వికీపీడియా చర్చ:వాడుకరి పెట్టెలు
ట్రాన్స్క్లూజన్స్ గురించి
మార్చు సహాయం అందించబడింది
ఆంగ్ల వికీలో వాడుకరి పెట్టల పేజీని చూడండి. వీటిలో ఏ వర్గాన్ని ఎంచుకొని సంబంధిత వాడుకరి పెట్టలకి వెళ్ళినా, అవి ఒక క్రమపద్ధతిలో పేర్చబడి, ప్రక్కనే ట్రాన్స్క్లూజన్ అనే లంకె కలిగి ఉన్నవి. ఈ లంకె పై క్లిక్ చేయగనే ఈ వాడుకరి పెట్టెలు ఏయే వాడుకరులు వాడుతున్నారో వారి జాబితాని చూపిస్తోంది. ఇది ఒక చక్కని సౌకర్యం. ఎందుకంటే ట్రాన్స్క్లూజన్ లంకె వలన ఒకే అంశంపై ఆసక్తి గల పలు వాడుకరులు సమిష్టి కృషి చేసి సంబంధిత వ్యాసాలను విస్తరించే అవకాశం ఉన్నది. ఇలా కాక ప్రతి వాడుకరి పెట్టెకు ఒక వర్గం చేర్చి, ఆ వర్గం లో ఉన్న వాడుకరులను సంప్రదించే సౌకర్యం ఉన్నా, ప్రతి వాడుకరి పెట్టెకు వర్గం చేయవలసిన అవసరం లేని సందర్భాలూ ఉన్నవి. అటువంటి సందర్భాలలో వాడుకరులు సహ వికీపీడియనులను సంప్రదించలేకపోవచ్చును. కావున ట్రాన్స్క్లూజన్ లంకె తెలుగు వికీలో కూడా లభ్యంగా ఉండాలని నేననుకొంటున్నాను. ప్రయత్నించాను కూడా. అయితే అది విఫల ప్రయత్నంగానే మిగిలిపోయినది. ఇలా చేయటానికి కావలసిన ఆంగ్ల మూసలలో కోడ్ ప్రొటెక్ట్ చేయబడి ఉన్నది. కావున వాటిని కాపీ చేయలేకపోయాను. అవి:
వీటి కోడ్ తెలుసుకొనగలిగితే, తెలుగు వికీలో వాడుకరి పెట్టల పేజీని కూడా ఇంగ్లీషు వికీ వాడుకరి పెట్టెల పేజీ వలె చేయవచ్చునని నా అభిప్రాయం. తద్వారా వ్యాసాల విస్తరణ లో సమిష్టి కృషి పెరుగుతుదందని నా అభిప్రాయం.
ప్రస్తుతం తెలుగు వికీలో పరిమితంగా ఉన్న వాడుకరి పెట్టెలను అపరిమితంగా పెంచే దిశలో నేను అపరిమిత కృషి చేస్తున్నా, వీటి పై భవిష్యత్తులో అపరిమిత కృషి చేసే వాడుకరులు కనీసం పరిమితంగానైనా పుట్టుకు రావచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనానికై, స్వల్పకాలంలోనే ఈ మూసలని సరి చేయటం మంచిదనుకొంటున్నాను.
దీని గురించి తెలిసిన వారు సహాయం చేయగలరు. - శశి (చర్చ) 08:18, 28 సెప్టెంబరు 2015 (UTC)
- శశి గారూ, ఈ వ్యాసంలో "భాషలు" విభాగం చూడండి. ట్రాన్స్‌క్లూజన్స్ పనిచేయుచున్నవి. సరిచేసాను. సహాయం పొందినట్లయితే {{సహాయం కావాలి}} మూసను తొలగించండి.-- కె.వెంకటరమణ⇒చర్చ 07:03, 2 అక్టోబరు 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, హృదయపూర్వక ధన్యవాదాలు! ఇక మిగతా వాడుకరి పెట్టెలకు ట్రాన్స్క్లూజన్స్ లంకె చేర్చే బాధ్యత నాది!! - శశి (చర్చ) 07:12, 2 అక్టోబరు 2015 (UTC)
- శశి గారూ, ఈ వ్యాసంలో "భాషలు" విభాగం చూడండి. ట్రాన్స్‌క్లూజన్స్ పనిచేయుచున్నవి. సరిచేసాను. సహాయం పొందినట్లయితే {{సహాయం కావాలి}} మూసను తొలగించండి.-- కె.వెంకటరమణ⇒చర్చ 07:03, 2 అక్టోబరు 2015 (UTC)
వికీకి ఏ మాత్రం సంబంధంలేని వాడుకరి పెట్టెలు తొలగించాలి
మార్చువికీపీడియా:వాడుకరి పెట్టెలు పేజీలో కొన్ని వాడుకరిపెట్టెలు వికీకి ఏ మాత్రం ఎట్టి పరిస్తితులలో సంబంధంలేని వాడుకరి పెట్టెలు ఉన్నవి.వాటిని దిగువ వివరించటమైనది. ఇవి కేవలం వ్యక్తుల అభిరుచులు లేదా వారి స్వంత అభిప్రాయాలు వ్యక్తీకరించినవి.వీటివలన వికీపీడియాకు ఎలాంటి ప్రయోజనం లేదు.వీటిని ప్రామాణికంగా చేసుకుని వారి స్వంత అభిప్రాయాలు లేదా అభిరుచులు నాకది ఇష్టం, నేను అది వాడతాను, నేను బయట తింటానికి ఇష్టపడుతాను, నాకు పంచె కట్టుకోవటం ఇష్టం, ఇలాంటి భావాలు తెలిపే వాడుకరి పెట్టెలు ఎంతమందైనా, ఎన్ని పెట్టెలు ఏయినా సృష్టించువచ్చు.ఇవి అన్ని వికీకి సంబంధంలేని అభిప్రాయలు.మరీ అలా రాసుకోవాలని కుతూహలం ఉంటే, అలాంటి సదుపాయం వికీ మనకంటూ ఒక వాడుకరిపేజీ ఇచ్చింది.అందులో రాసుకోవచ్చు.
- మూస:భర్తగా క్రూరత్వాన్ని ఎదుర్కొన్న వాడుకరి
- మూస:వరకట్న వేధింపు/గృహ హింస చట్టాలకి బలైన వారు
- మూస:ఎం బి ఏ
- మూస:ప్రత్యేక ఇసుకతిన్నె గల వాడుకరి
- మూస:కళా ప్రేమికులు
- మూస:వై దిస్ కొలవరి
- మూస:రెడీమేడ్/బిస్పోక్
- మూస:పురాతన శైలి దుస్తులు
- మూస:పాత తెలుగు సినిమా
- మూస:డయానా ఎఫ్+ వాడుకరి
- మూస:ఫిలిం ఫోటోగ్రాఫర్
- మూస:కోకా కోలా
- మూస:పాత హిందీ సినిమా
- మూస:గ్రామోఫోన్ అభిమాని
- మూస:కలర్ ఫిలిం గురించి
- మూస:నే ఛార్లీ చాప్లిన్ ని
- మూస:ఉగ్గాని
- మూస:రాగి సంగటి
- మూస:చేపలను ఆహారంగా తినే వికీపీడియనులు
- మూస:జొన్న రొట్టె
- మూస:ఫ్యాషన్
- మూస:రాజకీయాలకి దూరం
- మూస:రాజకీయ నాయకులు అబద్ధాలకోరులు
- మూస:కొండారెడ్డి బురుజు ఎక్కినవారు
- మూస:పురుష విమోచన
- మూస:పురుషవాది
- మూస:చిత్రలేఖనం
- మూస:ఛాయాచిత్రకళ సాంకేతిక అంశాలు
- మూస:వాడుకరి-ఉపాధ్యాయులు
- మూస:సాఫ్టువేర్ నిపుణులు
కావున పైన వివరించిన వాడుకరిపెట్టెలు తొలగించాలని నా అభిప్రాయం.ఇక్కడ వీటిని ఎవరు వాడుతున్నారనేది ముఖ్యం కాదు.పరిశీలించి స్పందించగలరు. యర్రా రామారావు (చర్చ) 09:25, 24 సెప్టెంబరు 2023 (UTC)
- వాడుకరులు వారి యిష్టా యిష్టాలను వాడుకరి పెట్టెల రూపంలో తమ వాడుకరి పేజీలో చేర్చడం ఆగ్లవికీలో కూడా ఆనవాయితీ గా ఉంది. ఆంగ్ల వికీలో లింకు చూడండి. ఈ వాడుకరి పెట్టెలు వికీకి ఉపయోగపడకపోయినా, వాడుకరి తన వాడుకరి పేజీలో తన వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఉన్న వాడుకరి పెట్టెలను చేర్చుకునేందుకు యిష్టపడతాడు. ఆంగ్ల వికీలో కూడా కొంతమంది వాడుకరులు వారి వాడుకరి పేజీలో తమ అభిరుచులను వ్యాస రూపంలో కాకుండా వాడుకరి పెట్టెల రూపంలో సూచించడం జరుగుతుంది. వాటి వల్ల తెవికీకి వచ్చిన నష్టం లేదు. ఏదైనా వాడుకరి పెట్టె అభ్యంతరకరమనిపిస్తే ఆ వాడుకరి పెట్టె చర్చా పేజీలో తెలియజేయండి. తొలగింపు అభ్యర్థన చేయండి. ఆన్నీ తొలగించవలసిన అవసరం లేదు. ఒక వాడుకరి పెట్టె ఎవరూ ఉపయోగించనిచో తొలగించవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:47, 24 సెప్టెంబరు 2023 (UTC)
- వాడుకరిపెట్టెలు సాధారణంగా వాడుకరి ఇష్టాలకు సంబంధించి ఉంటాయి. కాబట్టి వికీకి కొంత సంబంధం లేకుండా ఉండే అవకాశం ఉంది. దాన్ని అనుమతించవచ్చు. మరైతే, వికీకి సంబంధించని సొంత విషయాలు వాడుకరి పేజీలో రాసుకోకూడదని చెబుతున్నాం గదా.. వాడుకరి పెట్టెలను ఎలా అనుమతిస్తారు అనే ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. క్లుప్తంగా రాసుకోవచ్చని వికీ చెబుతోంది. ఉదాహరణకు, "నేనొక డాక్టరుగా పని చేస్తాను, నాకో ఆసుపత్రి ఉంది" అని రాస్తే ఓకే. కానీ, "నా ఆసుపత్రిలో ఫలానా సౌకర్యాలున్నై, అందులో ఇన్ని బెడ్లున్నై, ఆపరేషనుకు ఇంతవుద్ది, వికీపీడియన్లకు డిస్కౌంటిస్తాం,.." ఇలా రాసుకుంటూ పోతానంటే కుదరదు. అలాగే పేజీలో అసలేమీ రాయకుండా, ఒకే ఒక్క లైను - నా ఆసుపత్రి పేరు రాసాననుకోండి.. అది కూడా ప్రచారం కిందకే వస్తుంది. వాడుకరి పెట్టెలు కూడా క్లుప్తంగా రాసుకోవడం కిందకే వస్తుంది. ఈ కారణం వలన తీసెయ్యాల్సిన పన్లేదు. నా ఉద్దేశంలో వాడుకరిపెట్టె అనేది - ఫేస్‌బుక్కు, ట్విట్టర్ల లాంటి సామాజిక మాధ్యమాలకు అత్యంత దగ్గరగా ఉండే వికీ విశేషం.
- పోతే "రాజకీయ నాయకులు అబద్ధాలకోరులు" లాంటి నిందాపూర్వకమైనవి ఉండరాదు. మన అభిప్రాయం అలా ఉండడంలో తప్పు లేదేమో గానీ, దాన్ని ఇలా జనరలైజు చేసి ఒక వర్గం మనుషులందరినీ అబద్ధాల కోరులు అనడం వికీకి తగదు. ఫేస్‌బుక్కు, ట్విట్టర్ల లాంటి సామాజిక మాధ్యమాలకూ వికీకీ మధ్య ఉన్న తేడాను చెరిపేసే అంశం ఇది. ఇలాంటివి రాయకుండా నియంత్రణ పాటించాలి.
- మొత్తమ్మీద వికీ ఎక్కడైనా చెబుతున్నది ఒకటే - విచక్షణ, వివేచన వాడండి.
- వాడుకరిపెట్టెలు కొంత హాస్యస్ఫోరకంగా కూడా ఉండడం కద్దు. కానీ ఇలా - "ప్రత్యేక ఇసుకతిన్నె గల వాడుకరి" - అంటూ తికమక పెట్టేవి కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. :) __ చదువరి (చర్చ • రచనలు) 01:52, 25 సెప్టెంబరు 2023 (UTC)
- వీటిని చర్చకు పెట్టే ముందు ఆంగ్ల వికీపీడియా లింకును పరిశీలించాను.నాకైతే పై వ్యక్తిగత మూసలు అభ్యంతరంగా అనిపించి, ఆ ఉద్దేశ్యంతో చర్చకు ప్రవేశపెట్టాను. యర్రా రామారావు (చర్చ) 17:20, 25 సెప్టెంబరు 2023 (UTC)
- వాడుకరి పేరుబరిలో ఉండే అంశాలపై వికీ వ్యాసాలకు ఉండే నిబంధనలు సడలించుకోవచ్చు. వాడుకరి ఇష్టానుసారం వారి వాడుకరిపెట్టెలుంటాయి. ఇందుకు సముదాయంగా మనం కలిసి ఏమైనా నిబంధనలు ఏర్పరుచుకుని వాటిని పాటించని వాడుకరి పెట్టెలను తొలగించుకోవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 05:55, 29 సెప్టెంబరు 2023 (UTC)
- వీటిని చర్చకు పెట్టే ముందు ఆంగ్ల వికీపీడియా లింకును పరిశీలించాను.నాకైతే పై వ్యక్తిగత మూసలు అభ్యంతరంగా అనిపించి, ఆ ఉద్దేశ్యంతో చర్చకు ప్రవేశపెట్టాను. యర్రా రామారావు (చర్చ) 17:20, 25 సెప్టెంబరు 2023 (UTC)