వికీపీడియా:పాఠం (వికీపీడియా లింకులు)
సహాయం పేజీలు | స్వాగతం · తెలుగులో రచనలు చెయ్యడం · 5 నిమిషాల్లో వికీ · పాఠం · గైడు · పదకోశం · సహాయం · సహాయ కేంద్రం · ప్రశ్నలు · వీడియో పాఠాలు
మొదటి పేజీ | దిద్దుబాటు | ఫార్మాటింగు | వికీపీడియా లింకులు | బయటి లింకులు | చర్చాపేజీలు | గుర్తుంచుకోండి | ఖాతా | ముగింపు |
వికీపీడియా వ్యాసాలకు ఒకదానికొకటి లింకులివ్వడం చాలా ముఖ్యం. వ్యాస విషయానికి సంబంధించిన ఇతర సమాచారం పొందేందుకు ఈ లింకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఎప్పుడు లింకు ఇవ్వాలి
లింకు ఎప్పుడివ్వాలో చూసేందుకు నమూనా కోసం వికీపీడియా వ్యాసాలను చూడండి. లింకు ఇచ్చేటపుడు "ఒకవేళ నేను ఈ వ్యాసాన్ని చదివితే, ఈ లింకు నాకు ఉపయోగపడుతుందా" అని ప్రశ్నించుకోండి. ఏ పదానికైనా లింకు ఇచ్చేటపుడు వ్యాసంలో మొదటిసారి ఆ పదం తటస్థించిన చోట లింకు ఇవ్వండి. మొదటిసారి మాత్రమే ఇవ్వండి, ప్రతి చోటా కాదు.
లింకు ఎలా ఇవ్వాలి
వేరే వికీపీడియా పేజీకి లింకు ఇచ్చేందుకు ఆ పేజీ పేరుకు రెండు వైపులా జమిలి స్క్వేరు బ్రాకెట్లను ఇవ్వండి, ఇలాగ:
- [[ప్రయోగశాల]]
లింకు ఇస్తున్న పేజీ పేరు, వ్యాసంలో కనబడే పేరు వేరు వేరుగా ఉండాలంటే.. పేజీ పేరు తరువాత పైపు (|) గుర్తు పెట్టి ఆ తరువాత కనబడాల్సిన పేరు రాయాలి. దీన్ని పైపు లింకు అని అంటారు. ఉదాహరణకు:
- [[లక్ష్యంపేజీ పేరు|కనబడే పేరు]]
మీరు పెట్టె లింకులు సరైన వ్యాసానికే వెళ్తున్నాయని నిర్ధారించుకోండి. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు లింకు ఆ స్వాతంత్ర్య యోధుడి పేజీకి వెళ్తుంది. అల్లూరి సీతారామరాజు (సినిమా) ఆ సినిమా పేజీకి వెళ్త్తుంది. ఒకే పేరు, లేదా ఒకే రకమైన పేరు కలిగిన వేరు వేరు పేజీల విషయంలో తలెత్తే అయోమయాన్ని నివారించేందుకు అయోమయ నివృత్తి పేజీలను తయారు చెయ్యవచ్చు. ఈ అయోమయ నివృత్తి పేజీలో ఒకే పేరు కలిగిన అన్ని పేజీల జాబితా లింకులతో సహా ఉంటుంది.
తేదీలను లింకు చెయ్యడం
తేదీలకు లింకులు ఇవ్వడం వలన అది కనబడే విధానం సభ్యుని అభిరుచులలో సెట్ చేసుకున్న విధంగా కనిపిస్తుంది. లింకులు లేని తేదీ ఎలా రాసామో అలాగే కనిపిస్తుంది. 2006, జనవరి 1 అని రాస్తే 2006, జనవరి 1 అనే కనిపిస్తుంది. తేదీకి లింకు ఇచ్చినపుడు:
- [[జూలై 29]], [[2004]]
అనే లింకును వికీపీడియా కింది విధాల్లో ఏదో ఒక రకంగా చూపిస్తుంది:
- జూలై 29, 2004
- 29 జూలై 2004
- 2004 జూలై 29
- 2004-07-29
-సభ్యుడు తన అభిరుచుల్లో సెట్ చేసుకున్న విధానికి అనుగుణంగా ఇది కనిపించే విధానం ఉంటుంది. (ఇది లాగిన్ అయి ఉన్న సభ్యులకు మాత్రమే పని చేస్తుంది.)
వర్గాలు
వ్యాసాన్ని దానికి సంబంఢించిన ఇతర వ్యాసాలతో కలిపి ఓ వర్గంలో చేర్చవచ్చు. [[వర్గం:]] అని టైపు చేసి, కోలను తరువాత వర్గం పేరును రాయండి అంతే!
వర్గం పేజీకి వ్యాసం నుండి లింకు ఇవ్వలంటే, వర్గం టాగుకు ముందు కోలను (:) పెట్టండి, ఇలాగ:
- [[:వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
పై కోడు వ్యాసంలో ఇలా కనిపిస్తుంది:
వర్గాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటే ఇతరులు ఈ వ్యాసాన్ని తేలిగ్గా కనుక్కోగలరు. ఉత్తమమైన పద్ధతి ఏంటంటే ఇలాంటి ఇతర వ్యాసాలు ఏ వర్గంలో ఉన్నాయో చూసి అదే వర్గంలోకి చేర్చడం.