వికీపీడియా:పాఠం (దిద్దుబాటు)

మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    
వ్యాసంలో దిద్దుబాటు చేసేందుకు మార్చు ను నొక్కండి
వ్యాసంలో దిద్దుబాటు చేసేందుకు మార్చు ను నొక్కండి

వికీ అంశాలన్నిటిలోకీ అత్యంత ప్రాథమిక అంశం - మనము రాసిన పేజీలు సరి చేయడము! ఏవో కొన్ని సంరక్షిత పేజీలు తప్పించి, ప్రతి పేజీని మార్చే అవకాశం ఈ లింకు కు ఉంటుంది. ఈ లింకు ద్వారా మీరు ఖచ్చితంగా అదే చెయ్యవచ్చు: మీరు చూసే పేజీలో మార్పులు చేర్పులు చెయ్యడం. ఎవరైనా, దేన్నైనా దిద్దుబాటు చెయ్యగలిగే ఇలాంటి సైట్లనే వికీ లని అంటారు. ప్రయోగశాల కు వెళ్ళి, మార్చు లింకును నొక్కి చూడండి. వ్యాసంలో కనబడే విషయమంతా అక్కడ వికీ కోడ్ తో సహా కనిపిస్తుంది. మీరూ ఏదో ఒకటి రాసి భద్రపరచి వ్యాసం పేజీలో ఏం కనిపిస్తుందో చూడండి. (గమనిక: ఈ పేజీలో చెయ్యకండి!)

సరిచూడు

ఇక్కడ ఓ ముఖ్యమైన అంశం - సరిచూడు మీట. ప్రయోగశాల కు వెళ్ళి, ఏవో కొన్ని మార్పులు చేసి, భద్రపరచు నొక్కకుండా సరిచూడు మీట నొక్కి చూడండి. భద్రపరిచాక, వ్యాసం పేజీ ఎలా కనిపిస్తుందో మీకు సర్దుబాటు చేసిన పాఠము చూపిస్తుంది. ఏమైనా పొరపాట్లు చేసిన యెడల. వాటిని సరిచేసుకుని అప్పుడు భద్రపరచుకోవచ్చు. సరిచూసుకున్నాక భద్రపరచడం మర్చిపోవద్దు!

దిద్దుబాటు సారాంశం

Edit summary text box
Edit summary text box

భద్రపరిచే ముందు, మీరు చేసిన మార్పు చేర్పులకు సంబంధించి దిద్దుబాటు సారాంశం పెట్టెలో చిన్నపాటి వివరణ ఇవ్వడం వికీ సాంప్రదాయం. ఇది భద్రపరచు, సరిచూడు మీటలకు పైన ఉంటుంది. అది చాలా చిన్నదిగా - "+వర్గం" - ఇలా ఉండొచ్చు; దీనర్థం వ్యాసాన్ని ఏదో వర్గానికి చేర్చారని ఇతర సభ్యులకు అర్థం అవుతుంది. మీరు చేసిన మార్పులు చిన్నవైతే ఇది ఒక చిన్న మార్పు అనే చెక్ బాక్సులో టిక్కు పెట్టడం మరువకండి. అయితే మీరు లాగిన్ అయి ఉంటేనే ఇలా చిన్న మార్పును గుర్తించగలుగుతారు.

ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి
ఇక ఫార్మాటింగు కు వెళ్దాం