వికీపీడియా:వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 - తెవికీ బృందం పర్యటన నివేదిక

ఆగస్టు 4-6 తేదీల్లో చండీగఢ్‌లో భారతీయ వికీపీడియాల సమావేశమైన వికీకాన్ఫరెన్స్ ఇండియా - 2016 జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు వికీపీడియన్లు పాలగిరి, ప్రణయ్ రాజ్, విశ్వనాధ్, రహ్మానుద్దీన్, భాస్కరనాయుడు, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, స్వరలాసిక, కశ్యప్, పవన్ సంతోష్, నిఖిల్, కార్తీక్ ఛండీగఢ్ వెళ్ళారు. ఇది వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 తెవికీ బృందం పర్యటన నివేదిక.

నివేదిక మార్చు

4వ తేది మార్చు

 
Wikipediannn Introduction in WCI2016

4వ తేది ఉదయం 6 గంటలకు భాస్కరనాయడు, గుళ్లపల్లి నాగేశ్వరరావు, పాలగిరి రామకృష్ణారెడ్డి, విశ్శనాధ్, కశ్యప్, ప్రణయ్ లు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీ మీదుగా చంఢీఘడ్ లోని చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీ (సి.జి.సి) కి చేరుకున్నారు.

ఆ తరువాత మురళీమోహన్, పవన్ సంతోష్, నిఖిల్, కార్తీక్ లు వచ్చారు. కాసేపయ్యాక ఇతర భాష వికీపీడియన్లు కూడా వచ్చారు. అన్ని భాషల వికీపీడియన్లు ఒకచోట సమావేశమై ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. రాత్రి బస్సులో చంఢిగడ్ యూనివర్సిటీకి వెళ్లి డిన్నర్ చేసి, కేటాయించిన వసతికి వెళ్లారు.

 
Telugu Wikimedians in WCI2016

5వ తేది మార్చు

 
Wikipedians in Opening Ceremony of WCI2016
 
Opening Ceremony of WCI2016

ఉదయం 9 గంటలకు ఫలహారం తీసుకునే సమయంలో ఇతర భాషల వికీపీడియన్లను తెలుగు వికీపీడియా సభ్యులు కలిసి పరిచయం చేసుకున్నారు. ఫలహారం ముగించుకొని, బస్సులో గంటన్నర ప్రయాణంచేసి చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడికి చేరుకునేసరికి ఆడిటోరియంలో ప్రారంభ సమావేశం జరుగుతుంది. ముఖ్యతిథులు ప్రారంభ ఉపన్యాసం చేసి, సదస్సును ప్రారంభించారు. చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీ విద్యార్థులు పంజాబ్ సంస్కృతిని ప్రతిబింబించేలా నృత్యాలు చేశారు. అనంతరం వికీమీడియా ఫౌండేషన్‌ సీనియర్‌ ప్రోగాం ఆఫీసర్‌ అసఫ్‌ బార్టోవ్‌ ఉపన్యాసం ఇచ్చారు. ఆ తరువాత వికిమీడియా ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ మహేర్ కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం ఆడిటోరియం కింది గదిలో నమోదు కార్యక్రమం జరిగింది. తెలుగు వికీపీడియన్లు అక్కడికి వెళ్లి, తమ పేర్లను నమోదు చేయించుకొని, సదస్సు కిట్ ను అందుకున్నారు. అక్కడినుండి మధ్యాహ్న భోజనానికి వెళ్లారు.

2 గంటలకు తెలుగు వికీపీడియన్లంతా ఒకచోట సమావేశమై పంజాబ్ ఎడిటథాన్ లో రాయబోయే వ్యాసాల గురించి చర్చించడం జరిగింది. పంజాబ్ లోని గ్రామ వ్యాసాల రచన గురించి విశ్వనాథ్, పవన్ సంతోష్ లు వివరించారు. పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా ఇప్పటివరకు రాసిన వ్యాసాలలో మరింత సమాచారాన్ని తెలుగు వికీపీడియన్లు చేర్చారు.

6గంటలకు సమావేశం ముగిసిన తరువాత భాస్కరనాయడు, గుళ్లపల్లి నాగేశ్వరరావు, పాలగిరి రామకృష్ణారెడ్డి, మురళీమోహన్, విశ్వనాధ్, కశ్యప్, ప్రణయ్, నిఖిల్, కార్తీక్ లు సిమ్లాకు బయలుదేరారు. అక్కడికి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. 10 గంటల వరకు అక్కడి ప్రదేశాలు చూసి, ఒక హోటల్ లో భోజనం చేశారు. 11 గంటలకు సిమ్లా నుండి బయలదేరి, 2 గంటలకు హోటల్ కి చేరుకున్నారు.

 
Viswanath giving training about AWB to Telugu Wikimedians in WCI2016

6వ తేది మార్చు

 
Kasyapp Presenting in WCI2016

ఉదయం 9 గంటలకు ఫలహారం పూర్తిచేసుకొని, చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీ చేరుకున్నారు. తెలుగు వికీపీడియన్లంతా కలిసి పవన్ సంతోష్, విశ్వనాథ్ ల ఆధ్వర్యంలో పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా పంజాబ్ లోని గ్రామ వ్యాసాలను సృష్టించారు.

1.30కి జరిగిన లంచ్ లో ఇతర భాషల వికీపీడియన్లను కలిసి వివిధ వికీ ప్రాజెక్టుల గురించి చర్చించారు. లంచ్ తరువాత కశ్యప్, ప్రణయ్ లు Taking better photographs సెషన్ కు హాజరయ్యారు. ఫోటోలను తీయడంపై మెళకువలు నేర్చుకున్నారు.

3 గంటలకు Working with the Media - Panel and workshop సెషన్ లో కొంకణి వికీపీడియన్ Fredericknoronha Ten tips on going to the media ప్రజెంటేషన్ ఇచ్చారు.

అనంతరం వివిధ మాధ్యమాల ద్వారా తెలుగు వికీపీడియాకు కల్పించిన ప్రచారం గురించి Local Media and Telugu Wikipedia ప్రజెంటేషన్ లో Kasyap, Pavan Santhosh వివరించారు. తరువాత ఒడియా వికీపీడియన్ సుభాశిష్ How to better tell your Wikimedia community story using media as a tool పై ప్రజెంటేషన్ ఇచ్చారు.

4 గంటలకు కంప్యూటర్ లాబ్ కి వచ్చి 8 గంటల వరకు పంజాబ్ ఎడిటథాన్ కార్యక్రమం పూర్తిచేశారు. డిన్నర్ చేసి హోటల్ కి చేరుకున్నారు.

7వ తేది మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.