వికీపీడియా:సమావేశం/గుంటూరు/స్వేచ్ఛా నకలు హక్కులపై అవగాహన కార్యక్రమం

స్వేచ్ఛా నకలు హక్కుల గురించి తెలుగు సాహిత్య రంగంలో మరింత అవగాహన కల్పించేందుకు గుంటూరులో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది. అన్నమయ్య గ్రంథాలయం వేదికగా 2017 ఫిబ్రవరి 5 ఉదయం 10.30 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా తెలుగులో స్వేచ్ఛా గ్రంథాలయ (వికీసోర్సు) అభివృద్ధికి సహకరించిన భూసురపల్లి వెంకటేశ్వర్లు, పెద్ది సాంబశివరావుల సత్కారం, కోడిహళ్ళి మురళీమోహన్ గారి ""ఆంధ్ర సాహిత్యంలో బిరుద నామములు" పుస్తకావిష్కరణ, వికీసోర్సు గురించి అవగాహన వంటివి జరుగుతాయి.

వేదిక మార్చు

అన్నమయ్య గ్రంథాలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు

2017 ఫిబ్రవరి 5, ఉదయం 10.30

కార్యక్రమాలు మార్చు

  • నేరుగా స్వేచ్ఛా నకలు హక్కుల్లోనే ప్రచురితమైన ప్రింట్ పుస్తకం "ఆంధ్ర సాహిత్యంలో బిరుద నామములు" ఆవిష్కరణ
  • స్వేచ్ఛా నకలు హక్కుల్లో తన పుస్తకాన్ని పునర్విడుదల చేసిన సంగీతజ్ఞుడు, రచయిత, కవి భూసురపల్లి వెంకటేశ్వర్లు, యూనీకోడీకరించిన అన్నమయ్య సంకీర్తనలను వికీసోర్సులో చేర్చేందుకు వీలుగా అందించిన నిఘంటుకర్త, సాహిత్యపరుడు పెద్ది సాంబశివరావులను సత్కరించుకుంటున్నాం.
  • స్వేచ్ఛా నకలు హక్కుల గురించి చిరు అవగాహన సదస్సు

పాల్గొనేవారు మార్చు

ప్రత్యేక ఆహ్వానితులు