వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/ఇంకా సిద్ధంగా లేరు

విషయ ప్రాముఖ్యత అంటే ఏంటి?
వ్యాస విషయానికి, దానికి సంబంధం లేని విశ్వసనీయ ప్రచురణల్లో ప్రముఖంగా కవరేజి వచ్చి ఉంటే, వికీపీడియాలో దాని గురించి వ్యాసం రాసేందుకు అవసరమైన అర్హత దానికి ఉన్నట్లే అని భావిస్తారు.

ఈ మార్గసూచీని వాడినందుకు ధన్యవాదాలు!

మీరు తలపెట్టిన వ్యాస విషయానికి తగినంత ప్రాముఖ్యత లేదు. అయితే, భవిష్యత్తులో విశ్వసనీయ మూలాల దృష్టిలో పడితే కొన్ని విషయాలకు ప్రాముఖ్యత లభించవచ్చు. అలా జరిగితే, అప్పుడు మీరు ఈ విషయంపై వ్యాసం రాయవచ్చు. కొన్ని విషయాలైతే, ఈసరికే ఉన్న వ్యాసాలను విస్తరిస్తే సరిపోవచ్చు. ప్రాజెక్టు లోని ఇతర అంశాలపై పని చేయవలసినదిగా మిమ్మలని కోరుతున్నాం.

మంచి మూలాలు

1 విశ్వసనీయతకు పేరొంది ఉంటాయి: అవి నమ్మదగ్గ మూలాలు 2 వాటికి వ్యాస విషయంతో అనుబంధం ఉండదు 3 ఇతర వాడుకరులు వాటిని నిర్ధారించుకోగలుగుతారు

మూలాలే (దాదాపుగా) సర్వస్వం

మీరు ఎంచుకున్న విషయానికి ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు, కానీ మంచి ఉల్లేఖనలు లేకపోతే, ఇతరులెవరూ దాన్ని సమీక్షించలేరు, మీరు రాసిన దానితో ఏకీభవించలేరు, వ్యాసం లోని సమాచారాన్ని నిర్ధారించుకోలేరు. చాలా వ్యాసాలు, ప్రాముఖ్యతను నిర్ధారించే సరైన మూలాలను ఇవ్వకపోవడం వలన, పాఠ్యం లోని అంశాలకు మద్దతుగా నిలిచే మూలాలను ఇవ్వనందు వలనా చాలా వ్యాసాలు మెప్పించలేక విఫలమౌతూ ఉంటాయి. ఈ సూచీ లోని మూలాల పేజీని మళ్ళీ చూడండి. లేదా నమ్మదగ్గ మూలాల గురించి చదవండి.

  • మరిన్ని మూలాల కోసం వెతకండి! సెర్చి ఇంజను వాడండి. మీ దగ్గర లోని గ్రంథాలయానికి వెళ్ళండి.
  • ప్రపంచం లోని ప్రతీ ఒక్క విషయమూ ప్రాముఖ్యతా ప్రమాణాలను అందుకోలేదు – కొన్ని భవిష్యత్తు లోనూ అందుకోకపోవచ్చు, కొన్ని అందుకోవచ్చు.
  • ప్రాముఖ్యతా ప్రమాణాలను అందుకున్న ప్రతీ విషయమూ విజ్ఞానసర్వస్వపు స్థాయికి చెందినది కాకపోవచ్చు – తరచూ అడిగే ప్రశ్నలు (FAQ), విడీయో గేము గైడ్లు, స్మారకాలు, సూచన మాన్యువళ్ళు, డైరెక్టరీలు, లింకుల జాబితాలు, వ్యాపార ప్రకటనలు, స్వంత బాకా, నిఘంటువుల నిర్వచనాలు విజ్ఞానసర్వస్వ యోగ్యమైనవి కావు. ఏది వికీపీడియా కాదో చూడండి.
  • మీరు సేకరించిన మూలాలు సరిపోతాయో లేదో మీకు ఇదమిత్థంగా తెలీనపుడు, లేదా తటస్థ దృక్కోణంలో ఎలా రాయాలో తెలీనపుడు, సహాయ కేంద్రంలో అడగండి.
  • మీకు సరైన మూలాలు దొరకనపుడు, వ్యాసం రాయమని అడుగుతూ ఒక అభ్యర్ధన పెట్టండి.

మీరు తలపెట్టిన వ్యాసానికి సంబంధించి విశ్వసనీయ మూలాలను వెతకడానికి ఈ లింకులు సాయపడవచ్చు:

Find sources: Google (books · news · scholar · free images · WP refs· FENS · JSTOR · NYT · TWL.
అయితే, బోలెడన్ని విలువైన మూలాలు ఆన్‌లైన్లో దొరకవని గమనించండి.