విజయ్ రూపానీ
విజయ్ రామ్నిక్ లాల్ రూపానీ (జననం 1956 ఆగస్టు 2) భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన రాజ్‌కోట్ వెస్ట్‌కు గుజరాత్ శాసనసభ నుండి ఏం.ఎల్.ఏగా గెలుపొంది, 2016 ఆగస్టు 7 నుండి 2021 సెప్టెంబరుగు 12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాడు.[2][3]
విజయ్ రూపానీ | |||
అధికారిక చిత్రం, 2016 | |||
16వ గుజరాత్ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 2016 ఆగస్టు 7 – 2021 సెప్టెంబరు 12 | |||
గవర్నరు | ఓం ప్రకాష్ కోహ్లీ ఆచార్య దేవవ్రత్ | ||
---|---|---|---|
డిప్యూటీ | నితిన్ భాయ్ పటేల్ | ||
ముందు | ఆనందిబెన్ పటేల్ | ||
గుజరాత్ శాసనసభ సభ్యడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | వాజుభాయ్ వాలా | ||
నియోజకవర్గం | రాజకోట్ వెస్ట్ | ||
పార్లమెంట్ సభ్యడు , రాజ్యసభ
| |||
పదవీ కాలం 2006 – 2012 | |||
నియోజకవర్గం | గుజరాత్ | ||
మినిస్ట్రీ అఫ్ లేబర్ & ఎంప్లాయిమెంట్
| |||
పదవీ కాలం 2014 నవంబరు – 2016 ఆగస్టు | |||
ప్రెసిడెంట్ (కార్పోరేట్) భారతీయ జనతా పార్టీ
| |||
పదవీ కాలం 2016 ఫిబ్రవరి – 2016 ఆగస్టు | |||
తరువాత | జీతూ వఘ్ని | ||
మేయర్ of రాజకోట్ మునిసిపల్ కార్పోరేషన్
| |||
పదవీ కాలం 1996 – 1997[1] | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రంగూన్, బర్మా (1948–1962), యూనియన్ ఆఫ్ బర్మా, (ప్రస్తుత యాంగాన్, మయన్మార్) | 1956 ఆగస్టు 2||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనల్ డెమోక్రాటిక్ అల్లాయాన్స్ | ||
జీవిత భాగస్వామి | అంజలి రూపానీ | ||
సంతానం | 3 | ||
నివాసం | రాజకోట్ , గుజరాత్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం |
తొలినాళ్ళ జీవితం
మార్చువిజయ్ రూపానీ మయబెన్ రామ్నిక్ లాల్ రూపానీ దంపతులకు ఎడవ సంతానంగా జన్మించాడు. వీరు మయన్మార్లోని యాంగోన్లో బనియా కుటుంబానికి చెందిన వారు. బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా అతని కుటుంబం 1960 లో రాజ్‌కోట్‌కు వెళ్లింది.విజయ్ రూపానీ ధర్మేంద్రసింగ్ జి ఆర్ట్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి చదువును పూర్తి చేశారు.[4]
వృత్తి జీవితం
మార్చువ్యాపారవేత్తగా
మార్చువిజయ్ రూపానీ తన తండ్రి స్థాపించిన రసిక్ లాల్ & సన్స్ అనే వాణిజ్య సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు.ఆ తరువాత అతను స్టాక్ బ్రోకర్‌గా కూడా పనిచేశాడు.[5]
రాజకీయ జీవితం
మార్చువిజయ్ రూపానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) లో విద్యార్థి కార్యకర్తగా ఉన్నాడు. అలాగే అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో చేరాడు ఆ తరువాత 1971 లో జనసంఘ్ లో సభ్యనిగా చేరాడు. భారతీయ జనతా పార్టీ స్థాపించిన మొదటి రోజులనుండి పార్టీలతో సంబంధం కలిగి ఉన్నాడు.[6] ఈయన 1978 నుండి 1981 వరకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ గా ఉన్నాడు. 1987 లో రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.
రూపానీ 1988 నుండి 1996 వరకు ఆర్‌ఎంసి స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు. 1995 లో మళ్లీ ఆర్‌ఎంసికి ఎన్నికయ్యాడు. 1996 నుండి 1997 వరకు రాజ్‌కోట్ మేయర్‌గా పనిచేశాడు. 1998 లో బిజెపి గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు అలాగే చైర్మన్‌గా కూడా పనిచేశాడు. రూపానీ 2006 లో గుజరాత్ పర్యాటకం ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2006 నుండి 2012 వరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు 2013 లో బిజెపి గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ మునిసిపల్ ఫైనాన్స్ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు.
2014 నవంబరులో ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మొదటి క్యాబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించింది. ఈయన రవాణా, నీటి సరఫరా, కార్మిక ఇంకా ఉపాధి మంత్రిత్వ శాఖను నిర్వహించారు.
2016 ఫిబ్రవరి 19 న, ఆర్. సి. ఫాల్డు స్థానంలో రూపానీ గుజరాత్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడయ్యారు. 2016 ఫిబ్రవరి నుండి 2016 ఆగస్టు వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు.
ముఖ్యమంత్రిగా (2016 - 2021)
మార్చుఅతను ఆనందీబెన్ పటేల్ తరువాత 2016 ఆగస్టు 7 న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రాణిల్ రాజయగురును ఓడించి రాజకోట్ పశ్చిమ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి పదవికి నామినేట్ అయ్యాడు. 2017 డిసెంబరు 22 న శాసనసభ పార్టీ నాయకుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, 2021 సెప్టెంబరు 12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ "Gujarat CM resigns, all eyes on MLAs' meet to select Rupani's successor". The Economic Times. 21 December 2017. Retrieved 21 December 2017.
- ↑ Aug 7, Shailaja Neelakantan / Updated:; 2016; Ist, 16:31. "Vijay Rupani sworn in as new Gujarat Chief Minister | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Vijay Rupani resigns LIVE updates: First-time MLA Bhupendra Patel to be next Gujarat CM, to take oath on Monday". The Indian Express (in ఇంగ్లీష్). 2021-09-12. Retrieved 2021-09-12.
- ↑ Aug 6, PTI / Updated:; 2016; Ist, 04:52. "How Vijay Rupani pipped Nitin Patel to become Gujarat chief minister | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Vijay Rupani: A swayamsevak, stock broker and founder of a trust for poor". The Indian Express (in ఇంగ్లీష్). 2016-08-06. Retrieved 2021-05-21.
- ↑ "టైమ్స్ ఆఫ్ ఇండియా". టైమ్స్ అఫ్ ఇండియా. Archived from the original on 2016-08-23. Retrieved 2021-05-21.