విజయవాడ సెంట్రల్ మండలం
విజయవాడ సెంట్రల్ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం.[1] ఇది విజయవాడ రెవెన్యూ డివిజను పరిధి క్రింద నిర్వహించబడతుంది.[2] దీని ప్రధాన కార్యాలయం విజయవాడ నగరంలోని గాంధీనగర్‌లో ఉంది. ఈ మండలానికి విజయవాడ తూర్పు , విజయవాడ ఉత్తర, విజయవాడ పశ్చిమ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ మండలం, పౌర సౌకర్యాలకు భాధ్యత వహించే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఒక భాగంగా ఉన్నందున మండల పరిధిలో గ్రామాలు లేవు
విజయవాడ సెంట్రల్ మండలం | |
---|---|
Coordinates: 16°32′45″N 80°34′12″E / 16.54583°N 80.57000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
చరిత్ర
మార్చుఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా విజయవాడ నగరంలోని గాంధీనగర్ లో ఉండే విజయవాడ అర్బన్ మండల కార్యాలయానికి అశోక్ నగర్, భవానీపురం, కబేళ, కండ్రిక వంటి శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెళ్లేందుకు గత కొన్నేళ్లుగా పడుచున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ నార్త్ విజయవాడ వెస్ట్ అనే నాలుగు కొత్త అర్బన్ మండలాలను కృష్ణా జిల్లా పరిధిని సవరించగా, కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రెవెన్యూ డివిజను పరిధిలో భాగంగా ఈ మండలాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిింది.[3]వాటిలో ఈ మండలం ఒకటి.
మండలం లోని గ్రామాలు
మార్చుఈ మండలం పౌర సౌకర్యాలకు భాధ్యత వహించే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఒక భాగంగా ఉన్నందున మండల పరిధిలో గ్రామాలు లేవు.
మూలాలు
మార్చు- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ Government of Andhra Pradesh (2022-04-03). Andhra Pradesh Gazette, 2022-04-03, Extraordinary, Part PART I, Number 484.
- ↑ India, The Hans (2018-09-12). "Urban mandal office divided into 4 offices". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-30.