వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/వికీమిత్ర వేదిక-మార్చి 2017

వికీమిత్ర వేదికగా నెలవారీ సమావేశాన్ని రూపొందిస్తూ నిర్వహిస్తూన్న తొలి సమావేశాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించదలిచాము.

వివరాలు మార్చు

  • ప్రదేశం: రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ (నోట్: రవీంద్రభారతి వేదికపై కాదు గమనించగలరు)
  • తేదీ: 26 మార్చి 2017, సాయంత్రం 3.30 నిమిషాలకు

కార్యక్రమ సరళి మార్చు

వికీమిత్ర వేదిక కార్యక్రమాల్లో నేర్చేవి, చేసేవి, సరదా అన్న మూడు అంశాలు ఉంటాయి. వీటిని కార్యక్రమానికి హాజరయ్యేవారు చర్చ పేజీలో ప్రతిపాదించవచ్చు.

  • నేర్చేవి: ఒక వ్యాసంలో ఒక వాక్యం ఉపయోగించి ఎన్నో వ్యాసాల్లో మార్పులు చేయడం ఎలాగ
  • చేసేది: కొన్ని వ్యాసాలకు మూలాలు చేర్చి నాణ్యతాభివృద్ధి
  • సరదా: చైనీస్ విస్పర్ ఆట

నిర్వహణ మార్చు

  1. రాజశేఖర్
  2. వాడుకరి:Pranayraj1985

నిర్వహణ సహకారం మార్చు

  1. పవన్ సంతోష్ (చర్చ)

పాల్గొనే వికీమిత్రులు మార్చు

పాల్గొనే వికీపీడియన్ మిత్రులు ఈ కింద తమ సంతకం చేయగలరు

  1. Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:34, 23 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక మార్చు

కార్యక్రమం 3.30 గంటలకు హైదరాబాద్ కళా కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రారంభమైంది. కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన ఉర్దూ వికీపీడియన్ ముజాములుల్దీన్, తెలుగు వికీమిత్రులు కశ్యప్, ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, కొత్త వికీమిత్రుడు రామలింగారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఒక వ్యాసం నుంచి ఎన్నో వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చునన్న విషయాన్ని చర్చించారు. ఉదాహరణగా ఒక ప్రఖ్యత వ్యక్తి గురించిన వ్యాసం ఉపయోగించి వారి వ్యాసానికి రిఫరెన్సు చేర్చడమే కాకుండా వారు జన్మించిన గ్రామ వ్యాసంలోనూ రిఫరెన్సు చేర్చవచ్చన్నది, ఇలాంటి మరిన్ని ఉదాహరణలతో చర్చించారు. ముజామిల్ తాను ఉపయోగిస్తున్న రిఫరెన్సు లింకులు డెడ్ లింకులు అవుతున్న విషయాన్ని చెప్పగా, ఆర్కైవ్.ఆర్గ్ లో ఇప్పుడు ఆ లింకు ఏ స్థితిలో ఉందో అలా సేవ్ చేయవచ్చన్న విషయాన్ని చేసి చూపించడం జరిగింది. ఆపైన అందరూ కలిసి కింద నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారి పుస్తక ప్రదర్శన సందర్శించి వికీపీడియాల్లో రిఫరెన్సుకు పనికివచ్చే పుస్తకాలను ఎంపిక చేశారు. రానున్న తెలుగు వికీపీడియా గ్రంథాలయం ప్రాజెక్టుకు ఈ జాబితాను ఉపయోగించవచ్చున్న ఉద్దేశంతో కొన్ని పుస్తకాలు ఎంచుకున్నారు. అందరూ ఫోటోలు దిగి, తేనీరు పుచ్చుకుని కార్యక్రమాన్ని ముగించారు.