వికీపీడియా:సమావేశం/డిజిటల్ గ్రంథాలయ అవగాహన శిక్షణా కార్యక్రమం/తాడేపల్లిగూడెం

తెలుగు వికీపీడియాలో వికీమీడియా ఫౌండేషన్ వారి సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని గ్రంథాలను జాబితా చేసేందుకు, తద్వారా వికీమీడియా ప్రాజెక్టులకు సమాచారం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రారంభమైన వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అన్న ప్రాజెక్టు గురించి అవగాహన కల్పించి, శిక్షణను ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించన్నాము.

వేదిక

మార్చు

మాంటిస్సోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హౌసింగ్ బోర్డు కాలనీ, తాడేపల్లిగూడెం

తేదీ, సమయం

మార్చు

ఆగస్టు 7, 2014 - ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు

కార్యక్రమ నేపథ్యం

మార్చు
 
గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య

వికీమీడియా ఫౌండేషన్ వారు అందించిన ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంట్ ద్వారా వాడుకరి:Pavan santhosh.s వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికే పలువురు వికీమీడియన్లు చురుకుగా ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో కృషిచేస్తున్నారు. ఆ సంఖ్యను బహుళం చేసి, ఈ ప్రాజెక్టు ఉపయోగాన్ని మరింతమందిలోకి తీసుకువెళ్ళేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. డిజిటల్ యుగంలోని గ్రంథాలయాన్ని నెటిజన్లకు, వికీపీడియన్లకు అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టు కావడంతో సభ్యుల అంగీకారంతో సరిగ్గా వందేళ్ళ క్రితం తెలుగునాట గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించి విస్తృతమైన సత్ఫలితాలు ప్రజలకందించిన గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్యను ప్రాజెక్టు స్ఫూర్తిగా స్వీకరించాము. అదే కారణంతో ఈ కార్యక్రమాన్ని ఆయన స్మారక కార్యక్రమంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం, అయ్యంకి జన్మదినోత్సవం ఐన ఆగస్ట్ 8న నిర్వహిస్తున్నాము.

లక్ష్యం

మార్చు

కార్యక్రమంలో భాగంగా తెవికీలో చురుకుగా వ్యవహరిస్తున్న వికీపీడియన్లు మొదలుకొని ఇప్పటికీ ఖాతా లేని వారి వరకూ పలువురికి అవగాహన కల్పిస్తాము. అవసరమైన వారికి శిక్షణనిచ్చి ప్రాజెక్టును, తద్వారా వికీపీడియాను సుసంపన్నం చేసే కృషి ప్రారంభింపజేస్తాము.

కార్యక్రమ క్రమం

మార్చు
క్రమ సంఖ్య కార్యక్రమం సమయం కార్యక్రమ సరళి
1 స్వాగత కార్యక్రమం ఉదయం 9.30-9.35గంటలు ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానం
2 అయ్యంకి వెంకటరమణయ్యకు నివాళి ఉదయం 9.35-9.45గంటలు అయ్యంకి పటానికి పూలమాలలు వేసి, ఆయన గురించి తయారుచేసిన వీడియో ప్రదర్శన
3 అతిథుల ప్రసంగాలు ఉదయం 9.45-10గంటలు క్లుప్తంగా ముఖ్య అతిథులు కార్యక్రమం గురించి ప్రసంగిస్తారు
4 ఔత్సాహిక కొత్త సభ్యులకు అవగాహన ఉదయం 10-11గంటలు వయోవృద్ధుల సంక్షేమ సంఘం నుంచి పలువురు వయోవృద్ధులు కార్యక్రమంలో భాగంగా తెవికీ ప్రాధాన్యత మొదలుకొని తెవికీలో ఎందుకు రాయాలి, ఎలా రాయాలి వంటి మౌలిక అంశాలపై అవగాహన
5 టీ విరామం ఉదయం 11-11.15 గంటలు టీ, అల్పాహారం
6 నమోదు చేసుకున్న వాడుకరులకు శిక్షణ ఉదయం 11.15 నుంచి 12గంటల వరకు ముందుగా నమోదుచేసుకున్న కొత్త సభ్యులకు ప్రాజెక్టు, తెవికీల్లో కృషిచేయడంపై శిక్షణ
7 వికీపీడియన్లకు ప్రాజెక్టుపై అవగాహన మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు ఇప్పటికే చురుకుగా పనిచేస్తున్న వికీపీడియన్లకు ప్రాజెక్టుపై అవగాహన, భాగస్వామ్య కృషి, ప్రాజెక్టుపై వారి నుంచి సూచనలు స్వీకరించడం.
8 పాఠశాల విద్యార్థులకు వికీపై మౌలిక అవగాహన మధ్యాహ్నం 2 గంటల నుంచి పాఠశాల విద్యార్థులకు వికీపై మౌలిక స్థాయి నుంచి అవగాహన కార్యక్రమం

పాల్గొనేవారు

మార్చు

తప్పక పాల్గొనేవారు

మార్చు

వికీపీడియన్లు ఈ కింది లైన్లో వికీపీడియన్లు(ఖాతా ఉన్నవారు) సంతకం చేయండి.(--~~~~ అని సంతకం చేయగలరు)

వికీపీడియన్లు కాని వారైతే కింది వరుసలో మీ పేరు బ్రాకెట్లో సంప్రదించాల్సిన ఈమెయిల్/ఫోన్ నెంబర్ ఇవ్వగలరు.

పాల్గొనేందుకు వీలైనంతవరకూ ప్రయత్నించేవారు

మార్చు

వికీపీడియన్లు ఈ కింది లైన్లో వికీపీడియన్లు(ఖాతా ఉన్నవారు) సంతకం చేయండి.(--~~~~ అని సంతకం చేయగలరు)

వికీపీడియన్లు కాని వారైతే కింది వరుసలో మీ పేరు బ్రాకెట్లో సంప్రదించాల్సిన ఈమెయిల్/ఫోన్ నెంబర్ ఇవ్వగలరు.

నివేదిక

మార్చు
  • కార్యక్రమంలో తాడేపల్లిగూడెం వయోవృద్ధుల సంక్షేమ సంఘానికి చెందిన 10మంది వృద్ధులు పాల్గొన్నారు. వారిలో ఐదుగురు వికీపీడియన్లుగా నమోదయ్యారు. వారికి వికీపై అవగాహన, డీఎల్‌ఐలోని పుస్తకాల గురించి వివరాలు, తెలుగులో వ్రాయడం గురించి శిక్షణ వంటివి నిర్వహించాము.
  • దీనిలో పాల్గొని డీఎల్‌ఐ గురించి తెలుసుకునేందుకు తణుకు నుంచి వడ్డూరి రామకృష్ణ, పోడూరు నుంచి విశ్వనాధ్, తూర్పుగోదావరి జిల్లా నుంచి పాలగిరి గార్లు విచ్చేశారు. తాడేపల్లిగూడెంలోని మీనా గాయత్రి పాల్గొన్నారు. వీరందరిలోనూ ముఖ్యంగా విశ్వనాధ్, పాలగిరి, మీనాగాయత్రి నిర్వహణలో సహకరించారు. అందరికీ ప్రాజెక్టు గురించి అవగాహన కల్పించాము. మీనా గాయత్రి ప్రాజెక్టు పేజీలలో పుస్తకాలు చేర్చడం, టేబుల్స్ తయారీ వంటివాటి గురించి ఇతర వికీపీడియన్ల నుంచి సూచనలు తీసుకుని తర్వాతి కాలంలో ప్రాజెక్టులోనే అందరికన్నా ఎక్కువ కృషి చేసినవారిగా నిలిచారు.
  • కార్యక్రమ నిర్వహణలో ఎం.వి.ఆర్.మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత ఎం.ఎల్.ఎస్.ఎన్.రెడ్డి గారు, వయోవృద్ధుల సంక్షేమసంఘ అధ్యక్షులు జంపన వస సత్యనారాయణ, కళాశాల సిబ్బంది తదితరులు సహకరించారు.
  • కార్యక్రమంలో భాగంగా పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు వికీపీడియా గురించి, వికీలో వ్రాయడం వెనుక విద్యార్థులకు కలిగే ప్రయోజనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంప్రదించేందుకు

మార్చు

కార్యక్రమానికి హాజరయ్యేవారు అవసరమైతే సంప్రదించాల్సిన మెయిల్ ఐడీ pavansanthosh.s@gmail.com

బయటి లింకులు

మార్చు