వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు
అందరికి నమస్కారం! వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించడం గురించి మనము ఇంతకు ముందు చర్చించి ఒక నిర్ణయం తీసుకొన్నాము. అలాగే చాలా మంది (88 వికీమీడియన్లు) భారతీయ వికీపీడియన్లు దీనికి మద్దతు తెలుపగా, 11 కమ్యూనిటీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో మనకి మద్దతు రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇక ఇప్పుడు మనము ఈ చర్చ మొత్తాన్ని ముగించి ముందుకి వెళ్లవలిసిన సమయం వచ్చింది. ఆలా చేయటానికి మనవైపు ఒక పని మిగిలివుంది, అది ఏమిటంటే, మనము దీని మొత్తాన్ని ధ్రువీకరించి, తెలుగు వికీమీడియన్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్టలలో ఉన్న ఇతర వికీమీడియన్లు కలిసి దీని బాధ్యత తీసుకోవటం. అందుకోసం మనము పలువురు వికీమీడియన్లు దీని నిర్వహణ పనులలో పాలు పంచుకుంటారు అని చూపించాలి. ఇందు కారణముగా మా విన్నపం ఏమిటంటే, ఆసక్తి ఉన్న తెలుగు వికీమీడియన్లు వారి ఆసక్తి, ఇదివరకు వారు చేసిన కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), మరియు ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటాన్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అని క్రింది సెక్షన్లో వివరించండి.
ఇందులో ఆంధ్ర ప్రదేశ్ వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారు కూడా ఒక ముఖ్యభాగము కనుక వారు వారి క్లబ్ పేజీలో దీనిని ఇదే విధముగా చర్చించి తెలుగు వికీమీడియన్లు (మిగతా వారికి) సహ-నిర్వాహకులుగా ఉండటానికి ఇక్కడ ప్రకటిస్తారు. ఇక్కడ తెవికీ వైపు నుండి పలువురు అలాగే వి.వి.ఐ.టి వారు తమ ధ్రువీకరణ తెలిపిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వికీమీడియన్లు వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించటానికి అంగీకారము మరియు బాధ్యత తీసుకుంటన్నట్టుగా ప్రకటించవచ్చు.
అలాగే తెవికీ కమ్యూనిటీ మొత్తముగా ఇది వరుకు చేసిన ముఖ్య కార్యక్రమాలు గురించి వివరించవలసిందిగా తెవికీ సభ్యులను కోరుతున్నాను. అలాగే జులై జరిగిన మినీ-టి.టి.టి, తెవికీ సభ్యులు మరియు వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారు కలిసి నిర్వహించారు. ఇవి ముఖ్యముగా మనము ఒక కమ్యూనిటీగా బలము చూపించటని మరియు కార్యక్రమాల నిర్వహణలో మనకు ఉన్న అనుభవానికి సూచికలు. KCVelaga (talk) 09:38, 26 అక్టోబరు 2019 (UTC)
వికీమీడియన్ల ఆసక్తి ప్రకటన
మార్చు- తెలుగు భాషాభివృద్ధి చేయాలనే తలంపుతో తెలుగు వికీపీడియాలో 2013, మార్చి 8న చేరిన నేను, తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ... వికీపీడియా శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తూ, తెలుగు వికీపీడియా గురించి అందరికి తెలిసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నాను. 2013లో హైదరాబాదులో జరిగిన తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం నిర్వాహకుడిగా, 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు మరియు 2015లో తిరుపతిలో జరిగిన పదకొండో వార్షికోత్సవాలకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించాను. 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016 లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. 2016 ఆగస్టులో చండీగఢ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొని, పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించడంలో సహచరులతో కలిసి కృషిచేసాను. 2018లో బతుకమ్మ పండుగ సందర్భంగా రవీంద్రభారతిలో 25మంది తెవికీ సముదాయ సభ్యులతో సదస్సు నిర్వహించి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారినుండి సముదాయ సభ్యులకు సత్కారం అందింపజేసాను. 2019లో హైదరాబాదులో మినీ టిటిటి నిర్వహించి, ఆసక్తిగలవారికి వికీపీడియా శిక్షణ అందించాను. కాబట్టి, నేను వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2020 లోకల్ ఆర్గనైజింగ్ కమిటీలో ఉండాలి అనుకుంటున్నాను. మిగతా వాటిల్లో కూడా నా సహకారం అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:25, 27 అక్టోబరు 2019 (UTC)
- 2017 నుండి వికిసోర్స్ లో క్రియాశీలకంగా వున్నాను. 2018 లో TTT, మైసూరులోను, Wikisource Community Consultation సమావేశం కలకత్తాలోను, 2019లో హైదరాబాదులో జరిగిన mini TTTలోను పాల్గొన్నాను. కార్యక్రమ నిర్వహణలపై అవగాహన ఉన్నవాడను. హైదరాబాదు లో 2020లో జరగబోతున్న వికీ కాన్ఫరెన్స్ ఇండియాలో స్థానిక నిర్వాహక సంఘం సభ్యుడిగా వుండాలని కోరుతున్నాను. నా వంతు సహకారం అందించుటకు సిద్ధంగా ఉన్నాను. గుంటుపల్లి రామేశ్వరం
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన వ్యాసాలను, చిత్రాలను 2015 నుంచి వికీమీడియాలో చేర్చుతున్నారు. వికీపీడియ నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాలలో నేను పాల్గొన్నాను: వికి అడ్వాస్డ్ ట్రైనింగ్ (2018), వికీపీడియా ట్రైన్ ద ట్రైనర్ (2019), మినీ ట్రైన్ ద ట్రైనర్-హైదరాబాదు (2019). వీటితో పాటు ఎన్నో పోటీలలో పాల్గొన్నాను: వికీపీడియా ఏసియన్ నెల 2017లో 4వ స్థానం, వికీ లవ్స్ యెరెవాన్ లో 4వ స్థానం, వికీ లవ్స్ మాన్యుమెంట్స్ ఇండియా 2019లో 5వ స్థానం పొందాను. వివిఐటికి చెందిన Sumanth699తో కలిసి తెలుగు వికీపీడియాకు ఇన్ష్టాగ్రాంలో ఒక పేజీని మొదలుపెట్టి ఇప్పటివరకు 7 చిత్రకారులతో 40 చిత్రాలను అప్లోడ్ చేయించడమే కాక పదుల సంఖ్యలో OTRS పద్ధతి ద్వారా చిత్రాలను అప్లోడ్ చేశాము. భారతదేశంలో ఫేస్ బుక్ తరువాత ఇన్ష్టాగ్రాంలో అతిపెద్ద సామాజిక మీడియా కవడంలో ఒక టీంని తయారు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. హైదరాబాదులో జరగబోయే వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020కు నా వంతు సహకారం అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. --IM3847 (చర్చ) 12:47, 3 నవంబర్ 2019 (UTC)
- తెవికీలోనూ ఇతర సోదర సంస్థలలోనూ భాగస్వామ్యం వహిస్తున్నాను. 2011 ముంబైలో నిర్వహించిన వికీపీడియా ఇండియా సదస్సులో నోట్వర్తీ వికీపీడియను గుర్తింపు అందుకున్నాను. 2013 లో తెవికీ ఉగాది ఉత్సవం, మహిళాసమావేశాలలో పాల్గొన్నాను. వీటికి అవసరమైన ఆన్లైను సమావేశాలలో భాస్వామ్యం వహించాను. బెంగుళూరులో నిర్వహించిన, టి.టి.టి. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను. విజయవాడ, తిరిపతి తెవికీ సమావేశాలలో కార్యవర్గ సభ్యత్వం వహింస్తూ భాగస్వామ్యం వహించాను. హైదరాబాదు వికీసౌర్సు శిక్షణాకార్యక్రమంలో పాల్గొన్నాను. జరగబోయే ఇండియా వికీపీడియా సమావేశంలో నా వంతు సహకారం అందిస్తాను. T.sujatha (చర్చ) 14:38, 3 నవంబర్ 2019 (UTC)
- తెలుగు వికీపీడియా నుండి వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 నిర్వహించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనిద్వారా తెలుగు వికీపీడియా స్థాయి పెరుగుతుందని నా అభిప్రాయం. వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 నిర్వహణ పనులలో నేను కూడా భాగస్వామ్యం కావాలనుకుంటున్నాను. ధన్యవాదాలు, Adbh266 (చర్చ) 16:36, 3 నవంబర్ 2019 (UTC)
- తెలుగు వికీసమూహం ద్వారా మనందరికీ వికీ సమావేశం ఇండియా 2020 నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయం. మనం ఇంతకు ముందు హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలలో నిర్వహించిన సమావేశాల అనుభవం మనకు చాలా ఉపయోగకరం. నేను, మనందరి సహకార సమన్వయ నిర్వహణా అనుభవాలను క్రోడీకరించి ఈ సమావేశాన్ని ఇకముందెన్నడూ ఇలా నిర్వహించలేని విధంగా చేయాలని నా అభిలాష. నేను ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనగలనని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రస్తుతం వృత్తిరీత్యా కొంచెం నా పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ఒక 3-4 నెలలలో నేను తగినంత సమయం ఇందుకోసం కేటాయించగలను. ఈ సమావేశంలో కార్యక్రమ ప్రణాళిక అత్యంత కీలకమైనది. ఇతర భాషలందరి సహకారాన్ని తీసుకొని ఒక మంచి ఉపయోగకరమైన సమాచేశం చేద్దాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 17:09, 3 నవంబర్ 2019 (UTC)
- It's been more than one year since I joined Urdu wikipedia and I am continuously adding content to it which is my main focus. I usually translate articles form English and Arabic to Urdu wikipedia to increase the number of articles and reading materials. I have participated in Collaboration with Hebrew wikipedia,Asian Month 2018 and collaboration with Chinese Wikipedia. Currently I m working with Asian month 2019 and Tiger 2.0 where I have created 115 articles for Tiger so far. I was also involved with 100 wiki days where i created 100+ articles in less than 100 days. Now I am looking ahead to involve in some organising work to do mote than just writing articles and translation. In this regard, I am looking ahead to get a chance to work with this conference. So, I am willing to be a part of the organising team of this project.Faismeen (చర్చ) 17:15, 3 నవంబర్ 2019 (UTC)
- తెలుగు వికీ సమూహం ద్వారా ఈ కార్యక్రమం జరగటం ఆనందకరమైన విషయం. ఎవరి మధ్య వ్యక్తిగత, విద్య, వృత్తి, వయసు, కులం, మతం, డబ్బు వంటి తారతమ్య భేధాలు లేకుండా,రాకుండా సమన్వయంతో అంతా మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు వీలైనంత వరకూ సేవలు అందించుటకు, కార్యక్రమాలలో పాల్గొనుటకు సిద్దంగా ఉంటాను..B.K.Viswanadh (చర్చ) 06:12, 4 నవంబర్ 2019 (UTC)
- 2017 ᱠᱷᱚᱱ ᱥᱟᱱᱛᱟᱲᱤ ᱣᱤᱠᱤᱯᱤᱰᱤᱭᱟ ᱞᱟᱹᱜᱤᱫ ᱚᱱᱚᱞ ᱠᱩᱧ ᱚᱞ ᱟᱹᱜᱩ ᱟᱠᱟᱫ-ᱟ, ᱩᱱ ᱡᱚᱦᱚᱜ ᱫᱚ ᱥᱟᱱᱛᱟᱲᱤ ᱣᱤᱠᱤᱯᱤᱰᱤᱭᱟ ᱫᱚ ᱤᱱᱠᱩᱵᱮᱴᱚᱨ ᱨᱮᱜᱮ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱾ ᱩᱱ ᱠᱷᱚᱱ ᱱᱤᱛᱚᱜ ᱫᱷᱟᱹᱵᱤᱡ ᱟᱭᱢᱟ ᱥᱟᱛᱟᱢ ᱤᱧ ᱚᱞ ᱟᱹᱜᱩ ᱟᱠᱟᱫ-ᱟ ᱾ ᱟᱹᱰᱤ ᱜᱟᱱ Online Edit-a-thon ᱨᱮᱦᱩᱧ participate ᱟᱠᱟᱫ-ᱟ ᱾ ᱱᱤᱛᱚᱜ ᱪᱟᱞᱟᱜ ᱠᱟᱱ Projet tiger 2.0, Asian Month 2019 ᱟᱨ ᱛᱤᱨᱞᱟᱹ ᱦᱚᱲᱢᱚᱥᱟᱶᱟᱨ ᱥᱟᱯᱟᱲᱟᱣ ᱒᱐᱑᱙ ᱨᱮᱦᱚᱸ ᱦᱮᱯᱨᱟᱣ ᱨᱮ ᱢᱮᱱᱟᱹᱧᱟ ᱾ ᱤᱧ ᱫᱚ ᱵᱤᱥᱟᱠᱷᱟᱯᱟᱴᱱᱟᱢ ᱨᱤᱧ ᱛᱟᱦᱮᱸᱱ ᱠᱟᱱ ᱠᱷᱟᱹᱛᱤᱨ, Wiki India conference 2020 ᱨᱮ ᱚᱨᱜᱟᱱᱟᱭᱡᱚᱨ ᱞᱮᱠᱟᱛᱮ ᱛᱟᱦᱮᱸᱱ ᱠᱩᱥᱤᱧ ᱵᱩᱡᱷᱟᱹᱣᱟ ᱾ --Maina Tudu (చర్చ) 18:13, 4 నవంబర్ 2019 (UTC)
వి.వి.ఐ.టి వికీ-క్లబ్ సహా నిర్వహణకు ప్రకటన
మార్చునమస్కారం, వివిధ రకాల వికీమీడియా కార్యకలాపాలను అంటే ఎడిట్-అ-థాన్స్, మీటప్లు, ప్రాంతీయ స్థాయి ఈవెంట్లు, క్రాస్ కమ్యూనిటీ కొలాబరేషన్లు వంటివి TTT 2019 మరియు Mini-TTT 2019 ఇలాంటివాటి ముందస్తు నిర్వహణ అనుభవంతో వీవీఐటీ వికీ క్లబ్ సభ్యులు అందరం WikiConference India 2020 కి తెలుగు వికీ సముదాయమూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఇతర వికీపీడియన్లతో పాటు సహ నిర్వాహకులుగా ఉండాలని అనుకుంటున్నాం. మా అనుభవం సమావేశానికి విలువనిస్తుందని మేం నమ్ముతున్నాము, అంతేకాక ఈ నిర్వహణ నుండి మేము గొప్ప విషయాలు నేర్చుకుని వికీకి మెరుగైన సేవలు చేయగలమని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు MNavya (చర్చ) 02:21, 2 నవంబర్ 2019 (UTC)
- Discussion link: m:Talk:VVIT WikiConnect/WikiConference India 2020 Hyderabad: Co-hosting resolution. KCVelaga (talk) 06:48, 5 నవంబర్ 2019 (UTC)
ధ్రువీకరణ నిర్ణయం
మార్చువికీ కాన్ఫరెన్సు ఇండియా నిర్వహణకు భారత వికీ సముదయాలు తమతమ సమ్మతిని తెలిపిన నేపథ్యంలో, ఈ సమావేశ కార్యనిర్వహణ చేసేందుకు తెలుగు వికీపీడియన్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని వికీపీడియన్లు, వీవీఐటీ వికీ క్లబ్బు తమ ఆసక్తిని తెలియజేసారు. తెలుగు వికీపీడియాలోని వారే కాక, ఇతర భాషా వికీపీడియాలో పనిచేసే వారు కూడా నిర్వహణలో పాలు పంచుకునేందుకు ముందుకు రావడం ఉత్సాహాన్ని ఇనుమడింపజేసే అంశం. ఇక్కడి సభ్యులు వ్యక్తం చేసిన సంసిద్ధతను, సూచనలనూ పరిగణన లోకి తీసుకుని, కార్యక్రమం సన్నాహకాలపై మరింత ముందుకు పోవాలని నిర్వాహక నాయకత్వానికి తెవికీ సముదాయం అభ్యర్ధిస్తోంది. __చదువరి (చర్చ • రచనలు) 05:32, 5 నవంబర్ 2019 (UTC)
Translation of the decision In the light of the approval of the Wiki Conference India proposal by the Indic language Wiki Communities, The Wikipedians of Tewiki, of AP and Telangana states and of the VVIT Wiki club have expressed their willingness to participate in organising the event. It is heartening to see that Wikipedians from other language Wikipedias too expressed their interest to participate. Hence, Telugu Wikipedia requests the proposers to go ahead with the event considering this willingness and the suggestions given here.__చదువరి (చర్చ • రచనలు) 05:32, 5 నవంబర్ 2019 (UTC)