వికీపీడియా చర్చ:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2022

ఇక్కడ వాడుకరులు మీమీ అభిప్రాయాలను తెలియజేయగలరు.
సాయి కిరణ్ గారూ, వికీ పేజెస్ వాంటింగ్ ఫోటోస్ ప్రాజెక్టు కి సంబంధించిన మిగిలిన గ్రాంటు ఈ సమావేశానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఆలోచించగలరు--అభిలాష్ మ్యాడం (చర్చ) 15:50, 7 నవంబరు 2022 (UTC)Reply

అభిలాష్ మ్యాడం గారు మీరడిగిన వివరాలు త్వరలో తెలియజేస్తాను, కాస్త ఇతర పనులలో ఉండటం మూలాన ఆలస్యం అవుతోంది. NskJnv 12:53, 23 నవంబరు 2022 (UTC)Reply

ఎజెండాలో ఏమేముండాలి? మార్చు

నా అభిప్రాయాలివి: ఉదయం 10:30 కు మొదలెడదాం. సమావేశపు ఎజెండాలో-

  1. పరిచయ కార్యక్రమం - (అరగంట)
  2. తెవికీలో మన విజయాలు, సాధించిన ప్రగతి, సాధించలేకపోయినవి, మన వైఫల్యాలు, మన సమస్యలు -వీటిని సమీక్షించుకోవాలి. ఇకపై మనం చెయ్యాల్సినదేంటి అనేది చర్చించాలి. (గంటన్నర)
  3. యూజరు గ్రూపు గురించి చర్చ. ఎలా ఏర్పాటు చెయ్యాలి, ఎవరెవరు బాధ్యత తీసుకుంటారు వగైరాలు. అక్కడ ప్రాథమికంగా చర్చ జరిగిన తరువాత దాన్ని తెవికీలో సముదాయంలో చర్చ కోసం పెట్టి, తుదిరూపు నిద్దాం. (అరగంట)
  4. భోజనాలు, పిచ్చాపాటీ (గంట)
  5. తెవికీ ఆఫ్‌లైను పనులు: తెవికీ సముదాయం ఆఫ్‌లైనులో ఏమేం పనులు చెయ్యవచ్చు, చెయ్యాలి (శిక్షణ, వాడుకరులు కలవడాలు, వగైరాలు), ఎలా చెయ్యాలి అనే సంగతులు. కొత్త వాడుకరులను తీసుకురాటానికి ఇప్పటి వరకూ అనేక స్థాయిల్లో ప్రయత్నాలు జరిగాయి. పెద్దపెద్ద సంస్థలు కూడా ధన సంపత్తులతో రంగం లోకి దిగాయి గానీ పెద్దగా ప్రయోజనం కలగలేదు. కొత్త వాడుకరులను తీసుకురావడం అనేది అంత తేలిక కాదని పదేపదే తేలింది. దీనికి ఇతర మార్గాలు/పద్ధతులూ ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిద్దాం. ఆలోచనలను కలబోసుకుందాం. (గంట)

మధ్యాహ్నం 3 గంటలకు సమాప్తి సమావేశం తరువాత చెయ్యాల్సిన పనులు

  1. సమావేశపు నివేదికను మరుసటి రోజునే తెవికీలో పెడదాం.
  2. సమావేశంలో చేసిన నిర్ణయాలు, వాటి అమలుకు ఎవరెవరు బాధ్యులు అనేది విడిగా చూపిద్దాం.
  3. ఆయా నిర్ణయాలపై జరిగిన పనులను నెలకోసారి సమీక్ష కూడా చేసుకుందాం.

చదువరి (చర్చరచనలు) 01:45, 18 నవంబరు 2022 (UTC)Reply

చదువరి గారు ప్రస్తావించిన ఎజెండా అంశాలకు, సమావేశం తరువాత చెయ్యాల్సిన పనులతో ఏకీభవిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:46, 19 నవంబరు 2022 (UTC)Reply
చదువరి గారు ప్రస్తావించిన అన్ని అంశాలు బాగున్నాయి. నేనూ ఏకీభవిస్తున్నాను.-అభిలాష్ మ్యాడం (చర్చ) 10:50, 19 నవంబరు 2022 (UTC)Reply
  1. తెలుగు వికీపీడియా లో ఉన్న ప్రస్తుత పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము వంటి పేజీలలో చాలా పాత సమాచారం ఉన్నది, తెలుగు వికీ అప్రమేయ రూపురేఖలు మారుతున్నాయి కాబట్టి తదనుగుణంగా కొత్త వాడుకరుల కోణంలో సమీక్ష జరగాలి, అలాగే లాగిన్ అయిన తర్వాత స్వాగత సందేశం మీద, గురువుగా కేటాయించిన తర్వాత తదుపరి ప్రణాళికల మీద కూడా చర్చ జరగాలి. --Kasyap (చర్చ) 04:40, 20 నవంబరు 2022 (UTC)Reply

తేదీ ప్రదేశం నిర్వహణ వగైరాలు మార్చు

తేదీ: డిసెంబరు 10, 11 (2 వ శని, ఆది వారాలు) గానీ, 18 (మూడవ ఆదివారం) గానీ పెట్టుకోవచ్చు. 25 (నాలుగో ఆదివారం) కూడా అనుకూలమే. నాకు వీటిలో ఏదైనా అనుకూలమే. ప్రదేశం: @Pranayraj1985 గారూ, మీ వద్ద కుదురుతుందేమో పరిశీలించవలసినది. చదువరి (చర్చరచనలు) 02:14, 18 నవంబరు 2022 (UTC)Reply

18 (మూడవ ఆదివారం) కాకుండా నాకు ఏదైనా అనుకూలమే. యర్రా రామారావు (చర్చ) 06:49, 18 నవంబరు 2022 (UTC)Reply
పైన తెలిపిన ఏ తేదీలలో అయినా పాల్గొనడానికి నేను సిద్ధం-అభిలాష్ మ్యాడం (చర్చ) 10:52, 19 నవంబరు 2022 (UTC)Reply
@Chaduvari గారూ, రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ను డిసెంబరు 11 (2వ ఆదివారం) నాడు ‘కవితో పరిచయం’ అనే కార్యక్రమంకి ఇచ్చేసారని తెలిసింది. డిసెంబరు 10 (2వ శనివారం), 18 (మూడవ ఆదివారం), 25 (నాలుగో ఆదివారం) లలో ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:53, 19 నవంబరు 2022 (UTC)Reply
@Chaduvari గారూ, డిసెంబరు 22 నుండి జనవరి 1 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతోంది. డిసెంబరు 25 (నాలుగో ఆదివారం)న మనం జన్మదిన వేడుక నిర్వహించుకుంటే, ఆ సాయంత్రం వికీపీడియన్ల బుక్ ఫెయిర్ సందర్శన కార్యక్రమం కూడా చేపట్టవచ్చని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:29, 23 నవంబరు 2022 (UTC)Reply
అలాగేనండి.__ చదువరి (చర్చరచనలు) 10:32, 23 నవంబరు 2022 (UTC)Reply
బుక్ ఫెయిర్ కార్యక్రమం ఉంది కాబట్టి 25 (నాలుగో ఆదివారం) నాడు తెవికీ జన్మదిన వేడుక జరపటానికి నా మద్దతు ప్రకటించుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 13:17, 23 నవంబరు 2022 (UTC)Reply
ప్రదేశం విషయంలో ఒకవేళ రవీంధ్ర భారతి కాకుండా, ఇంకా ఎక్కడైనా (హైదారాబాదులో) జరుపుదాం అనే ఉద్ధేశ్యం ఉన్నవారు, ఇంకోచోట అనువైన ప్రదేశం ఉచితంగా లభిస్తే అభిప్రాయాలు తెలుపవలసింది.దానిమీద సముదాయ సభ్యులు అభిప్రాయాలు తెలపగలరు. యర్రా రామారావు (చర్చ) 13:27, 23 నవంబరు 2022 (UTC)Reply
25 (నాలుగో ఆదివారం) కూడా నాకు వేరే ముఖ్యమైన ఫంక్షన్ అనుకోకుండా ఉన్నట్లుగా నాకు తెసిసింది.అందువలన నాకు అనుకూలంగా లేదు. యర్రా రామారావు (చర్చ) 14:01, 28 నవంబరు 2022 (UTC)Reply

జన్మదిన వేడుక జరపటానికి ఏమైనా ఇబ్బందులు కలవా,ఒకవేళ రవీంధ్ర భారతి కాకుంటే వేదికను ఐఐఐటీ ప్రాంగణంలో జరపె అవకాశం ఉంటే నాకు తెలియచేయగలరు.ఈ సారికి విజయవాడ అయినా బాగుంటుంది అని నా వ్యక్తిగత ఆలొచన.--Kasyap (చర్చ) 06:53, 29 నవంబరు 2022 (UTC)Reply

విజయవాడకు సంబంధించి ప్రతిపాదనలేమీ రాలేదు. ఇక హైదరాబాదునే ఖాయం చేసుకుందామని నా అభిప్రాయం. @Pranayraj1985 గారూ వేరే అభిప్రాయాలేమీ రాలేదు కాబట్టి నాలుగో ఆదివారం - డిసెంబరు 25 న పైడి వీర్రాజు థియేటరు లోనే జరుపుకుందాం. __ చదువరి (చర్చరచనలు) 10:33, 9 డిసెంబరు 2022 (UTC)Reply
అలాగేనండీ @Chaduvari గారు, తెవికీ జన్మదిన వేడుక నిర్వహణకు సంబంధించి ఒక నిర్వహణ సమన్వయ జట్టును కూడా ఏర్పాటుచేసుకొని కార్యక్రమాన్ని జరుపుకుందామని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:08, 11 డిసెంబరు 2022 (UTC)Reply
సరేనండి. నన్ను కూడా నిర్వాహక జట్టులో కలుపుకోండి. __ చదువరి (చర్చరచనలు) 08:11, 11 డిసెంబరు 2022 (UTC)Reply
చదువరి, యర్రా రామారావు, అభిలాష్ మ్యాడం, కశ్యప్, సాయికిరణ్ గార్లకు.... వికీ జన్మదిన వేడుక నిర్వహణ (డిసెంబరు 25న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) వేదికకు సంబంధించి మామిడి హరికృష్ణ గారి నుండి అనుమతి తీసుకున్నాను. వేడుకల నిర్వహణ పనులను ప్రారంభించుకుందాం. ఈ విషయంపై చర్చించవలసిందిగా కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:32, 19 డిసెంబరు 2022 (UTC)Reply
@Pranayraj1985 గారూ ధన్యవాదములు, ఈ ఏడాది పుస్తక ప్రదర్శనలో తెలుగు వికిపీడియా స్టాలు మీద ఏమైనా సమాచారం ఉన్నదా దానిని బట్టి మనం ఔత్సాహికులకు వికీ జన్మదిన వేడుకలో ఎదైనా పరిచయ కార్యక్రమం నిర్వహించవచ్చు. Kasyap (చర్చ) 04:55, 19 డిసెంబరు 2022 (UTC)Reply
ప్రణయ్ రాజ్ గారూ ధన్యవాదాలు.ఇక వేడుకల నిర్వహణ పనులను ప్రారంభించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 06:37, 19 డిసెంబరు 2022 (UTC)Reply
ధన్యవాదాలు @Pranayraj1985 గారు. __చదువరి (చర్చరచనలు) 06:35, 19 డిసెంబరు 2022 (UTC)Reply
Pranayraj1985 గారు, WPWPTE కి సంబంధించిన గ్రాంటు కొంత మిగిలి ఉంది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో మనం ఒకసారి అనుకుంటే, దానిపై తగిన నిర్ణయం తీసుకుందాం.NskJnv 12:53, 20 డిసెంబరు 2022 (UTC)Reply
ఎంత మిగిలింది అని వివరం తెలుపవచ్చుగదా?దానినిబట్టి కూడా ప్లాను చేసుకోవచ్చు. యర్రా రామారావు (చర్చ) 13:08, 20 డిసెంబరు 2022 (UTC)Reply
యర్రా రామారావు గారు, అక్షరాలా 53,000 యాభై మూడు వేయిలు మిగిలింది అండి, దీని ఉపయోగం పట్ల మీ అభిప్రాయం తెలియజేయగలరు. NskJnv 13:18, 20 డిసెంబరు 2022 (UTC)Reply
ధన్యవాదాలు @Nskjnv గారు. మన కార్యక్రమ నిర్వహణలో భాగంగా రెండు ఫ్లెక్సీలు (12*8 సైజు వేదిక, 8*8 సైజు బయట), తెవికీ జన్మదిన వేడుక కేకు, వచ్చిన సభ్యులను బట్టి మధ్యాహ్న భోజనం-టీ-స్నాక్స్, తెవికీ బ్యాడ్జీలు వంటివి అవసరమతున్నాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:43, 20 డిసెంబరు 2022 (UTC)Reply
Pranayraj1985 గారు, అలాగే నండి, దీనికి సంబంధించి తన్వీర్ హస్సన్(వికీమీడియా) గారి అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది. NskJnv 17:04, 20 డిసెంబరు 2022 (UTC)Reply
అలాగేనండి @Nskjnv గారు..!-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:44, 21 డిసెంబరు 2022 (UTC)Reply
వేడుక నిర్వహణలో భాగంగా ఫ్లెక్సీ (డిజైన్, ప్రింట్, పేస్టింగ్)లకు 3వేలు, మధ్యాహ్న భోజనంకు 2వేలు, కేకు-స్నాక్స్ లకు 1వేయి రూపాయలు... మొత్తంగా 6వేలు ఖర్చయ్యాయి. @Nskjnv గారూ, WPWPTE గ్రాంటు గురించి తన్వీర్ హస్సన్(వికీమీడియా) గారి అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది అన్నారు కదా, దాని గురించి అప్డేట్ చేయగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:32, 4 జనవరి 2023 (UTC)Reply
నమస్కారం ప్రణయ్‌రాజ్ వంగరి గారు, వేడుక నిర్వహణలో భాగంగా ఫ్లెక్సీ (డిజైన్, ప్రింట్, పేస్టింగ్)లకు 3వేలు, మధ్యాహ్న భోజనంకు 2వేలు, కేకు-స్నాక్స్ లకు 1వేయి రూపాయలు... ఈ ఖర్చులకి సంబంధించి రసీదులు పంపగలరు. ఒకవేళ ఆ రసీదులు లేకపోతే ఖర్చులని ఒక పట్టికలో రాసి ఈ కార్యక్రమానికి ఉపయోగించినట్టు ఒక పేపరు పై సంతకం చేసి పంపగలరు. మీ బ్యాంకు వివరాలు వగైరా తో నాకు wikikiranam@gmail.com మెయిల్ చేయగలరు. తద్వారా మీరు ఖర్చు చేసిన డబ్బులని మీకు అందిచగలను.

ధన్యవాదాలు - NskJnv 03:03, 19 జూలై 2023 (UTC)Reply

అలాగేనండీ @Nskjnv గారు. ఖర్చులకి సంబంధించిన రసీదులను పంపిస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:28, 20 జూలై 2023 (UTC)Reply

పత్రికా వ్యాసం మార్చు

వికీపీడియా గురించి పత్రికా వ్యాస విషయాన్ని గతంలో చర్చించుకున్న విషయం అందరికీ తెలిసిందే.. దీనికి సంబంధించి పత్రికా వ్యాసం తెవికీ జన్మదినమైన 10నాడు ప్రచురితమైతేనే బావుంటుందని నా అభిప్రాయం.-అభిలాష్ మ్యాడం (చర్చ) 10:43, 9 డిసెంబరు 2022 (UTC)Reply

తుది అజెండా మార్చు

పైన అజెండాకు సంబంధించి కొంత చర్చ జరిగింది దాన్ని బట్టి అజెండాకు తుది రూపును ఇలా అనుకుంటున్నాను. పరిశీలించండి:

  1. పరిచయ కార్యక్రమం, తెవికీ జన్మదిన వేడుక కేకు కటింగ్ - (అరగంట)
  2. తెవికీలో మన విజయాలు, సాధించిన ప్రగతి, సాధించలేకపోయినవి, మన వైఫల్యాలు, మన సమస్యలు -వీటిని సమీక్షించుకోవాలి. ఇకపై మనం చెయ్యాల్సినదేంటి అనేది చర్చించాలి. (గంట)
  3. యూజరు గ్రూపు గురించి చర్చ. ఎలా ఏర్పాటు చెయ్యాలి, ఎవరెవరు బాధ్యత తీసుకుంటారు వగైరాలు. అక్కడ ప్రాథమికంగా చర్చ జరిగిన తరువాత దాన్ని తెవికీలో సముదాయంలో చర్చ కోసం పెట్టి, తుదిరూపు నిద్దాం. (అరగంట)
  4. కొత్త వాడుకరులకు గురువు కేటాయింపు జరిగిన తరువాత ఏం జరగాలి అనేదానిపై చర్చ (అరగంట)
  5. భోజనాలు, పిచ్చాపాటీ (గంట)
  6. తెవికీ ఆఫ్‌లైను పనులు: తెవికీ సముదాయం ఆఫ్‌లైనులో ఏమేం పనులు చెయ్యవచ్చు, చెయ్యాలి (శిక్షణ, వాడుకరులు కలవడాలు, వగైరాలు), ఎలా చెయ్యాలి అనే సంగతులు. కొత్త వాడుకరులను తీసుకురాటానికి ఇప్పటి వరకూ అనేక స్థాయిల్లో ప్రయత్నాలు జరిగాయి. పెద్దపెద్ద సంస్థలు కూడా ధన సంపత్తులతో రంగం లోకి దిగాయి గానీ పెద్దగా ప్రయోజనం కలగలేదు. కొత్త వాడుకరులను తీసుకురావడం అనేది అంత తేలిక కాదని పదేపదే తేలింది. దీనికి ఇతర మార్గాలు/పద్ధతులూ ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిద్దాం. ఆలోచనలను కలబోసుకుందాం. (గంట)

మధ్యాహ్నం 3 గంటలకు సమాప్తి చదువరి (చర్చరచనలు) 06:51, 19 డిసెంబరు 2022 (UTC)Reply

@Chaduvari గారూ, పైన మీరు రాసిన తుది అజెండాలోని అంశాల విషయంలో నా అంగీకారాన్ని తెలియజేస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:40, 20 డిసెంబరు 2022 (UTC)Reply
ముఖ్య కార్యక్రమం భోజనాలకు ముందు ముగించి తరువాత అందరం పుస్తక ప్రదర్సనలో తెలుగు వికిపీడియా స్టాలు వద్దకు వెళ్ళి సాయంత్రం వరకూ అక్కడే ప్రచారం చెస్తే బాగుంటుంది అనేది నా విన్నపం, సెలవరోజు కాబట్టి సందర్సకుల తాకిడి కూడా వుండవచ్చు.
అతి ముఖ్యంగా కొత్తవారిని ఎలా నిలుపుకోవాలి,అసలు వికి పీడియా చెపుతున్న మార్గదర్శకాలు ఎమిటి అన్న వాటిమీద చర్చ జరగాలి. Kasyap (చర్చ) 09:33, 20 డిసెంబరు 2022 (UTC)Reply

సమావేశం కోసం చెయ్యాల్సిన సన్నాహాలు మార్చు

నాకు తట్టిన కొన్ని సన్నాహకాలు:

  • తెవికీలో జరిగిన పనిని సమీక్షించేందుకు (అజెండాలో 2 వ అంశం) గాను కొంత డేటా చేతిలో ఉంటే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. తెవికీ గణాంకాల పేజీల్లో అందుకు తగ్గ డేటా దొరకొచ్చు. అందులోంచి పనికొస్తుందనుకున్న డేటాను ప్రింటు తెచ్చుకుందాం.
  • యూజరు గ్రూపు గురించిన సమాచారాన్ని ముందే మనం ప్రింట్లు తీసి తెచ్చుకుంటే చర్చలో సౌలభ్యంగా ఉంటుంది.
  • సమావేశంలో భోజనం, టీ కాఫీలు వగైరాల కోసం ముందే ఆర్డరిచ్చి పెట్టుకోవాలి. లేదా సమావేశం మొదలవగానే ఎంతమంది వచ్చారో చూసుకుని అప్పుడైనా ఆర్డరివ్వవచ్చు.
  • సమావేశమయ్యాక, పుస్తక ప్రదర్శనకు వెళ్ళాలని అమ్నుకుంటున్నాం కాబట్టి, దానికి కొంత సన్నాహాలు చేసుకుంటే బాగుంటుంది. అవి -
    • చొక్కాలకు పెట్టుకోడానికి ఒక బ్యాడ్జీ. ఆ బ్యాడ్జీలను సిద్ధం చేసి పెట్టుకోవాలి.
    • పుస్తక ప్రదర్శనలో ఉంచేందుకు కొన్ని కరపత్రాలను, బ్యానర్లను, పోస్టర్లను సిద్ధం చేసుకోవడం. ఈసారి కొంత వినూత్నంగా చేద్దాం.
    • ప్రచార ధోరణిని కొంత మారుద్దాం.. "వికీపీడియా చదువుతున్నారు సరే.. కానీ అక్కడ మీరు ఎందుకు రాయడం లేదు?" అనో, "మీరు వికీపీడియాలో ఎందుకు రాయాలంటే.." - ఇలాంటి థీములతో ప్రచారం చేద్దాం. వికీ గురించి పరిచయం చేద్దాం అనేది పాత సంగతి, ఇక ఆ మూడ్ నుండీ ఆ మోడ్ నుండీ బయటికి వచ్చేద్దాం (ఎన్నాళ్లని పరిచయం చేస్తాం? ఎంత చేసినా, అందరికీ తెలిసేలా చేసేటప్పటికి ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోతాయ్). ప్రజలకు వికీ గురించి తెలుసు అనే అనుకుందాం (కొత్తగా తెలుసుకునేవాళ్లకు అరె నాకు తెలియలేదే.. అని అనిపించాలి కనీసం). అలాంటి ప్రచారాలతో బ్యానర్లను, పోస్టర్లు తయారు చేసుకుందాం. లేదా ప్రభుత్వం వారే తయారుచేసి పెట్టినా సరే.
    • పుస్తక ప్రదర్శనలో వికీ గణాంకాల సైజులను ప్రదర్శించి "ఆహా..!" అనిపిద్దాం. ఉదాహరణకు - "వికీపీడియా వ్యాసాలన్నిటినీ ముద్రిస్తే మొత్తం 4 లక్షల పేజీలౌతాయని మీకు తెలుసా?", "ఈ సమాచారం మొత్తం ఉచితమేనని, దాన్ని పుస్తకాలుగా ముద్రించి అమ్మేసుకోవచ్చనీ మీకు తెలుసా?", "వికీపీడియా సమాచారాన్ని అనేక పత్రికలు కాపీ చేస్తుంటాయని మీకు తెలుసా?" లాంటి ప్రశ్నలడుగుదాం.

గమనిక: ప్రింట్లు తీసి తెచ్చుకున్న అంశాలకు సంబంధించి - చర్చ ఆ ప్రింట్ల లోని అంశాలకే పరిమితమవ్వాల్సిన ఆవశ్యకత లేదు. అవి కేవలం చర్చా సౌలభ్యం కోసం మాత్రమే. __చదువరి (చర్చరచనలు) 07:21, 19 డిసెంబరు 2022 (UTC)Reply

@Chaduvari గారూ... పుస్తక ప్రదర్శనలోని తెవికీ స్టాల్ లో సందర్శకులకు పంచేందుకు ప్రభుత్వం వారే కరపత్రాలను, బ్యానర్లను, పోస్టర్లను ముద్రించి మనకు ఇస్తారు. అంతేకాకుండా స్టాల్ లో ఈసారి డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామనీ అందులో పోస్టర్లు, పవర్ పాయింట్ ప్రజంటేషన్, ఫోటోలు, వీడియోల ద్వారా వినూత్నంగా తెవికీ గురించి తెలియజేసేలా చేద్దామని, అందుకు ఎలాంటివి చేస్తే బాగుంటుందో సముదాయ సభ్యులు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం వారు కోరారు. వికీ ప్రచారం గురించి పైన మీరు చెప్పినవి బాగున్నాయి, అలాగే మనం తెవికీ ప్రత్యేకత గురించి వార్తాపత్రికల్లో ఇవ్వాలి అనుకున్న అంశాలు (గ్రామ-సినిమా వ్యాసాలు, తెవికీ విజయాలు వంటివి)తో కూడినవి కూడా తయారుచేసి ప్రదర్శిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:36, 19 డిసెంబరు 2022 (UTC)Reply
Return to the project page "సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2022".