వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/అన్నా విశ్వవిద్యాలయం

అన్నా విశ్వవిద్యాలయం
అన్నా వర్శిటీ
నినాదంనాయకత్వం రూపకల్పన
రకంప్రభుత్వ
స్థాపితం1978
మాతృ సంస్థ
అన్న యూనివర్సిటీ  
బడ్జెట్ప్రభుత్వ నిధులు
చిరునామమద్రాసు, మద్రాసు, తమిళనాడు, 600025, ఇండియా

అన్నా విశ్వవిద్యాలయం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉన్న ఒక విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం ఎన్.ఐ.ఆర్.ఎఫ్ 2020 ర్యాంకింగ్ ప్రకారం 12వ స్థానంలో ఉంది . టిఎన్‌పిసిఇఇ, గేట్ పరీక్షల ద్వారా ఇందులో ప్రవేశం కల్పిస్తారు.[1]

కోర్సులు మార్చు

ఇక్కడ వివిధ వ్యవధుల్లో నిర్వహించే యూజీ, పీజీ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు, ఐదు, ఆరు సంవత్సరాల వ్యవధి కలిగిన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములు, రెండు, మూడు సంవత్సరాల వ్యవధి కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి.[2] ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక ఫీజు రాయితీ ఇస్తారు. 2018 - 2019 సమాచారం ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం నాలుగు సంవత్సరముల కోర్సులలో 10420 విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 6158 మంది అబ్బాయిలు , 4262 మంది అమ్మాయిలు ఉన్నారు. 2018-2019 సంవత్సర సమాచారం ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఐదు సంవత్సరముల ఇంజనీరింగ్ కోర్సులలో 531 విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 175 మంది అబ్బాయిలు , 356 మంది అమ్మాయిలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల కోర్సులలో 3271 విద్యార్థులు చదువుతుండగా, ఇందులో 1560 మంది అబ్బాయిలు, 1711 మంది అమ్మాయిలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం మూడు సంవత్సరముల కోర్సులలో 297 విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 181 మంది అబ్బాయిలు,116 మంది అమ్మాయిలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఇంటిగ్రేటెడ్ కోర్సులలో 447 విద్యార్థులలో 212 మంది అబ్బాయిలు, 235 మంది అమ్మాయిలు. ప్రతి కోర్సులలో అమ్మాయిల, అబ్బాయిల నిష్పత్తి సుమారు 1:2 ఉన్నారు. విశ్వవిద్యాలయములో మొత్తం కంటే 1870 పి హెచ్ డి చేస్తుండగా అందులో 779 మంది పార్ట్ టైం విద్యార్థులు ఉన్నారు .

ఉద్యోగ నియామకాలు - ఉన్నత చదువులు మార్చు

2018-2019 సంవత్సరం లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం నాలుగు సంవత్సరముల కోర్సులలో వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 5.0 లక్షలు. ఉద్యోగ నియామకాలకి పోటీపడే విద్యార్థులలో 51% సఫలం అయ్యారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల కోర్సులలో వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 1.8లక్షలు. ఉద్యోగ నియామకాలకి పోటీపడే విద్యార్థులలో 24% సఫలం అయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల కోర్సులలో వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 4.16లక్షలు , మూడు సంవత్సరముల కోర్సులలో వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 4.4 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల కోర్సులలో 34 శాతం మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం మూడు సంవత్సరముల కోర్సులలో 56శాతం మంది ఉద్యోగం సంపాదించడంలో సఫలీకృతులు అయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఇంటిగ్రేటెడ్ సంవత్సరము వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 4.0లక్షలు ,42 శాతం మంది ఉద్యోగం సంపాదించడం లో సఫలీకృతులు అయ్యారు. 2018-2019 సంవత్సరం లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల విద్యార్థులలో 4 శాతం,అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల విద్యార్థులలో 8 శాతం,పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల విద్యార్థులలో 2 శాతం మంది ఉన్నత చదువులకు వెళ్లారు.

వ్యయం మార్చు

విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల వార్షిక వేతనాలు బయటి కాలేజీలకంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి. 2018-19 సంవత్సరములో అధ్యాపకుల, మిగతా కార్యాలయ ాలయ సిబ్బంది వేతనాలకై 215.16కోట్లు ఖర్చు చేశారు . విశ్వవిద్యాలయంలో వర్క్‌షాప్‌లు, సెమినార్లు, పరిశోధనా సమావేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీటి నిర్వహణ కోసం 2018-19 సంవత్సరములో 1.81కోట్లు ఖర్చు పెట్టారు. గ్రంథాలయాన్ని, ప్రయోగశాలలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉంటారు, వీటి కొరకై 2018-19 సంవత్సరములో 4.24కోట్లు ఖర్చు పెట్టారు.


వికలాంగులకు సౌకర్యాలు మార్చు

విశ్వవిద్యాలయములో శారీరక వికలాంగులకు సహాయపడే సౌకర్యాలు కలవు. 80 శాతం కంటే ఎక్కువ భవనాలలో ఎలివేటర్లు ,ర్యాంప్‌లు ఉన్నాయి. వికలాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు 80 శాతంకి పైగా భవనాలలో కలవు. ఒక భవనం నుండి మరో భవనానికి వెళ్ళడానికి వీల్ చైర్ వంటి వసతులు ఉన్నాయి.

మూలాలు మార్చు

https://www.nirfindia.org/nirfpdfcdn/2020/pdf/University/IR-O-U-0439.pdf

  1. "Home - Anna University". www.annauniv.edu. Retrieved 2021-06-21.
  2. "కోర్సులు". annauniv.edu. Retrieved 2021-06-21.{{cite web}}: CS1 maint: url-status (link)