వికీపీడియా చర్చ:విషయ ప్రాముఖ్యత
తాజా వ్యాఖ్య: అథారిటీ కంట్రోల్ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
అథారిటీ కంట్రోల్
మార్చుఒక వ్యాసపు విషయ ప్రాముఖ్యతను నిర్ధారించేందుకు {{Authority control}} మూసను ప్రామాణికంగా తీసుకోవచ్చా? వ్యాస విషయం (వ్యక్తి, సంస్థ వగైరాలు) VIAF వంటి అంతర్జాతీయ డేటాబేసుల్లో చోటు చేసుకుంటేనే ఈ మూసలో కనిపిస్తుంది. లేకపోతే మూసను పేజీలో పెట్టినా ప్రచురించాక కనిపించదు. ఇది లేనంత మాత్రాన, ప్రాముఖ్యత లేనట్టేనని నా ఉద్దేశం కాదు. కాని ఇది ఉంటే మాత్రం విషయ ప్రాముఖ్యత ఉన్నట్టే అని అనుకోవచ్చా? అని నా ఆలోచన. వాడుకరులు స్పందించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 08:31, 16 ఫిబ్రవరి 2019 (UTC)
- చదువరి గారు, వ్యక్తికి ఆధార్ ఎలాగో ఒక రచయితను నిర్దిష్టంగా గుర్తించటానికి ఇచ్చే సంఖ్యమాత్రమే కావున అది ప్రాముఖ్యతకు ఆధారం కాకూడదు. --అర్జున (చర్చ) 00:15, 6 ఏప్రిల్ 2021 (UTC)
- నాకు తెలిసినంతవరకు అథారిటీ కంట్రోల్ దాదాపు ప్రచురితమైన అన్ని పుస్తకాల రచయితలకు, కొద్దో గొప్పో పేరున్న సంస్థలకు కూడా ఐడీలు ఇస్తూ వస్తోంది. అందునా అవి ఇటీవలివి అయితే వాటికి ఐడీ తప్పక లభిస్తోంది. కాబట్టి దీని ఆధారంగా ప్రాముఖ్యతను అంచనా వేయకూడదని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 08:22, 6 ఏప్రిల్ 2021 (UTC)
- @Arjunaraoc గారూ, ఆధార అనేది ప్రతీ వ్యక్తికీ తప్పనిసరి. ప్రతీ మనిషికీ ఉండే గుర్తింపది. అథారిటీ అలాంటిది కాదు. మీ పోలిక కుదరదు.__ చదువరి (చర్చ • రచనలు) 05:40, 7 ఏప్రిల్ 2021 (UTC)