వికీపీడియా చర్చ:AWB ఖాతా అనుమతి విధానం

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

రచ్చబండలో జరిగిన చర్చలో చర్చించిన వాటిని ఇక్కడ కొంత విపులంగా రాసాను. 500 దిద్దుబాట్లు ఏ పేరుబరి లోనైనా చెయ్యవచ్చని మార్చాను. అక్కడ చర్చించనివి, ఇక్కడ చేర్చినవీ ఇవి:

  1. నిర్వాహకులు కూడా కొత్త ఖాతాలు సృష్టించుకుని అనుమతులు కోరాలి. AWB తో ఏమైనా నిర్వాహక పనులు చెయ్యాలంటే మాత్రమే తమ నిర్వాహక ఖాతాలు వాడాలి.
  2. ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకునే విధానం

పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 10:36, 2 అక్టోబరు 2020 (UTC)Reply

ఆటోవికీబ్రౌజరు ఉపయోగాల మీద మరింత అవగాహనకు సభ్యులకు కార్యశాల నిర్వహించాలి , అప్పుడు సభ్యులు దీని మీదపనిచేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించవచ్చు Kasyap (చర్చ) 06:20, 3 అక్టోబరు 2020 (UTC)Reply
ఆలోచన బాగుంది Kasyap గారు. ఈ కార్యశాలలో నేనూ పాల్గొంటాను. నన్ను తోడ్పడమంటే నాకు తెలిసినంతలో, చేతనైనంతలో ప్రయత్నమూ చెయ్యగలను. __చదువరి (చర్చరచనలు) 06:25, 3 అక్టోబరు 2020 (UTC)Reply
Kasyap గారి ఆలోచన బాగుంది.చదువరి గారూ తోడ్పాటు అందిస్తామన్నారు.ఇది అవసరం కూడా. కార్యశాల పనిని కశ్యప్ గారు చేపట్టవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:40, 3 అక్టోబరు 2020 (UTC)Reply

ధ్యన్యవాదములు , చదువరి గారు (వాడుకరి:ChaduvariAWBNew), వెంకటరమణ గారు (వాడుకరి:K.Venkataramana.AWB),యర్రా రామారావు గారు యర్రా రామారావు , అనుమతి పొందియున్నారు , ఇంకా చురుకుగా మార్పులు చేస్తున్నారు కావున మీలో ఎవరైనా మాకు శిక్షణ ఇవ్వగలరు మీకు అనుకూలం అయిన తెదీ సమయం తెలుపగలరు . దీనికి సంబంధించిన JioMeet వంటి వాటి ఉపకరణాల వాడకంలో సహాయం ,ఇతర సాంకేతిక అంశాలు నేను సభ్యులతో సమన్వయం చేస్తాను. : Kasyap (చర్చ) 10:34, 3 అక్టోబరు 2020 (UTC)Reply

సరేనండి Kasyap గారు, నేను సిద్ధమే. నా శక్తి మేరకు ఈ పని చేస్తాను. పగలైతే ఆదివారం నాడు, రాత్రి 8 గంటల తరువాతనైతే ఏ రోజైనా నాకోకేనండి. __చదువరి (చర్చరచనలు) 10:49, 3 అక్టోబరు 2020 (UTC)Reply
Return to the project page "AWB ఖాతా అనుమతి విధానం".