వికీపీడియా:యాంత్రికానువాదాలపై మరో చర్చ

యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు
గూగుల్ యాంత్రికానువాదం ద్వారా వికీలో చేరిన వేలాది వ్యాసాలపై అనేక చర్చోపచర్చల తరువాత, వాటిని శుద్ధి చేసేందుకు అనేక విఫలయత్నాలు జరిగాక, చివరికి వాటిని తొలగించాలని సముదాయం నిశ్చయించింది. 2020 ఫిబ్రవరి 5 న ఆ వ్యాసాలన్నిటినీ తొలగించారు. ఆయా సందర్భాల్లో జరిగిన చర్చల వివరాలను కింది ట్యాబుల్లో చూడొచ్చు.
ప్రాజెక్టు | 2010 నవంబరు | 2016 జూలై | 2016 సెప్టెంబరు | 2016 డిసెంబరు | 2018 జూలై | 2020 జనవరి | ఇతర చర్చలు

గూగుల్ యాంత్రికానువాదాలపై 2016 డిసెంబరులో రచ్చబండలో జరిగిన చర్చను ఉన్నదున్నట్లుగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు ద్వారా తయారైన వ్యాసాల విషయమై మరో చర్చసవరించు

గూగుల్ అనువాదాల ద్వారా తయారైన వ్యాసాల విషయంలో గతంలో చర్చలు జరిగాయి. వాటిలో చాలావాటిని సంస్కరించలేం, తీసెయ్యాల్సిందే అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కానీ కొందరు సంస్కరించాలని అభిలషించారు. అంచేత ఆ వ్యాసాలు ఇంకా కొనసాగుతున్నాయి. చివరిసారి 5 నెలల కిందట జరిగిన చర్చలోనూ అదే జరిగింది. వాటిని సంస్కరిస్తామని కొందరు వాడుకరులు ముందుకు రావడంతో తొలగింపు నిర్ణయం అమలు కాలేదు. ఈ ఐదు నెలల కాలంలో సంస్కరణ దిశగా ముందడుగు పడిన దాఖలాలేమీ లేవు. (ఒకవేళ పడి ఉంటే నేను మిస్సయ్యుంటాను). వాడుకరి:Pavan santhosh.s గారు ముందుకు తెచ్చిన శుద్ధి ప్రణాళికలో కూడా వారు పాల్గొన్నట్లు కనిపించలేదు. తొలగింపు నిర్ణయాన్ని అమలు జరపడంపై సముదాయం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి, సంస్కరణ దిశగా తాము ఏమేం చేసారో, అద్యతనభావిలో తమ ప్రణాళిక ఏమిటో ఆ సభ్యులు ప్రకటిస్తే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఉంటుందని వినతి.__చదువరి (చర్చరచనలు) 08:32, 24 డిసెంబరు 2016 (UTC)

అలాంటి వ్యాసాలను తొలగించడమే మంచిది.ఎవ్వరికి అర్థం కాని వ్యాసాల వలన ఉపయోగం శూన్యం.అలాగే రసాయన విభాగానికి చెందిన మూలకాల వ్యాసాలు చాలా ఏక వాక్య వ్యాసాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి చేర్పులు లేకుండా.అటువంటి వాటిని తొలగిస్తే వాటి స్థానంలొ కొత వ్యాసాలు రాస్తా.Palagiri (చర్చ) 12:49, 24 డిసెంబరు 2016 (UTC)
వికీ శుద్ధి అనే దానికి ఏ రకమైన ప్రయత్నాలు చేసినా అవి ఎప్పుడూ ఆగుతూనే ఉంటాయి. కొత్త వ్యాసాల సృష్టి కంటే, ఉన్న వ్యాసాలు మెరుగుపరచడం, మొలక వ్యాసాలను అభివృద్ది చేయడం అత్యావశ్యం. ప్రస్తుతం రాసేదానికి గుర్తింపు రావాలనే, పొందాలనే భావన అధికంగా ఉంది. ఎప్పటికపుడు వీటిపై చర్చలు జరుగుతాయి, కొందరు సభ్యులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని వారికి తోడ్పాటు ఉండదు. కనుక ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావడం లేదు. సీనియర్ సభ్యులు ముందుకు వచ్చి ఈ వికీ ప్రక్షాళనకు కొన్ని ప్రణాళీకలు తయారు చేసి చర్చించి వాటిపై కృషి చేస్తే బావుంటుంది అని నా ఆలోచన..--Viswanadh (చర్చ) 02:52, 25 డిసెంబరు 2016 (UTC)
  • ఈ అంశాన్ని చర్చకు తెచ్చినందుకు చదువరి గారికి ధన్యవాదాలు. నేను రూపొందించిన ప్రణాళిక విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం చాలా ముదావహం. ప్రస్తుతం మొదటి విడతగా 116 వ్యాసాలను ప్రతిపాదిస్తూ ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నం ప్రారంభించాను. ఈ ప్రయత్నం ద్వారా తీసేయవలసిన వ్యాసాలను కానీ, అభివృద్ధి చేయాల్సిన వ్యాసాలను కానీ గుర్తించవ్చు. తద్వారా ఓ 70-90 వ్యాసాల భవిష్యత్తు తేల్చవచ్చు. తొలగించినా, అభివృద్ధి చేసినా నిర్దిష్టమైన పద్ధతి ద్వారా చేయాలన్న ఆలోచన వల్లే ఈ ప్రయత్నం తలకెత్తుకున్నాను. ఐతే ఇప్పటికి ఎన్నింటిని అభివృద్ధి చేశారన్నది మాత్రం మీనా గాయత్రి వంటి వారు చెప్తే బావుంటుంది. ఒకసారి మొదటి దఫా ప్రాధాన్య క్రమం నిర్దేశించుకున్నాకా, స్వల్పకాలిక ఎడిటథాన్ల ద్వారా అభివృద్ధి, తొలగింపు చేయవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:26, 27 డిసెంబరు 2016 (UTC)

ఈ ఏడాది 34 గూగుల్ అనువాద వ్యాసాలు అభివృద్ధి చేశాం. గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో 59 వ్యాసాలు ఉన్నాయి. వీటిలో 74 శాతం ఇటీవల అభివృద్ధి చేసినవే కావడం గమనార్హం. వ్యక్తిగత బిజీ, 100 వికీ డేస్ కారణంగా నాకు కొన్ని రోజులుగా ఈ వ్యాసాలు రాయడం కుదరట్లేదు. అయితే ప్రాధాన్యతా క్రమం నిర్ధారించడం వంటి కార్యకలాపాలు వల్ల ముఖ్యమైన వ్యాసాలు కష్టపడి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ పని వల్ల ఇంకా ఈజీగా వ్యాసాలు రాయచ్చు అని నా అభిప్రాయం. అందుకే ఈ ప్రాధాన్యతా గుర్తింపు, ఎడిటథాన్ లలో పాల్గొంటాను.--Meena gayathri.s (చర్చ) 09:30, 27 డిసెంబరు 2016 (UTC)

నేను ఎన్నోసార్లు గూగుల్ అనువాద వ్యాసాలని శుద్ధి చేద్దామని ప్రయత్నించి విఫలుడనయాను. వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వ్యాసాలు రాయడం తేలిక అని నా అభిప్రాయం. Vemurione (చర్చ) 21:36, 1 జనవరి 2017 (UTC)

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమ నిర్ధారణసవరించు

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమ నిర్ధారణకు ఇక్కడ ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిగా 116 వ్యాసాల ప్రాధాన్యత నిర్ధారిస్తున్నాం. డిసెంబరు 26న ప్రారంభించిన ఈ ప్రక్రియ జనవరి 2తో ముగియనుంది. 5గురు సభ్యులు చేయాల్సిన ఈ ప్రాధాన్యత క్రమ నిర్ధారణలో ఇప్పటికే చదువరి, మీనాగాయత్రి గార్లు తమను తాము నమోదు చేసుకుని, వారి ప్రాధాన్యతలు ఇచ్చేశారు. రాజశేఖర్ గారు నమోదు చేసుకున్నారు ఇంకా ప్రాధాన్యత ఇవ్వాల్సివుండగా, మరో ఇద్దరు నమోదు చేసుకుని ప్రాధాన్యతలు నిర్ధారించే అవకాశం ఉంది. ఐతే ఇది జనవరి 2తో ముగియనుంది కాబట్టి దయచేసి ఆసక్తి కలిగిన సభ్యులు ఇక్కడ నమోదు చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:42, 1 జనవరి 2017 (UTC)

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమం నిర్ధారణ కార్యక్రమం మొదటి దఫాలో ప్రాధాన్యతలు నిర్ధారించేందుకు నాతో కలిపి 5గురు పాల్గొన్నారు. పాల్గొన్నందుకు చదువరి, మీనాగాయత్రి, రాజశేఖర్, రవిచంద్ర గార్లకు ధన్యవాదాలు. ప్రస్తుతం గూగుల్ అనువాద వ్యాసాల మొదటి దఫా నిర్ధారణ పూర్తయింది. తీసేయాల్సిన వ్యాసాలు, ఉంచాల్సిన వ్యాసాలు చెరొకటీ 50కి అటూ ఇటూ రావడంతో 90కి పైగా వ్యాసాల భవితవ్యం తేలింది. వీటిపై తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేసేందుకు ఓ ఎడిటథాన్ రేపటి నుంచి పదిరోజుల పాటు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను. దయచేసి మీ స్పందనలు తెలియజేయగలరు. (పాల్గొనదలిచిన సభ్యులు వాక్యానికి వాక్యం సరిజేసుకునే కష్టతరమైన పద్ధతిలో చేయనక్కరలేదు, తేలిగ్గా వికీపీడియా ట్రాన్స్ లేషన్ టూల్ వాడి తేలిగ్గా అనువదించవచ్చు. వికీపీడియా ట్రాన్స్ లేషన్ టూల్ వాడకం ఎలాగో స్క్రీన్ కాప్చర్ వీడియో కూడా తీశాం, ఉపయోగించుకోగలరు). --పవన్ సంతోష్ (చర్చ) 10:20, 4 జనవరి 2017 (UTC)
నేను ప్రయాణాల్లో ఉండటం చేత, ఎక్కువ చెయ్యలేను. నాలుగింటిని మాత్రం ఎంచుకున్నాను, ఆ పేజీలో గుర్తు పెట్టాను.__చదువరి (చర్చరచనలు) 11:04, 4 జనవరి 2017 (UTC)