వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/సంస్థ విషయ ప్రాముఖ్యత
విషయ ప్రాముఖ్యత
ప్రపంచంలో కొట్లాది సంస్థలున్నాయి. కానీ వాటిలో అతి కొద్ది సంస్థలే వికీకెక్కేంత ప్రాముఖ్యత కలిగినవి.
వ్యాస విషయానికి, దానికి సంబంధం లేని విశ్వసనీయ ప్రచురణల్లో ప్రముఖంగా కవరేజి వచ్చి ఉంటే, వికీపీడియాలో దాని గురించి వ్యాసం రాసేందుకు అవసరమైన అర్హత దానికి ఉన్నట్లే అని భావిస్తారు.
వికీపీడియాలో పేజీ ఉండాలంటే సంస్థకు కిందివి తప్పనిసరి:
- సంస్థకు సంబంధమేమీ లేని మూలాల్లో సంస్థ గురించి విస్తారంగా (ఏదో ప్రస్తావన ఉంటే చాలదు) ప్రచురితమై ఉండాలి, లేదా
- ప్రముఖ స్వతంత్ర ప్రచురణ సంస్థలు ప్రచురించే ప్రముఖ సంస్థల ర్యాంకుల జాబితాల్లో ఈ సంస్థ పేరు వచ్చి ఉండాలి, లేదా
- స్టాక్ మార్కెట్ల ఇండెక్సును లెక్కించే సంస్థల్లో ఒకటై ఉండాలి (మొత్తం మార్కెట్ లోని సంస్థలన్నిటినీ కలిపి చూసే ఇండెక్సుల లాంటివి పరిగణన లోకి రావు).
ఉత్పత్తి గాని, సేవ గానీ తప్పనిసరిగా:
- దాన్ని అందిస్తున్న సంస్థకు సంబంధం లేని మూలాల్లో దాని గురించి విస్తారంగా (ఏదో ప్రస్తావన ఉంటే చాలదు) ప్రచురితమై ఉండాలి. అంటే ఆ ఉత్పత్తిసేవ గురించిన వ్యాసాలై ఉండాలి - వేరే వ్యాసంలో ఏదో నాలుగైదు ప్రస్తావనలుంటే అది పనికిరాదు, జాబితాలో ఒక అంశంగా ఉంటే పనికిరాదు.
లేదా
- ట్రేడ్‌మార్కును తేలిగ్గా గుర్తు పట్టేసేంత విస్తృత గుర్తింపు ఉండి ఉండాలి.
Conflict of interest/advertising
సంస్థతో మీకు సంబంధం ఉంటే, మీకు అన్యథా ఆసక్తి ఉన్నట్లే. సంస్థ ప్రచారం లాగా రాయకుండా ఉండడం కష్టమౌతుంది - అలా రాయడం వికీపీడియాలో సమ్మతం కాదు. సంస్థకు చాలా ప్రత్యేకత ఉంటే తప్ప, సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్లుగా ఏ చిన్న ప్రస్తావనైనా దానికి ప్రచారమే అవుతుంది. వ్యాసం వుషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే, దాన్ని తొలగిస్తారు. సంస్థ నిజంగా ప్రాముఖ్యత ఉన్నదైతే, ఇవ్వాళో రేపో మరొకరెవనైనా దాని గురించి రాయకపోరు. వికీపీడియాలో రాయాలనుకుంటే మీకు బోలెడన్ని అంశాలున్నాయి, చూడండి.
- గమనిక: మీకు ఈ విషయం పట్ల అన్యథా ఆసక్తి ఉండి కూడా, దాని గురించి వ్యాసం రాయాలనే నిశ్చయించుకుంటే, వ్యాసపు చర్చ పేజీలో మీ అన్యథా ఆసక్తి ఏమిటో వివరించండి.
- డబ్బు కోసం దిద్దుబాటు: మీరు డబ్బు తీసుకుని రాస్తూ ఉంటే, వికీమీడియా ఫౌడేషను వారి వాడుక నిబంధనల ప్రకారం మీకు డబ్బులు ఇస్తున్నదెవరు, క్లయంటు ఎవరు, సంబంధిత సమాచారం ఏదైనా ఉంటే దాన్నీ వెల్లడించాలి. ఇంగ్లీషు వికీపీడియా లోని en:WP:COIPAYDISCLOSE, en:Wikipedia:Paid-contribution disclosure లను చూడండి.
మీరు తలపెట్టిన వ్యాసం నిబంధనలకు అనుగుణంగా ఉందా?
నా వ్యాసం ప్రాముఖ్యత ఉన్న సంస్థ గురించే, పైగా అది ప్రచారమేమీ కాదు
నా వ్యాసం ప్రచారంగా పరిగణించబడే అవకాశం ఉంది (సాయం చెయ్యండి!)
నేను వ్యాసం రాయ తలపెట్టిన సంస్థకు అంతగా ప్రాముఖ్యత లేదు (ఏం చెయ్యమంటారు?)