ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 ప్రకారం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో 2014 డిసెంబరు 30 న ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[1][2][3] ఈ సంస్థ రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో పట్టణ సేవలు పర్యవేక్షిస్తుంది.[4]
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ | |
---|---|
![]() | |
AP CRDA అమరావతిలో ఉప కార్యాలయం | |
సంస్థ వివరాలు | |
స్థాపన | 2014 |
Preceding agency | విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ |
అధికార పరిధి | ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం |
ప్రధానకార్యాలయం | విజయవాడ 16°30′30″N 80°38′30″E / 16.50833°N 80.64167°E |
సంబంధిత మంత్రి | బొత్స సత్యనారాయణ |
కార్యనిర్వాహకులు | విజయ కృష్ణన్, కమిషనర్ |
వెబ్‌సైటు | |
APCRDA |
దీని అధికార పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8,352.69 కి.మీ2 (8.99076×1010 sq ft) మేర విస్తరించి ఉంది. అమరావతి నగరం కూడా ఈ అథారిటీ క్రిందికి వస్తుంది.[5][6]
చరిత్రసవరించు
రాజధాని వికేంద్రీకరణ వివాదం వలన కొన్నాళ్లు అస్థిత్వం కోల్పోయి, రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టం రద్దు చేయడంవలన మరల ఉనికిలోకి వచ్చింది.
పరిపాలనసవరించు
పరిపాలనమండలిసవరించు
- ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్, ఛైర్మన్ ప్రభుత్వం
- మంత్రి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, వైస్ ఛైర్మన్
- మంత్రి, ఆర్థిక శాఖ, సభ్యుడు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ),సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థిక శాఖ, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, రవాణా రోడ్స్ & భవనాలు శాఖ, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, శక్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, పర్యావరణ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, పంచాయితీ రాజ్ శాఖ, సభ్యుడు
- కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, మెంబర్ కన్వీనర్
కార్య నిర్వాహక కమిటీసవరించు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ చైర్మన్
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థిక శాఖ, సభ్యుడు
- కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ), మెంబర్ కన్వీనర్‌గా
అధికారిసవరించు
శ్రీకాంత్ నాగులపల్లి మొదటగా అధికార కమిషనర్ గా పనిచేశాడు. As of 2022[update] విజయ కృష్ణన్ కమీషనర్ గా పనిచేస్తున్నది. [7]
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-24. Retrieved 2016-08-17.
- ↑ "Capital Region Development Authority comes into being". The Hindu. 30 December 2014. Retrieved 6 January 2015.
- ↑ "3-decade-old VGTMUDA to be dissolved". The Hans India. 20 November 2014. Retrieved 6 January 2015.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-29. Retrieved 2016-08-20.
- ↑ Subba Rao, GVR (23 September 2015). "Capital region expands as CRDA redraws boundaries". The Hindu. Vijayawada. Retrieved 23 September 2015.
- ↑ "Andhra Pradesh Capital Region Development Authority Act, 2014" (PDF). News19. Municipal Administration and Urban Development Department. 30 December 2014. Archived from the original (PDF) on 18 ఫిబ్రవరి 2015. Retrieved 9 February 2015.
- ↑ "Contact us". Retrieved 2022-01-24.