వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు
వికీపీడియా గణాంకాలు రెండు విధాలుగా ఉంటాయి - వికీ పేజీలు, వాడుకరులు, దిద్దుబాట్లు వగైరాలకు సంబంధించిన గణాంకాలు ఒకరకం కాగా, పేజీలకు వచ్చిన వ్యూలు, ట్రాఫిక్కుకు స్ంబంధించిన గణాంకాలు రెండవ రకం. ఈ ప్రాజెక్టు మొదటి రకం గణాంకాలను గుదిగుచ్చి ఒక పద్ధతిలో ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంది. కేవలం పరిశీలన కోసం మాత్రమే కాకుండా, వికీ పేజీల్లో ఉన్న వివిధ లోపాలను, లక్షణాలను, సవరణలు అవసరమైన అంశాలను చూపించడం, తద్వారా వికీ అభివృద్ధికి తోడ్పడ్డం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు, గణాంకాలను కింది విధాలుగా వర్గీకరించి చూపిస్తుంది:
- వికీపీడియా:గణాంకాలు: ఇది గణాంకాలకు హోమ్ పేజీ లాంటిది. ప్రపంచం లోని వివిధ వికీలతో పోలిస్తే తెవికీ స్థానం, భారతీయ భాషా వికీలతో పోలిస్తే తెవికీ స్థానం వగైరా గణాంకాలను ఈ పేజీలో చూడవచ్చు.
- వికీపీడియా:స్థూల గణాంకాలు: పేరుకు తగ్గట్టు స్థూల గణాంకాలను చూప్సితుంది.
- వికీపీడియా:పేజీల గణాంకాలు: ప్రధానబరి లోని పేజీలకు సంబంధించిన వివిధ గణాంకాలను ఈ పేజీల్లో ప్రధానంగా చూడవచ్చు. వివిధ ఇతర పేరుబరుల్లోని పేజీల గణాంకాలు కూడా ఈ విభాగంలో ఉంటాయి.
- వికీపీడియా:వాడుకరుల గణాంకాలు: వాడుకరులు చేసిన దిద్దుబాట్లు, చేర్చిన బైట్లు, సృష్టించిన పేజీలు - వాటిలో జరిగిన తొలగింపులు, చేసిన నిర్వహణ పనులు వగైరా గణాంకాలు ఈ పేజీల్లో ఉంటాయి.
- వికీపీడియా:కాలావధి గణాంకాలు - వివిధ కాలావధుల్లో జరిగిన పనుల సంఖ్యను ఈ విభాగంలో చూడవచ్చు. 2005 నుండి రోజువారీగా, నెలవారీగా, సంవత్సరం వారీగా జరిగిన పనుల గణాంకాలు ఈ పేజీల్లో ఉంటాయి.
చర్యలు అవసరమైన పేజీలుసవరించు
వివిధ లక్షణాలు, లోపాలు కలిగిన పేజీల జాబితాలను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా తయారు చేస్తాం. ఈ పేజీలను పరిశీలించి లోపాల సవరణల వంటి తగు చర్యలు తీసుకునేందుకు ఈ పేజీలు ఉపకరిస్తాయి. ఇలాంటి గణాంకాల పేజీలన్నిటినీ వర్గం:చర్యలు అవసరమైన పేజీలు అనే వర్గం లోకి చేరుస్తాం. ఎక్కువ పరిమాణంలో ఉన్న పనులను కలిపి ఒక ప్రాజెక్టుగా రూపొందించుకుని దిద్దుబాట్లు చెయ్యవచ్చు. ఆ విధంగా ఈ ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులకు దారితీస్తుంది.
మూసలుసవరించు
ప్రాజెక్టులో భాగంగా {{వికీపీడియా గణాంకాలు}} అనే నేవిగేషను మూసను తయారు చేసాం. ఈ మూసను ప్రతీ గణాంకాల పేజీలోనూ చేర్చాలి. తద్వారా వివిధ గణాంకాల పేజీలను చేరుకోవచ్చు.
వర్గాలుసవరించు
- ఈ ప్రాజెక్టు లోని గణాంకాల పేజీలన్నీ వర్గం:వికీపీడియా గణాంకాలు అనే వర్గం లోకి చేరుతాయి.
- వర్గం:చర్యలు అవసరమైన పేజీలు
వనరులుసవరించు
ఈ గణాంకాలను ప్రధానంగా తెవికీ డేటాబేసును క్వెరీ చేసి సేకరించి వికీ పేజీల్లో అమరుస్తాం. క్వెరీ చేసే అడ్రసు:
- క్వారీ, బ్రౌజరు నుండి డేటాబేసును సంప్రదించగల పరికరం - SQL భాష తెలిసి ఉండాలి. ఈ సైటులో ఈ సరికే వివిధ వాడుకరులు రాసిన క్వెరీలన్నీ కనిపిస్తాయి. వాటినే తగు మార్పులతో వాడుకోవచ్చు.
పాల్గొంటున్న వాడుకరులుసవరించు
ఈ ప్రాజెక్టులో ఎవరైనా పాల్గొనవచ్చు. SQL భాష రానివారు కూడా చేరవచ్చు. చేర్చిన గణాంకాల్లో లోపాలేమైనా ఉంటే వాటిసి సరిచేసి ప్రాజెక్టు నాణ్యతను మెరుగుపరచవచ్చు. కొత్త గణాంకాల సూచనలను చేర్చవచ్చు. కింద సంతకం చేసి ప్రాజెక్టులో చేరండి.
సంప్రదించండిసవరించు
ఈ ప్రాజెక్టు విషయమై మరింత సమాచారం కోసం కింది వారిని సంప్రదించవచ్చు