వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు

2013లో జరగబోయే వికీపీడియా సర్వసభ్య సమావేశంలో నేరుగా పాల్గొనలేని పూర్వ మరియు ప్రస్తుత సభ్యులు దయచేసి మిగితా వికీపీడియన్లకై ఒక సందేశాన్నో లేక ఒక వీడియోనో రూపొందించి ఇక్కడ చేర్చవలసినదిగా మనవి.

అభినందనలు/సూచనలు నమూనా
== [[వాడుకరి:వాడుకరి పేరు| కంపశాస్త్రి]] ==
హలో, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు నా సందేశం(/సూచనలు)
* వికీపీడియా మహోత్సవం - 2013 సర్వ సభ్య సమావేశం జయప్రదంగా జరిగినందుకు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను.
* ప్రతి సంవత్సరం ఈవిధమైన వార్షిక సమావేశాలు జరుపుతే బాగుంటుంది.
~~~~

ఉగాది శుభవార్తః తెలుగు భాషకు సాంకేతిక పరిజ్నానాన్ని జోడిస్తున్న సురేశ్ కొలిచాల,వెన్న నాగార్జున లాంటి నిపుణులకు కూడా క్రమం తప్పకుండా పురస్కారాలు అందజేయాలని కోరితే అధికారభాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారు అంగీకరించారు.తమిళనాడులో ఇస్తున్నట్లుగా ప్రతియేటా ఉత్తమ తెలుగు సాఫ్ట్ వేర్ లు తయారు చేసిన వారికి కొన్ని ప్రోత్సాహక బహుమతులు మన తెలుగు వైతాళికుల పేరిట ఇవ్వాలన్న నా మనవిని అమలు చేస్తామన్నారు.--Nrahamthulla (చర్చ) 14:25, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి విషయం తెలిపారు. ధన్యవాదాలు. అధికారిక ప్రకటన ఏమయినా జరిగినదా? రహ్మానుద్దీన్ (చర్చ) 18:46, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సాధ్యమైనంత త్వరగా ఈ బహుమతులపై ప్రభుత్వ ఆమోదం పొందుతానని ప్రసాద్ గారు ఉగాదికి ముందురోజు నాకు హామీ ఇచ్చారు.ఈ శుభవార్తను ఫేస్ బుక్ లో కూడా వెల్లడించాను --Nrahamthulla (చర్చ) 14:56, 14 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వికీపీడియా సర్వసభ్య సమావేశాలు జయప్రదంగా మహోత్సవంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాను. వికీపీడియన్ మిత్రులకు అభివాదాలు. ముందు నన్ను పరిచయం చేసుకుంటాను. భాగవత గణనాధ్యాయిని. తెలుగు, పోతన, భాగవతం నా ఆసక్తులు. తెలుగుభాగవతండాట్ కం అని ఒక జాలిక పెట్టి, నే చేస్తున్న గణనాధ్యాయం పనిని అందరితో పంచుకుంటున్నాను. ఇక్కడ తెలుగు భాగవతానికి చెందినవి అన్నీ తెలుగు లిపిలోనే ప్రధానంగా అందించాలి అన్నది ప్రయత్నం. 2007 సం.లో టైపింగుకాని, కంప్యూటరు కాని సరిగా రాని నాకు తెవికెనే కంప్యూటరులోను అంతర్జాలంలోను తెలుగు అనుకూలమే అని దారి చూపించింది. అంతే కాక, తెవికేలో సమర్పించిన నా "భాగవతము - సాంఖ్యము" ద్వారా నా పని మొదలెట్టడానికి వలసిన ధైర్యం ఇచ్చినది మన తెవికే నే అని సగర్వంగా మనవి చేసుకుంటున్నాను. ఈ రోజుకి పోతన తెలుగు భాగవతం మీద ఈపాటి చేయగలిగానంటే వేల పేజిల కొద్దీ టెక్సటులు, వేల కొద్ది పద్యాల ఆడియోలు ఆ జాలికలో అందిస్తున్నానంటే తేవికె నే ఆది మూలం. అందుకు నేను సదా కృతఙ్ఞుడను. ఐనా కూడా నిన్ననే సింగపూరు మా అబ్బాయి దగ్గరకు వెళ్ళడం వలన వ్యక్తిగతంగా హాజరు కాలేక పోతున్నా. పరోక్షంగా మాత్రమే పాల్గొంటున్నట్లు ఫీలవుతాను.

veera.sj నిర్వాహకులకు పంపిన సందేశం మార్చు

తెవికీపీడియనులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు!!

ఇటువంటి మహత్తర సమావేశం జరుగుతున్నందుకు ఒక వైపు మహదానందంగా ఉన్ననూ, అర్జున గారు మరల మరల అభ్యర్థించిననూ, వృత్తిపర ఇబ్బందులు, వ్యక్తిగత అడ్డంకుల వలన నేను పాల్గొనలేకపోతున్నందుకు చాలా బాధగా ఉన్నది. క్షమించాలి.

ఈ సమావేశంలో మీరందరూ చురుకుగా పాల్గొని తెవికీని తెలుగు ప్రజలకి మరింత దగ్గర చేసే క్రియాశీలక నిర్ణయాలని తీసుకొని తెవికీ వ్యాప్తికి మీ వంతు సహకారాన్నందించి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసినదిగా నా మనవి.

సందేశంలో తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించండి.

ఇట్లు, శశి

ధన్యవాదాలు

వికీలందరికకీ విజయనామ సంవత్సరం అందరికీ విజయాలు చేకూర్చి విశేష ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:34, 12 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]