వికీపీడియా చర్చ:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/రహ్మానుద్దీన్

వివరించండి

మార్చు

అధికార హోదా కొరకై స్వీయ ప్రతిపాదన చేసి చక్కని ఒరవడిని ప్రారంభించినందుకుకొనసాగించినందుకు ముందుగా ధన్యవాదాలు.

  • మీకు అధికార హోదా లేని కారణంగా ఏ ఇబ్బందులు ఎదురయ్యాయో వివరించండి. తెలుగు వికీపీడియా నిర్వహణలోనూ, వికీఅకాడెమీలు నిర్వహించడంలోనూ అధికారహోదా ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకర్ధం కాలేదు. నాకు తెలిసినంత వరకూ నిర్వాహకుడు చెయ్యలేని, అధికారి చెయ్యగల ముఖ్యమైన పనులు ౧) ఇతర సభ్యులను అధికారులు, నిర్వాహకులు, బాట్లను చెయ్యగల సౌలభ్యం ౨) వాడుకరి పేరు మార్చుచెయ్యగల సౌలభ్యం. ఈ రెండవ అధికారాన్ని కేంద్రీకరించి, స్థానిక అధికారుల చేతుల్లో తీసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది నాకు తెలిసింది. అఫ్‌కోర్సు నాకు తెలియనిది ఉండవచ్చు లేదా నాకు తెలిసినది తాజా సమాచారం కాకపోవునూ వచ్చు. అందుకే తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 07:37, 12 డిసెంబర్ 2013 (UTC)
  • వైజాసత్య గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎదురయిన ఇబ్బంది వాడుకరి పేరును మార్చడం. ఇంకా వాడుకరి పేర్లు అధిక సంఖ్యలో సృష్టించే అధికారం కూడా బ్యూరోక్రాట్ కి ఉందని గ్రహించాను. అంతకు మించి, సాధారణంగా తెలుగు వికీపీడియాలో తోటి అధికారులకు సహాయకంగా ఉండాలన్నది కూడా ఒక ఆశయం. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:49, 12 డిసెంబర్ 2013 (UTC)
క్షమించాలి. మీరు కూడ స్వయంప్రతిపాదన చేసుకున్నారని మరచిపోయాను. నేనూ స్వయంప్రతిపాదితున్నే :-) కాకపోతే అప్పటికి స్థానికంగా ఈ పేజీ లేదు, ఒక పద్ధతంటూ ఏర్పడలేదు. బహుశా, నేను రచ్చబండలో అధికారి హోదా కోరుతున్నాను అని వ్రాసినట్టున్నాను. --వైజాసత్య (చర్చ) 06:44, 31 డిసెంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారికి, నాకు తెలిసి వాడుకరి పేర్లు అధిక సంఖ్యలో సృష్టించే అధికారం బ్యూరోక్రాట్ కి లేదు. ఏమైనా ఆధారం వుంటే పేర్కొనండి. --అర్జున (చర్చ) 05:36, 31 డిసెంబర్ 2013 (UTC)
  • అధికారి హోదా ద్వారా వాడుకరుల పేరు మార్చడం వరకూ నాకు తెలుసు. ఇంకా ఇతర అధికారాల గురించి మరింత అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అకౌంట్ రిక్వెస్ట్ పేజీ వాడుకునేలా కొత్త సభ్యులను కోరుతున్నాను. అలానే మార్పుల థ్రాటిల్ ఎదురవకుండా ఉండేలా ఏమయినా మార్గాలున్నాయా? --రహ్మానుద్దీన్ (చర్చ) 14:29, 1 జనవరి 2014 (UTC)Reply

ఏకాభిప్రాయాన్ని సమీకరించి నిర్ణయం చేయటం

మార్చు
  • అధికారిగా నిర్వాహకునికంటే క్లిష్టమైన అంశాలపై ఏకాభిప్రాయాన్ని సమీకరించగలిగి నిర్ణయం చేయగలగాలి. మీ నిర్వాహకఅనుభవంలో క్లిష్టమైన అంశాలకు దగ్గరిగావున్నటువంటి వాటిపై మీ నైపుణ్యాలను తెలిపే ఉదాహరణలేవైనా వుంటే తెలపండి.--అర్జున (చర్చ) 05:54, 31 డిసెంబర్ 2013 (UTC)
  • ఈ కిందివి కొన్ని నేను నిర్వాహకునిగా చేసినవి :
  1. పేజీలు తొలగించడంలో మరింత అనుభవజ్ఞత.
  2. పేజీలు తరలించడంలోని మెళకువలు
  3. కొన్ని అనవసరపు మార్పులు చేస్తున్న వాడుకరులను, ఐపీ అడ్రెస్ లను నిరోధించడం
  4. కొన్ని అవసరమున్న తీసివేయబడిన పేజీలను పునఃస్థాపించడం మొదలగునవి.

ఇంకా ఎన్నో విషయాలు నిరంతరం సీనియర్ సభ్యుల నుండి తెలుసుకొని నడుచుకుంటానని తెలియజేస్తున్నాను, --రహ్మానుద్దీన్ (చర్చ) 15:00, 1 జనవరి 2014 (UTC)Reply

Return to the project page "అధికార హోదా కొరకు విజ్ఞప్తి/రహ్మానుద్దీన్".