వ్యాసుడు రచించిన, మహాభారతములో మొత్తం 18 ఉపపర్వాలు, 8 అశ్వాసాలు ఉన్నాయి. సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం 9,984 శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి 2,084 ఉన్నాయి.

మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలలో విషయ క్రమణిక ఇలా ఉంది.

దస్త్రం:Ugrashravas narrating Mahābhārata before the sages gathered in Naimisha Forest.jpg
ఆది పర్వ మహాభారతాన్ని ఋషుల ముందు పఠించినట్లు వివరిస్తుంది ఎందుకంటే దాని పరిధిలో తెలిసిన జ్ఞానమంతా ఉంటుంది.
  1. ఆది పర్వము: పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
  2. సభా పర్వము: కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
  3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
  4. విరాట పర్వము: విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
  5. ఉద్యోగ పర్వము: కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
  6. భీష్మ పర్వము: భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  7. ద్రోణ పర్వము: ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  8. కర్ణ పర్వము: కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  9. శల్య పర్వము: శల్యుడు సారథిగాను, అనంతరం నాయకునిగాను సాగిన యుద్ధం. దుర్యోధనుని మరణం.
  10. సౌప్తిక పర్వము: నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
  11. స్త్రీ పర్వము: గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
  12. శాంతి పర్వము: యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
  13. అనుశాసనిక పర్వము: భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
  14. అశ్వమేధ పర్వము: యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
  15. ఆశ్రమవాస పర్వము: ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
  16. మౌసల పర్వము: యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
  17. మహాప్రస్ధానిక పర్వము: పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
  18. స్వర్గారోహణ పర్వము: పాండవులు స్వర్గాన్ని చేరడం.

వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. ఇవి కాక తరువాతి కథ అయిన శ్రీకృష్ణుని జీవితగాథను తెలుగు మహాభారతంలో భాగంగా కాక హరివంశ పర్వము అనే ప్రత్యేక గ్రంథంగా పరిగణించారు. నన్నయ మొదలుపెట్టిన కథావిభాగాన్నే తిక్కన, ఎఱ్ఱన అనుసరించారు.


ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.

ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.

రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్


ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.

ఉపపర్వాలు

మార్చు

మహా భారతంలోని మొత్తం 100 ఉపపర్వాలలో 19 ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు

  1. అనుక్రమణికా పర్వం (పర్వాల సంగ్రహం)
  2. పౌష్యం
  3. పౌలోమం
  4. ఆస్తిక పర్వం
  5. ఆదివంశావతరణం
  6. సంభవ పర్వము
  7. లాక్షాగృహ దహనం
  8. హిడింబాసురని వధ
  9. బకాసురుని వధ
  10. చైత్రరథం
  11. ద్రౌపదీ స్వయంవరం
  12. వైవాహిక పర్వము
  13. విదురాగమనం
  14. రాజ్యలాభ పర్వం
  15. అర్జునుని వనవాసం
  16. సుభద్రా కల్యాణం
  17. హరణ హారిక
  18. ఖాండవ వన దహనం
  19. మయసభా దర్శనం

ఆంధ్ర మహాభారతం

మార్చు

అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు

విశేషాలు

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: