వికీపీడియా:వికీపీడియా నిర్వాహకులకు రోషముందా

యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు
గూగుల్ యాంత్రికానువాదం ద్వారా వికీలో చేరిన వేలాది వ్యాసాలపై అనేక చర్చోపచర్చల తరువాత, వాటిని శుద్ధి చేసేందుకు అనేక విఫలయత్నాలు జరిగాక, చివరికి వాటిని తొలగించాలని సముదాయం నిశ్చయించింది. 2020 ఫిబ్రవరి 5 న ఆ వ్యాసాలన్నిటినీ తొలగించారు. ఆయా సందర్భాల్లో జరిగిన చర్చల వివరాలను కింది ట్యాబుల్లో చూడొచ్చు.
ప్రాజెక్టు | 2010 నవంబరు | 2016 జూలై | 2016 సెప్టెంబరు | 2016 డిసెంబరు | 2018 జూలై | 2020 జనవరి | ఇతర చర్చలు

గూగుల్ యాంత్రికానువాదాలపై 2010 నవంబరులో రచ్చబండలో జరిగిన చర్చ ఇది. దీన్ని ఉన్నదున్నట్లుగా తెచ్చి ఇక్కడ పెట్టాం.

వీకీ పీడియా తెలుగు నిర్వాహకులారా... మీకు రోషం ఉందా...

మార్చు

వీకీపీడియా తెలుగు నిర్వాహకులారా.. మీక రోషం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. మీరు వీకీపీడియా తెలుగు నిర్వాహకులు కావడానికి మీకున్న అర్హతల గురించి నేను ప్రశ్నిస్తున్నాను. రోజూ వీకీపీడియాలోకి ప్రవేశించడమా...??? లేక.. రోజువారీగా పనీపాట లేని ఉబుసుపోక చర్చల్లో మరింత చురుగ్గా పాల్గనడమా..????? అన్నాను అని కాదు... ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. తరతరాలకు ఉండేవిధంగా చక్కటి తెలుగు విజ్ఞానబాండాగరంగా వీకీపీడియాను తీర్చిదిద్దాలని.. మా ఆశ( కచ్చితంగా మీ ఆశ మాత్రం కాదు.. ) సంఖ్యాపరంగా పరిగెడుతున్నాం.. అని మీరు బాగా చంకలు కొట్టుకుంటున్నారు. తప్ప... ఒక్కసారి కళ్లు తెరిచి చూడండి ఒకడు.. బూతు బొమ్మలతొ ఆ0గ్ల భాష ఆర్టికల్స్‌ మన మీదకు డంప్‌ చేస్తాడు. మరొకడు.. రోజూ మరే పనిలేదంటూ తిథి పేర్లతో వందల సంఖ్యలో ఏకవాక్య ఆర్టికల్స్‌ సృష్టిస్తాడు. ఇక సినిమా పేరు, నటీనటుల పేర్లతో ఆర్టికల్‌ పూర్తవుతుంది.

ఇక గూగుల్‌ వారి సంగతి చెప్పనక్కరలేదు. స్వకార్యం, స్వామి కార్యం రెండూ నెరవేరినట్లు.. ఛారిటీ పేరిట.. గూగుల్‌ వికీపీడియా తెనుగీకరణ అంటూ.. అమెరికా సామాజ్య్రవాద భావజాలాన్ని భారతదేశం దశదిశలా వ్యాప్తి చెందేలా.. యాంత్రిక అనువాదాలు జరుపుకుంటే... గౌరవనీయులైన తెలుగు వీకీపీడియా నిర్వాహకులారా... గూగుల్‌ తెలుగు సంస్కృతి పై సాగుతున్న దండయాత్ర కనపడలేదా...???? 'ఇక గూగుల్‌ గోల ఒక్కటైతే.. యాంత్రిక అనువాదాలు చేసేవారి గోల మరొకటి.'

అస్సలు అది తెలుగేనా...????

మీరు ఒప్పుకుంటారో లేదో.. కానీ.. పట్టుమని పదోక్లాసు పాసుకాని వ్యక్తి కూడా.. అది తెలుగు కాదు.. తెలుగుకు పట్టిన తెగులు అని ఢంకా భజాయించి మరీ చెబుతాడు. ఈ విధంగా అప్రతిహాతంగా వీకీపీడియా తెలుగు తల్లిని దినమొక పరి వివస్త్రను చేస్తుంటే.. అవేమీ మీకు పట్టవు. గంధం తోటలో కలుపు మొక్క ఉండవచ్చు.. కానీ కలుపు తోటలో గంధం చెట్టు ఉందంటే కృతకంగా ఉంటుంది. చేవ లెని వారు మాత్రమే తమ తోటలో కలుపును దట్టంగా పెరగనిస్తారు. మన తెలుగు వీకీపీడియా పరిస్థితి అలానే ఉంది. తెలుగు వీకీపీడియా ఇప్పుడు ఒక పెద్ద కలుపుతోట. ఏం. తెలుగువారిమైన మనకు బెంగాలీలకు ఉన్న పౌరుషం లేదా.. తమిళలకున్న రోషం లేదా...? మనమేమైనా అర్థనారీశ్వరులమా... ? మనభాషను మనం కాపాడుకోలేమా..?? మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..????

కాపాడుకోగలం.. ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...

తమ భాషపై జరుగుతున్న దాడిని బెంగాలీ వీకీపీడియన్లు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. అసలకు తమ భాష స్థాయికి లేవంటూ.. బెంగాలీ వీకీపీడియా నిర్వాహకులు గూగుల్‌ వారు అనువదించిన వార్తలను మొత్తాన్ని పీకిపారేశారు. వారు మొనగాళ్లు.. వారిని అభినందించవలసిందే. మన పొరుగున ఉండే తమిళ సోదరులు సైతం.. గూగుల్‌ మెడలు వంచారు. ఏమంటారు.. మనం బెంగాలీల బాట ఒక్క వారం రోజులు పడితే చాలు.. యాంత్రిక అనువాదాల పేరిట వచ్చే కథనాలను డిలీట్‌ చేస్తే.. అప్పుడు గూగుల్‌వారికి బుద్ధి వస్తుంది. అలాగే సింగిల్‌ లైన్‌ వార్తలనూ డిలీట్‌ చేస్తాం అని చెప్పి.. నాలుగు రోజులు సమయం ఇవ్వండి. మూసలు పోస్తాం. లంకెలు పెడతాం... అనే పనులకు కాస్త విరామం ఇవ్వండి. ప్రపంచంలో ఎక్కడా లేని షోడశ కన్యల గురించి, జలసూత్రం వారి వంశవృక్షం గురించి.. మరో చెత్త గురించో ప్రతిపాదనలు ఆపండి.. లేదు మీరంతా బిజీగా ఉన్నామని చెబితే.. మాకు తోచిన విధంగా తెలుగువీకీపీడియాను సంస్కరిస్తాం..
ఇక్కడ వరకూ రాసిన సభ్యుడి కోసం ఇక్కడ నొక్కండి


  • అర్థనారీశ్వరుడు అంటే శివుడు అని అర్థం. ఆ పదాన్ని ఒకసారి సరిగా గమనించి ఉపయోగించి ఉండాల్సింది. నారి, ఈశ్వరుడు(శివుడు)..... అలాంటి పదాన్ని మీరు ఒక బూతుగా ప్రయోగించడం కేవలం తెలియనితనం అని భావించి ఆ వాక్యాలను ఖండిస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ, ఎక్కడా ఆ పదాన్ని బూతుగా వాడలేదు. స్త్రీ పురుషల సమానత్వాన్ని సూచించడానికి ఈ పదం వాడతారు. శివుడు తన శరీరంలో అర్థ భాగాన్ని తన భార్యకు ఇస్తాడని ఏదో పురాణగాధ(నాకూ సరిగా తెలీదు). మీరు ఆ పదం బదులు నపుంసకులు అన్న పదం వాడాల్సింది. కాకపోతే అటువంటి పరుషపదజాలం వాడకుండా ఉంటే మంచిది. ఇహ అసలు విషయానికి వస్తే , నేను నిర్వాహకుడిని కాదు కానీ మన తెలుగువారికి ఇప్పుడిప్పుడే కాస్త భాషాభిమానం, ఆత్మాభిమానం అలవడుతోంది. నెమ్మదిగా వాడుకరుల సంఖ్య పెరిగి మరింత మంచి వ్యాసాలు రూపొందుతాయని ఆశిద్దాం. వాడుకరుల సంఖ్య తక్కువున్నా చాలా మంచి వ్యాసాలు రూపొందాయి వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి. యాంత్రిక అనువాదాల గురించి ఇదివరకు కూడా చర్చ జరిగిందనుకుంట. వాటన్నిటినీ ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తున్నారు. వీలున్నప్పుడు నెమ్మదిగా వాటిని కూడా సంస్కరిస్తారు. మీరు బహుశా కొత్త వాడుకరి అనుకుంట. కొత్తలో ఇలాగే అన్నీ తప్పులే కనపడతాయి. సంస్కరించే పని మొదలుపెడితే దాని లోతు మీకు కూడా తెలుస్తుంది. ఏమీ పర్లేదు. మనలాంటి భాషాభిమానులు తోడ్పాటు అందిస్తూ ఉంటే తప్పక అభివృద్ధి కనపడుతుంది. ఇహ మీరు కూడా రంగంలోకి దిగండి. శుభమస్తు. --శశికాంత్ 11:49, 3 నవంబర్ 2010 (UTC)
    • నేను తెలుగు కాలెండర్ ప్రకారం ప్రతి రోజుకు ఒక పేజీ తయారుచేస్తున్నాను. ఇది స్వచ్ఛమైన తెలుగుతనానికి ఉదాహరణ. ఈ కాలెండర్ ప్రకారం ప్రతి రోజు వచ్చే పండగలను చేరుస్తాను. అందుకు కావలసిన పుస్తకాలు నా వద్ద ఉన్నాయి. ప్రముఖుల జీవితచరిత్రలు మీరెవరి దగ్గరైనా ఉంటే వారి పుట్టిన మరియు మరణించిన తిథుల్ని వీటిలో చేర్చమని మనవి. 1947కు ముందు బ్రిటిష్ వారు రాకపూర్వం తేదీలంటే ఈ తెలుగు కాలెండర్ ప్రకారం మాత్రమే చూసుకొనేవారు. ఇప్పుడు అవేమిటో కొందరికి తెలియదు.Rajasekhar1961 14:15, 3 నవంబర్ 2010 (UTC)
  • రాజశేఖర్ గారూ , మీ కృషి అభినందనీయం. నాకు ప్రస్తుతం వార్షిక పరీక్షలు ఉన్నాయి. పూర్తవ్వగానే నేనుకూడా ఇందులో పాలుపంచుకుంటాను. ఇందులో చారిత్రిక సంఘటనలు, వర్తమానంలో జరుగుతున్న విశేష సంఘటనలు కూడా చేరుద్దాం. ఆంగ్ల క్యాలండర్ కు ధీటుగా తయారుచేద్దాము. ఇప్పటికీ మనం నిత్యజీవితంలో చాలా శుభకార్యాలకు మరియు ఇతర పనులకు ముహూర్తాలు నిర్ణయించడానికి ఈ క్యాలండరే వాడుతున్నాం. కనుక ఈ కృషి వృధా కాదు. --శశికాంత్ 14:31, 3 నవంబర్ 2010 (UTC)
  • రాజశేఖర్ గారూ మీకృషి ప్రశంశనీయమైనది. నాకు తెలిసిన విషయాలు నేనూ చేరుస్తాను. --t.sujatha 16:42, 3 నవంబర్ 2010 (UTC)
యాంత్రిక అనువాద వ్యాసాలపై ఇది వరకు చాలా సార్లు చర్చ జరిగింది. ఆ వ్యాసాలు చాలా సభ్యులకు రుచించడం లేదు కూడా, కాని ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అలాంటి వ్యాసాల సంఖ్య వృద్ధి అవుతూనే ఉంది. కొత్త వ్యాసాలే కాదు ఎంతో కష్టపడి, ఎందరో సభ్యుల కృషి వల్ల చక్కగానే వృద్ధి చెందిన వ్యాసాలపై కూడా యాంత్రిక వ్యాసాలు ఓవర్‌టేక్ చేశారు. ఇదే విషయం నేను ఇదివరకు తెలియజేశాను. సభ్యులు ప్రతిస్పందించకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. తెవికీలో నిర్వాహకులు స్వయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోరు, ఏది చేసిననూ పాలసీలు, సంప్రదాయాల ప్రకారము కాని, ప్రజాస్వామ్య పద్దతిలో సభ్యుల అంగీకారం ప్రకారం కాని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది నిర్వాహకుల తప్పిదం అని చెప్పడం సరికాదు, సభ్యులందరూ దీనిలో భాగస్వామ్యులే. నిర్వాహకులకు మామూలు సభ్యుల కంటె అనుభవం ఉంటుంది, ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడంతో కొత్తసభ్యులకు తోడ్పడతారు. కొత్తగా చేరిన సభ్యుడైననూ, సంవత్సరాల అనుభవం ఉన్న నిర్వాహకుడైననూ ప్రస్తుతమున్న పాలసీల ప్రకారం ఓటింగ్ నిర్ణాయకంలో ఇద్దరూ సమానమే. కొత్త సభ్యులైననూ నిస్సందేహంగా ప్రస్తుత లోపాలను సరిదిద్దడానికి చర్చలు లేవదీయవచ్చు. మీరు యాంత్రిక వ్యాసాలు తదితర విషయాలపై చర్చ తీస్తే మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం నిర్వాహకులు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:00, 3 నవంబర్ 2010 (UTC)


ముందుగా శశికాంత్‌ గారికి ధన్యవాదాలు. నా ప్రతిపాదనపై చర్చ లేవదీసినందుకు... అయితే శశికాంత్‌ గారు మూల విషయాన్ని పక్కనబెట్టి.. అర్థనారీశ్వరులన్న పదంపై దృష్టి సారించి మీరు ప్రత్యుత్తరం ఇవ్వడం కోడిగ్డుపై ఈకలు పీకడం..లాంటిదే. మీరన్నట్లు.. మీరు సూచించిన పదాన్ని ఉపయోగిద్దాం. నో ప్రాబ్లమ్‌... అర్థనారీశ్వరుడున్నదన్ని బూతు అర్థం ధ్వనించే విధంగా నేను ఉపయోగించలేదు. ఇది పూర్తిగా మీ తెలియనితనం. అక్కడ చేతగాని వారు, లేదా ఏ పనిని పూర్తిగా చేయలేనివారని తెలియజెప్పే వ్యంగ్యప్రయోగం. ఇక ఆ పదం గురించి చర్చ కొనసాగిస్తే.. పుంఖానుపుంఖాలు రాయాల్సి ఉంటుంది. శశికాంత్‌గారు... మొత్తం నా ప్రతిపాదనలో భావం మీకు అర్థం అయి ఉంటుందని భావిస్తున్నాను. అపరిపక్వ అనువాద వ్యాసాలు, గూగుల్‌ చేస్తున్న సాంస్కృతిక దాడిని, అల్లరి చిల్లరగా ఒక్కొక్క వాక్యం రాసే వారిని ఏరిపారేయాలనేది నా ప్రతిపాదన.

ఇక వీకీపీడియాకు కొత్త వాడకరిని మీరు నా గురించి ప్రస్తావించారు. దీనికి కొలమానం ఏమిటండి..? వీకీపీడియలో రోజూ లాగిన్‌ అయితే పాత లేక పోతే కొత్తా... ??? లేక మరేదయినా ఉందా...?

ఇక చంద్రకాంతరావుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రకాంతరావు గారు.. మీరన్న విషయాలను కొన్నింటిని ఏకీభవిస్తాను. మరికొన్నింటితో విబేధిస్తాను. అనువాద వ్యాసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీరు పేర్కొన్నారు. గూగుల్‌ వారి అనువాద వ్యాసాలు ప్రారంభమై.. ఇప్పటికి 18 మాసాలు కావొస్తోంది. ఒక పక్క సాంస్కృతి దాడి.. మరో పక్క వ్యాపార దృక్పథంతో..అక్షరం అంటే తెలియని బీపీవోలు... కోట్ల రూపాయలు అర్జిస్తూ... (నిజంగానే ఈ అనువాదాలపేరిట కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి) తెలుగు వీకీపీడియాను కలుషితం చేస్తుంటే.. నిర్ణయం తీసుకోలేదంటున్నారు.. ఈ అలసత్వానికి కారణాలు ఏమిటో..??? సభ్యులు ప్రతిపాదించకపోవడంతో...నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతోందన్నారు. నేనూ సభ్యుడినే...( కాదంటారా.. దానికేమైనా ప్రమాణాలున్నాయా) ఇప్పుడు నేను ప్రతిపాదిస్తున్నాను. అనువాద వ్యాసాలు, ఏక వాక్య వ్యాసాలపై కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రకాంతరావుగారు.. దీనిపై చర్చను ముందుకు తీసుకెళ్లాల్సినదిగా అభ్యర్థిస్తున్నాను. అయితే రావుగారు.. మరో విషయం..

తెవికి నిర్వాహకుల నుంచి వచ్చే పడికట్టు సమాధానాన్ని ముందుగానే ఇక్కడ పొందుపరుస్తున్నాను. గతంలోనూ ఇదే విధమైన సమాధానాలు రావడంతో... వారికి ఆ సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా.. దానిపై మరో ప్రశ్నను సైతం లేవనెత్తుతున్నాను. వారి సమాధానం( ఊహించి...) అలాంటి అనువాద వ్యాసాలన్నింటిని.. యాంత్రిక అనువాదాల కింద పెడుతున్నాం. ఆసక్తికరమైన వారు వీటిని శుద్ధి చేసి.. వాటిపైన ఉన్న యాంత్రిక అనువాదాల మూసను తొలగించమని కోరుతున్నాం. వీలైనంత వరకు మాకు మట్టుకు మేము.. కొన్నింటిని సంస్కరిస్తున్నాం. ఎంత సిగ్గు చేటు... అవి యాంత్రిక అనువాదాలా...???? ఎవరైనా కొత్త వ్యక్తి చూస్తే.. నిజంగానే యంత్రాల ద్వారా వాటిని అనువదించారేమో అని అనుకుంటున్నారు. భావదారిద్య్రానికి పరాకాష్ట.. అది యాంత్రిక అనువాదం కాదు.. గూగుల్‌ వారు..కేవలం కాసులకు ఆశపడి.. నిర్లక్ష్యంగా.. తెంపరితనంతో.. వచ్చీరానీ తెలుగులో.... అడ్డూ అదుపు లేకుండా చేసిన అనువాదాలు.. అని పెట్టలేమా...? ఇక మనం ఎందుకు వాటిని శుద్ధి చేయాలండి.. చంద్రకాంతరావు గారు.. రుసుము తీసుకొని అనువదించే వారు మనలాంటి ఔత్సాహికులకన్నా.. మరింత బాధ్యతతో వాటిని అనువదించాలి. వారు పని జవాబుదారీగా ఉండేవిధంగా.. తెవికి నిర్వాహకులు వ్యవహరించాలి కదా.. ఆ బాధ్యత నెరవేర్చనప్పుడు నిర్వాహకులనే పదానికి అర్థం ఏమిటో..????

నేను ఎక్కువగా యాంత్రికానువాద వ్యాసాలు చదవలేదు. నేను చదివిన వ్యాసం డిబేట్ నాణ్యత బాగనే వుందనిపించింది. ఇటీవలి సమాచారం ప్రకారం గూగుల్ తమిళ వికీ సముదాయ విమర్శలకు స్పందిస్తోంది. వారికి వున్న పరిమితులకారణంగా, తమిళ వికీ సంప్రదింపులతో విధానాలను మెరుగు పరిచి ఆ తరువాత తెలుగు వికీ ప్రతినిధులతో చర్చలు జరుపుతామని చెప్పారు. మీరు దీనిలో పాల్గొనదలచుకుంటే మీ వివరాలు తెలియచేయండి. ఇకపై వికీపీడియా:గూగుల్_అనువాద_వ్యాసాలు ప్రాజెక్టు పేజీలో చర్చని కొనసాగించండి. ఇక మొలకలు గురించి వికీ సముదాయం లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది కొత్త వ్యాసాలకు ప్రేరణనిస్తాయని అంటుండగా, వికీ నాణ్యతని దెబ్బతీస్తాయని మరికొందరి వాదం. ప్రతీ వ్యాసం చిన్న వ్యాసం లేక మొలకగా ప్రారంభమై ఆ తరువాత కాలానుగుణ మార్పులు చెందుతూ మంచి వ్యాసంగా రూపుదిద్దుకుంటుందని తెలిసిన విషయమే కదా. ఒక వ్యక్తి మొలకలు మాత్రమే సృష్టించటం కాక, కొన్నిటినైనా విస్తరించటానికి పనిచేస్తుంటే వారిని ప్రోత్సహించడం అవసరం. ఏ నిర్ణయమైనా తీసుకోటానికి, అమలుచేయటానికి పరస్పర గౌరవంతో ప నిచేసే క్రియాశీల సముదాయం అవసరం. దానిని పెంచడానికి మీతోడ్పాటు ఇవ్వండి. -- అర్జున 05:51, 14 నవంబర్ 2010 (UTC)