విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు

విజయనగర రాజ్యంలో పన్నులు చాలా ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఆదాయం, ఎక్కువ పన్నులుగా ఉండేవి. పన్నుల అధికారిగా భాండాగర్రి అని ఓ పదవి ఉండేది, ఇది చాలా అత్యున్నతమైనది, ప్రధాన మంత్రి తరువాత ఇదే విలువైనది.

రాజునకు ఆదాయ మార్గాలు చాలా ఉండేవి, ముఖ్యముగా భూమిశిస్తుపై ఆధారపడి ఉండేవారు.

భూమిశిస్తు

మార్చు

పంటపొలాలు కొలిపించేవారు, తరువాత న్యాయముగా 1/6 వ వంతు శిస్తు వసూలు చేసేవారు, కానీ చాలా పర్యాయములు ఇవి ఎక్కువగా ఉండేవి, చాలాసార్లు సగంకంటే ఎక్కువ పంట శిస్తుగా కట్టవలసి వస్తూ ఉండేది, కానీ భ్రాహ్మణుల కిచ్చిన అగ్రహారములందూ, ఇనాము భూములపైననూ న్యాయమైన 1/6 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు, దేవాయల భూములపై 1/30 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు. అడవులను కొత్తగా కొట్టి గ్రామంలను ఏర్పరచి వ్యవసాయం చేసినవారికి పన్నులలో మినహాయింపు ఉండేది. మాగాణి, మెట్టభూములపై పన్నులు విడివిడిగా ఉండేవి. ఈ శిస్తు ధనముగా కానీ, ధాన్యముగా కానీ ఉండేది. మాగాణి భూములపై ధాన్యం రూపంలోనూ తోటలపైన అయితే ధనం రూపంలోనూ ఉండేది. రైతులు పన్నులు కట్టలేక వలసపోయిన దృష్టాంతములు ఉన్నాయి. గ్రామంలయందు పన్నులు వసూలు చేయడానికి కరణము అను అధికారి ఉండేవాడు.

ఇతర పన్నులు

మార్చు
  1. మత పన్ను
  2. వృత్తి పన్ను
  3. సామాజిక పన్ను
  4. వాణిజ్య పన్ను
  5. పుల్లరి
  6. కొండగట్టు పన్ను
  7. గ్రామదేవత పూజలపై పన్నులు
  8. వేశ్యలపై పన్ను
  9. మగ్గముపన్ను
  10. ఆదాయపు పన్ను
  11. ఉప్పు పన్ను
  12. నిధి నిక్షేపాలపై పన్ను
  13. పశువులపై పన్ను
  14. నీటి బుగ్గలపై పన్ను
  15. స్థిరాస్తులపై పన్నులు
  16. ఎండుగడ్దిపై పన్ను
  17. దేవాలయ యాత్రికులనుండి పన్ను
  18. వివాయములపై పన్ను
  19. ఊరేగింపులపై పన్ను

వృత్తి పన్ను

మార్చు

ఎంత చిన్న ఆదాయమైననూ, వృత్తిపన్ను చెల్లింపవలసి వచ్చేది, చాకలి, మంగలి, కుమ్మరి, పంచాణమువారు, పశువులకాపరులు, జంగమవృత్తి, చర్మకారులు, మేళగాండ్రు, మొదలగువారు వృత్తిపన్నులక్రిందకి వచ్చేవారు.

వేశ్యలపై పన్ను

మార్చు

వేశ్యలపై కూడా పన్ను ఉండేది. విజయనగరమందున్న వేశ్యలు చెల్లించేపన్ను 12,000 మంది సైనికాధికారులకు సరిపొయ్యేవి.

విజయనగర రాజులు  
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం