తలసాని శ్రీనివాస్ యాదవ్

తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.[2] గతంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.[3]

తలసాని శ్రీనివాస్ యాదవ్
తలసాని శ్రీనివాస్ యాదవ్

పదవీ కాలం
2014 - ప్రస్తుతం
ముందు మర్రి శశిధర్‌ రెడ్డి
నియోజకవర్గం సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1965-10-06) 1965 అక్టోబరు 6 (వయసు 58) [1]
సికింద్రాబాద్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కీ.శే. వెంకటేశం యాదవ్
జీవిత భాగస్వామి శ్రీమతి స్వర్ణ
సంతానం తలసాని సాయికిరణ్ యాదవ్, ఇద్దరు కూతుళ్లు
నివాసం వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
మతం హిందూ

జననం మార్చు

తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965, అక్టోబరు 6న సికింద్రాబాద్, మోండా మార్కెట్ లోని మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేశ్‌యాదవ్, లలితాభాయి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి వెంకటేష్‌యాదవ్ మోండా మార్కెట్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు.

వివాహం - పిల్లలు మార్చు

శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం మార్చు

1986లో రాజకీయ అరంగ్రేటం చేసి, 1986లో మోండా డివిజన్ నుంచి ఎంసిహెచ్‌కు కార్పోరేటర్‌గా పోటీ చేసి జనతా దళ్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయాడు.[4] 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎంఎల్‌ఎగా మొదటిసారి గెలిపొందాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2008 జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ చేతిలో ఓటమి చెందాడు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు.[5] తరవాత జరిగిన పరిణామాలతో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మంత్రిమండలిలో మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, కెసిఆర్ మంత్రిమండలిలో పశుసంవర్థక శాఖ మంత్రిగా నియామకమయ్యాడు.[6]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యాటక, కార్మికశాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నాడు.[7][8][9][10] ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించడం కోసం ప్రభుత్వం 12.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్‌, ఫుడ్‌ కోర్టును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023 మే 03న ప్రారంభించారు.[11][12]

ఎన్నికల చరిత్ర మార్చు

ఎన్నికల ఫలితాలు
సంవత్సరం కార్యాలయం నియోజక వర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ   45,358 మేరీ రవీంద్రనాథ్ భారత జాతీయ కాంగ్రెస్   24,897 గెలుపు
1999 79,130 41,607 గెలుపు
2004 53,930 టి. పద్మారావు గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి   56,997 ఓటమి
2008^ 50,031 పిట్ల కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్   31,964 గెలుపు
2009 40,668 జయసుధ 45,063 ఓటమి
2014 తెలంగాణ శాసనసభ సనత్‌నగర్ 56,475 దండె విఠల్ తెలంగాణ రాష్ట్ర సమితి   29,014 గెలుపు
2018 తెలంగాణ రాష్ట్ర సమితి   66,464 కూన వెంకటేష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ   35,813 గెలుపు

మూలాలు మార్చు

 1. Sakshi (17 December 2014). "కొత్త మంత్రుల జీవిత విశేషాలు..." Sakshi. Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.
 2. "Talasani Srinivas Yadav Profile". Archived from the original on 2016-05-29. Retrieved 2017-01-15.
 3. "Talasani Srinivas Yadav resigns as MLA to take oath as Cabinet minister". NewsWala. 16 December 2014. Archived from the original on 23 June 2015. Retrieved 23 June 2015.
 4. Eenadu (15 November 2023). "మోండా మార్కెట్‌ వీరులు". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
 5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
 6. మన తెలంగాణ (20 February 2019). "మూడోసారి మంత్రి పదవి". Telangana. Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.
 7. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 8. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 9. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 10. Eenadu (16 November 2023). "మళ్లీ మంత్రిస్తారా?". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
 11. Namasthe Telangana (4 May 2023). "గౌడల ఆత్మగౌరవానికి నీరాజనం.. బీమాతో గీత వృత్తిదారులకు భరోసా: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
 12. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.