వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు

వ్యక్తుల పేజీలకు ఉండే ప్రత్యేకతల్లో రెండు వారి జనన, మరణాల తేదీలు. ఈ రెండు వివరాలను వ్యక్తి పేజీ లోను, తత్సంబంధిత ఇతర పేజీల్లోనూ నమోదు చెయ్యడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం

ఏం చెయ్యాలి

మార్చు

ప్రతీ వ్యక్తి పేజీ లోను జనన తేదీ తప్పనిసరిగా ఉండాల్సిన అంశం. మరణించిన వ్యక్తులకైతే మరణ తేదీ కూడా తప్పనిసరి అంశమే. వ్యక్తి పేజీలో ఈ తేదీలు కింది చోట్ల నమోదవుతాయి:

పేజీ పాఠ్యంలో

మార్చు

1. వ్యాసం ప్రవేశికలో పేరు రాగానే పక్కనే బ్రాకెట్లోజనన తేదీ మరణ తేదీ వస్తాయి. ఉదా: ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). 2. జీవిత విశేషాలు, మరణం వంటి విభాగాల్లో మళ్ళీ జనన మరణ వివరాలు వస్తాయి 3. సమాచారపెట్టెలో మళ్ళీ ఈ వివరాలు వస్తాయి.

పేజీ వర్గాల్లో

మార్చు

ఇవన్నీ వ్యక్తి పేజీలో చేర్చాక, ఈ పేజీలో చేర్చాల్సిన అనుబంధ అంశాలు రెండున్నాయి. అవి: 1. జననాలు వర్గం లోకి ఈ పేజీని చేర్చడం. ఉదా: శ్రీశ్రీ పేజీని "1910 జననాలు" అనే వర్గం లోకి చేర్చాం 2. మరణాలు వర్గం లోకి ఈ పేజీని చేర్చడం ఉదా: శ్రీశ్రీ పేజీని "1983 మరణాలు" అనే వర్గం లోకి చేర్చాం

ఇతరపేజీల్లో

మార్చు

ఈ వివరాలను ఆ వ్యక్తికి సంబంధించిన పేజీలోనే కాకుండా, కింది పేజీల్లో కూడా నమోదు చెయ్యాలి:

 1. జనన సంవత్సరం పేజీలో. ఉదా: శ్రీశ్రీ జనన వివరాలను 1910 పేజీలో చేర్చాలి
 2. జనన తేదీ పేజీలో. ఉదా: శ్రీశ్రీ జనన వివరాలను ఏప్రిల్ 30 పేజీలో చేర్చాలి
 3. మరణ సంవత్సరం పేజీలో. ఉదా: శ్రీశ్రీ మరణ వివరాలను 1983 పేజీలో చేర్చాలి
 4. మరణ తేదీ పేజీలో. ఉదా: శ్రీశ్రీ మరణ వివరాలను జూన్ 15 పేజీలో చేర్చాలి

పై మూడు చోట్లా జనన మరణ వివరాలను చేర్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. వ్యక్తి ప్రాముఖ్యతను బట్టి ఈ అంశాలను మొదటి పేజీలో వచ్చే "చరిత్రలో ఈ రోజు" పేజీలో కూడా ప్రదర్శిస్తారు. అయితే ఈ అంశం ఈ ప్రాజెక్టులో పరిధిలో లేదు.

ఎలా చెయ్యడం

మార్చు
 1. పేజీ తెరవాలి
 2. పేజీ పాఠ్యంలో జనన మరణాలు ఉన్నాయో లేదో చూడాలి. ఉంటే సరి.., రెండు వివరాలూ లేకపోతే ఇక ఆ పేజీలో చేసే పనేమీ లేదు. ఉదా: నన్నయ్య పేజీలో ఈ రెండు వివరాలూ లేవు. ప్రస్తుతానికి వీటిని వదిలేద్దాం. (ఈ పేజీని 11 వ శతాబ్దపు వ్యక్తులు అని వర్గీకరించవచ్చు. అది తరువాత పరిశీలిద్దాం)
 3. ఈ రెంటిలో రెండూ ఉన్నా, ఒక్క వివరమే ఉన్నా సరే, పేజీలో సంబంధిత వర్గాలు/వర్గం ఉందో లేదో చూడండి. లేకపోతే చేర్చండి. ఉదా: జననం 1910 ఏప్రిల్ 30 అని, మరణం 1983 జూన్ 15 అని ఉందనుకుందాం. అ పేజీని వర్గం:1910 జననాలు, వర్గం:1983 మరణాలు అనే వర్గాల్లోకి చేర్చాలి. ఆ వర్గాలు ఈసరికే ఉంటే సరే, లేకపోతే చేర్చండి.
 4. సమాచారపెట్టె ఉంటే ఈ రెండు వివరాలు అందులో ఉన్నాయో లేవో చూడండి. లేకపోతే చేర్చండి. అసలు సమాచారపెట్టే లేకపోతే వదిలెయ్యండి, చెయ్యాల్సిందేమీ లేదు.

తరువాత

 1. జనన సంవత్సర పేజీ - 1910 తెరవండి
 2. అందులో "జననాలు" విభాగంలో సరైన చోట "ఏప్రిల్ 30: శ్రీశ్రీ, తెలుగు కవి (మ. 1983)" అని రాసి పేజీని ప్రచురించండి. వాక్యం ఈ ఆకృతి లోనే ఉండాలి.
 3. జనన తేదీ పేజీ - ఏప్రిల్ 30 తెరవండి
 4. అందులో "జననాలు" విభాగంలో సరైన చోట "1910: శ్రీశ్రీ, తెలుగు కవి (మ. 1983)" అని రాసి పేజీని ప్రచురించండి. వాక్యం ఆకృతిని పాటించాలి.
 5. మరణ సంవత్సర పేజీ - 1983 తెరవండి
 6. అందులో "మరణాలు" విభాగంలో సరైన చోట "జూన్ 15: శ్రీశ్రీ, తెలుగు కవి (జ. 1910)" అని రాసి పేజీని ప్రచురించండి. వాక్యం ఆకృతిని పాటించాలి.
 7. మరణ తేదీ పేజీ - జూన్ 15 తెరవండి
 8. అందులో "మరణాలు" విభాగంలో సరైన చోట "1983: శ్రీశ్రీ, తెలుగు కవి (జ. 1910)" అని రాసి పేజీని ప్రచురించండి. వాక్యం ఆకృతిని పాటించాలి.

ఆవశ్యకమైన వనరులు

మార్చు

ఇది యాంత్రికంగా చేసే పనే కాబట్టి ప్రత్యేకించి వనరులు అవసరం లేదు. పరిశోధనలు చెయ్యాల్సిన అవసరం గాని, సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం గానీ లేదు. ఉన్న సమాచారాన్ని వివిధ పేజీల్లో చేర్చడమే. సమాచారం లేని పేజీలను వదిలెయ్యడమే తప్ప ఆ సమాచారాన్ని సేకరించడం ఈ ప్రాజెక్టు పరిధిలో లేదు.

పని పరిమాణం

మార్చు

వివిధ వర్గాల్లోని సమాచారాన్ని పరిశీలించి చూస్తే మొత్తం వ్యక్తుల పేజీలు 6,000 పైచిలుకు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వర్గీకరణలో దోషాల కారణంగా కొన్ని సంబంధం లేని పేజీలు ఉండే అవకాశం ఉంది. వాటిలో సుమారు 200 పేజీల్లో మరణాలు వర్గం మాత్రమే ఉంది, జనన వర్గం లేదు. మరో 2400 పేజీల్లో జనన వర్గం మాత్రమే ఉంది, మరణ వర్గం లేదు. దీనికి ప్రధాన కారణం అవి జీవించి ఉన్న వ్యక్తుల పేజీలు అయి ఉండవచ్చు. (అలాంటి వాటికి సంబంధించి జనన సంవత్సరం, తేదీ పేజీల పని చూడాలి.). మిగతా వాటికి మరణ వర్గం చేర్చాలి. ఇంకో 2500 పేజీల్లో జననం, మరణం రెండూ వర్గాలూ లేవు. వాటిలో పైన చెప్పిన పనులన్నీ చెయ్యాలి. (ఈ పేజిల్లో కొన్ని అసలు వ్యక్తుల పేజీలే కావు. వర్గీకరణ దోషం కారణంగా అవి వ్యక్తుల వర్గాల్లోకి చేరాయి. అలాంటి పేజీలను సదరు వర్గం లోంచి తీసేసి ముందుకు సాగిపోవడమే.)

ఈ పనులన్నీ చెయ్యడానికి మొత్తమ్మీద పది పన్నెండు వేల పైచిలుకు దిద్దుబాట్లు అవసరం కావచ్చు.

పేజీల జాబితా

మార్చు

పేజీల జాబితాలు కింది పేజీల్లో ఉన్నాయి

కాలావధి

మార్చు

ప్రత్యేకంగా ఇంత సమయంలో ఇంత ప్రాజెక్టు పని చెయ్యాలని కాలావధి ఏమీ పెట్టలేదు. వాడుకరులు తమతమ ఆసక్తుల మేరకు తమతమ లక్ష్యాలను నిర్దేశించుకుని పని చెయ్యవచ్చు.

ప్రాజెక్టులో పాల్గొనే సభ్యులు

మార్చు
 1. చదువరి (చర్చరచనలు)
 2. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 04:32, 21 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
 3. --Rajasekhar1961 (చర్చ) 11:18, 21 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]