వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి

మండల పేజీల ప్రాజెక్టు దశ 1

మార్చు

అవిభాజిత ఆంధ్రప్రదేశ్ కాలపు ప్రాజెక్టు కొరకు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు చూడండి.

మండల పేజీల ప్రాజెక్టు దశ 2

మార్చు

ప్రస్తుతస్థితి

మార్చు

మండలానికి, మండల కేంద్రానికీ విడివిడిగా పేజీలను తయారు చెయ్యాలనే పనిలో ఇప్పటికి కొంత పని అయింది. మూడోవంతు పేజీలు తయారయ్యాయి. ఇంకా తయారు చెయ్యాల్సిన పేజీల జాబితా ఉంది.

పని పద్ధతి

మార్చు

ఈ విభాగంలో చెయ్యాల్సిన పనులు ఇవి:

  1. మండల కేంద్రానికి పేజీ ఈసరికే ఉంది. ఇప్పుడూ మండలానికి కొత్త పేజీని తయారు చెయ్యాలి. ఉదా: రణస్థలం అనే గ్రామం/మండల కేంద్రానికి పేజీ ఉంది. ఇప్పుడు రణస్థలం మండలం అనే కొత్త పేజీని సృష్టించాలి.
  2. రణస్థలం పేజీలో ఆ గ్రామానికి చెందిన సమాచారాన్ని మాత్రమే ఉంచి, మండల సమాచారాన్ని తీసివెయ్యాలి.
  3. తీసివేసిన ఈ మండల సమాచారాన్ని కొత్త పేజీలోకి చేర్చాలి.
  4. తరలించాల్సిన సమాచారం: తొలి వాక్యం, మండలం లోని గ్రామాలు విభాగం, మండల గణాంకాలు విభాగం వగైరాలు.
  5. గ్రామం సమాచారపెట్టెను ఆ పేజీలోనే ఉంచేసి, మండల సమాచారపెట్టెను కొత్త పేజీకి తరలించాలి.
  6. మండలంలోని గ్రామాలు మూసను గ్రామం పేజీ లోనే ఉంచెయ్యాలి.
  7. ఫలానా జిల్లా లోని మండలాలు అనే మూసను తీసివేసి, కొత్త పేజీలోకి తరలించాలి.
  8. వర్గాలకు చెయ్యాల్సిన మార్పులేమీ లేవు. (మూసలు మార్చినపుడు వర్గాలు వాటంతటవే తగినట్లుగా మారిపోతాయి.)
  9. రెండు పేజీలను భద్రపరచాలి.
  10. ఆ తరువాత మండలంలోని గ్రామాలు మూసలో కింది సవరణ చెయ్యాలి.
*title లో ఫలానా మండలం లోని గ్రామాలు అనే చోట కొత్త మండలం పేజీకి లింకు ఇవ్వాలి.
* మండలంలోని గ్రామాలు మూసలో గ్రామాలకు మండల వ్యాసం లింకు ఇవ్యాలి.
  1. జిల్లాలోని మండలాలు అనే మూసలో పాత మండలం లింకు స్థానే, కొత్త లింకును చేర్చాలి. ఈ పని ఎప్పటికప్పుడు చెయ్యవచ్చు. కొన్ని మండలాల పనయ్యాక వాటన్నిటికీ ఒక్కసారే చెయ్యవచ్చు. లేదా, జిల్లాలోని అన్ని మండలాలూ అయిపోయాక ఒక్కసారే చేర్చవచ్చును కూడా.
  2. ఆసక్తి ఉంటే, ఈ కొత్త పేజీకి, వికీడేటాలో ఈ సరికే తయారై ఉన్న పేజీకి లింకు ఇవ్వండి.

జాబితా ను చూసి అందులోని పేజీలను తయారుచేసాక, చివరి పంక్తిలో అయిపోయింది అని రాయండి.

కాల పరిధి

మార్చు

2009-01-05 నుండి. 2009-07-20 (చదువరి గారు ప్రాజెక్టు నుండి విరమించిన తేదీవరకు)

పాల్గొన్నవారు

మార్చు
  1. చదువరి (చర్చరచనలు) - అనంతపురం జిల్లా

సమీక్ష

మార్చు

<చేయాలి>

మండల పేజీల ప్రాజెక్టు దశ 3

మార్చు

<ప్రారంభించాలి>