విచిత్ర జీవితం 1978 లో వచ్చిన తెలుగు సినిమా. దీనిని శ్రీ ఉమాలక్ష్మి కంబైన్స్ పతాకంపై [1] నిడమర్తి పద్మాక్షి, ఎన్. పుష్పా భట్ నిర్మించారు. వి. మధుసూదనరావు దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[3] ఈ చిత్రం హిందీ చిత్రం దాగ్ (1973),[4][5] కు రీమేక్. దాగ్ సినిమా, థామస్ హార్డీ 1886 లో రాసిన నవల ది మేయర్ ఆఫ్ కాస్టర్బ్రిడ్జ్ ఆధారంగా రూపొందించారు.

విచిత్ర జీవితం
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం నిడమర్తి పద్మాక్షి
ఎన్.పుష్పాభట్
కథ గుల్షన్ నందా
చిత్రానువాదం వి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన ఆరుద్ర
సంభాషణలు బొల్లిముంత శివరామకృష్ణ
ఛాయాగ్రహణం వె.ఎస్.ఆర్.స్వామి
కూర్పు డి. వెంకటరత్నం
నిర్మాణ సంస్థ శ్రీ ఉమా లక్ష్మీ కంబైన్స్
భాష తెలుగు

కథ మార్చు

చంద్ర శేఖర్ / చంద్రం (అక్కినేని నాగేశ్వరరావు) గౌరీ (వాణిశ్రీ) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. సురేంద్ర నాథ్ (మోహన్ బాబు) అనే పెద్దమనిషి యాజమాన్యంలోని ఎస్టేట్‌లో చంద్రానికి ఉద్యోగం లభిస్తుంది. గౌరీ ఒంటరిగా ఉన్నప్పుడు సురేంద్ర, ఆమెను వేధించడానికి ప్రయత్నిస్తాడు. కాని సమయానికి చంద్రం వస్తాడు. వారి మధ్య గొడవ సురేంద్ర నాథ్ మరణానికి దారితీస్తుంది. చంద్రం‌కు మరణశిక్ష పడుతుంది. అయితే, జైలుకు వెళ్లే దారిలో, పోలీసు వ్యాన్ ప్రమాదంలో పడి అందులో ఉన్నవారంతా చనిపోతారు. ఆ సమయానికి, గౌరీ గర్భవతి. ఆమె ఒక మగ పిల్లవాణ్ణి ప్రసవిస్తుంది.

కాలం గడుస్తుంది. గౌరి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. అక్కడ ఆమెకు బోర్డు సభ్యురాలు గంగ (జయసుధ) తో పరిచయం అవుతుంది. వారు మంచి స్నేహితుల లవుతారు. గౌరి భర్తకున్న అపఖ్యాతి కారణంగా, ఆమె ఉద్యోగం కోల్పోతుంది. గంగ గౌరీని తన ఇంటికి పిలుస్తుంది. అక్కడ, గంగ భర్తగా చంద్రాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతుంది. గౌరి అక్కడినుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. చంద్రం ఆమెను అడ్డుకుంటాడు. అప్పుడు అతను జరిగినదంతా వివరిస్తాడు. ప్రమాదం నుండి తప్పించుకున్న తరువాత, చంద్రం వెంటనే గౌరీ కోసం వెళ్తాడు కాని ఆమె ఆచూకీ తెలియలేదు. ఆ తరువాత, అతను గంగను కలుసుకున్నాడు. గర్భిణీ అయిన ఆమెను తన ప్రేమికుడు వదిలివేసి వెళ్ళిపోయాడని తెలుసుకుంటాడు. కాబట్టి, శేఖర్‌గా తన కొత్త గుర్తింపును ఇచ్చినందుకు గాను అతడు ఆమెను పెళ్ళి చేసుకుని ఆమె బిడ్డకు చట్టబద్ధత ఇస్తాడు. ప్రస్తుతం, గౌరీ శేఖర్ ల సాన్నిహిత్యాన్ని గమనించిన గంగా వారిని అనుమానిస్తుంది. తరువాత, సత్యాన్ని గ్రహించి క్షమాపణ కోరుతుంది. ప్రస్తుతం, బహుభార్యాత్వం నేరంపై విచారించేందుకు చట్టం మళ్ళీ ఇన్స్పెక్టర్ ఆనంద్ (జగ్గయ్య) రూపంలో చంద్రం ఇంటికొచ్చింది. చివరికి, గంగ సురేంద్ర నాథ్ దుష్టత్వాన్ని బయటకు తెస్తుంది. అతనే ఆమెను మోసం చేసినవాడు. చంద్రం మంచితనాన్ని కూడా ధ్రువీకరిస్తుంది. చివరగా, చంద్రం నిర్దోషిగా ప్రకటించబడతాడు. అందరూ కలిసి జీవించడంతో ఈ సినిమా ముగుస్తుంది.

నటీనటులు మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

పాటలు మార్చు

పాటలను చక్రవర్తి స్వరపరిచాడు. EMI కొలంబియా వారు విడుదల చేశారు.[6]

ఎస్. పాట సాహిత్యం గాయనీ గాయకులు నిడివి
1 "ఇన్నాళ్ళ ఈ మూగ బాధ" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 4:33
2 "బంగినపల్లి మామిడిపండు" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:26
3 "నా కోసం" ఆరుద్ర ఎస్పీ బాలు, పి.సుశీలా 4:28
4 "అల్లిబిల్లి చిట్టిపాప" వీటూరి పి. సుశీల 4:36
5 "ఓ ప్రియతమా" దాశరథి పి. సుశీల 3:51
5 "గుమ్మడమ్మ గుమ్మడమ్మ" వేటూరి సుందరరామమూర్తి పి. సుశీలా, జిక్కి 4:18

మూలాలు మార్చు

  1. "Vichitra Jeevitham (Banner)".
  2. "Vichitra Jeevitham (Direction)".
  3. "Vichitra Jeevitham (Cast & Crew)". Archived from the original on 2018-10-27. Retrieved 2020-08-12.
  4. "Vichitra Jeevitham (Remake)".
  5. "Vichitra Jeevitham (Review)". Archived from the original on 2021-10-16. Retrieved 2020-08-12.
  6. "Vichitra Jeevitham (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-08-12.