వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా బోధన, ప్రచార వీడియో వనరులు

తెలుగు వికీపీడియా గురించి తెలుసుకునేందుకు ఉపకరించే బోధన, ప్రచార వీడియో వనరులు తయారుచేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు వికీపీడియా గురించి ప్రచారం చేసే వీడియోలు, బోధించే వీడియోలు వనరులుగా అభివృద్ధి చేయడం, దానికి సమన్వయం చేయడం దీని లక్ష్యం.

సంబంధిత చర్చ

మార్చు
  • 2015లో తెలుగు వికీపీడియన్లు రాజశేఖర్, ప్రణయ్ రాజ్ తదితరులను సీఐఎస్ ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్. యు.బి.పవనజ కలిసి వనరుల విషయంలో తెలుగు వికీపీడియన్లకు ఏం కావాలని అడిగారు. ఆ క్రమంలో తెవికీపీడియన్లు కోరినవాటిలో వీడియోపాఠాలను తెలుగులో తీయాలన్నది కూడా ఉంది. ఆపైన జరిగిన చర్చలో సీఐఎస్ ఎ2కె వారు హిందీ తదితర భాషల్లో తీసిన వికీపీడియా వీడియో ట్యుటోరియల్స్ గురించి తెలియజేసి ఆ పద్ధతిలోనే తెలుగు వికీపీడియాకు కూడా వీడియోపాఠాలు తయారుచేద్దామన్న ప్రతిపాదన తీసుకువచ్చారు. సమావేశమైన తెలుగు వికీపీడియన్లు అందుకు సంతోషించి అంగీకరించడమే కాక తర్వాత నిర్వహించిన పలు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి చర్చించుకున్నారు, రచ్చబండలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
  • 2017 ప్రారంభంలో తెలుగు వికీపీడియా రచ్చబండలో చర్చ జరిగింది. తద్వారా స్క్రీన్ కాప్చర్ వీడియోల ద్వారా ఈ కృషి చేయాలని చర్చించడం జరిగింది.

జరిగిన కృషి

మార్చు

ఈ పాఠాల రూపకల్పనలో జరగాల్సిన కృషి

  1. ఆంగ్లంలోని వీడియో పాఠాల స్క్రిప్టు తెలుగులోకి అనువదించుకోవడం. అవసరమైన చోట తెలుగు ఉదాహరణలు చొప్పించడం - ఈ ప్రాజెక్టుపై పనిచేసేందుకు తెలుగు వికీపీడియన్లు సుజాత, ప్రణయ్ రాజ్, రాజశేఖర్ ముందుకువచ్చారు. వారిలో సుజాత అనువాదం చేసే పనిని నిర్వహిస్తున్నారు. ప్రణయ్ రాజ్ ఆ పాఠాల్లోని డైలాగులను అవసరమైనచోట వాడుకభాషలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కృషికి సంబంధించిన పాఠాలను ఇక్కడ గూగుల్ డాక్యుమెంట్లో పెట్టారు.

ప్రస్తుత ప్రయత్నాలు

మార్చు

ప్రధాన పేజీ: వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా బోధన, ప్రచార వీడియో వనరులు/వీడియో వనరుల తయారీ - 2017

పాల్గొనే సభ్యులు

మార్చు
  1. JVRKPRASAD (చర్చ) 03:49, 25 నవంబర్ 2015 (UTC)
  2. --Pranayraj1985 (చర్చ) 04:56, 25 నవంబర్ 2015 (UTC)
  3. శశి (చర్చ) 16:54, 14 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

<పైన మీ పేరు రాసి పక్కన బైస్టాంపుతో సంతకం చేయగలరు>

ప్రణాళికకు అవసరమైన లింకులు

మార్చు

చేయాల్సిన పనులు

మార్చు
చేయాల్సిన పని బాధ్యత వహించే వికీ సభ్యులు సలహాలు/సూచనలు