గుజరాత్ శాసనసభ
గుజరాత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా గుజరాత్ విధానసభ అనేది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని ఏకసభ శాసనసభ. గుజరాత్ శాసనసభలో ప్రస్తుతం 182 మంది శాసనసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాల ఉంటుంది. శాసనసభలో 13 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు, 27 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి.
గుజరాత్ శాసనసభ | |
---|---|
15వ గుజరాత్ శాసనసభ | |
రకం | |
రకం | గుజరాత్ శాసనసభ ఏకసభ శాసనసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
అంతకు ముందువారు | 15వ గుజరాత్ శాసనసభ |
నాయకత్వం | |
స్పీకర్ | |
డిప్యూటీ స్పీకర్ | |
గుజరాత్ ముఖ్యమంత్రి సభా నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 182 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (158)
ప్రతిపక్షం (20) ఖాళీ (4)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2022 |
తదుపరి ఎన్నికలు | డిసెంబర్ 2027 |
సమావేశ స్థలం | |
23°13′9″N 72°39′25″E / 23.21917°N 72.65694°E విఠల్‌భాయ్ పటేల్ భవన్,గుజరాత్ విధానసభ,గాంధీనగర్,గుజరాత్,భారతదేశం |
చరిత్ర
మార్చుభావ్నగర్ రాష్ట్ర పాలకుడు భావ్‌సిన్హ్‌జీ గోహిల్ 38 మంది సభ్యులతో కూడిన ప్రజాప్రతినిధి అసెంబ్లీని స్థాపించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు కృష్ణకుమార్ సిన్హ్జీ 55 మంది సభ్యులతో 1941లో భావ్‌నగర్ శాసనసభను ఏర్పాటు చేశాడు, ఇందులో 33 మంది ఎన్నుకోబడిన సభ్యులు, 16 మంది నామినేట్ చేసిన సభ్యులు, 6 ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ప్రశ్నలు అడగడం, తీర్మానాలు చేయడం, బడ్జెట్‌పై చర్చించడం, బిల్లులు ప్రవేశపెట్టడం వంటి అధికారాలు వారికి ఉన్నాయి. ఏడాదిలో కనీసం రెండుసార్లైనా ఈ సభ సమావేశమయ్యేది. పోర్‌బందర్ రాష్ట్ర అసెంబ్లీకి అదే అధికారాలు ఉన్నాయి. బరోడా రాష్ట్ర పాలకుడు సాయాజీరావు గైక్వాడ్ III 1908లో బరోడా శాసనసభను ఏర్పాటు చేశాడు.[5]
1921 నుండి రాచరిక రాష్ట్రాలు మినహా ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని ఆ ప్రాంత ప్రజలు ప్రతినిధులను ఎన్నుకొని బొంబాయి రాష్ట్ర శాసనసభకు పంపబడ్డారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో సౌరాష్ట్ర రాష్ట్ర శాసనసభను ఏర్పాటు చేశారు. ఇది 1956 అక్టోబరు 31 వరకు పనిచేసింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం సౌరాష్ట్ర రాష్ట్రం బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడింది.[5]
బొంబాయి రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలుగా 1960 మే 1న విభజించిన అనంతరం గుజరాత్ శాసనసభ నూతనంగా ఏర్పడింది. గుజరాత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఎన్నికైన మాజీ బొంబాయి శాసనసభలోని 132 మంది సభ్యులు మొదటి గుజరాత్ శాసనసభను ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య 1962లో 154కి, 1967లో 168కి, 1975లో 182కి పెరిగింది.[5]
శాసనసభ సభ్యులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ https://gujarat.neva.gov.in/ [bare URL]
- ↑ Bureau, The Hindu (2023-01-17). "Amit Chavda named CLP leader in Gujarat". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-01-18.
- ↑ Shankar Chaudhary appointed as Gujarat Legislative Assembly Speaker, 20 December 2022
- ↑ Jethabhai Ahir appointed as Gujarat Legislative Assembly Deputy Speaker, 20 December 2022
- ↑ 5.0 5.1 5.2 Kalia, Ravi (2004). Gandhinagar: Building National Identity in Postcolonial India. University of South Carolina Press. pp. 26, 33, 36, 37, 115. ISBN 9781570035449. Archived from the original on 9 October 2023. Retrieved 17 October 2020.
- ↑ PTI (2022-12-15). "Gujarat's former State minister Shankar Chaudhary set to become next Assembly Speaker". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-12-15.
- ↑ "Gujarat Congress MLA C J Chavda resigns, likely to join BJP". The Indian Express. Retrieved 19 January 2024.
- ↑ "Bhupendra Patel named Gujarat CM again". news.abplive.com. Retrieved 2022-12-10.[permanent dead link]
- ↑ "Gujarat AAP MLA Bhupendra Bhayani resigns, set to join BJP". The Hindu (in Indian English). 2023-12-13. ISSN 0971-751X. Retrieved 2023-12-14.
- ↑ "Khambhat Congress MLA Chirag Patel resigns". DeshGujarat. 2023-12-19. Retrieved 2023-12-19.
- ↑ PTI (2022-12-15). "Gujarat's former State minister Shankar Chaudhary set to become next Assembly Speaker". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-12-15.
- ↑ "Gujarat : Independent MLA Dharmendrasinh Vaghela Joins BJP Ahead Of Lok Sabha Elections". The Blunt Times. Retrieved 24 January 2024.