విక్రంపురి
విక్రంపురి, తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదు సమీపంలోని తిరుమలగిరి శివారు ప్రాంతం.[1] కరీంనగర్ కు వెళ్ళే రాజీవ్ గాంధీ రహదారికి ఆనుకొని ఉన్న సికింద్రాబాద్ క్లబ్కు సమీపంలో ఈ విక్రంపురి ఉంది.[2]
విక్రంపురి | |
---|---|
సికింద్రాబాద్ | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 026 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో ఆర్ అండ్ డి కాలనీ, శ్రీ రామ్ ఎన్క్లేవ్, సామ్రాట్ కాలనీ, శ్రీపురి కాలనీ, జనకపురి, కార్ఖాన మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం
మార్చువిక్రంపురిలో కెఎఫ్‌సి రెస్టారెంటు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్యు, ఎస్‌బిఐ బ్యాంకు, ఘనశ్యామ్ సూపర్ మార్కెటు, రత్నదీప్ సూపర్ మార్కెటు ఉన్నాయి. ఇక్కడ ఆర్మీ కంటోన్మెంట్ కూడా ఉంది.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో విక్రంపురి మీదుగా నగరంలోని అఫ్జల్‌గంజ్, జెబిఎస్, కోఠి, ఓల్డ్ అల్వాల్, ఎంబి దర్గా, చార్మినార్, రిసాలా బజార్, మెహదీపట్నం మొదలైన ప్రాంతాలకు బస్సు (బస్సులు నెంబర్లు 82, 77) సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను, జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Vikrampuri Colony, Karkhana, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.