వికీపీడియా:గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల తొలగింపు-2016 జూలై

యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు
గూగుల్ యాంత్రికానువాదం ద్వారా వికీలో చేరిన వేలాది వ్యాసాలపై అనేక చర్చోపచర్చల తరువాత, వాటిని శుద్ధి చేసేందుకు అనేక విఫలయత్నాలు జరిగాక, చివరికి వాటిని తొలగించాలని సముదాయం నిశ్చయించింది. 2020 ఫిబ్రవరి 5 న ఆ వ్యాసాలన్నిటినీ తొలగించారు. ఆయా సందర్భాల్లో జరిగిన చర్చల వివరాలను కింది ట్యాబుల్లో చూడొచ్చు.
ప్రాజెక్టు | 2010 నవంబరు | 2016 జూలై | 2016 సెప్టెంబరు | 2016 డిసెంబరు | 2018 జూలై | 2020 జనవరి | ఇతర చర్చలు

యాంత్రికానువాదాలపై 2016 జూలైలో రచ్చబండలో జరిగిన చర్చను ఉన్నదున్నట్లుగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు ద్వారా తయారైన చెత్తను ఏం చెయ్యాలిసవరించు

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారానో మరో రకంగానో కొందరు భాషాంతకులు, పాపం ఒక ఒరిజినల్ వ్యాసాన్ని తీసుకుని, దాన్ని ఖండఖండాలుగా నరికి, పోగులు పెట్టి, అదే అనువాదమనుకునే భ్రాంతిలో పడి, ఆ పోగులను వ్యాసంగా భ్రమించి, దాని కో పేరు తగిలించి, తెవికీలో పారేసినట్లుగా తెలుస్తోంది (ఉదాహరణకు: వేల్ షార్క్).

ఈ శవాలకు పోస్టు మార్టమ్ చేసి ఎందుకు చచ్చిపోయాయో తేల్చాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. వాటికి ఏదైనా కాయకల్ప చికిత్స చేసి, మళ్ళీ బతికింపజెయ్యొచ్చనే ఆశ, దింపుడు కళ్ళెం ఆశ కంటే కూడా దురాశ, పేరాశ! కాబట్టి ఈ వ్యాసాలను (శవాలను) తక్షణమే తొలగించాలని (దహనం చెయ్యాలని) ప్రతిపాదిస్తున్నాను. తక్షణమే అని ఎందుకంటున్నానంటే, ఈ శవాలు తెవికీలో ఎన్నాళ్ళుంటే, అన్నాళ్ళపాటు మనందరినీ మూకుమ్మడిగా అవమానించినట్లే!__చదువరి (చర్చరచనలు) 08:33, 25 జూలై 2016 (UTC)

వివరణసవరించు

కింది సభ్యుల అభిప్రాయాలు చూసిన తరువాత చదువరి గారి ప్రతిపాదనకు నా అభిప్రాయాలు జోడిస్తే బాగుంటుందని ఇలా రాస్తున్నాను. అనువాద వ్యాసాలన్నీ తొలగిస్తే అందులో ఉన్న మంచి వ్యాసాలు కూడా పోగొట్టుకుంటాం కదా అన్న సభ్యుల అభిప్రాయం సమంజసంగా ఉంది. ఇక్కడ సమస్యల్లా అలాంటి వాటిని వెతికి పట్టుకోవడమే. ఇందులో ఉత్సాహం ఉన్న సభ్యులు దీన్ని ప్రాజెక్టులా భావించి వేరు చేస్తామనడం స్వాగతించదగ్గ నిర్ణయం. ఏవో కొన్ని మంచి వ్యాసాలు పోగొట్టుకుంటామని చాలా చెత్త వ్యాసాలు ఉంచడం సరికాదని నా అభిప్రాయం. ఇదివరకే శుద్ధి చేసిన వ్యాసాలకు మినహాయింపు ఇవ్వడానికి మార్గాలు ఆలోచిద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అనువాద వ్యాసాలు తొలగిస్తున్నామంటే వాటిని శాశ్వతంగా తొలగిస్తున్నామని కాదు. తొలగించిన తరువాత కూడా సభ్యులకిష్టమైన వ్యాసాలు ఎంపిక చేసుకుని పునస్థాపించుకుని వాటిమీద కృషి చేయవచ్చు. ఇది కొద్దికాలంలో పూర్తయ్యే పని కాదని సభ్యులందరికీ తెలుసు. తెవీకీలో పని చేసేవారు తమకిష్టమైన సమయంలో స్వేచ్ఛగా పని చేస్తారు కాబట్టి ఇది ఎప్పటికీ పూర్తి చేస్తారని సభ్యులను బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పని కోసం పసలేని వ్యాసాలు ఉంచడం లో అర్థం లేదు. --రవిచంద్ర (చర్చ) 15:51, 25 జూలై 2016 (UTC)

చక్కని చర్చ. సత్ఫలితాల వైపుకే దారి తీస్తోంది. ప్రస్తుతం కొద్ది ఆరోగ్యపరమైన ఇబ్బందితో నా చేతికి ఇంట్రావీనస్ ఇంజక్షన్ చేసే నీడిల్ క్యాప్ పెట్టారు. ఈ చేత్తో టైప్ చేయడానికి నొప్పితో పాటు చాలా సేపు పడుతోంది. ఉదయానికల్లా దీన్ని తీసేస్తారు కనుక చర్చలో ప్రధానంగా ముందుకు వచ్చిన(ట్టు నాకు అనిపిస్తున్న) ప్రాధాన్యత క్రమం నిర్ధారణ అన్నదానిపై ఓ చిత్తు ప్రణాళిక రూపొందించి చూపడానికి ఒక్క రోజు వ్యవధి ఇస్తే తయారుచేసి ప్రతిపాదిస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:49, 25 జూలై 2016 (UTC)
అందరికీ నమస్కారం.. నిన్న రాత్రి నేను చెప్పిన విధంగా ఓ చిత్తు ప్రణాళిక రూపొందించాను. పరిశీలించి చూడగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:35, 26 జూలై 2016 (UTC)

అంగీకారంసవరించు

  1. నేను ఇందుకు అంగీకరిస్తున్నాను. మనం ఎంత కృషి చేసినా కేవలం ఇటువంటి కొన్ని వ్యాసాల వల్ల తెలుగు వికీ నాణ్యత కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. సముదాయ నిర్ణయం అయితే ఆపరేషన్ స్వచ్ఛ వికీ చేపట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. --రవిచంద్ర (చర్చ) 11:48, 25 జూలై 2016 (UTC)
  2. ఈ వ్యాసాలను శుద్ధిచేసేకన్నా కొత్తగా రాసుకోవడం మంచిది. ఆ యాంత్రిక అనువాద వ్యాసాలను శుద్ధిచేయడం కూడా అతి కష్టంతో కూడుకున్నది. అనేక సంవత్సరాలనుండి ఉన్న ఆయా వ్యాసాల వల్ల వికీ నాణ్యత కోల్ఫోవడం తప్ప ఏ ప్రయోజనం లేదు. కొన్ని వ్యాసాలను శుద్ధి చేయగలిగాము. అన్ని వ్యాసాలను శుద్ధిచేయడం సాధ్యంకాని పని. కనుక తొలగించినా అభ్యంతరం లేదు.-- కె.వెంకటరమణచర్చ 12:13, 25 జూలై 2016 (UTC)
  3.   Support అంగీకరిస్తున్నాను. ఈ వ్యాసాల వల్ల లాభం అయితే ఏమీ లేదు.--రహ్మానుద్దీన్ (చర్చ) 14:08, 25 జూలై 2016 (UTC)
  4.   Support అంగీకారము. అయితే అన్నీ కాకుండా, అస్సలు శుద్ధికి పనికి రానివి ముందుగా తొలగించితే కొంత వరకు సమంజసము అని ఇదివరకు తెలియజేసాను. దశల వారీగా ఈ తొలగింపు కార్యక్రమము చేపడితే బావుంటుంది అని నా అభిప్రాయము మాత్రమే. (ప్రస్తుతము నేను శలవులో ఉన్నాను కనుక నా అభిప్రాయము తెలియజేయటములో అభ్యంతరము ఉండదని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇబ్బంది అయితే నా అభిప్రాయము తొలగించ వచ్చును.) JVRKPRASAD (చర్చ) 14:17, 25 జూలై 2016 (UTC)
  5. నాకు అంగీకారమే. ఏదైనా పని మొదలుపెట్టినా అది ఆరంభశూరత్వంగానే ఉంటుంది కనుక. మళ్ళీ వాటిని మెరుగు చేయగలగటం కష్టమైన పని. అలా అని వాటిలో మెరుగుపరచగల వ్యాసాలను విడదీయడం కూడా చాలా పెద్దపని. అలా విడదీయడానికి ఎవరైనా ముందుకొచ్చి, వాటిల్లో ఒక మూస ఉంచితే మిగతావి తొలగించవచ్చు.--Viswanadh (చర్చ) 14:40, 25 జూలై 2016 (UTC)
  6. ఒక్క వాక్యం కూడా అర్థంకాని ఇలాంటి క్రుళ్ళిపోయిన శవ వ్యాసాలు పాఠకుల పాలిట పిశాచులుగా మారి భయభ్రాంతులకు గురిచేసి పాఠకులను మళ్ళీ ఈ వైపు చూడనివ్వవని వేరే చెప్పనక్కరలేదు. వీటిని తెవికీలో ఉంచడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. వీటిని శుద్ధి చేయాలన్ననూ కొత్త వ్యాసం కంటే అధికశ్రమ అవుతుంది. కాబట్టి శుద్ధిచేయడానికి వీలుపడని ఇలాంటి వ్యాసాలను పూర్తిగా తొలిగించడమే ఉత్తమం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 25 జూలై 2016 (UTC)

తిరస్కారంసవరించు

  1. గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్టుపై ఇప్పటికే నేను పైలెట్ కృషి చేస్తున్నాను. నిజానికి ఈ జాబితాలో ఎన్నో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యాసాలున్నాయి. అలానే ప్రస్తుతం నేను వాడుతున్న కంటెంట్ ట్రన్స్లేషన్ టూల్ ప్రతి వాక్యాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కొత్త వ్యాసాన్నే తయారు చేసుకోవచ్చు. పైగా మనం ఇవాళ కొంత అనువాదం చేసి, దాన్ని సేవ్ చేయకపోయినా తరువాత ఆ పేజీ ఓపెన్ చేసుకుంటే డేటా పోకుండా వస్తుంది. ఇలాంటి అవకాశం ఉండగా చివరిగా ఓ గట్టి ప్రయత్నం చేయకుండా మొకుమ్మడిగా తొలగించడం మంచిది అనిపించట్లేదు. పైగా అనుభవజ్నులైన తెవికీ రచయితలు చురుగ్గా పాల్గొంటున్న ఈ సమయంలో ప్రణాళికాబద్ధమైన కృషి చేసి, వాటిని శుద్ధి చేయగలమని నమ్ముతున్నాను.--Meena gayathri.s (చర్చ) 12:39, 25 జూలై 2016 (UTC)
మొత్తం కొత్త వ్యాసాన్నే తయారు చేసుకోవచ్చు. అదే అందరూ చెబుతున్నది కూడా. కావాలంటే ఈ వ్యాసాల పేర్లు ఒక చోట చేర్చుకుని, ఆ వ్యాసాలు తొలగించేసి, మీ వేగానికి అనుగుణంగా రాసుకోవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:11, 25 జూలై 2016 (UTC)
  1. ఈ వ్యాసాలను తొలగించేబదులు వాటిని శుద్ది చేసి నాణ్యతను పెంచడానికి కృషి చేయవచ్చు. పరభాషా వ్యాసాలను తెవికీలో చేరుస్తూ ఆదరిస్తున్న మనము, ఉన్నవాటిని తొలగించకుండా వాటి శుద్దికై ఒక కార్యాచరణ ప్రణాళిక చేపట్టవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:33, 25 జూలై 2016 (UTC)

తటస్థంసవరించు

నేను వాటిని లోతుగా చూశాను. ఒక 1000 పెద్ద వ్యాసాలను శుద్ధిచేయడం చాలా పెద్ద పని. చేయగలిగితే మంచిదే. కానీ నా వరకు అది ఇంచుమించు అసాధ్యం. అలాగే అన్నింటిని మూకుమ్మడిగా తొలగించడం (తమిళ వికీపీడియాలో చేసినట్లుగా) నాకు నచ్చనిది. నేను వ్యక్తిగతంగా చూసిన మంచి వ్యాసాలు కొన్ని ఇందులో ఉన్నాయి. వాటిని గుర్తించి వేరుచేయడం మనం చేయాల్సిన మొదటి పని; అలాగే చదువరి గారు చూపించిన వ్యాసాల వంటివాటిని గుర్తించి పూర్తిగా తొలగించడం చేయవచ్చును. వ్యాసం ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని నా మనవి. నా యీ అభిప్రాయాలు క్లిష్టంగా ఉన్నా కూడా వెయ్యి పెద్ద వ్యాసాలను కోల్పోకూడదనే మీనా గాయత్రి, సుజాత గారితొ కలసి వీటిని ఒక ప్రాజెక్టు (వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి గా స్వీకరించి శుద్ధి చేస్తున్నాము. ఎవరైనా అసలు చెత్తగా ఉన్న వ్యాసాలను గుర్తిస్తే; వాటిని తొలగించడం కూడా ఇందులో భాగంగా నిర్వహిస్తాము. మొత్తం అన్ని వ్యాసాలను తొలగించడానికి నేను వ్యతిరేకం. అందరం కలసి ఒక ప్రణాలిక ప్రకారం పనిచేసి ఈ వ్యాసాలలో కొన్నింటిని బ్రతికించవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 14:29, 25 జూలై 2016 (UTC)

అభిప్రాయాలుసవరించు

20 రోజుల్లో 36వ్యాసాలు(వాటిల్లో అతిపెద్ద వ్యాసం సైజు 53 కెబిలు, ఒక్క మొలక వ్యాసం కూడా లేదు.)అనువాదం చేసాను. ఇది ఇంకా కొనసాగుతుంది. దీన్ని బట్టీ చూసినా, సుజాత గారి కాంట్రిబ్యూషన్స్ చూసినా తెవికీలోని మహిళా వికీపీడియన్లకు ఆరంభ శూరులు అన్న పేరు కరెక్ట్ కాదని తెలుస్తోంది. ఇంతకుముందే ప్రాధాన్యత గుర్తించమని అడిగాం. ఇప్పుడూ అదేమాట. ప్రాధాన్యత లేని, తెవికీ కి పనికిరాని వ్యాసాలను వేరు చేసి తీసేయడం కరక్టే. కానీ ఏ మాత్రం ప్రాధాన్యత ఉన్న వ్యాసమైన, అవి వందలాదిగా వచ్చినా కూడా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమే. ఈ వ్యాసాల్లో అమితాబ్ బచ్చన్, సోనియా గాంధీ, ముకేష్ అంబానీ, సానీయా మీర్జా వంటి అతిముఖ్యమైన వ్యాసాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోగల సామర్ధ్యంతోనీ మనం ఉన్నాం. కాబట్టి అలోచించి సభ్యులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నా మాటలతో ఎవరినైనా హర్ట్ చేస్తే సారీ.--Meena gayathri.s (చర్చ) 15:48, 25 జూలై 2016 (UTC)

మీనా గాయత్రి గారూ, మీరు శుద్ధి చేసినవి, తిరగరాసినవి ఈ లెక్కలోకి రావండీ. వాటి గురించి మీకేమీ భయం అక్కర్లేదు. ఇక్కడ ఆలోచిస్తున్నది ఏ సభ్యులూ చాలా కాలంగా పట్టించుకోకుండా అలా పడి ఉన్న వ్యాసాల గురించి. మీరు ఇప్పుడు రాస్తున్నవే కాక రాయబోయే వ్యాసాల జాబితాను తయారు చేసుకుని వాటిని మీరు అభివృద్ధి చేస్తారంటే దానిని స్వాగతించే వారు తప్ప వ్యతిరేకించే వారుండరు. --రవిచంద్ర (చర్చ) 15:55, 25 జూలై 2016 (UTC)
ఇంతకుముందే అభివృద్ధి చేసిన వ్యాసాలను తెవికీలో తొలగించరని నాకూ తెలుసండీ. పైన నేను మాత్రమే అనువాదం చేసిన వ్యాసాల పేర్లు ఉదహరించడంతో మీరు ఇలా భావించారనుకుంటా. నేను చెప్పేది ప్రాధాన్యత ఉన్న శుద్ధి చేయాల్సిన వ్యాసాల గురించే.--Meena gayathri.s (చర్చ) 05:02, 26 జూలై 2016 (UTC)

అట్నుంచి కొట్టుకురండిసవరించు

సత్యం శంకరమంచి రాసిన "అమరావతి కథల్లో" ఒక కథుంటుంది అట్నుంచి కొట్టుకురండి అని. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలనాకాలంలో అడవిలో దారిదోపిడీ దారుల తెగ మితిమీరి దారుణాలు చేస్తోంది. వారిని ఆపడానికి నాయుడు వారి జాతి నాయకుణ్ణి పిలిపిస్తాడు. చిన్న కూనల తప్పు కాయమని వేడిన నాయకుడి మాటలు మన్నించి, వారందరినీ సైన్యంలో చేర్చుకుని, గౌరవమైన జీవితం కల్పిస్తాడు. కానీ అరచకాలు చేయడానికి అలవాటు పడినవారు అడవిలో చేసే దారుణాలు రాజ్యంలో మొదలెడతారు. సొంత బిడ్డల్లా కాపాడుతున్న ప్రజకు వీరు కలిగించే కష్టనష్టాలను ఓర్చికోలేక, మాయోపాయంతో వారిని విందుకు పిలిపించి, చివర్లో మీ తప్పులెన్నిటినో కాశాను ఇకమీకు నూకలు చెల్లినయ్ అంటూ అందరినీ వరసలో నించోపెట్టి ఒకే సారి అందర్నీ నరికేయబోతాడు. ఈలోపు జాతి నాయకుడు దొరా చంపేది ఉంటే చంపేయండి, కానీ అటునుంచీ కొట్టుకురండి అని ప్రాధేయపడతాడు. ఈ లోపు జాలి కలిగి దొర ఈ హత్యాకాండ ఆపమంటాడన్న ఆశతో.

ఇప్పుడు కూడా అట్నుంచే కొట్టుకు రమ్మంటున్నా. తెవికీకి ప్రాధాన్యత లేని వ్యాసాలను కొట్టుకురండి. ఇట్నుంచీ ప్రాధాన్యత కలిగిన వ్యాసాలను అభివృద్ధి చేసుకుంటూ వద్దాం. పైన కథలో నాయుడుగారు దోపిడీదారుల తలలన్నీ కొట్టేసినట్టుగా, తెవికీలో అవకతవకల అనువాద వ్యాసాలను-ప్రాధాన్యత ఉన్నవాటిని అభివృద్ధి చేసుకుని, లేనివాటిని తొలగించుకుని శేషం లేకుండా వదిలించుకుందాం. --Meena gayathri.s (చర్చ) 04:59, 26 జూలై 2016 (UTC)