వికీపీడియా చర్చ:WikiProject/జీవ శాస్త్రము
జీవ శాస్త్రము ప్రాజెక్టు
మార్చునన్ను ఈ పనిలో నియమించినందుకు ధన్యవాదాలు. దీనికి ఒక ప్రణాలిక వేసుకొంటే మంచిది. లేకపోతే గుడ్డి ఎద్దులాగా తయారైతాము. నేను చేయవలసిన పనెమిటో తెలిపితే బాగుంటుంది. జీవ శాస్త్రము కు సంబంధించిన పేజీల జాబితా ఎలా తయారుచేస్తారో చెబితే నేను ప్రయత్నిస్తాను. వర్గీకరణకు సంబంధించిన మూసల్ని మీరు తయారుచేస్తే మంచిది.ఇవికీనుండి కాపీచేస్తే అవి పనిచేస్తాయా లేదా నాకు తెలియదు. చర్చపేజీలలో ప్రాజెక్టు మూసను పెడుతున్నాను. శరీర అవయవాల్ని శరీర నిర్మాణ శాస్త్రము వర్గంలో ఉంచుతున్నాను. మనంఈ పనిని మంచిగా పూర్తిచెయాలని నా కాంక్ష.Rajasekhar1961 11:06, 12 ఆగష్టు 2007 (UTC)
- ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సరంజామా అంతా నేను సమకూర్చలేదు. అందుకనే మీకేపనీ అప్పుడే పురమాయింలేదు. అయినా చొరతీసుకొని చర్చాపేజీలో ప్రాజెక్టు మూసలు అంటించినందుకు కృతజ్ఞతలు. వర్గీకరణ మూసలు నేను తయారుచేస్తాను. జాబితా తయారు చెయ్యటం సులభమే (అంటే ఇది ఇప్పటిదాకా తెవికీలో జీవశాస్త్రానికి సంబంధించిన వ్యాసాల లిస్టన్నమాట. జీవశాస్త్రపు వ్యాసాల జాబితా ఇక్కడ ప్రారంభిద్దాం . ఈ ప్రాజెక్టు బాగా తీర్చిదిద్దాలనే నా ఆకాంక్ష కూడా --వైజాసత్య 11:31, 12 ఆగష్టు 2007 (UTC)
ప్రస్తుతానికి ప్రణాళిక ఇది. (డిటైల్సు చర్చించుకొని నిర్ణయించుకుందాం)
- వ్యాసాల జాబితా తయారు చేసుకుంటే అన్ని వ్యాసాల లింకులు ఒక దగ్గర ఉంటాయి.
- ఆ తరువాతా జాబితాలోని వ్యాసాలన్నింటికీ చర్చాపేజీలలో మూసలు అంటించాలి. (జాబితా ఉంటుంది కాబట్టి ఏవీ మిస్ కాకుండా అంటించవచ్చు)
- వ్యాసాల నాణ్యతను మరియు ప్రాముఖ్యతను బేరీజు వెయ్యాలి. (నాణ్యత అంటే మొలక దశలో ఉన్నదా? ఆరంభ దశలో ఉన్నదా వగైరా..ప్రాధాన్యత అంటే విజ్ఞానసర్వస్వానికి ఆ వ్యాసం ఎంత ముఖ్యమైనదన్న సమాచారం)
- సత్యరము పనిచేయాల్సిన వ్యాసాలను గుర్తించి వాటిని అభివృద్ధి చెయ్యటం
ఒకసారి మీరు వికీపీడియా:WikiProject/భారతదేశ చరిత్ర పేజీ చూస్తే మరింత అవగాహన వస్తుంది