విజయ్ భరద్వాజ్

భారతీయ క్రికెటర్

1975, ఆగస్ట్ 15బెంగుళూరులో జన్మించిన విజయ్ భరద్వాజ్ (Raghvendrarao Vijay Bharadwaj) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. దేశవాళీ పోటీలలో 1000కి పైగా పరుగులు సాధించి 1999-00లో తొలిసారిగా భారత జట్టులో ప్రవేశించాడు. నైరోబీలో జరిగిన ఎల్.జి.కప్‌లో న్యూజీలాండ్ పై తొలిసారిగా వన్డే మ్యాచ్ ఆడినాడు. మొత్తంపై 3 టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

విజయ్ భరద్వాజ్

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

భరద్వాజ్ 3 టెస్టులు ఆడి 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 22 పరుగులు. బౌలింలో 107.00 సగటుతో ఒక వికెట్టును సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 26 పరుగులకు ఒక వికెట్టు.

వన్డే గణాంకాలు మార్చు

విజయ్ భరద్వాజ్ 10 వన్డేలు ఆడి 27.19 సగటుతో 136 పరుగులు సాధించాడు. వన్డేలో అతడి అత్యధిక స్కోరు 41 నాటౌట్. వన్డే బౌలింగ్‌లో 19.18 సగటుతో 16 వికెట్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 34 పరుగులకు 3 వికెట్లు.