విజయ తెలంగాణ మెగా డెయిరీ

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రావిర్యాలలో ఉన్న డెయిరీ

విజయ తెలంగాణ మెగా డెయిరీ అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, రావిర్యాలలో ఉన్న డెయిరీ. 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మెగా డెయిరీ 2023, అక్టోబరు 5న ప్రారంభించబడింది.[1]

విజయ తెలంగాణ మెగా డెయిరీ
రకంతెలంగాణ ప్రభుత్వ సబ్సిడరీ
పరిశ్రమపాలు, డెయిరీ
స్థాపన2023; 1 సంవత్సరం క్రితం (2023)
ప్రధాన కార్యాలయం,
ఉత్పత్తులు

నిర్మాణం

మార్చు

2021 సెప్టెంబరు 3న మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డి ఈ మెగా డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.

దేశంలోనే అత్యాధునిక‌, ఆటోమేష‌న్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీతో నిర్మించిన ఈ విజ‌య మెగా డెయిరీలో నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డీడీబీ) సహకారంతో రోజూ 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ చేసేలా మిష‌న‌రీ ఏర్పాటు చేశారు.[2] ఈ డెయిరీ నిర్వహణకు సోలార్‌ విద్యుత్తును వినియోగిస్తున్నారు. సోలార్‌ విద్యుదుత్పత్తి వ్యవస్థతోపాటు, వ్యర్థాల వినియోగంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మెగా డెయిరీలో మిల్క్‌ పైపు బ్రిడ్జి, సివిల్‌ పనులు, ల్యాబొరేటరీ, నెయ్యి శుద్ధి, వెన్న తయారీ, ఐస్‌క్రీం ప్యాకింగ్‌, ఐస్‌క్రీం మిక్స్‌ ప్రిపరేషన్‌, పెరుగు ప్యాకింగ్‌, శీతలీకరణ విభాగాలున్నాయి.[3]

ఉత్పత్తులు

మార్చు

ఇందులో రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్‌ పాల ప్యాకెట్ల తయారీతోపాటు ప్రతినెలా 30 టన్నుల వెన్న తయారీకానుంది. రోజుకు 10 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం గల యంత్ర పరికరాలు ఏర్పాటుచేశారు. రోజుకు 5 వేల నుంచి 10 వేల లీటర్ల ఐస్‌ క్రీం తయారీ, రోజుకు 20 టన్నుల పెరుగు ఉత్పత్తి, రోజుకు 12 వేల లీటర్ల మజ్జిగ, లస్సీ తయారీ కానున్నాయి.[4]

ప్రారంభం

మార్చు

ఈ మెగా డెయిరీ 2023, అక్టోబరు 5న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలోమంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.[5]

మూలాలు

మార్చు
  1. "KTR Launch Vijaya Mega Dairy Plant at Raviryala : రాష్ట్రంలో పాడి రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు: మంత్రి కేటీఆర్". ETV Bharat News. 2023-10-05. Archived from the original on 2023-10-11. Retrieved 2023-10-11.
  2. Shanker (2023-10-05). "విజయ మెగా డెయిరీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్". Mana Telangana. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-11.
  3. ABN (2023-10-03). "ప్రారంభానికి విజయ మెగా డెయిరీ ప్లాంట్‌ సిద్ధం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-10-11. Retrieved 2023-10-11.
  4. telugu, NT News (2023-10-05). "Vijaya Dairy | రావిర్యాలలో విజయ మెగా డెయిరీని ప్రారంభింనున్న మంత్రి కేటీఆర్‌.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం". www.ntnews.com. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-11.
  5. telugu, NT News (2023-10-05). "KTR | పాడి రైతుల‌కు రూ. 350 కోట్ల ప్రోత్సాహ‌కాలు ఇచ్చాం : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-10-06. Retrieved 2023-10-11.