వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఫిబ్రవరి 21, 2016 సమావేశం

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు

మార్చు

ఈనెల అతిథి

మార్చు
  • నండూరి రమేష్, జాతీయ ఉత్తమ యువజన అవార్డు గ్రహీత, వికలాంగ మహా సంఘటన్ జాతీయ అధ్యక్షులు.

చర్చించాల్సిన అంశాలు

మార్చు
  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు

మార్చు
  1. రాజశేఖర్

నిర్వహణ సహకారం

మార్చు
  1. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు

మార్చు
  1. Pranayraj1985 (చర్చ) 13:10, 16 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. kbssarma (చర్చ)

పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

మార్చు

చర్చించిన అంశాలు

మార్చు
  • దిగవల్లి వేంకట శివరావు గారి పుస్తకాల గురించి: పవన్ సంతోష్ ఇప్పటికే ఆయన సాహిత్యాన్ని మూలంగా చేసుకుని రిఫరెన్స్ ఇస్తూ కొన్ని వ్యాసాలు సృష్టించారు. ఆంధ్ర లొయోలా కళాశాల విద్యార్థి వికీపీడియన్లతో, డా.కోలా శేఖర్ గారి సహకారాన్ని స్వీకరించి దిగవల్లి వారి సాహిత్యం ఆధారంగా మరిన్ని వ్యాసాలు అభివృద్ధి చేయొచ్చని తన్వీర్ సూచించారు. దిగవల్లి వేంకట శివరావు గారి పుస్తకాలు సరికొత్త విజ్ఞాన మూలాలను అభివృద్ధి చేయడంలో తెలుగు వికీపీడియా ఎలా ఉపయోగించుకుంటుందో చూపించేందుకు పనికివస్తుంది.
  • ఆంధ్ర లొయోలా కళాశాల విద్యార్థులు సృష్టించిన వ్యాసాల గురించి చర్చ: రాజశేఖర్ గారు మాట్లాడుతూ బోటనీ వ్యాసాలు మంచి నాణ్యతతో లేవని, ఎందుకంటే విద్యార్థులు అనుసరించేందుకు మంచి శైలిలోని మోడల్య వ్యాసాలేవీ అందుబాటులో లేకపోవడం కారణమని పేర్కొన్నారు. తెలుగు వికీపీడియాలో మంచి నాణ్యతతో కూడిన వ్యాసాలు రావాలంటే మంచి/ప్రామాణిక వ్యాసాలను వారికి అందజేయాలని, తద్వారా విద్యార్థులు వాటిని అనుసరించగలుగుతారని పేర్కొన్నారు.
  • తెలుగు వికీపీడియాలో నాణ్యత అభివృద్ధికి సూచనలు: తెలుగు వికీపీడియన్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, అది కూడా One on One శిక్షణ జరగాలని గుళ్ళపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయాధికారుల్లో ఆసక్తి కనబరిచినవారికి ఫాలో-అప్ చేపట్టాలని, పవన్ సంతోష్ కొత్త వికీపీడియన్లను అనుసరిస్తూ వారిని సలహా సూచనలు (మెంటార్షిప్) చేస్తూండాలని గుళ్ళపల్లి సూచించారు.
  • ఇతర రాష్ట్రాల్లో తెవికీ: ఢిల్లీలోని తెలుగు అసోసియేషన్ వంటి తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులను పుస్తకాల విడుదల మరియు తెవికీ వ్యాసాల అభివృద్ధి కోసం కూడా సంప్రదించాలని గుళ్ళపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
  • కొత్త వాడుకరులను తీసుకురావడం: కొత్తవాడుకరులు తమంతట తామే వికీలోకి రావట్లేదు, వారిని వికీ వేదికపైకి తీసుకువచ్చేందుకు మార్గాలు అన్వేషించాలి. పలు పోటీల ద్వారా కొత్త వాడుకరులను ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చని కశ్యప్ తెలిపారు. పోటీల విషయమై తెవికీపీడియా రచ్చబండలో సముదాయ సభ్యులు ప్రతిపాదించి, చర్చించేందుకు ముందుకురావాలని తన్వీర్ సూచించారు. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులను పలు పోటీ పరీక్షల శిక్షణ సంస్థల ద్వారా కలసి వికీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయొచ్చని కశ్యప్ సూచించారు. వారు నిత్యం పలు విధాలుగా ప్రామాణిక గ్రంథాలు చదువుతూ ప్రిపేర్ అవుతుండడం వల్ల వారి నైపుణ్యాలు, విజ్ఞానం తెవికీకి ఉపకరిస్తుందని ఆయన భావించారు. ఇప్పటికే ఉన్న వికీపీడియన్లపైనే సొమ్ము ఖర్చుచేస్తున్నామని కొత్తవారిని శిక్షణ ఇచ్చేందుకు ఖర్చుచేస్తే బావుంటుందని పేర్కొన్నారు.
  • గ్రామవ్యాసాలు, ఫోటోలు: తెవికీలో ఫోటో కాంపిటేషన్ నిర్వహించాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. అలానే గ్రామవ్యాసాలను బహుముఖీనంగా అభివృద్ధి చేసేందుకు ఔత్సాహిక వికీపీడియన్లకు ట్రావెల్ గ్రాంట్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. దీన్ని కూడా కార్యరూపం దాల్చేందుకు వికీపీడియా రచ్చబండలో చేర్చి సూచనలు స్వీకరించి, ఏకాభిప్రాయానికి రావాలని తన్వీర్ అభిప్రాయపడ్డారు.
  • కాపీహక్కులపై FAQ డాక్యుమెంట్ తయారీ: కాపీహక్కులకు సంబంధించి వికీపీడియన్లకు తరచు వచ్చే సమస్యలు, తరచు అడిగే ప్రశ్నలు ఓ డాక్యుమెంట్ రూపంలో తయారుచేసి తెలుగులోకి నిపుణులతో అనువాదం చేయించి అందుబాటులోకి తేవాలని వికీపీడియన్లు కోరారు.
  • కొత్త వికీపీడియన్లు, అనుభవజ్ఞులైన వికీపీడియన్ల మధ్య ఫలప్రదమైన భాగస్వామ్య ప్రతిపాదన: కొత్త వికీపీడియన్లు అనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నెలరోజుల పాటు ఓ భాగస్వామ్యంలా కృషిచేసేలాంటి ప్రతిపాదనకు సమావేశంలో మంచి స్పందన లభించింది. ప్రధానంగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ తనవంతుగా తాను కనీసం ఒక కొత్త వికీపీడియన్ కి శిక్షణ నిర్వహిస్తానని తెలిపారు.
  • వికీపీడియన్ల విజ్ఞప్తులు: అమ్మనుడి లేదా నడుస్తున్న చరిత్ర మేగజైన్ ఓటీఆరెస్ స్థితి, అన్నమాచార్య సంకీర్తన ప్రాజెక్టు ప్రస్తుత స్థితి (అత్యంత ప్రాధాన్యం), అమ్మనుడి/నడుస్తున్న చరిత్ర మేగజైన్ కాపీహక్కుల స్థితి, అనగా రచయితలు కాపీహక్కులు ఇచ్చివేశారా వగైరా నిర్ధారించడం వంటివాటిపై అప్డేట్స్ కోరారు. సవర భాష వాడుకరుల బేస్ ను అన్వేషించడం (తద్వారా విక్ష్నరీలో తెలుగు లిపిలోని సవర నిఘంటువుపై పనిచేసే ప్రయత్నం చేయొచ్చు), తెలుగు వీడియో పాఠాల రూపకల్పన చేసే పని ముందుకు తీసుకువెళ్ళడం, భారత రత్న, పద్మవిభూషణ్ వంటి అవార్డుల ఆర్టీఐ ద్వారా సమాచార సేకరణ కోరారు.
  • ప్రోగ్రాం అసోసియేట్ గా పవన్ సంతోష్ పనిపై సూచనలు: డిసెంబర్, జనవరి నెలల పనిని ఆధారం చేసుకుని సభ్యులు కొన్ని సూచనలు చేశారు. అవగాహన మరియు అవుట్ రీచ్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాడుకరులు మరియు కంటెంట్ పెంపొందేలా సంస్థాగత భాగస్వామ్యాలు అభివృద్ధి చేయాలి. నెలకు కనీసం మూడైనా అవుట్ రీచ్ కార్యకలాపాలు చేపట్టాలి. ఆయన స్వచ్ఛంద కృషి తగ్గిపోయింది, చాలా చురుకైన వాడుకరి కావడంతో ఎ2కె బాధ్యతల వల్ల ఆయన కృషి తగ్గరాదు. అవుట్ రీచ్ చేసే శైలి మార్చాలి.
  • వికలాంగ మహా సంఘటన్ తో భాగస్వామ్యం: పవన్ సంతోష్ ఆహ్వానం మేరకు సమావేశానికి వికలాంగ మహాసంఘటన్ అధ్యక్షుడు నండూరి రమేష్ వచ్చారు. ఆయనతో విభిన్న ప్రతిభావంతులు తెవికీ వాడుకరుల్లో తక్కువగా ఉండడం, వారి భాగస్వామ్యం వల్ల సమాచారంలో కూడా వైవిధ్యం పెరగడం, వాటి అవసరం వంటి విషయాలను పవన్ సంతోష్, రాజశేఖర్ తదితరులు చర్చించారు. ఆ క్రమంలో రమేష్ సీఐఎస్-ఎ2కె, తెవికీ భాగస్వామ్యంతో విభిన్న ప్రతిభావంతులైన తమ సంస్థ సభ్యులతో అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపడదామని నిర్ణయించారు.

ఫలితాలు

మార్చు

పాల్గొన్నవారు

మార్చు
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రాజశేఖర్
  2. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  3. కృపాల్ కశ్యప్
  4. పవన్ సంతోష్
  5. ప్రణయ్‌రాజ్ వంగరి
  6. నండూరి రమేష్ (జాతీయ ఉత్తమ యువజన అవార్డు గ్రహీత, వికలాంగ మహా సంఘటన్ జాతీయ అధ్యక్షులు)
  7. తన్వీర్ హాసన్ (సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్)
Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక

మార్చు