వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణం

తెవికీ
మహిళావరణం

తెలుగు వికీపీడియాలో మహిళా వికీపీడియన్ల సంఖ్య, భాగస్వామ్యం పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. పలు అధ్యయనాల్లో, ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాలో రాస్తున్నవారిలో దాదాపు 8.5 నుంచి 16 శాతం వరకూ మాత్రమే మహిళలు ఉన్నారని తేలింది.[1][2] అప్రయత్నంగా వచ్చిన ఈ వివక్షను ప్రయత్నపూర్వకంగా నివారించి తెలుగు వికీపీడియాలో మహిళల సంఖ్య పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టులో భాగంగా 2018 మార్చి మహిళా చరిత్ర మాసాన్ని తొలి అవకాశంగా తీసుకుంటున్నాం. ఈ క్రమంలో జరిగే ప్రస్తుత కార్యకలాపాలకు కేంద్రస్థానంగా ఈ ప్రాజెక్టు పేజీని ఉపయోగించనున్నాం, అలానే భవిష్యత్ కార్యకలాపాలకు వికీమీడియా సముదాయం ఈ ప్రాజెక్టు పేజీని ఉపయోగించుకోవచ్చు.

నేపథ్యంసవరించు

వికీపీడియాలో మహిళల భాగస్వామ్యం, మహిళలకు సంబంధించిన అంశాల ప్రాతినిధ్యం లోపించడం వల్ల "విశ్వంలోని సమస్త మానవ విజ్ఞానం, మానవులందరికీ స్వేచ్ఛగా పంచాలన్న" ఆశయంలో సమస్త మానవ విజ్ఞానం అన్నదానికీ, వికీపీడియా మూలస్తంభాల్లో ఒకటైన తటస్థతకు కూడా దెబ్బ తగులుతుంది. మహిళల గురించిన వ్యాసాల సంఖ్యలోనూ, వికీపీడియాల్లో మహిళల భాగస్వామ్యంలోనూ చాలా ప్రయత్నపూర్వకం కాని, క్రమబద్ధమైన వివక్ష చోటుచేసుకుంది.
2014, 15, 16 సంవత్సరాల మార్చి నెలల్లో తెలుగు వికీపీడియా సమాచారంలో వివక్ష తగ్గించేందుకు గాను, మహిళల గురించి వ్యాసాలు రాసేలా పలు ప్రయత్నాలు సాగాయి. ఇన్ని ప్రయత్నాల ఫలితంగా తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం 22.6 శాతం జీవిత చరిత్ర వ్యాసాలు మహిళల గురించి ఉన్నాయంటే దానికి పూర్వ పరిస్థితి మరింక ఎలా ఉండేదో తెలుస్తుంది.[3]
భాగస్వామ్యం విషయంలో చూసుకున్నా అతి ఎక్కువ దిద్దుబాట్లు చేసిన 10 మందిలో ఒకరే మహిళ, ఎక్కువ మార్పులు చేసిన 25 మంది వాడుకరుల్లో 2, నలభైమంది వాడుకరుల్లో 3 మహిళలు ఉండడం ఆందోళన కలిగించే సమస్య.[4] ఈ ముగ్గురిలో 12 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న వారు ఒకరు కాగా, దాదాపు నాలుగేళ్ళ నుంచి రాస్తున్న వారు మరొకరు, ఇటీవల ఏడాదిలోపు చేరిన వారు ఇంకొకరు. దీనివల్ల మరింతమంది మహిళలు తెలుగు వికీపీడియన్లు అయ్యేలా కార్యకలాపాలు చేపట్టాలన్నది అన్నది నాణ్యతాపరంగానూ, వైవిధ్యపరంగానూ కూడా ప్రస్తుతం అత్యావశ్యకమైన పనుల్లో ఒకటిగా నిలుస్తోంది.

గతంలో కృషిసవరించు

గతంలో సమాచారంలో వివక్ష తొలగించే దిశగా మార్చి నెలల్లో చేపట్టిన కృషి ఇలా ఉంది:

నిర్వాహకులుసవరించు

  1. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)

భాగస్వామ్య సంస్థలుసవరించు

2018 మార్చిసవరించు

2018 ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి మార్చి నెల పాటు తెలుగు వికీపీడియాలో మహిళల సంఖ్య, భాగస్వామ్యం పెంపొందించడానికి కార్యశాలలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ కింది పట్టికలో నిర్వహణ సహకారంలో ఎవరైనా తమ పేరు జోడించుకోవచ్చు. మిగిలినవాటి మార్పు చేర్పుల విషయంలో ముందస్తుగా చర్చించి చేయడం విధాయకం.

కార్యక్రమాల వివరాల పట్టికసవరించు

ప్రదేశం తేదీ వేదిక నిర్వహణ సహకారం కార్యక్రమాలు
హైదరాబాదు 2018 ఫిబ్రవరి 24, 25 స్వేచ్ఛ, గచ్చిబౌలి, హైదరాబాద్ స్వేచ్ఛ వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణం/హైదరాబాద్/2018 ఫిబ్రవరి కార్యశాల
విశాఖపట్టణం 2018 మార్చి 10 సహనిర్వాహకురాలు, పాల్గొన్న సభ్యురాలు లలిత పండ్రంకి ఇంట్లో, విశాఖపట్టణం లలిత పండ్రంకి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణం/విశాఖపట్టణం/2018 మార్చి 10 కార్యశాల

లక్షిత సభ్యులుసవరించు

ఈ తెవికీ మహిళావరణం కార్యక్రమాలకు, గతానుభవాలు, ఫలితాలను దృష్టిలో ఉంచుకుని అభిరుచి కలిగిన సభ్యుల ఎంపిక - శిక్షణ అన్న పద్ధతి వాడాలని ఆలోచన. అందుకు పాల్గొనే సభ్యులను రెండు ప్రమాణాల ఆధారంగా ఎంచుకోవచ్చు

  1. ఇప్పటికే తెలుగు టైపింగ్ అలవాటు ఉండి, డిజిటల్ స్పేస్ లో తెలుగులో ఏవోకటి రాస్తున్నవారు
  2. డిజిటల్ స్పేస్ లో నిర్మాణాత్మక ప్రయత్నాలు, కార్యకలాపాలు, వాటి ఫలితాల గురించి అవగాహన ఉండి కూడా, అటువంటి ప్రయత్నాల్లో పూర్తిగా మునిగిపోయినవారు కాకపోవడం.

ఇవి శిలాశాసనాల్లాంటి నియమాలు కావు. ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గోవడం కానీ, సహాయం చేయడం కానీ ఆసక్తి ఉన్న వికీపీడియన్లు, తమకు తెలుగు వికీపీడియాలో కృషిచేసే ఉత్సాహం ఉన్నదన్న అభిప్రాయం ఎవరిమీదన్నా కలిగితే ఈ ప్రమాణాల్లో ఏదీ లేకపోయినా తీసుకురావచ్చు. కానీ ఈ ప్రమాణాలున్న మహిళా అభ్యర్థులు మీ దృష్టిలో ఉంటే మాత్రం తప్పక ఈ కార్యక్రమం గురించి తెలియజేయగలరు.

పాల్గొంటున్నవారుసవరించు

కార్యక్రమంలో పాల్గొంటున్నవారి వివరాలు ఇక్కడ చూడవచ్చు.

మూలాలు, నోట్స్సవరించు

  1. న్యూయార్క్ టైమ్స్ వ్యాసంలో "...the considerable and often-noted gender gap among Wikipedia editors; in 2011, less than 15 percent were women." (సుమారు అనువాదం: గుర్తించదగ్గ, పలుమార్లు నొక్కిచెప్పిన వికీపీడియా రచయితల్లో జెండర్ గ్యాప్; 2011లో 15శాతం కన్నా తక్కువమందే వీరిలో మహిళలు) అన్న వాక్యం
  2. వికీమీడియా ఫౌండేషన్ వాడుకరుల సర్వే గణాంకాలు
  3. Klein M, Konieczny P, Gupta H, Rai V, Zhu H. Wikidata Human Gender Indicators 2016. doi:10.6084/m9.figshare.3100903.v1
  4. డిసెంబరు నాటి గణాంకాలు