్యపేజీ ఉండాలి. సమాచారం వికీ మార్గదర్శకాలను అనుసరించి వాడుకరి రూపొందించవచ్చు. గణాంక పరికరాలు పూర్తి అవగాహనా ఈయలేవు.--VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. సమ్మతిస్తున్నాను --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. సమ్మతిస్తున్నాను Palagiri (చర్చ) 09:24, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. సమ్మతిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. సమ్మతిస్తున్నాను --అభిలాష్ మ్యాడం (చర్చ) 16:20, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. సమ్మతిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. సమ్మతిస్తున్నాను --Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. సమ్మతిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    17. సమ్మతిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:01, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    18. సమ్మతిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. అభ్యర్ధి 2000 దిద్దుబాట్లతో పాటు, స్యీయప్రతిపాదన చేసుకునేనాటికి 50 వ్యాసాలలో ఎడిట్లు చేసిఉండాలి.
    1. no వ్యతిరేకిస్తున్నాను . ఎందుకంటే దిద్దుబాట్లు పది వ్యాసాల్లో చేసినా 50 వ్యాసాల్లో చేసినా తేడా ఎమీ ఉండదు అని నా ఉద్దేశం.__చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. @Chaduvari: గారితో ఏకీభవిస్తూ no వ్యతిరేకిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. no వ్యతిరేకిస్తున్నాను --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. no వ్యతిరేకిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. no వ్యతిరేకిస్తున్నాను ---B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. తటస్థం --VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. no వ్యతిరేకిస్తున్నాను . వ్యాసాలను అభివృద్ధి చేయడం వరకు సమ్మతమేకానీ, వ్యాసాల పరిమితి అవసరం లేదని నా అభిప్రాయం. --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. @Chaduvari: గారితో ఏకీభవిస్తూ no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 09:24, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. no వ్యతిరేకిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. no వ్యతిరేకిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. no వ్యతిరేకిస్తున్నాను ఎన్ని దిద్దుబాట్లు, ఎన్ని ఎడిట్ లకంటే, కనీసం ఆరు మాసాలపాటు వాడుకరి చురుకుగా కృషిచేస్తూ ఉండాలి.Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. no వ్యతిరేకిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:01, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. no వ్యతిరేకిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. సమ్మతిస్తున్నాను -- నేతి సాయి కిరణ్ (చర్చ) 06:20, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికి ప్రధానపేరుబరిలో అనువాదయంత్రం ద్వారా 20 వ్యాసాలు సృష్టించి ఉండాలి.
    1. no వ్యతిరేకిస్తున్నాను . నిర్వాహకత్వానికి ఆవశ్యకమైనది - నిర్వహణా పరమైన పరిజ్ఞానం, అందుకు తగ్గ కృషి. అనువాదాలు చెయ్యడం అందులోకి రాదు __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. no వ్యతిరేకిస్తున్నాను --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. no వ్యతిరేకిస్తున్నాను -- యాంత్రిక అనువాద వ్యాసాలకంటే స్వంతగా అనువాదం చేసిన అనువాదాలు బాగుంటున్నాయి. యాంత్రిక అనువాద వ్యాసాలు పరిగణలోకి తీసుకోకపోవడం మంచింది.--Tmamatha (చర్చ) 16:11, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. no వ్యతిరేకిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను ---B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. no వ్యతిరేకిస్తున్నాను --అనువాద పరికరం నుంచి తప్పనిసరిగా తెలిసి ఉండవలసిన అవసరం లేదు కానీ, అనువాదం, అందులో సమస్యలు, మెరుగుపరచడం, సూచనలు తెలిస్తే బాగుంటుంది. -- రవిచంద్ర (చర్చ) 10:15, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. అనువాద పరికరం ముఖ్యమయినది. దాని ప్రయోజనాల గురించిన అవగాహన, అనువాద సమస్యలు, మెరుగుపరచడం, సూచనలు అవసరం. ఇతరభాషలలో, ముఖ్యంగా ఆంగ్లంలో నుంచి కావలసిన వ్యాసాలున్నాయి. ఎన్ని అనువాదాలు చేయాలి అనేది ముఖ్యం కాదు. --VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. no వ్యతిరేకిస్తున్నాను . అనుభవం కొరకు అనువాదయంత్రం ద్వారా వ్యాసాలను అనువాదం చేయడం వరకు సమ్మతమేకానీ, వ్యాసాల పరిమితి అవసరం లేదని నా అభిప్రాయం. ఈ విషయంలో రవిచంద్ర గారి అభిప్రాయంలో ఏకీభవిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. no వ్యతిరేకిస్తున్నాను నాకు అనువాద పరికరం తెలియదు.ఎక్కువగా స్వంత అనువాదాలు లేదా స్వంత రచనలు చెసాను.నేను 20 యాంత్రిక అనువాద వ్యాసాలు లేవని,తీసిపుచ్చడం సబబు కాదని నా వ్యక్తిగత అభిప్రాయం.Palagiri (చర్చ) 09:24, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. సమ్మతిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. సమ్మతిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. సమ్మతిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. no వ్యతిరేకిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. no వ్యతిరేకిస్తున్నాను -- నేతి సాయి కిరణ్ (చర్చ) 06:20, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి 20 ప్రధానపేరుబరి వ్యాసాల చర్చలలో లేదా రచ్చబండ చర్చలలో పాల్గొని ఉండాలి.
    1. సమ్మతిస్తున్నాను . అయితే ఈ పాయింటును బాగా విస్తరించాలి. అభ్యర్థి చెయ్యాల్సిన కృషి గురించి మరింత విపులంగా ఉండాలి. దాన్ని చర్చ విభాగంలో రాసాను. __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. సమ్మతిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. సమ్మతిస్తున్నాను . చర్చతో పాటుగా ఇతర ఎన్నికలలో కూడా వోటరుగా పాల్గొనాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. సమ్మతిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. సమ్మతిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. సమ్మతిస్తున్నాను ---B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. సమ్మతిస్తున్నాను -- రవిచంద్ర (చర్చ) 10:20, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. సమ్మతిస్తున్నాను -- --VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. సమ్మతిస్తున్నాను --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 09:28, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. సమ్మతిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. సమ్మతిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. సమ్మతిస్తున్నాను అయితే, అనువాదయంత్రం, అలాగే, సరియైన అనువాదం పట్ల అవగాహన ఉంటే సరిపోతుంది. Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. సమ్మతిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. సమ్మతిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. సమ్మతిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి కనీసం రెండు ప్రాజెక్టు పనులలో భాగస్వామ్యం అయి ఉండాలి.
    1. సమ్మతిస్తున్నాను , కానీ ఒక వికీప్రాజెక్టు చాలు. __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. no వ్యతిరేకిస్తున్నాను నిర్వాహకత్వానికి వికీప్రాజెక్టుల్లో పనిచేయడానికి ప్రత్యక్షంగా ఏమీ సంబంధం లేదు. ఏ వికీప్రాజెక్టులోనూ పనిచేయకుండానే తనకు తోచిన పని తాను చేసుకుంటూ నిర్వహణా సూత్రాలను అవగాహన చేసుకోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. no వ్యతిరేకిస్తున్నాను --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 03:19, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. సమ్మతిస్తున్నాను , కానీ ఒక వికీప్రాజెక్టు చాలు. ➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. no వ్యతిరేకిస్తున్నాను -- అవసరం లేదు. మిగతా నిర్వహణా కార్యకాలపాలలొ పాల్గొంటే చాలు..--B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. no వ్యతిరేకిస్తున్నాను -- రవిచంద్ర (చర్చ) 10:20, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. సమ్మతిస్తున్నాను , కనీసం ఒక వికీప్రాజెక్టు అనుభవం ఉంటే మంచింది.--VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. no వ్యతిరేకిస్తున్నాను . ఈ విషయంలో పవన్ సంతోష్ గారితో ఏకీభవిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 06:34, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. no వ్యతిరేకిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. no వ్యతిరేకిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. సమ్మతిస్తున్నాను Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. no వ్యతిరేకిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    17. no వ్యతిరేకిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  9. స్వీయ ప్రతిపాదన చేసుకునేముందు ముగ్గురు నిర్వాహకులు అభిప్రాయాలు తెలుసుకోవాలి. వారిలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు పరిగణించి, స్వీయప్రతిపాదన చేసుకోవాలి.(దీని వలన అభ్యర్థికి ఆత్మస్థైర్యం కలగటానిక అవకాశం ఉంది.)
    1. no వ్యతిరేకిస్తున్నాను . తెలుసుకుంటే మంచిదే. కానీ నిర్బంధం చేస్తే అప్పుడు రెండు దశల్లో ప్రతిపాదనలు పెట్టమని చెప్పినట్లు అవుతుంది.__చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. no వ్యతిరేకిస్తున్నాను మెజారిటీ అభిప్రాయం మంచిదవ్వాలని నియమం ఏమీ లేదు. నిర్వాహకుల్లో అత్యధికులు చురుగ్గా లేరని ప్రతిపాదకులే చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ ప్రతిపాదన నష్టదాయకంగా ఉంటుంది. ఉదాహరణకు నిర్వాహకత్వ సంస్కరణల గురించి చేసిన ఈ ప్రతిపాదనకే ముగ్గురు, నలుగురికి మించి నిర్వాహకుల అభిప్రాయాలు రాకపోవచ్చు. ఒక సామాన్యమైన అభ్యర్థి ముగ్గురు నిర్వాహకుల ఎలా సంపాదించగలరు? --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. no వ్యతిరేకిస్తున్నాను --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 03:22, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. no వ్యతిరేకిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. no వ్యతిరేకిస్తున్నాను - అవసరం లేదు. ఒకసారి ప్రతిపాదన చాలు.B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. no వ్యతిరేకిస్తున్నాను - ఒకేసారి ప్రతిపాదన చాలు --VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. no వ్యతిరేకిస్తున్నాను --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 06:34, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. no వ్యతిరేకిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. no వ్యతిరేకిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. no వ్యతిరేకిస్తున్నాను ఇది సరి కాదు. Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. no వ్యతిరేకిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. no వ్యతిరేకిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    17. సమ్మతిస్తున్నాను -- నేతి సాయి కిరణ్ (చర్చ) 06:20, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. ఆరు మాసాలకు మించి సెలవులో ఉన్నప్పుడు నిర్వాహకత్వం స్వయంచాలకంగా రద్దైయింది.
    1. no వ్యతిరేకిస్తున్నాను . ఎందుకంటే, రెండేళ్ళ పాటు నిష్క్రియగా ఉన్న నిర్వాహకుల నిర్వాహకత్వాన్ని తీసేసే పద్ధతి అన్ని వికీపీడియాల వ్యాప్తంగా ఈసరికే ఉంది. దాన్ని మార్చాల్సిన అవసరం కనబడ్డం లేదు. __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. no వ్యతిరేకిస్తున్నాను --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. no వ్యతిరేకిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. no వ్యతిరేకిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను - --B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. no వ్యతిరేకిస్తున్నాను - ఇది సాధ్యం కాదు.--VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. no వ్యతిరేకిస్తున్నాను . ఈ విషయంలో చదువరి గారితో ఏకీభవిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:44, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. సమ్మతిస్తున్నాను Palagiri (చర్చ) 06:34, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. no వ్యతిరేకిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. సమ్మతిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. సమ్మతిస్తున్నాను ఇంకా సమయం తగ్గించినా పరవాలేదు.Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. no వ్యతిరేకిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. no వ్యతిరేకిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  11. మొదట ఒక సంవత్సరకాలం వరకు నిర్వాహకత్వం పనితీరు పరిశీలన కింద (ట్రయల్ రన్) గా పరిగణించబడుతుంది.దాని తరువాత నిర్వాహకత్వం స్వయంచాలకంగా రద్దైయింది.
    1. no వ్యతిరేకిస్తున్నాను . ఇన్ని అర్హతలు, పరీక్షలూ పెట్టి, మళ్ళీ తాత్కాలికం అంటే సబబుగా లేదు. __చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. no వ్యతిరేకిస్తున్నాను ఈ రూపంలో ప్రతిపాదన నాకూ సమ్మతం కాదు. కానీ, ఈ సూచన వెనుక ఉద్దేశం అర్థం చేసుకోదగ్గది. నిర్వాహకులు చురుకుగా లేకపోవడం పట్ల అసంతృప్తితో, పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశంతో వచ్చినదిగా నాకు తోస్తున్నది. అలాగైతే, ఈ నియమం కొత్తగా వచ్చే నిర్వాహకులకే కాక మొత్తం అందరు నిర్వాహకులకూ వర్తించేలాగా మరోసారి ప్రతిపాదించాలి (గతంలో నిష్క్రియాపరంగా ఉన్న నిర్వాహకుల తొలగింపు ప్రతిపాదించగా విఫలమైంది కనుక) అంతే తప్ప, గత నిర్వాహకులం వ్యవహరించిన/స్తున్న తీరులో లోటుపాట్లకు కొత్తవారి మీద ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన భారం పెట్టడం సబబు కాదు. --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. no వ్యతిరేకిస్తున్నాను --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 03:22, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. no వ్యతిరేకిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. no వ్యతిరేకిస్తున్నాను - మనకున్నదే కొందరు. మనం వాపు చూసి బలుపుగా అనుకొవడం అనవసరం. ఉన్న వనరులను సర్ధుకుంటే చాలు.
    8. no వ్యతిరేకిస్తున్నాను - ఇది సాధ్యం కాదు.--VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. no వ్యతిరేకిస్తున్నాను . ఈ విషయంలో పవన్ సంతోష్ గారితో ఏకీభవిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:48, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. no వ్యతిరేకిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. no వ్యతిరేకిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. no వ్యతిరేకిస్తున్నాను నిర్వాహకుల సమూహం నిర్ణయంమేరకు చేసే విధులకు పరిశీలన. అంటే ఎవరు చేయాలి,? Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. no వ్యతిరేకిస్తున్నాను --Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. no వ్యతిరేకిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  12. అభ్యర్థి కోరికమేరకు తిరిగి రెగ్యులర్‌గా కొనసాగటానికి, ఆ కాలంలో పనితీరు సంతృప్తిగా ఉందని సముదాయం భావిస్తే మాత్రమే కంటిన్యూ కావటానికి అవకాశం ఉంది.
    1. no వ్యతిరేకిస్తున్నాను . పనితీరు సంతృప్తికరంగా లేని వారిపై సముదాయం ఎప్పుడైనా చర్చకు పెట్టవచ్చు, తగు నిర్ణయం తీసుకోవచ్చు.__చదువరి (చర్చరచనలు) 14:59, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    2. no వ్యతిరేకిస్తున్నాను --Tmamatha (చర్చ) 04:01, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    3. పదకొండవ పాయింట్‌కి చేసిన వ్యాఖ్యే దీనికీ వర్తిస్తుంది. ఏడాది ఏడాదీ నిర్వాహకత్వం రద్దయ్యి తిరిగి సంపాయించుకోవాలంటే అది అందరు నిర్వాహకులకూ వర్తించాలి. కొత్తవారికి ఒక్కరికే కాదు. లేదూ ట్రయల్ పీరియడ్ ఉండాలంటే కొత్తవారికి చాలా తక్కువ నియమాలతో, మూణ్ణెల్ల కాలానికి ఇస్తేనే ట్రయల్ అన్నదానికి న్యాయం అవుతుంది. అలా ఇచ్చే ప్రతిపాదన చేద్దామా అంటే, నిర్వాహకత్వం వంటి అత్యంత పెద్ద బాధ్యతను ట్రయల్ పీరియడ్‌కు (ఒకరోజైనా) ఇవ్వడం పెద్ద రిస్క్. దానికి తగిన అన్ని జాగ్రత్తలూ ప్రతిపాదనలో పొందుపరచాల్సి ఉంటుంది. కనుక, no వ్యతిరేకిస్తున్నాను . --పవన్ సంతోష్ (చర్చ) 17:00, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    4. no వ్యతిరేకిస్తున్నాను --రహ్మానుద్దీన్ (చర్చ) 17:43, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    5. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 03:22, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    6. no వ్యతిరేకిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 05:25, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    7. no వ్యతిరేకిస్తున్నాను ----B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    8. no వ్యతిరేకిస్తున్నాను -- రవిచంద్ర (చర్చ) 10:15, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    9. no వ్యతిరేకిస్తున్నాను - ఇది సాధ్యం కాదు.--VJS (చర్చ) 08:44, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    10. no వ్యతిరేకిస్తున్నాను . ఈ విషయంలో పవన్ సంతోష్ గారితో ఏకీభవిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:48, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    11. no వ్యతిరేకిస్తున్నాను Palagiri (చర్చ) 06:34, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    12. no వ్యతిరేకిస్తున్నాను --Divya4232 (చర్చ) 15:40, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    13. no వ్యతిరేకిస్తున్నాను --Pravallika16 (చర్చ) 23:23, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    14. no వ్యతిరేకిస్తున్నాను Muralikrishna m (చర్చ) 09:51, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    15. no వ్యతిరేకిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:56, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    16. no వ్యతిరేకిస్తున్నాను -- Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    17. no వ్యతిరేకిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మధ్యంతర ప్రతిపాదనలు

మార్చు

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు ప్రతిపాదనలలో భాగంగా చదువరి గారు కింది చర్చలో, కొత్తగా నిర్వాహకులు కాదలచుకున్నవారికి అర్హతా నిబంధనలను సులభతరం చెయ్యాలి. అదే సమయంలో అవి వారి నిర్వాహకత్వ కృషికి దోహదపడేలా ఉండాలనే సూచనచేసారు. ఇంకా దానిలోనే మరికొన్ని అభిప్రాయాలు వెల్లడించారు. దానిలో భాగంగా, ఏయే అంశాలపై ఎలాంటి కృషి చెయ్యవచ్చు అనే ఒక సూచనామాత్రపు పట్టికను ఈ ప్రతిపాదనల చర్చాపేజీలో పొందుపర్చారు. దీన్ని బట్టి వారు చేసిన కృషి, నిర్వాహకత్వం ప్రతిపాదించేందుకు అనువుగా ఉందా లేదా అని అభ్యర్థులు పరిశీలించేందుకు తోడ్పడుతుందని, ప్రతిపాదనను పరిశీలించి, అభ్యర్థిత్వాన్ని అంచనా కట్టేందుకు వాడుకరులకూ ఇది ఒక సూచనగా పనిచేస్తుందని, అయితే ఇది నిర్వాహకత్వాన్ని నిర్ణయించే "ప్రామాణికం" కాదని, దీనిపై ఆధారపడి నిర్ణయం ఉండదని, అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలో దీన్ని ఒక పనిముట్టుగా వాడుకోవటానికి పనికివస్తుందని సూచించారు. ఇంకా నిర్వాహకుల బాధ్యతలేంటి, అవి ఎలా చేస్తారు అనే సంగతులను తెలుసుకోవడం. నిర్వాహకులు కాకుండానే నిర్వాహణ సంబంధమైన పనులు ఏమిటి అనే విషయమై స్పష్టమైన అవగాహన ఏర్పడాలని, ఈ రెంటి వలన ఎవరినీ అడగకుండానే వాడుకరులు నిర్వాహక అభ్యర్థిత్వానికి సిద్ధం కావచ్చుఅని, ఇంకా సహాయం అవసరమైతే వీటిమీద "నిర్వహణ బడి" లో తమకు అవసరమైన సహాయం అందుకుని ప్రతిపాదనకు సన్నద్ధం కావచ్చుని, ఈ మూడూ నిర్వాహకత్వానికి సిద్ధమవడంలో సహాయపడటానికే కాని, అన్నీ ఐచ్ఛికమేకానీ. తప్పనిసరి కాదని సూచించారు.

అలాగే పవన్ సంతోష్ గారు కింది చర్చలోనే నిర్వాహకత్వం ట్రయల్ పద్ధతిలో ఇవ్వడం అన్నదానిపై, నిర్వహణ హక్కులు లేనంతమాత్రాన నిర్వహణ పనులు చేయలేమని లేదని, కాబట్టి, నిర్వహణాధికారం లేకుండా, ప్రతిపాదన అక్కరలేకుండా "నిర్వహణ బడి" అన్న ఒక ప్రాజెక్టును స్థాపించి, అందులో నమోదుచేసుకున్న ప్రతీ వాడుకరితోనూ ప్రత్యేకాధికారాలు అక్కరలేని నిర్వహణ పనులు చేయించి (నోటీసులు పెట్టడం, చర్చల్లో పాల్గొనడం, విధానాలు ప్రతిపాదించడం, వగైరా) వారు మరింత మెరుగైన నిర్వాహక ప్రతిపాదన చేసుకునేలా మెరుగుదిద్దవచ్చని సూచన చేసారు. ఈ విషయం గత జనవరిలో జరిగిన తెవికీ పండగ 2024లో చదువరి గారు కూడా ప్రతిపాదించారని గుర్తు చేసారు.పట్టికను దిగువ పొందపరచటమైనది

పట్టిక
సం పని కొలమానం చేసిన ప్రతి తనిఖీకీ మార్కులు
1 ఇటీవలి మార్పులపై నిఘా పెట్టి పేజీల్లో జరిగే దుశ్చర్యలు మొదలైనవాటిని పరిశీలిస్తూ ఆయా దిద్దుబాట్లను తిరగ్గొడుతూ ఉండడం. కొత్త వ్యాసాలను తనిఖీ చెయ్యడం. తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5
2 నిర్వహణకు సంబంధించి చేసే చర్యలు (అనాథ వ్యాసాలు, అగాధ వ్యాసాలు, కోరిన వ్యాసాలు/వర్గాలు/మూసలు వగైరా జాబితాలపై పనిచేయడం) తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5
3 వ్యాసాల్లో భాష నాణ్యతపై చర్యలు - భాషను సవరించడం, సముచితమైన మూసను చేర్చడం వగైరా తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5
4 నిర్వాహకుల నోటీసుబోర్డులో ఏదైనా విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకురావడం. ఉదా: దుశ్చర్య, తొలగింపు చర్య, సంరక్షణ, వగైరా తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 10
5 అయోమయ నివృత్తి పేజీల సృష్టి/విస్తరణ/నిర్వహణ వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5
6 అయోమయ నివృత్తి పేజీలకు వెళ్తున్న లింకులను గమనించి వాటిని సరైన పేజీకి మార్చడం వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5
7 తక్షణమే తొలగించాల్సిన పేజీల్లో CSD మూసలు చేర్చడం, తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5
8 తొలగింపు చర్చపై నిర్ణయాన్ని ప్రకటించడం నిర్ణయం ఎలా ప్రకటించాలనే పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది 10
9 తొలగింపుకు ప్రతిపాదించడం, వాటిని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలలో చేర్చటం తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది 5
10 తొలగింపు చర్చలో పాల్గొని అభిప్రాయం ప్రకటించడం తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది. చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది 5
11 తొలగింపు ప్రతిపాదన వచ్చినపుడు ఆ వ్యాసంలో తగు మార్పులు చేసి తొలగింపు నుండి రక్షించడం తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని, వ్యాసాలను తొలగించకుండా నిలిపి ఉంచే నిబద్ధతను సూచిస్తుంది 10
12 రచ్చబండలో చర్చలో పాల్గొనడం చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది 3
13 కొత్తవారికి తోడ్పాటు (స్వాగతం కాకుండా, వాడుకరి చేసిన పనిని ప్రస్తావిస్తూ ప్రోత్సహించడం, దోషాలేమైనా ఉంటే మర్యాదగా తెలియజేయడం) కొత్తవారితో సాన్నిహిత్యం ఏర్పడి వారికి వికీలో నిలబడటానికి ప్పోత్సాహాన్ని ఇస్తుంది 10
14 ఎడబ్ల్యుబి వాడుక (కొన్ని పనులు సులువుగా ఏక మొత్తంలో చేయాటానికి) వ్యాసాలలో శైలిపై పట్టుసాదించే కృషిని, సత్వర చర్యలను ఏకమొత్తంలో తీసుకునే నిబద్ధతను తెలియజేస్తుంది 3
15 అనువాద పరికరం వాడుక మరికొంతమందికి దానిలో ఉన్న సాంకేతికను, పనితనాన్ని తెలియచేప్పేనిబద్ధతను తెలియజేస్తుంది 4
16 ప్రత్వేక పేజీలు విభాగంలో అంశాలకు జోడించని పేజీలు, భాషా లింకులు లేని పేజీలు లింకులు కలుపుట తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5
17 మొలక వ్యాసాలు అభివృద్ధి, మూలాలు లేనివాటికి మూలాలు సమకూర్చటం తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది 5

పై సూచనలలో భాగంగా "నిర్వహణ బడి" అనే ఒక ప్రాజెక్టు పేజీని రూపొందించి, దానిలో నమోదు చేసుకున్న వాడుకరులకు ఈ పై పట్టికలోని అంశాలపై తగిన తర్పీదు ఇవ్యటానికి, ఈ అంశాలను విధానపేజీలో చేర్చటానికి సమదాయ సభ్యులు తగిన సూచనలు, అభిప్రాయాలు తెలుపవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:17, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల అభిప్రాయాలు, సూచనలు

మార్చు
  1. సమ్మతిస్తున్నాను --యర్రా రామారావు (చర్చ) 05:28, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. సమ్మతిస్తున్నాను --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:51, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. సమ్మతిస్తున్నాను __చదువరి (చర్చరచనలు) 08:46, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. సమ్మతిస్తున్నాను ---VJS (చర్చ) 08:50, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. సమ్మతిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 13:50, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. సమ్మతిస్తున్నాను --➤ కె.వెంకటరమణచర్చ 03:29, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. సమ్మతిస్తున్నాను ---B.K.Viswanadh (చర్చ) 06:08, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. సమ్మతిస్తున్నాను Palagiri (చర్చ) 09:14, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  9. సమ్మతిస్తున్నాను Muralikrishna m (చర్చ) 09:26, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. సమ్మతిస్తున్నాను --Batthini Vinay Kumar Goud (చర్చ) 14:57, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  11. సమ్మతిస్తున్నాను --Tmamatha (చర్చ) 15:26, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  12. సమ్మతిస్తున్నాను -- Thirumalgoud (చర్చ) 16:31, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  13. సమ్మతిస్తున్నాను --Nagarani Bethi (చర్చ) 17:07, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  14. సమ్మతిస్తున్నాను --రవిచంద్ర (చర్చ) 11:26, 1 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విధాన ప్రతిపాదనను తెచ్చినందుకు రామారావు గారికి ధన్యవాదాలు. నిర్వాహకత్వం పొందడంలో వాడుకరులకు ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. అందుకు గాను కింది 3 విషయాలను ఈ ప్రతిపాదన పరిగణించాలని నా అభిప్రాయం

  1. కొత్తగా నిర్వాహకులు కాదలచుకున్నవారికి అర్హతా నిబంధనలను సులభతరం చెయ్యాలి. అదే సమయంలో అవి వారి నిర్వాహకత్వ కృషికి దోహదపడేలా ఉండాలి.
  2. నిర్వాహక అభ్యర్థుల నుంచి సముదాయం ఎటువంటి పరిజ్ఞానాన్ని, కృషినీ ఆశిస్తోంది అనే విషయం అభ్యర్థికి తెలియాలి. తద్వారా తాను అందుకు సరిపోతానా లేదా అనేది తెలుస్తుంది.
    1. పరిజ్ఞానాన్ని అందించే సహాయం: ప్రస్తుతం పరిజ్ఞానం గురించిన సమాచారం ఉంది దాన్ని కొంత మెరుగుపరచాలి, బలోపేతం చెయ్యాలి.
    2. పరిజ్ఞానంతో పాటు, కృషి కూడా చేసి ఉండాలి. నిర్వాహకత్వానికి సంబంధించి మామూలు వాడుకరులు చెయ్యదగ్గ కృషి ఏంటి? ఎలా చెయ్యాలి? అనే సమాచారం ప్రస్తుతం అంతగా లేదు. దాన్ని వెంటనే తయారు చెయ్యాలి.
  3. నిర్వాహకత్వ ప్రతిపాదన పద్ధతిలో కూడా కొన్ని మార్పులు చెయ్యాలి. ముఖ్యమైనది: గత ఆరు నెలల్లో తాము చేసిన నిర్వాహకత్వ సంబంధ కృషి (పైన రెండో పాయింటు లోని రెండో ఉప పాయింటులో చెప్పినది) గురించి చెప్పే పద్ధతిని ప్రవేశపెట్టాలి. అలాంటి పనులతో ఒక పట్టికను నిర్వాహకవర్గం రూపొందించాలి. అందులోని పనులకు మూల్యాంకనను కూడా రూపొందించాలి. ఆయా నిర్వాహక అభ్యర్థులు ప్రతిపాదన పెట్టేముందే తమ అర్హతను పరీక్షించుకునేందుకు అది వాడుకోవచ్చు. వాడుకరులకు ఆ అభ్యర్థిపై తమకున్న అభిప్రాయాలను నిర్థారించుకునేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. కానీ ప్రతిపాదనపై నిర్ణయానికి అది కొలబద్ద కాకూడదు

పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 14:08, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పైన నేను రాసిన "నిర్వాహకత్వానికి సంబంధించి మామూలు వాడుకరులు చెయ్యదగ్గ కృషి ఏంటి?" అనే విషయమై, నా ఆలోచనలను దీని చర్చ పేజీలో రాసాను. అది కొంచెం పెద్దగా ఉండడంతో, ఇక్కడ రాస్తే మరీ కలగాపులగం అవుతుందేమోనని అక్కడ రాసాను. లింకు: వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు#నిర్వాహకత్వానికి దోహదపడే కృషి గురించి కొన్ని ఆలోచనలు
నిర్వాహత్వం ఆశించాలంటే అక్కడ చూపిన కృషి తప్పనిసరిగా చేసి ఉండాలనేది నా అభిప్రాయం. కానీ అభ్యర్థి స్వీ అంచనాకు, అభ్యర్థిని అంచనా వెయ్యడంలో తోటి వాడుకరులకూ అది పనికొస్తుందనేది నా అభిప్రాయం. __ చదువరి (చర్చరచనలు) 05:16, 21 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారూ పైన సూచించిన మీ సూచనలకు ధన్యవాదాలు.లింకు: వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు#నిర్వాహకత్వానికి దోహదపడే కృషి గురించి కొన్ని ఆలోచనలు లో సూచించిన సూచనలు లేదా భాధ్యతలు నిర్వాహకులకు తెలియవలసిన అవసరం ముంది.@పవన్ సంతోష్ గారు పైన వివరించిన తెవికీ బడి యందు ఈ విషయాలపై అవగాహన కలిగించవచ్చు.వాటిని కూడా ఇదే ప్రతిపాదనలలో చర్చలకొరకు సముదాయం దృష్టికి తీసుకు రావటానికి అదనపు ప్రతిపాదనలు విభాగం కింద చేర్చవలసిన అవసరం ముంది. యర్రా రామారావు (చర్చ) 15:19, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో నిర్వాహకత్వ ప్రతిపాదనలను, నిర్వహణను మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్న @యర్రా రామారావు: గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ప్రతిపాదనల్లో చాలావాటి వెనుక స్వయంగా నిర్వహణ చేస్తూ, ఇతరుల నిర్వాహక కృషినీ (దాని లేమినీ) దగ్గర నుంచి చూస్తూ, మరికొందరు సమర్థులైన కొత్త నిర్వాహకులు తయారైతే బావుంటుందన్న రామారావు గారి దృష్టి నాకు కనిపించింది. అయితే, నిర్వహణను ట్రయల్ పద్ధతిలో ఇవ్వడం అన్నదానిపై నాకు ఒక ఆలోచన తట్టింది. నిర్వహణ హక్కులు లేనంతమాత్రాన నిర్వహణ పనులు చేయలేమని లేదు కదా. కాబట్టి, నిర్వహణాధికారం లేకుండా, ప్రతిపాదన అక్కరలేకుండా "నిర్వహణ బడి" అన్న ఒక ప్రాజెక్టును స్థాపించి, అందులో నమోదుచేసుకున్న ప్రతీ వాడుకరితోనూ ప్రత్యేకాధికారాలు అక్కరలేని నిర్వహణ పనులు చేయించి (నోటీసులు పెట్టడం, చర్చల్లో పాల్గొనడం, విధానాలు ప్రతిపాదించడం, వగైరా) వారు మరింత మెరుగైన నిర్వాహక ప్రతిపాదన చేసుకునేలా మెరుగుదిద్దవచ్చని నా సూచన. ఇలాంటిదే గత జనవరిలో జరిగిన తెవికీ పండగ 2024లో చదువరి గారు కూడా ప్రతిపాదించారు. దీన్ని పరిశీలించి మీ అభిప్రాయం చెప్పండి. మరోసారి కృతజ్ఞతలు, అభినందనలతో పవన్ సంతోష్ (చర్చ) 17:08, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@పవన్ సంతోష్ గారూ "నిర్వహణను ట్రయల్ పద్ధతిలో ఇవ్వడం" అనేదానిపై నిర్వహణ బడి ఆలోచన బాగానే ఉంది.అయితే ఇది నేను కొత్తగా ప్రతిపాదన చేసిన 11 నియమం నిర్వాహకత్వం పొందిన తరువాత స్తబ్ధతగా ఉంటారనే ఉద్దేశ్యంతో తగిన ఆసక్తిని పెంపొందించుకుంటారనే భావనతో చేర్చటం జరిగింది.మీ సూచన కూడా బాగుంది.నిర్వహణాధికారం లేకుండా, ప్రతిపాదన అక్కరలేకుండా "నిర్వహణ బడి" ప్రాజెక్టును స్థాపించి, అందులో నమోదుచేసుకున్న ప్రతీ వాడుకరితోనూ ప్రత్యేకాధికారాలు అక్కరలేని నిర్వహణ పనులు చేయించి (నోటీసులు పెట్టడం, చర్చల్లో పాల్గొనడం, విధానాలు ప్రతిపాదించడం, వగైరా) వారు మరింత మెరుగైన నిర్వాహక ప్రతిపాదన చేసుకునేలా అమలుపర్చటానికి అభ్యంతరంలేదు.మీ సూచనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:37, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వహణ బడి ప్రతిపాదన బాగుంది. నిర్వాహకత్వాన్ని సులభతరం చెయ్యడంలో ఇది తోడ్పడుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినదానికి ఈ పాయింటును చేర్చి మరింత సమగ్రం చేస్తాను.
ఔత్సాహికులు నిర్వాహకత్వానికి సిద్ధమయ్యేందుకు మూడు తోడ్పాటులుంటాయి:
  1. నిర్వాహకుల బాధ్యతలేంటి, అవి ఎలా చేస్తారు అనే సంగతులను తెలుసుకోవడం. తెవికీలో ఈ సమాచారం ఈసరికే ఉంది. అవసరమైతే దాన్ని మెరుగుపరచాలి.
  2. నిర్వాహకులు కాకుండానే నిర్వహణ సంబంధమైన పనులు ఏమిటి అనే విషయమై స్పష్టమైన అవగాహన ఏర్పరచాలి. ఈ రెంటి వలన ఎవరినీ అడగకుండానే వాడుకులు నిర్వాహక అభ్యర్థిత్వానికి సిద్ధం కావచ్చు. ఆ కృషి ఏమిటి అనేదాన్ని నేను ఇక్కడ రాసాను. ఇంకా సహాయం అవసరమైతే -
  3. "నిర్వహణ బడి" లో తమకు అవసరమైన సహాయం అందుకుని ప్రతిపాదనకు సన్నద్ధం కావచ్చు.
ఈ మూడూ నిర్వాహకత్వానికి సిద్ధమవడంలో సహాయపడటానికే, అన్నీ ఐచ్ఛికమే. తప్పనిసరి కాదు. యర్రా రామారావు గారూ, నేను ప్రతిపాదించిన పట్టికలో మీకు అవసరమనిపించిన మార్పుచేర్పులు చేసి దాన్నీ, నిర్వహణ బడినీ పై ప్రతిపాదనలో చేర్చవలసినదిగా కోరుతున్నాను. వాడుకరులు వాటిపై కూడా తమ అభిప్రాయాలను చెప్పే వీలుంటుంది. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 08:19, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారూ అలాగేనండీ. యర్రా రామారావు (చర్చ) 08:32, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వహణ బడి ఆలోచన బాగున్నది , అడ్మిన్ లా లేకుండా చేయగలిగే నిర్వాహకత్వ అంశాలు చాలా ఉన్నాయి ఇంకా అడ్మినిస్ట్రేటర్ హోదా ట్రోఫీ కాదు . కాబట్టి ముందు అలాంటి పనులు చేసి అవసరాన్ని బట్టి రోల్‌బ్యాక్ వంటి హక్కులు ఇచ్చి వాటి నిర్వాహణ సంతృపికరంగా అనిపిస్తే అప్పుడు నిర్వాహక ప్రతిపాదనకు ప్రోత్సహించవచ్చు. Kasyap (చర్చ) 04:47, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిజానికి తెవికీలో వాడుకరులు తక్కువ. వచ్చేవారు నిలబడేది లేదు. ఉన్నవారితో అవసరమైన వ్యాసాలను, ప్రాజెక్టులను మెరుగుపరుచుకుంటే సరిపొతుంది. ఎక్కువగా నిర్వహణాపరమైన అంశాలతో ఆ ఉన్న కొద్ది మందినీ చికాకు పెట్టడం అనవసర ప్రయాస. ముందు సమూహాన్ని ఒక నాలుగైదు వందల మందితో నింపి, కనీసం రెండు వందల మంది ఆసక్తి, ఉత్సాహం ఉన్న వాడూకరులను ఒక్క ఆరు నెలలు కొనసాగించి ఆపై ఇలాంతి ప్రతిపాదనలు తీసుకురావడం ఉత్తమమైన ఆలోచన అవుతుంది. ..--B.K.Viswanadh (చర్చ) 05:58, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@విశ్వనాథ్ గారూ మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.నిజానికి తెవికీ లో నమోదైన వాడుకరులు తక్కువ ఏమీకాదు. లక్షమందికి పైనే ఉన్నారు. చురుకైన వాడుకరులు, నిర్వాహకులు మాత్రమే తక్కువ. ప్రస్తుతం బహు తక్కువమందితోనే అవసరమైన వ్యాసాలను, ప్రాజెక్టులను మెరుగుపరచుటం జరుగుతుంది. ఏరంగంలోనైనా ప్రయాసలేకపోతే అభివృద్ధి అనేది ఉండదని నా అభిప్రాయం. కొన్ని నియమాలు 10 మందికైనా 400 మందికైనా ఒకేరకమైన నియమాలు ఉంటాయి. యర్రా రామారావు (చర్చ) 15:40, 26 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh గారూ, కొత్తవారిని నిర్వాహకులుగా తీర్చిదిద్ది, వారికి నిర్వాహక బాధ్యతలు అప్పగించడం అన్నది తెవికీ భవిష్యత్తుకు అత్యంత అవసరమైన, వెనువెంటనే ప్రారంభించి పనిచేయాల్సిన చర్య. మీ వ్యాఖ్యకు, తెలుగు వికీపీడియాకు సంబంధించిన పరిస్థితులకు ఏ సంబంధం లేదు.
గత కొన్నేళ్ళుగా తెవికీలో రోజువారీగా, నెలవారీగా, సంవత్సరం వారీగా వస్తున్న కొత్త వ్యాసాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉదాహరణకు గత ఏడాది 9619 కొత్త వ్యాసాలు మొదటి పేరుబరిలో వచ్చాయని లెక్కలు చెప్తున్నాయి. 2017-20 వరకూ నాలుగేళ్ళ వ్యవధిలో వచ్చిన మొత్తం వ్యాసాలన్నీ కలుపుకుంటే 10వేల చిల్లర దాటలేదు. అంటే ఇంతకుమునుపు నాలుగేళ్ళలో రాసే కొత్తవ్యాసాలు ఇప్పుడు ఏడాది వ్యవధిలో రాస్తున్నారు. గత ఏడాది నెలకు 801 వ్యాసాలు వచ్చాయి. ఇది గత ఎనిమిదేళ్ళ కాలాన్ని పరిగణిస్తే రికార్డు. ఇదిలా ఉంచండి - ఈ ఫిబ్రవరి నెలలో 2001 వ్యాసాలు వచ్చాయి. అంటే 2017 (1872 వ్యాసాలు), 2020 (1970 వ్యాసాలు) సంవత్సరాల్లో ఏడాది మొత్తంలో వచ్చిన కొత్త వ్యాసాల కన్నా ఈ ఫిబ్రవరిలో 29 రోజుల్లో వచ్చిన కొత్త వ్యాసాలు ఎక్కువ.
అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఏడాదికి నాలుగు రెట్లు కొత్త వ్యాసాల సృష్టి జరుగుతోంది. కొద్దిమేరకు ఉన్న వ్యాసాలను విస్తరించే కృషి కూడా జరుగుతుందనుకుందాం. మరి ఆ వ్యాసాల నాణ్యత ఎలా ఉండొచ్చో, ఎలా పెంచవచ్చో, ఎలా మదింపు వేయొచ్చో పరిశీలించి, సహాయం చేసి, నాణ్యతను పెంచే నిర్వాహక కృషిచేసేవారి సంఖ్య ఎంత ఉంది. ఉన్న నిర్వాహకుల్లో అత్యధికులం నిర్వాహక కార్యకలాపాలు రోజువారీ చేపట్టట్లేదు. మరి ఎవరు సాయం చేస్తారు ఈ రచయితలకు? ఎవరు వ్యాసాల నాణ్యత పెంచుతారు? భవిష్యత్తులో వాడుకరుల సంఖ్య పెరిగిందనుకోండి, ఆ వాడుకరులకు ఇప్పుడున్నవారు ఎలా, ఎంతమేరకు సాయం చేయగలుగుతారు?
ఇన్ని రెట్లు కొత్త వ్యాసాల సృష్టి పెరుగుతున్నప్పుడు ఆ మేరకు చురుకైన నిర్వాహకుల సంఖ్య కూడా పెరగాలి. తెవికీ ట్రెండ్స్ చూస్తున్న అనుభవజ్ఞులైన నిర్వాహకులు ఎవరికైనా ఈ సంగతి తేలిగ్గా అర్థం అవుతుంది. మీకెందుకు అర్థం కాలేదో నాకు తెలియట్లేదు. పవన్ సంతోష్ (చర్చ) 18:31, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వం లేకుండానే తెవికీ లో అనేక పనులు చేయవచ్చని తెలుస్తోంది. ఈ పధ్ధతి బావుంది. ఒత్తిడి ఉండదు. --VJS (చర్చ) 08:54, 27 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Vjsuseela గారూ, ఇప్పుడు మీరు చేసిన ఈ వ్యాఖ్యలు, అభిప్రాయాల వెల్లడి కూడా నిర్వాహకత్వంలో భాగమేనండీ. :-) పవన్ సంతోష్ (చర్చ) 13:43, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మంచిదండి. కొంచెం కొంచెం అర్ధమవుతోంది. ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. చర్చలో లేకపోయినా ఇంకొంత మందికి కూడా ఉంటాయేమో ఈ సందేహాలు.
నిర్వాహకులు, అధికారులు, సాంకేతిక నిపుణులు అందరు వాడుకరులే. వారు చిన్నవి పెద్దవి అన్ని రకాల పనులు చేస్తున్నారు. చేయగలిగే సామర్ధ్యము అవకాశము (access) ఉంటుంది. కానీ వాడుకరులందరూ నిర్వాహకులు, అధికారులు, సాంకేతిక నిపుణులు కారు. నిర్వాహకులు, అధికారులు (వీరికి జాబితా ఉంది), సాంకేతిక నిపుణులు (వీరి జాబితా చూడలేదు) మాత్రమే చేయగలిగే పనులు గురించిన వివరాలు స్పష్టత ఉంటే అందరికి ఉపయోగంగా ఉంటుంది. ఇన్నింటికీ మార్గదర్శకాలు ఏర్పరచుకుంటున్న /సవరించుకుంటున్న సమయంలో ఈ స్పష్టమైన మార్గదర్శకాలుంటే అందరికి ఉపయోగంగా ఉంటుంది. నా సమస్య చదివిన మీకందరికీ ధన్యవాదాలు. VJS (చర్చ) 06:16, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు. కొత్త నిర్వహకులను చేర్చడంలో నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కొత్త వాడూకరులను తీర్చి దిద్దటం అవసరమ అని నేను ముందే చెప్పా, దాన్నే మళ్ళీ మీరు నాకు చెప్తున్నారు. నిర్వహణాపరమైన అన్ని విషయాలు నిర్వహకులే చేయనక్కరలేదు. అందరూ చేయగల అవకాశం ఉంది. కానీ నిర్వహణాపరమైన విషయాలపై ఎక్కువ చర్చ, అనేక పాలసీలు తయారు చేయడం, వాటిని అమలు చెయడానికి ప్రయత్నించడం, అవి సరిగా అమలు కాకపొవడం లేదా అసలు అలాంటి అనేక పాలసీలు ఉన్నయని ఎవరికీ ముఖ్యంగా కొత్త వాడూకరులకు తెలియకపొవడం ఇదంతా అసలు వాస్తవమైన సంగతి. రాసేవారిని ఎక్కువగా తికమకకు గురి చేయడం తప్ప వీటి వలన ఏమి ఉపయోగం ఉండదు అని నా భావన. చర్చలు పాలసీలు అవసరమే అయినా వాటిని కొత్త వాడుకరుల దృష్టి పదం నుండి చర్చిస్తే, లేదా రూపొందిస్తే ఉపయోగంగా ఉంటుందని అనుకుంటాను. అంటే ఒక్క మాటలో చెప్తే - కొత్తగా ఒక నిర్వహకులను చేర్చుకొడానికి ఇంత చర్చ అనవసరం. ధన్యవాదాలు.. --B.K.Viswanadh (చర్చ) 06:24, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh " ఎక్కువగా నిర్వహణాపరమైన అంశాలతో ఆ ఉన్న కొద్ది మందినీ చికాకు పెట్టడం అనవసర ప్రయాస" అన్నారు మీరు. కొత్తగా నిర్వాహకులను తీసుకువచ్చేందుకు, ఉన్నవారికి నిర్వాహకత్వం గురించి నేర్పించేందుకు (నిర్వహణ బడి అందుకే కదా) ప్రయత్నిస్తున్న ఈ ప్రతిపాదనను గురించి "ముందు సమూహాన్ని ఒక నాలుగైదు వందల మందితో నింపి, కనీసం రెండు వందల మంది ఆసక్తి, ఉత్సాహం ఉన్న వాడూకరులను ఒక్క ఆరు నెలలు కొనసాగించి ఆపై ఇలాంతి ప్రతిపాదనలు తీసుకురావడం" ఉత్తమం అన్నారు.
స్థూలంగా చూస్తే, తెవికీలో పెరిగిన వ్యాసాల సంఖ్య, నిర్వహణ పనుల అవసరం మీకు అర్థం కాలేదనే నాకు తోచింది.
"నిర్వహణాపరమైన అన్ని విషయాలు నిర్వహకులే చేయనక్కరలేదు. అందరూ చేయగల అవకాశం ఉంది." అంటున్నారు. కానీ, రాజుగారి గుండిగలో పాలు పోసినట్టు అవుతోంది పరిస్థితి. నిర్వాహకులు సైతం, అందులోనూ సుదీర్ఘ అనుభవం ఉన్న నిర్వాహకులు సైతం, చేయట్లేదు. అందుకనే, నిర్వహణ పనుల కోసం ఒక బడి పెట్టి, కొత్తవారిని నిర్వాహకులుగా తీర్చిదిద్దాలి. అందుకోసం ఇలాంటి ప్రయత్నాల అవసరం ఎంతైనా ఉంది. పవన్ సంతోష్ (చర్చ) 08:45, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh గారూ, మీరు "రాసేవారిని ఎక్కువగా తికమకకు గురి చేయడం" అన్నారు కదా, ఇప్పుడు పోనీ ఈ మధ్యంతర ప్రతిపాదనలు చూసి ఆ జాబితాలోని ఏయే పనులు ఆ తికమకకు గురిచేయడం కిందకు వస్తాయో చూసి చెప్పండి. "కొత్త వాడుకరుల దృష్టిపథం" నుంచి చూడాలంటున్నారు. ఆ జాబితాను ఆ దృష్టిపథం నుంచి చూసి చెప్పండి. మీరనేది కాస్త స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ. పవన్ సంతోష్ (చర్చ) 08:47, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • "రాసేవారిని ఎక్కువగా తికమకకు గురి చేయడం తప్ప వీటి వలన ఏమి ఉపయోగం ఉండదు అని నా భావన."
  • "కొత్తగా ఒక నిర్వహకులను చేర్చుకొడానికి ఇంత చర్చ అనవసరం."
కొత్తగా నిర్వాహకత్వం తీసుకోదలచుకున్నవారికి ఆ మార్గాన్ని సులభతరం, సుబోధకం చేసే ప్రతిపాదనపై జరుగుతోంది ఈ చర్చ. ఈ ముఖ్యమైన ప్రతిపాదనపై చర్చలో సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. అలాంటిది, అసలు ఇంత చర్చ అనవసరం అని రాయడం ఈ చర్చ అసలు ఉద్దేశాన్ని నీరుగార్చేదిగా ఉంది.
తెవికీలో చురుగ్గా ఉంటూ నిర్వహణ భారం మోస్తున్న నిర్వాహకులందరికీ: నిర్వాహకత్వాన్ని సులభతరం చేసేందుకు మీరు చేస్తున్న ఈ కృషిని నేను అభినదిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. విశ్వనాధ్ గారు ప్రదర్శించిన దృక్పథం కారణంగా నిరాశ చెందవద్దని కోరుతున్నాను. నిర్వహణలో చురుగ్గా ఉన్నారు కాబట్టి అందులోని సాధాకబాధకాలు మీకు తెలుసు, కొత్తగా నిర్వాహకత్వం పొందగోరే అభ్యర్థులకు మార్గాన్ని సులభతరం చెయ్యడం లోని అవసరం ఏమిటో మీకు తెలుసు. విశ్వనాధ్ గారు నిర్వాహకత్వంలో గత కొన్నేళ్ళుగా నిష్క్రియగా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఆయన అభిప్రాయాలతో నేను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 09:50, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Vjsuseela గారూ, నిర్వాహక హక్కులు అంటే కొన్ని అదనపు హక్కులు ఉంటాయండీ. ఇప్పుడు మీరు మీ కుడివైపున చూస్తే పరికరాల్లో తరలించు వంటివి ఉంటాయి కదా. అక్కడ నిర్వాహకులకు తొలగించు, సంరక్షించు, వగైరా ఇంకొన్ని ఉంటాయి. ఒక వ్యాసాన్ని తొలగించడం, కానీ సంరక్షించడం కానీ, ఒక వాడుకరిని నిరోధించడం కానీ చేసేందుకు నిర్వాహకులకు ఉపకరణాలు ఉంటాయి. అయితే, ఆ ఉపకరణాలను ఉపయోగించడం అన్నది నిస్సందేహంగా తెలుగు వికీపీడియా పాలసీలకు లోబడి చేయాలి. పాలసీలు స్పష్టంగా లేనట్టైతే తెలుగు వికీపీడియా సముదాయంలో చర్చకు పెట్టి నిర్ణయాన్ని ఆధారం చేసుకుని చేయాలి. అంటే చేయడానికి ఉపకరణం ఉంటుంది కానీ ఏం చేయాలన్నది సముదాయం అంతా కలసి నిర్ణయించిన పాలసీలు, తెవికీకి మూలమైన మూలస్తంభాల ఆధారంగానే జరగాలన్నమాట.
ఇప్పుడు, మీరు అనుభవజ్ఞురాలైన వాడుకరి, నేను నిర్వాహకత్వం కలిగిన వాడుకరిని. ఒక వ్యాసం తొలగించాల్సినది మీకు కనిపిస్తే మీరు తొలగింపు మూస పెట్టొచ్చు, నేనూ పెట్టొచ్చు. పెట్టాకా, దానిపై జరిగే చర్చ చివరలో వికీ నియమాలను అర్థం చేసుకోగలిగితే మీరైనా నిర్ణయం చేయవచ్చు, నేనైనా చేయవచ్చు. ఆ నిర్ణయానికి అనుగుణంగా తొలగింపు చేయడం మాత్రం నిర్వాహకులు చేస్తారు. అలాగని, నిర్ణయం ఉంచమని వస్తే తొలగించడం నిర్వాహకులు చేయకూడదు. చేస్తే అది వారి హక్కులను దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అంటే, నిర్వాహకులకు, నిర్వహణ పనులు చేసే వాడుకరులకు ఉన్న భేదం పాలసీలకు కానీ, చర్చకు కానీ అనుగుణంగా 'అమలుచేయగలగడం మాత్రమే'.
ఇంకా వివరంగా విడిగా రాస్తాను. లేదంటే ఇప్పటికే ఉంటే వాటిని క్రోడీకరిస్తాను. మీరు ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 11:31, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. VJS (చర్చ) 12:08, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు. "విశ్వనాధ్ గారు నిర్వాహకత్వంలో గత కొన్నేళ్ళుగా నిష్క్రియగా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు" అన్నారు. రాస్తూ ఉంటేనే ఎక్టివ్ గా ఉన్నట్టు అనుకొనే మీ ఆలోచన సరైనదేనా ?, ఇక్కడ లేదా మరెక్కడైనా మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా లేదా ఒక సమూహానికి వ్యతిరేకంగా ఎవరైనా అభిప్రాయాన్ని వ్యక్త పరిస్తే వారిపై ఎక్కువ ఆసక్తి కనబరచడం (లేదా వారిపై ఫోకస్ చేయడం) దేని కిందికి వస్తుందని అనుకుంటారు?, కొత్త వాడుకరులకు అనూకూలంగా మీ నిర్ణయాలు లేదా పాలసీలు లేవు, సులభతరంగా చేయడం కాక కష్టతరంగా మారుస్తున్నారు అని ఎవరైనా అంటే మీకెమైనా ఇబ్బంది అనిపిస్తుందా?, ఇప్పుడు ఎక్టివ్ గా ఉన్న వాడుకరులు వంద మంది ఉన్నారా?, ఉన్న 20 మంది వాడూకరుల ద్వారా పాలసీల రూప కల్పన కాక, వాడుకరులను పెంచుకొనే పాలసీలు, పధకాలు, వర్క్ షాప్స్, ప్రాజెక్టులు పై పని తీరు సమీక్షిస్తున్నారా?, అసలు అలాంటి ప్రాజెక్టూల రూప కల్పన ఎమైనా జరిగిందా?, దీనిపై ఒకపేజీ చేసి చర్చను ప్రారంభించగలమా?.. అక్కడ అసలు అభిప్రాయాలను దాడి లేకుండా, ఇబ్బంది లేకుండా నిర్భయంగా వ్యక్తపరచగలమా?, వాటీ ద్వారా మూస దోరణి నుండి బయటాకు వచ్చే ప్రయత్నం చేయగలమా?,. నిర్వహణా పరమైన అన్ని సమస్యలు ఇక్కడ ఎలా తెలుస్తాయి. అవి తెలియాలంటే ఒక కొత్త విధ్యార్ధి సమూహం వద్ద మన వికీ ఎంత వరకూ వాళ్ళకు అర్ధం అయ్యింది చూడాలి. మనం కూర్చుండాం. మీకు ఎప్పుడు సాధ్యమో తెలియచేయండి. ఇద్దరం వెళదాం. అప్పుడైనా అసలు విషయాలు మీకు తెలుస్తాయేమో బహూశా.. ధన్యవాదాలు.--B.K.Viswanadh (చర్చ) 02:45, 10 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

మార్చు

యర్రా రామారావు గారికి, చదువరి గారికి, పవన్ సంతోష్ గారికి, రహ్మానుద్దీన్ గారికి, Kasyap గారికి, కె.వెంకటరమణ గారికి, B.K.Viswanadh గారికి, VJS గారికి.. అందరికి నమస్కారం, చాలా చక్కగా నిర్వహకత్వ విధివిధానాలపై చర్చ జరుగుతోంది. కొత్తవారికి కూడా అర్థమయ్యేలా ఉంది. ముఖ్యంగా సాధారణ వాడుకరులకు మార్గదర్శకంగా ఉండడంతో పాటు అజ్ఞాత వాడుకరుల దుశ్చర్యలను అరికట్టడంలో నిర్వాహకత్వం ఉన్న వాడుకరుల కృషి ఎంతో ఉంటుంది. అంటే తెవికీకి, సాధారణ వాడుకరుల అవసరం ఎంతో దానికి సరియైన నిష్పత్తిలో నిర్వహకులు ఉండడం కూడా అంతే అవసరం. దీనికి కొత్తగా ప్రతిపాదనలు ఆహ్వానించడం అనేది నిరంతర ప్రక్రియే అయినా, ప్రస్తుతం ఉన్న నిర్వాహకులలో చురుకుదనం తగ్గడానికి కారణం కూడా అన్వేషించి, వారిని తిరిగి స్వాగతిస్తే బాగుంటదనేది నా అభిప్రాయం. Muralikrishna m (చర్చ) 13:31, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@మురళీకృష్ణ గారూ మీ స్పందనలకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న నిర్వాహకులలో చురుకుదనం తగ్గడానికి కారణం కూడా అన్వేషించి, వారిని తిరిగి స్వాగతిస్తే బాగుంటదనేది నా అభిప్రాయం అనే దానిపై నాకు తెలిసినంతవరకు ఇది మరొకరు ఎవరో చేప్పేదికాదు.వ్యక్తిగతంగా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి.అందులో వారిస్వంతపని పని వత్తిడి కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, వికీ మీద విరక్తి కలిగి ఉండవచ్చు, ఏ కారణం అయినా కావచ్చు, చెప్పలేం. కాకపోతే నిర్వాహక హోదా ఉన్నవారెవరైనా కారణాంతరాలవలన చురుకుదనం లోపించి, నిర్వాహకత్వానికి న్యాయం చేయలేనని భావించినవారు వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ#ఉపసంహరణకు కారణాలు లోని 1 వ నియమం ప్రకారం ప్రతి నిర్వాహకుడు తప్పనిసరిగా నడుచుకోవాలని నా అభిప్రాయం.లేదా 2, 3 నియమాలు ప్రకారం సముదాయం తగిన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం.సరే ఇవన్నీ కాదనుకుందాం. వారిలో చురుకుదనం నింపటానికి, వారిని తిరిగి స్వాగతించటానికి తగిన అవకాశాలు ఉంటే సవివరంగా సముదాయం దృష్ఠికి తీసుకురాగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:52, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు గురువుగారు, సవివరంగా చెప్పారు. నా ఉద్దేశం ప్రస్తుతం 11 మంది నిర్వహకులు ఉన్నారు. అంటే ఇది మంచి నంబరే కదా... ఏదైనా కారణం చేత స్వల్ప విరామం తీసుకున్నా తిరిగి కార్యరంగంలోకి దూకుతారని ఆశించాను. అంతకు మించి నా దగ్గర తగిన సూచనలు లేవు.
అయితే, విశాఖ తెవికీ 20వ వార్షికోత్సవంలో పాత వాడుకరులను పోస్ట్ కార్డ్ ద్వారా ఆహ్వానించాం కదా... ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేయవచ్చునేమో సముదాయం ఆలోచించాలి.! Muralikrishna m (చర్చ) 18:02, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Muralikrishna m గారూ, మీకు తెలియని సంగతేమీ కాదు, అయినా నా అభిప్రాయం కాబట్టి రాస్తున్నాను. తెవికీలో కృషి చెయ్యాలనేది నిర్బంధమేమీ కాదు. ఎవరి వీలుకు తగినట్టు వాళ్ళు రాస్తారు. వీలైనప్పుడే రాస్తారు. అలాగే ఉండాలి కూడా. వికీలో రాయడాన్ని మనం ఎంజాయి చెయ్యాలి. అదొక ఉజ్జోగం లాగా ఉండకూడదు. :) కాకపోతే ఒకప్పటి చురుకైన వాడుకరులను మళ్ళీ రండి అంటూ వారికి గుర్తు చేస్తూంటాం, అంతే. ఆసక్తి ఉన్నవాళ్ళు పాలగిరి గారి లాగా మళ్ళీ వస్తూంటారు (విశాఖ వార్షికోత్సవం సాధించిన సత్ఫలితాల్లో ఇది ఒకటి అని నా ఉద్దేశం). అలా వికీకి మేలు జరుగుతూంటుంది. అలా అని అందరూ రావాలనేమీ లేదు.
ఉన్న వనరుల లోనే చేయగల పనులు చేస్తూంటాం. మీలాగా ఉత్సాహంగా చురుగ్గా కృషి చేసేవారు వికీలో మరిన్ని బాధ్యతలు తీసుకుని వికీని నడిపించడం, అందుకు మార్గాన్ని సుగమం చెయ్యడం ఈ ప్రతిపాదన లోని ప్రధాన ఉద్దేశమని నేను భావిస్తున్నాను. ఇదొక మంచి ప్రయత్నం, మంచి ఫలితాలే ఉంటాయని అనుకుంటున్నాను. __ చదువరి (చర్చరచనలు) 06:14, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పాయింటులో తలెత్తిన సందేహం

మార్చు

రహ్మానుద్దీన్ గారూ మొదటి పాయింట్లులో మీరు "వేరే వికీ ప్రాజెక్టులో లో ఇప్పటికే అధికారి/నిర్వాహకునిగా ఉన్న వ్యక్తికి ఈ నిబంధన వర్తిస్తుందా?" అనే ప్రశ్నను లేవనెత్తారు.ఇవి కేవలం తెలుగువికీపీడియాకు సంబంధించిన మార్గదర్శకాలు. ఆదృష్ఠితోనే వీటిని చూడాలని నా అభిప్రాయం.ఈ మార్గదర్శకాలు ఇతర వికీపీడియా నిర్వాహకత్వానికి ఎలా వర్తించవో, అలాగే ఇతరవికీపీడియా నిర్వాహకత్వ మార్గదర్శకాలు తెలుగు వికీపీడియాకు వర్తించవని భావించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:58, 30 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మార్గదర్శకాలుపై నిర్ణయ ప్రకటన కోరుటను గురించి

మార్చు

ఈ ప్రతిపాదనలోని మార్గదర్శకాలుపై 2024 ఏప్రిల్ 3న , అధికారి, సీనియర్ నిర్వాహకుడైన రాజశేఖర్ గారిని తగిన నిర్ణయం/నిర్ణయాలు ప్రకటించవలసినదిగా అభ్యర్థించుచున్నాను.సమయం కోసం ముందుగా తెలుపటమైనది.ధన్యవాదాలు.(మర్చిపోయిన సంతకం) యర్రా రామారావు (చర్చ) 3 ఏప్రిల్ 2024

రాజశేఖర్ గారూ అవకాశం చూసుకుని ఈ రోజు నిర్ణయం ప్రకటించగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:41, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

మార్చు

కొత్త నిర్వాహకత్వ హక్కులు పొందడానికి మార్గదర్శకాలు రూపొందించి, సభ్యుల స్పందనలను పరిశీలించాను. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ చర్చలలో నేను పాల్గొనలేకపోయాను. కాబట్టి ఫలితాలను ప్రకటిస్తున్నాను:

  • 1. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికీలో వాడుకరిగా నమోదై రెండు సంవత్సరాలు దాటాలి. ఆ కాలంలోపు 2000 ఎడిట్లు చేసి ఉండాలి. (ఈ దిద్దుబాట్లు అన్ని నేంస్పేసులతో కలిపి).
  • 2. స్యీయ ప్రతిపాదన చేసుకోవాలి.
  • 3. అనామక సభ్యులు నిర్వాహాకులు కాలేరు, వారు ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటుహక్కు ఉండదు. వ్యాఖ్యానించవచ్చు.
  • 4. అభ్యర్ధికి సభ్య పేజీ ఉండాలి. ఆ సభ్య పేజీలో వ్యక్తిగత విషయాలు బయల్పరచవలసిన అవసరం లేదు, కానీ తనకు తెవికీ ఇష్టాఇష్టాలు, పరిజ్ఞానం, వికీలో స్యయం ప్రతిపాదనచేసేనాటికి చేసిన కృషి గురించి కొంతైనా సమాచారం ఉండాలి. ఈ విధంగా తెలుపుటవలన ఓటింగు సందర్బంలో అభ్యర్ధి ఇష్టాఇష్టాలు, కృషిని సభ్యులందరూ తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది.
  • 7. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి 20 ప్రధానపేరుబరి వ్యాసాల చర్చలలో లేదా రచ్చబండ చర్చలలో పాల్గొని ఉండాలి.

ఈ పైన పేర్కొన్న 1, 2, 3, 4 మరియు 7 ప్రతిపాదనలు వాడుకరుల ద్వారా స్వీకరించబడ్డాయి. మిగిలిన ప్రతిపాదనలు 5, 6, 8, 9, 10, 11 మరియు 12 ఓటింగులో పాల్గొన్న వాడుకరుల మెజారిటీ అభిప్రాయలకు అనుగుణంగా వీగిపోయాయి.--Rajasekhar1961 (చర్చ) 18:14, 10 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

    • నిర్వహణ బడి ఆలోచన బాగున్నది, నిర్వాహకత్వం బాధ్యతలు లేకుండా చేయగలిగే అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు అలాంటి పనులు చేసి అవసరాన్ని బట్టి రోల్‌బ్యాక్ వంటి హక్కులు ఇచ్చి వాటి నిర్వాహణ సంతృపికరంగా అనిపిస్తే అప్పుడు నిర్వాహక ప్రతిపాదనకు ప్రోత్సహించవచ్చును. వాడుకరులు చాలామంది ఇందుకు సమ్మతించడంతో ఈ ప్రతిపాదన స్వీకరించబడినది.--Rajasekhar1961 (చర్చ) 06:28, 11 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
      • నిర్వహణ బడి సవరణ: నిర్వహణ బడి లోని కొన్ని అంశాలను నేర్చుకొన్న పిదప, రోల్‌బ్యాక్ హక్కులతో సంబంధం లేకుండా సదరు వాడుకరులకు నిర్వహక బాద్యతలను అప్పగించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 05:42, 5 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయ సారాంశం ఆకృతి

మార్చు

ఈ చర్చలో ఉహకందనంతగా ఎక్కువమంది వాడుకరులు పొల్గొన్నారు. అందరూ వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు. చాలా పెద్ద చర్చ జరిగింది. గంధరగోళానికి తావులేకుండా నిర్ణయ ఫలితాలును సృష్టత కోసం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దిగువ వివరించమైనది.

నిర్ణయంలో ఆచరణకు సమ్మతించిన మార్గదర్శకాలు

1. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికీలో వాడుకరిగా నమోదై రెండు సంవత్సరాలు దాటాలి.ఆ కాలంలోపు 2000 ఎడిట్లు చేసి ఉండాలి.(ఈ దిద్దుబాట్లు అన్ని నేంస్పేసులతో కలిపి) (చర్చలో 1వ అంశం)

2. స్వీయ ప్రతిపాదన చేసుకోవాలి.(చర్చలో 2వ అంశం)

3. అనామక సభ్యులు నిర్వాహకులు కాలేరు, వారు ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటుహక్కు ఉండదు. వ్యాఖ్యానించవచ్చు.(చర్చలో 3వ అంశం)

4. అభ్యర్ధికి సభ్య పేజీ ఉండాలి. ఆ సభ్య పేజీలో వ్యక్తిగత విషయాలు బయల్పరచవలసిన అవసరం లేదు, కానీ తనకు తెవికీ ఇష్టాఇష్టాలు, పరిజ్ఞానం, వికీలో స్వయం ప్రతిపాదన చేసేనాటికి చేసిన కృషి గురించి కొంతైనా సమాచారం ఉండాలి. ఈ విధంగా తెలుపుటవలన ఓటింగు సందర్భంలో అభ్యర్ధి ఇష్టాఇష్టాలు, కృషిని సభ్యులందరూ తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది.(చర్చలో 4వ అంశం)

5. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి 20 ప్రధానపేరుబరి వ్యాసాల చర్చలలో లేదా రచ్చబండ చర్చలలో పాల్గొని ఉండాలి. (చర్చలో 7వ అంశం)

నిర్ణయంలో ఆచరణకు వ్యతిరేకించిన మార్గదర్శకాలు

1. అభ్యర్ధి 2000 దిద్దుబాట్లతో పాటు, స్యీయప్రతిపాదన చేసుకునేనాటికి 50 వ్యాసాలలో ఎడిట్లు చేసిఉండాలి. (చర్చలో 5వ అంశం)

2. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికి ప్రధానపేరుబరిలో అనువాదయంత్రం ద్వారా 20 వ్యాసాలు సృష్టించి ఉండాలి. (చర్చలో 6వ అంశం)

3. స్వీయ ప్రతిపాదన చేసేనాటికి కనీసం రెండు ప్రాజెక్టు పనులలో భాగస్వామ్యం అయి ఉండాలి. (చర్చలో 8వ అంశం)

4. స్వీయ ప్రతిపాదన చేసుకునేముందు ముగ్గురు నిర్వాహకులు అభిప్రాయాలు తెలుసుకోవాలి. వారిలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు పరిగణించి, స్వీయప్రతిపాదన చేసుకోవాలి.(దీని వలన అభ్యర్థికి ఆత్మస్థైర్యం కలగటానిక అవకాశం ఉంది.) (చర్చలో 9వ అంశం)

5. ఆరు మాసాలకు మించి సెలవులో ఉన్నప్పుడు నిర్వాహకత్వం స్వయంచాలకంగా రద్దైయింది. (చర్చలో 10వ అంశం)

6. మొదట ఒక సంవత్సరకాలం వరకు నిర్వాహకత్వం పనితీరు పరిశీలన కింద (ట్రయల్ రన్) గా పరిగణించబడుతుంది.దాని తరువాత నిర్వాహకత్వం స్వయంచాలకంగా రద్దైయింది. (చర్చలో 11వ అంశం)

7. అభ్యర్థి కోరికమేరకు తిరిగి రెగ్యులర్‌గా కొనసాగటానికి, ఆ కాలంలో పనితీరు సంతృప్తిగా ఉందని సముదాయం భావిస్తే మాత్రమే కంటిన్యూ కావటానికి అవకాశం ఉంది. (చర్చలో 12వ అంశం)

నిర్వహణ బడి నిర్ణయ ఫలితం

మధ్యంతర ప్రతిపపాదనలలో కొత్తగా నిర్వాహకులు కాదలచుకున్నవారికి అర్హతా నిబంధనలను సులభతరం చెయ్యాలనే ఉద్దేశ్యంతో అదే సమయంలో అవి వారి నిర్వాహకత్వ కృషికి దోహదడేలా ఉండటానికి నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు ప్రతిపాదనలలో భాగంగా ఆచరణలో పెట్టటానికి "నిర్వహణ బడి" ని విధాననిర్ణయ పేజీలో చేర్చటానికి సమ్మతించబడినది.అయితే అందులోని పనులకు మూల్యాంకన నిర్వాహకత్వం కోరే అభ్యర్థులు ప్రతిపాదన పెట్టేముందే కేవలం తమ అర్హతను పరీక్షించుకునేందుకు మాత్రమే దీనిని వాడుకోవచ్చు.వాడుకరులకు ఆ అభ్యర్థిపై తమకున్న అభిప్రాయాలను నిర్థారించుకునేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. కానీ నిర్వాహకత్వ ప్రతిపాదనపై నిర్ణయానికి అది కొలబద్ద కాకూడదు.

రాజశేఖర్ గారూ మీ నిర్ణయ ఫలితాలకు అనుగుణంగా నిర్ణయాల ఆకృతిని సృష్టత కోసం పైన క్లుప్తంగా వివరించాను. పరిశీలించి నిర్థారించగలరు.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:55, 13 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఫలితాలపై వివరణ ఇచ్చినందుకు యర్రా రామారావు గారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 13:55, 13 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయంపై అభిప్రాయాలు

మార్చు
@రాజశేఖర్ గారూ శ్రమ తీసుకుని ఈ చర్చలో నిర్ణయం ప్రకటించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 18:36, 10 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@రాజశేఖర్ గారూ అలాగే మధ్యంతర ప్రతిపాదనలు విభాగంలో "నిర్వహణ బడి" చర్చకు కూడా నిర్ణయం ప్రకటించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 18:42, 10 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@రాజశేఖర్ గారూ మధ్యంతర ప్రతిపాదనలు విభాగంలోని "నిర్వహణ బడి" చర్చకు కూడా నిర్ణయం ప్రకటించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:10, 11 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.