వికీపీడియా చర్చ:WikiProject/హిందూమతం
హరె రామ హరె రామ రామ రామ హరె హరె హరె క్రిష్న హరె క్రిష్న క్రిష్న క్రిష్న హరె హరె
Thanks and regards, Rama Krishna kotteti
మహాభారత కథ కు అనువైనది వికీబుక్స్
మార్చు- ఈ ప్రాజెక్టులో చాల పని జరిగింది, సుజాత గారు చాలా సమాచారం చేరుస్తున్నారు. అయితే వికీపీడియా కన్న వికీబుక్స్ దీనికి సరియైనదిగా అనిపించింది. ఈ విషయమై, ఇంతకు ముందు చర్చ జరిగినట్లైతే, ఆ వివరాలు తెలియచేయండి. ఇలాగే కొనసాగితే, ముందు వికీబుక్స్ లో కి మార్చటానికి కష్టం కలుగవచ్చు. --అర్జున 06:07, 24 సెప్టెంబర్ 2010 (UTC)
- ఈ మహాభారతకధను వికీ బుక్స్‌కు మార్చడం సమంజసమని మిగిలిన అనుభవజ్ఞులైన సభ్యులు అభిప్రాయం వెలిబుచ్చితే మార్చ వచ్చు. స్వర్గారోహణ వరకూ వ్రాసి. తరువాత హరివంశం వరకూ వ్రాయాలని అనుకుంటున్నాను. అందరి ఏకాభిప్రాయంతో ఈ పని కొనసాగిస్తాము.--t.sujatha 06:25, 24 సెప్టెంబర్ 2010 (UTC)
- ఇది స్వంత అనువాదము కాదు. వికీబుక్స్ చదివేవారు తక్కువ. వికీపీడియా చదివే వారు ఎక్కువ. వికీ బుక్స్‌లో ఉంటే పాఠకులకు అందుబాటులో ఉండదు. వ్రాసినదానికి కాని చదివేవారికి గాని ప్రయోజనము ఉండదు. --t.sujatha 02:16, 12 అక్టోబర్ 2011 (UTC)
- అయితే వికీసోర్స్ దీనికి సరిపోయిన ప్రాజెక్టు. వికీపీడియా లో వుంది కాబట్టి ఎక్కువమంది చదువతారనుకోవటం పొరపాటు. ఇటువంటివాటివలన వికీపీడియా మౌలిక స్వభావం మారిపోతే దాని విలువే తగ్గిపోతుంది. ఆలోచించండి. -- అర్జున 07:20, 13 అక్టోబర్ 2011 (UTC)
- అర్జునరావుగారూ తెవికీలో వ్రాస్తున్న మహాభాతంలోని అశ్వాసాలు కేవలం వ్యవహారిక భాషలో ఉన్న సంక్షిప్త స్వరూపం మాత్రమే వికీ సోర్స్‌లో సంస్కృతంలో ఉన్న వ్యాసమహర్షి వ్రాసిన మూలభారతం లేదంటే కవిత్రయం ఆంధ్రీకరించిన పద్యరూపమైన మహాభారతం లాంటివి మాత్రమే చేర్చవచ్చని నేను అనుకుంటున్నాను. అత్యంత విలువైనవి, అత్యున్నత పురస్కారాలు అందుకున్నవి, పురాతనమైనవి అయిన గ్రంధాలు మాత్రమే వీకీసోర్స్‌లో భద్రపరుస్తున్నారు. కాసుబాబుగారికి ఈ విషయంలో అవగాహన బగాఉంది. వారికి మహాభఅరతం వ్యాసాల విషయంలో ఆసక్తిఉంది. దీనిని వికీసోర్స్ ఉంచడం ఉచితమని మీరంతా అనుకుంటే మీరు చేర్చవచ్చు. t.sujatha 08:13, 13 అక్టోబర్ 2011 (UTC)
- సుజాత గారు చెప్పినట్లు ఇది మహాభారతం సంక్షిప్తరూపం మాత్రమే అయినట్లయితే వికీసోర్స్‌కు తరలించే అవసరం లేదనుకుంటాను. అనుమతి పొందబడిన లేదా కాపీ హక్కుల కాలం ముగిసిన గ్రంథాల పూర్తిరూపం అయితేనే వికీసోర్స్
లేదా వికీబుక్స్‌లో చేర్చవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:59, 13 అక్టోబర్ 2011 (UTC)- దీనిగురించి మరింత చర్చించవలసిన అవసరముంది. అయితే దీని తెలుగు మూలాలు నాకు కనపడలేదు. సుజాత గారు సంక్షిప్తం చేస్తున్నట్లయితే, దానికి అనుమతి వున్నది లేనిది కూడా తెలియాలి. మీరు ఒక ఆశ్వాసం మూలం మెయిల్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న వారికి తెలియచేసినట్లయితే, పరిశీలించి చర్చించటానికి వీలవుతుంది. చంద్రకాంతరావు గారు: వికీ బుక్స్ కొత్త పుస్తకాలు రాయడానికి కాబట్టి నకలు హక్కులపరిమితులు లేనివి వికీ సోర్స్ లో వుంచడమే మంచిది. -- అర్జున 01:18, 14 అక్టోబర్ 2011 (UTC)
- సుజాత గారు చెప్పినట్లు ఇది మహాభారతం సంక్షిప్తరూపం మాత్రమే అయినట్లయితే వికీసోర్స్‌కు తరలించే అవసరం లేదనుకుంటాను. అనుమతి పొందబడిన లేదా కాపీ హక్కుల కాలం ముగిసిన గ్రంథాల పూర్తిరూపం అయితేనే వికీసోర్స్
- మహాభారతం కధ వ్రాయడానికి ఒక కధ మీద అధారపడి వ్రాసినది కాదు. వివిధ గ్రంధాలలో ఉన్నది, విన్నది, తెలిసినది అధారంగా కొన్ని పరిశోధనాగ్రంధాలలో కధకు కావలసినది చేర్చి వ్రాసినది కనుక ప్రత్యేకంగా మెయిల్ చేయడానికి వీలు పడదు. ఇది కధకు సంగ్రహస్వరూపమే మూల కధలో ఒక్కొక్క సందర్భానికి అనేక రెట్లు వివరణాత్మకమైన వర్ణనలు ఉంటాయి. ఇది కేవలం మహాభారతం గురించి అవగాహన కలిగించడానికి వ్రాసినదే కాని పూత్రి మహాభారతం కాదు. కాని ఈ కధలో ఆమూలాగ్రం కధంసంగ్రహం చోటు చేసుకున్నది. నాకు తెలిసినంతవరకు కవిత్రయభారతానికి వ్యాసభాతరానికి దగ్గరగా సాగినది. అంతగా తేడాలు ఉండవని అనుకుంటున్నను. తెలిసిన వారు ఎవరైనా తేడాలు ఉంటే పేర్కొనవచ్చు. ఈ వ్యాసాలను కధాంశం క్లుప్తంగా వ్రాయాలని మొదలు పెట్టాను. కాని వ్రాసే సమయంలో ఏది వ్రాయాలో ఏది వదలాలో వీలుకాని సందిగ్ధం వలన కధ పొడిగించబడినది. ఆసక్తికరంగా వచ్చినది అనుకుంటున్నాను. సి. చంద్రకాంతరావుగారి అభిప్రాయం సరి అయినది అని నా అభిప్రాయం. t.sujatha 03:20, 14 అక్టోబర్ 2011 (UTC)
- తెలుగు ఒన్ కామ్‌లో మహాభారం పి డి ఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఒక సారి పరిశీలించండి. చాగంటి కోటేశ్వరరావు గారి ఆదిపర్వము, విరాట పర్వము ప్రసంగాలు ఆన్ లై్‌లో లభ్యం ఔతాయి. వీటిని ఆడియో రూపంలో వినవచ్చు. ఆంగ్లంలో కూడా సంక్షిప్త మహాభారతం ఆన్ లైన్‌లో లభ్యం ఔతుంది. ఉషశ్రీ గారు ఆకాశవాణిలో చేసిన ప్రసంగాలు కూడా ఆన్‌లైన్లో లభ్యం ఔతుంది. ఇది చాలా క్లుప్తరూపంగా ఉటుంది. అయినా బహు శ్రావ్యంగా ఉంటుంది. నేను వాటిని సెర్చి చేసినప్పుడు చూసి విన్నాను. వీటిని ఎమ్ పి త్రీ ఆడియో ఫైల్స్ రూపంలో కూడా వినవచ్చు. లింకులు అంతగా పరిశీలించ లేదు. చందమామలో ఈ కధ ఆసాంతం సంగ్రహపూరంలో ప్రచురితమైనది. t.sujatha 03:32, 14 అక్టోబర్ 2011 (UTC)
- అర్జునరావుగారూ తెవికీలో వ్రాస్తున్న మహాభాతంలోని అశ్వాసాలు కేవలం వ్యవహారిక భాషలో ఉన్న సంక్షిప్త స్వరూపం మాత్రమే వికీ సోర్స్‌లో సంస్కృతంలో ఉన్న వ్యాసమహర్షి వ్రాసిన మూలభారతం లేదంటే కవిత్రయం ఆంధ్రీకరించిన పద్యరూపమైన మహాభారతం లాంటివి మాత్రమే చేర్చవచ్చని నేను అనుకుంటున్నాను. అత్యంత విలువైనవి, అత్యున్నత పురస్కారాలు అందుకున్నవి, పురాతనమైనవి అయిన గ్రంధాలు మాత్రమే వీకీసోర్స్‌లో భద్రపరుస్తున్నారు. కాసుబాబుగారికి ఈ విషయంలో అవగాహన బగాఉంది. వారికి మహాభఅరతం వ్యాసాల విషయంలో ఆసక్తిఉంది. దీనిని వికీసోర్స్ ఉంచడం ఉచితమని మీరంతా అనుకుంటే మీరు చేర్చవచ్చు. t.sujatha 08:13, 13 అక్టోబర్ 2011 (UTC)
చర్చలో పాల్గొంటున్నవారందరికీ ధన్యవాదములు. సుజాతగారు మహాభారత కథ వ్రాయడం మొదలుపెట్టినపుడే ఈ విషయం గురించి నేను ఆలోచించాను. వికీ నియమాలకు అనుగుణం కాకపోతే ఇంత శ్రమను మనం ప్రోత్సహించి ఉండాల్సింది కాదు. ఈ విషయమై నా అభిప్రాయాలను క్రింద వ్రాస్తున్నాను.
- ఇది వికీ సోర్స్‌లో ఉండడానికి అనువైన రచన కానే కాదు. ఉదాహరణకు కవిత్రయం భారతాన్ని మనం వికీసోర్స్‌లో పెట్టవచ్చును. లేదా ఇతర రచయితలు అనుమతిస్తే వారి రచనలను (ఉదా: ఉషశ్రీ భారతం వంటివి) పెట్టవచ్చును. కాని వికీ సభ్యులు తమ స్వంత రచనలను వికీసోర్స్ లో ప్రచురించకూడదు.
- వికీబుక్స్ పాఠ్యపుస్తకాలకోసం అనుకొంటాను. నాకు అంతగా తెలియదు. కాని ఇది పాఠ్యపుస్తకం కాదు గనుక వికీబుక్స్ లో ఉంచతగదు.
- ఇక కాపీహక్కుల సంగతి. మహాభారతం అనే (అదృష్టవశాత్తు కాపీహక్కు లేని) సంప్రదాయ ఇతిహాస సారాంశాన్ని సుజాతగారు సంక్షిప్తంగా తమ మాటలలో వ్రాశారు. వికీపీడియాలో కథలు వ్రాయకూడదు కాని ఇతర రచనల సారాంశాన్ని వ్రాయవచ్చును. సినిమా వ్యాసాలకు కూడా సంక్షిప్త కథను వ్రాస్తాము గదా? రామాయణం కాండాలను నేను ఇదే విధంగా వ్రాసాను. మహాభారతం చాలా చాలా పెద్దది గనుక సారాంశమే చాలా వ్యాసాలుగా అయ్యింది. మహాభారతం విషయ సూచికే షుమారు 20 పేజీలుంటుందని గమనించగలరు.
- ప్రస్తుతం ఈ వ్యాసాలన్నీ కేవలం కథకే పరిమితమైనట్లు కనిపిస్తున్నాయి. కాని వీటిలో క్రమంగా ఇతర విషయాలు (చారిత్రిక, సాహిత్య, ఆధ్యాత్మిక, తాత్విక విశేషాలవంటివి) చేరిస్తే అపుడు అవి సంపూర్ణ వ్యాసాలు అవుతాయి. ఉదాహరణకు ఆది పర్వము, సుందర కాండము చూడగలరు.
ఆంతవరకూ వీనిని విస్తరణ అవుసరమైన వ్యాసాలుగా పరిగణింపదగును. తరువాత ఈ చర్చను చర్చ:మహా భారతము పేజీలోనికి కాపీ చేస్తాను.
- కాసుబాబు 17:56, 14 అక్టోబర్ 2011 (UTC)
- పైన వికీబుక్స్ పదం పొరపాటున చేర్చడం జరిగింది. ఇప్పడు కొట్టివేశాను. -- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:25, 14 అక్టోబర్ 2011 (UTC)
- కాసుబాబుగారు చెప్పినది వాస్తవం. ఇది ఇతిహాసము కనుక అత్యంత పురాతనమైనది కనుక అనుకోకుండా మొదలు పెట్టి విస్తరించడం జరిగింది. ఈ తరము వారికి అత్యంత రమణీయమైన ఈ ఇతిహాసము మీద అవగాహన కలగాలని ఈ వ్యాసాల విస్తరణ చేసాను. వాస్తవానికి మహాభారతం అతి విస్తరమైనది. అర్జునుడి కిరీట వర్ణన మాత్రమే అనేక పధ్యాలు ఉంటుంది. అలాగే విరాటపర్వములో సూర్యాస్తమయము గురించి అనేక పధ్యాలలో రమ్యంగా వర్ణించబడి ఉంటుంది. ఇవి ఉదాహరణలే ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో. మహాభారతం ఆంధ్రీకరించడానికి ముగ్గురు కవులు జీవితపర్యంతం కృషి చేసారు. కనుక అది సంపూర్తిగా చదవడానికే సమయము చాలదు కనుక పూర్తిగా అనువదించడమన్నది అసాధ్యము. మూలభారతం ఉంటే ఇలాంటివి ఎన్నో వ్రాయవచ్చు. కనుక వీకీసౌర్స్‌లొ ఉంచవలసినది మూలగ్రంధాలను మాత్రమే.--t.sujatha 07:12, 15 అక్టోబర్ 2011 (UTC)
- సుజాత గారు, మీ కృషి శ్లాఘనీయం. ఇప్పుడు మనం చర్చిస్తున్నది ఈ వ్యాసాలు వికీపీడియాకి అనువైనవా అని. మీరు రాసినదానిలో భారతంలో వ్యక్తులగురించిన వ్యాసాలు వికీపీడియాలో వుండదగినవి. ఎందుకంటే ఆయా వ్యక్తుల గురించి వివిధ దృక్కోణాలు ఆ వ్యాసంలో పేర్కొనవచ్చు. అలాగే మనము ఒక్కొక్క పర్వం ఒక పుస్తకం అనుకొని, దాని గురించిన క్లుప్త సమాచారంతో పాటు, దాని నుంచి ఈ తరం గ్రహించవలసిన మానవ విలువలు చర్చిస్తే దానిలో వివిధ దృక్కోణాలు చేర్చి విజ్ఞానసర్వస్వం రూపంగా మారే అవకాశముంది. ఉదాహరణకి శ్రీ చాగంటి వారి ప్రవచనం ప్రకారం, ఇస్కాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాష్యం ప్రకారం దీని అర్థం ఇలా వుంది అని రాసినప్పుడు బాగుంటుంది. సంక్షిప్త వ్యాసం సృజనాత్మకమైన కృషి కిందకు వస్తుంది. ఆటువంటిది సహకారంతో చేయదలచుకున్నప్పుడు, వికీబుక్స్ లో రాయటం మంచిదని నా అభిప్రాయం. ముందు ముందు, దీని నుండి తయారయిన పుస్తకం విద్యార్థులు ( ఈ కాలంలో విద్యాలయానికి వెళ్లేవారే విద్యార్థులు కాదు కదా) చదువుకోటానికి వీలుగా వుంటుంది. మీరు ప్రస్తుతానికి దీనిని ఇక్కడ వుంచినా ముందు ముందురాయబోయే వాటిని వికీబుక్స్ లో వుంచమని మనవి. వాటి గురించిన వ్యాసం వికీబుక్స్ లింక్ వికీపీడియా లో వుంచవచ్చు. చదివేవారు గూగుల్ ఇతర అన్వేషణా యంత్రాల ద్వారా దీనిని చూస్తారు కాబట్టి, వాటికి వికీపీడియా నా వికీబుక్స్ అని భేదం లేదు కాబట్టి, మీకు అభ్యంతరముండదని నేను భావిస్తాను. అన్నట్లు నాకు చాగంటి వారి సైట్ తప్ప మిగతా భారత లింకులు కనబడలేదు. మీరు కొన్ని లింకులు మహాభారత వికీపీడియా వ్యాసంలో చేర్చండి -- అర్జున 05:08, 16 అక్టోబర్ 2011 (UTC)
- అర్జునరావుగారూ మీ ప్రశంశకు ధన్యవాదాలు. ఈ వ్యాసాలు వికీపీడియాకు అనువైనవి కాదు అన్నది వాస్తవం. వికీవ్యాసాలంటే కాసుబాబుగారు వ్రాసిన రామాయణం, సుందరకాండ, అష్టాదశ పురాణాలు లా ఉండాలి.
మంచి ప్రయోజనము ఉన్నది అనుకున్నప్పుడు నియమాలు అన్నవి మర్పులు చేసుకోవచ్చు అన్నది నా అభిప్రాయం. భారతీయసంప్రదాయంలో భాగమైన వేదాలు, అష్టాదశపురాణాలు, ఇతిహాసాలు వంటివాటిలో ఏమున్నది అన్న విషయం కనీస అవగాహన కలిగిస్తూ ప్రజలకు చేరువ చేయాలన్నది నా అభిప్రాయం. ఆ అభిప్రాయంతో కేవలం చదివి తెలుసుకోవడానికి మాత్రమే ఈ వ్యాసాలను వ్రాసాను. వీటి ఉద్దేశ్యం చదివి మహాభారతఅన్ని గురించిన అవగాహన చేసుకోవడమే. ఛాగంటివారు ఇలా వ్రాసారు అని ఉటంకించడానికి కూడా వీలు కాదు. ఎందుకంటే వారుకూడా భారతం ఉన్నది ఉన్నట్లు వ్యాసభారతానికి దగ్గరగా కవిత్రయభారతాన్ని ప్రసంగిస్తారు. ప్రతి అంశంశాన్ని ఉటంకించవలసి వస్తుంది. అవకాశం ఉంటే మీరు అది విని తెలుసుకో వచ్చు. భాష్యం కంటే అసలైనకధాంశం చదవడమే ముఖ్యం. ఎందుకంటే భాష్యంలో రచయిత అభిప్రాయాలు కలసి ఉంటాయి. కనుక అవి అంత అవసరము ఉండదు. ఈ వ్యాసంలో చోటు చేసుకున్న అంశాలను విడిగా కొంత ప్రస్తావించి సారాంశంన్ని అలాగే ఉంచాలి.
- ఇక వికీబుక్స్‌లో చేర్చే విషయం. వికీపీడియాలో వ్రాసిన మరుక్షణం నుండి అది వికీపీడియాకు స్వంతం కనుక సభ్యుల ఏకీకృత అభిప్రాయంతో దానిని మీరు చేయవచ్చు. నాకంటె ముందు నుండి అనుభంతో క్రియాశీలకంగా పని చేస్తున్న కాసుబాబుగారి అభిప్రాయం, చంద్రకాంతరావు గారి అభిప్రాయం తీసుకుని ఆ పని చేయండి. అక్కడకు మార్చడానికి నాకు అభ్యంతరం లేదు. --t.sujatha 12:54, 16 అక్టోబర్ 2011 (UTC)
- ధన్యవాదాలు. అందరి సమ్మతిమీద ఆ పని చేయాలన్నా, దానికి బాట్ తయారు చేయడం మంచిది. తెవికీసభ్యులు క్రియాశీలత్వం మరింత మెరుగైనపుడు ఈ పని గురించి ఆలోచించవచ్చు. -- అర్జున 04:46, 17 అక్టోబర్ 2011 (UTC)
- ఇక వికీబుక్స్‌లో చేర్చే విషయం. వికీపీడియాలో వ్రాసిన మరుక్షణం నుండి అది వికీపీడియాకు స్వంతం కనుక సభ్యుల ఏకీకృత అభిప్రాయంతో దానిని మీరు చేయవచ్చు. నాకంటె ముందు నుండి అనుభంతో క్రియాశీలకంగా పని చేస్తున్న కాసుబాబుగారి అభిప్రాయం, చంద్రకాంతరావు గారి అభిప్రాయం తీసుకుని ఆ పని చేయండి. అక్కడకు మార్చడానికి నాకు అభ్యంతరం లేదు. --t.sujatha 12:54, 16 అక్టోబర్ 2011 (UTC)